
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్‌ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది.
ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర
ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930
ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390
ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940
ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500
ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560
ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110
ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370
ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560
ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840
ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060
ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900
ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100
ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240
ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450