ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో బయటపడబోతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో బయటపడబోతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేనిది త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.