
మహింద్రా కొత్త టీయూవీ300 ప్లస్ వాహనం
మహింద్రా అంతా కొత్తగా టీయూవీ300 ప్లస్ వాహనాన్ని ఎట్టకేలకు మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.9.47 లక్షలుగా(ఎక్స్‌షోరూం, ముంబై) నిర్ణయించింది. ఈ వాహనంలో 9 సీట్లు ఉన్నాయి. ఈ వాహనాన్ని అధికారికంగా లాంచ్ చేయడానికి కంటే ముందు, ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ వాహనాలను డెలివరీ చేసి వారి నుంచి కంపెనీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. తాజాగా ఈ వాహనాన్ని కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేసింది. 2.2 లీటరు ఎంహెచ్‌ఏడబ్ల్యూకేడీ120 ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. 88 కేడబ్ల్యూ(120 బీహెచ్‌పీ)ని డెలివరీ చేస్తోంది. ఇటాలియన్ డిజైన్ హౌజ్‌లో దీన్ని డిజైన్ చేశారు. హై-టెక్ ఫీచర్లను ఇది ఆఫర్ చేస్తోంది. 17.8 సీఎం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ విత్ జీపీఎస్ నావిగేషన్, 4 స్పీకర్లు+2 ట్వీటర్లు, ఈసీఓ మోడ్, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, బ్లూసెన్స్ యాప్, ఈసీఓ మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ టెక్నాలజీ, ఇంటెలిపార్క్ రివర్స్ అసిస్ట్, డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి.
4400ఎంఎం పొడవు, 1835 వెడల్పు, 1812 ఎత్తును ఇది కలిగి ఉంది. ఐదు రంగుల్లో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. మేజిస్టిక్ సిల్వర్, గ్లాసియర్ వైట్, బోల్డ్ బ్లాక్, డైనమో రెడ్, మోల్టెన్ ఆరెంజ్ రంగుల్లో ఈ వాహనం లభ్యమవుతుంది. పీ4, పీ6, పీ8 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. 2015 సెప్టెంబర్ నుంచి టీయూవీ300 విజయవంతంగా రోడ్లపై నడుస్తుందని, ఇప్పటి వరకు ఆన్ రోడ్డుపై 80వేల వాహనాలను విక్రయించినట్టు మహింద్రా అండ్ మహింద్రా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ విజయ్ రామ్ నోక్రా చెప్పారు. ఎక్కువ స్పేస్, ఎక్కువ పవర్‌తో టీయూవీ300 ప్లస్‌ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.