మాల్యాకు డీఆర్‌టీ మరో షాక్‌... | Vijay Mallya 74 lakh UBHL shares sold for Rs 1008 crore: ED | Sakshi
Sakshi News home page

మాల్యాకు డీఆర్‌టీ మరో షాక్‌...

Published Thu, Mar 28 2019 12:06 AM | Last Updated on Thu, Mar 28 2019 12:06 AM

Vijay Mallya 74 lakh UBHL shares sold for Rs 1008 crore: ED - Sakshi

న్యూఢిల్లీ:  బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్స్‌  (యూబీహెచ్‌ఎల్‌)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్‌ మాల్యాపై మనీ లాండరింగ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్‌టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్‌ఎల్‌కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది.

ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్‌బీఐ కన్సార్టియంకు విజయ్‌ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్‌టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్‌ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్‌టీ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement