వేల్పనూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పని చేసిన భాస్కర్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది.
బ్యాంకు ఉద్యోగికి జైలుశిక్ష
Published Mon, Oct 24 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
వెలుగోడు: వేల్పనూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పని చేసిన భాస్కర్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. వేల్పనూరు స్టేట్ బ్యాంక్‌లో పొదుపు లక్ష్మి గ్రూప్‌లకు సంబంధించి 2013లో రూ.1.40 లక్షలు గోల్‌మాల్ జరిగింది. ఈ మేరకు పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులు, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు క్యాషియర్ భాస్కర్ డబ్బును స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆత్మకూరు కోర్టులో నిందితుడిని హాజరు పరుచగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ తీర్పు ఇచ్చారు.
Advertisement
Advertisement