తల్లి, చెల్లిని రోడ్డుపైకి గెంటేసిన సోదరులు | Brutal for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అమానుషం

Published Fri, Jun 1 2018 2:04 PM | Last Updated on Fri, Jun 1 2018 2:04 PM

Brutal for property - Sakshi

రోడ్డుపై సామగ్రితో ధీనంగా చూస్తున్న తల్లీకూతుళ్లు 

ఖానాపూర్‌ : వ్యవసాయ భూమికోసం అన్నదమ్ములు మధ్య సఖ్యతలేక కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని రోడ్డుపై వదిలేసిన సంఘటన ఖానాపూర్‌ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పాత ఎల్లాపూర్‌ పంచాయతీ పరిధి ఒడ్డెవాడలోని పల్లెపు ఎంకవ్వ, మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లున్నారు. మల్లయ్య ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు.

ఇద్దరు కూతుళ్లకు వివాహం అయినప్పటికీ ఒక కూతురు నర్సవ్వ తల్లి ఎంకవ్వతోనే ఉంటోంది. పదేళ్లుగా ఎంకవ్వ పెద్ద కొడుకు ఎంకటి, చిన్న కొడుకు జగన్‌ తల్లీచెల్లి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వారిద్దరూ కూలీ పనులు చేసుకునే చిన్న కొడుకు ఇంటి వద్ద ఉన్న ఓ గుడిసెలో నివసిస్తున్నారు. కాగా.. గ్రామంలోని చెరువు వద్ద ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు చెందిన సుమారు రెండెకరాల భూమి ఉంది.

ఆ భూమి పదేళ్లకుపైగా పెద్ద కుమారుడు ఎంకటి సాగు చేసుకుంటున్నాడు. దీంతో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో నుంచి తనకు సగం వాటా ఇవ్వాలని జగన్‌ అన్నను కోరాడు. దానికి అన్న ససేమిరా అన్నాడు. దీంతో అన్న ఇంటి వద్ద కు పోవాలని ఇంటి నుంచి తల్లీచెల్లిని గెంటివేశా డు.

పెద్ద కుమారుడు కూడా తన వద్ద వద్దనడం తో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద గల చెట్టు కిందకు తల్లీచెల్లి చేరారు. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement