
సాక్షి, ముంబై: భారీ ఎత్తున నిధుల సమీకరణ చర్యలుచేపట్టిందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం నాటి బుల్ మార్కెట్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కౌంటర్ భారీగా లాభపడింది. వివిధ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టే ప్రతిపాదన నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల దిగారు. హెచ్‌డీఎఫ్‌సీకౌంటర్ 52 వారాల గరిష్టాన్ని తాకింది.
బిఎస్ఇ ఫైలింగ్ ప్రకారం, అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) లేదా ఏడీఆర్, డిపాజిటరీ రిసీప్ట్స్ తదితర మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని చర్చించేందుకు 2017 డిసెంబర్ 20 న బోర్డు సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకు వాటాదారుల ఆమోదంతో సహా. బోర్డు ఆమోదం పొందినట్లయితే, పైన పేర్కొన్న ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందేందుకు విస్తృత సాధారణ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
మరోవైపు ఈ షేరుపై రూ. 2165 టార్గెట్‌తో ఎనలిస్టులు బై కాల్ ఇస్తున్నారు.