prison
-
దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్ విడుదల
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని నిన్న(శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది.కాగా, యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి.అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
యూన్ సుక్ యోల్‌ను జైలు నుంచి విడుదల చేయండి
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు భారీ ఊరట లభించింది. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి. అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
మత్స్యకారుల్లో ‘తండేల్’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎలక్షన్ ముందు మాయ మాటలు చెబుతారు. కానీ జగన్ గారు గెలవక ముందే మా కుటుంబాల వారికి మాటిచ్చి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ గెలిస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం. అలాగే ఆయన గెలిచాక మమ్మల్ని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించారు. ఒక్కొక్కరికీ రూ.5లక్షల సాయం అందజేశారు. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. మాకు ఊపిరి పోసి, పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబాల్లో ఎవరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.’ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో గనగళ్ల రామారావు అన్న మాటలివి..కానీ తండేల్ సినిమా విడుదలయ్యాక ఎందుకో రామారావు స్వరం మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇతర దేశాల్లో ఉన్న వారిని విడిపించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కదా.. ఇప్పుడు కొన్ని బుర్రలకు ఆ విషయం అర్థం కావడం లేదు.. ఏదో పట్టినట్టు కొంతమంది అదే పనిగా వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్పతనమని చెబుతున్నారంటూ.. తోటి మత్స్యకారులనుద్దేశించి కొన్ని మీడియాల్లో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అలాగే తండేల్ సినిమా యూనిట్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నాడు జరిగిన మేలు గురించి చెప్పకపోవడం కూడా మిగతా 21 మత్స్యకార కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. అసలు నిజమిది.. వాస్తవానికి రామారావు ఒక్కడే తండేల్ కాదని, సినిమాలో అలా కథ రాసుకున్నారు గానీ.. పాకిస్తాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని 21 మత్స్యకార కుటుంబాల వారు తెలిపారు. తండేల్ సినిమాతో రామారావు ఒక్కరికే లబ్ధి చేకూరిందని అన్నారు. అప్పుడేం జరిగిందో తమకు తెలుసని, ఎవరి వల్ల విడుదలయ్యామో తమకు ఇంకా గుర్తుందని అన్నారు. వైఎస్ జగనే పునర్జన్మ ఇచ్చారని ఆనాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. తాము స్టేజీ ఎక్కితే ఎక్కడ వాస్తవాలు చెబుతామో అని ఆ ఆవకాశం ఇవ్వకుండా చేశారని, రామారావు, కథా రచయిత తమను మోసం చేశారని మండిపడ్డారు. ఇదేనా కృతజ్ఞత.. రామారావు వ్యవహార శైలి వల్ల డి.మత్స్యలేశంలో చిచ్చు రేగింది. రామారావుకు అవకాశవాదం తప్ప కృతజ్ఞత లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక రామారావు ఏమన్నాడు.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు...అంతా మీడియాలో రికార్డయి ఉంది.. మరిచిపోయి మాట్లాడితే పాత వీడియాలు గుర్తు చేస్తాయి...’ అని అంటున్నారు. సినిమా యూనిట్‌ను తప్పుదారి పట్టించి, తమకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం రామారావు ఒక వైపైతే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాడు జరిగిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరి గొప్పతనమేంటో, ఎవరి చేసిన మేలు ఏంటో చర్చకు వస్తోంది. -
ట్రంప్‌కు గిఫ్ట్‌గా.. భూమ్మీద నరకం..?
ఎల్ సాల్వడార్ మహా కారాగారం... ప్రపంచంలోనే అత్యంత అధ్వాన జైలుగా ‘అప్రసిద్ధి’. ఖైదీలు ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం అసంభవం. 60 ఏళ్లు మొదలుకొని వెయ్యేళ్లకు పైగా కారాగారవాస శిక్షలు పడిన ఖైదీలు ఇక్కడ ఉంటారు. వెయ్యి మంది అధికారులు, 600 మంది సైనికులు, 250 మంది పోలీసులు ఈ జైలును పర్యవేక్షిస్తుంటారు. స్టీలుతో పెట్టెల్లా తయారుచేసిన బోనుల్లాంటి నాలుగు అరల పడకల్లో (మెటల్ బంక్ బెడ్స్) ఖైదీలు దాదాపు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి కూర్చోవాలి. పరుపులు ఉండవు. వారు గుసగుసలాడుకోవాల్సిందే తప్ప పెద్దగా మాట్లాడుకునేందుకు అనుమతించరు. భోజనంగా మూడు పూటలా వరి అన్నం, బీన్స్, పాస్టా, ఉడికించిన గుడ్డు పెడతారు. మాంసం వడ్డించరు.ఎల్ సాల్వడార్లో 1990వ దశకం చివర్లో ఎంఎస్-13, బారియో 18 అనే రెండు గ్యాంగులు మాదకద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో చెలరేగాయి. పరస్పరం ప్రత్యర్థులైన ఈ రెండు ముఠాలు దేశాన్ని వణికించాయి. అయినా ప్రస్తుతం జైల్లో మాత్రం ఈ రెండు గ్రూపుల సభ్యుల్ని కలిపే ఉంచుతున్నారు. గ్వాంటనామో బే కారాగారం కంటే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శిక్షాకాలం ముగిసినా ఖైదీలను సమాజంలోకి విడిచిపెట్టరు. వారు బయటి ప్రపంచాన్ని చూసే అవకాశమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే వారు జీవచ్ఛవాలు! తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత నియంత’ (వరల్డ్స్ కూలెస్ట్ డిక్టేటర్) గా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే మాత్రం తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ‘ఆఫర్’ కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. ఇంతకీ అమెరికా ఆఫర్ ఏమిటి? ఏ రూపంలో? ఎంత? వివరాలు బయటికి రాలేదు! -
ఎల్ సాల్వడార్ మెగా జైలు.. భూమిపై నరకం!
ఎల్ సాల్వడార్.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్యనున్న సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం. ఇందులో ఉందొక మహా కారాగారం. దాని పేరు- టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. క్లుప్తంగా సెకోట్ (CECOT). అంటే... సెంటర్ ఫర్ కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిజం. ‘ఉగ్రవాద కట్టడి కేంద్రం’ అనొచ్చు. ఈ జైలును ఉద్దేశపూర్వకంగానే నగర వాతావరణానికి దూరంగా పల్లెపట్టున నిర్మించారు. రాజధాని శాన్ సాల్వడార్ కు తూర్పుగా 40 మైళ్ళ దూరంలోని గ్రామీణ ప్రాంతంలో 57 ఎకరాల్లో విస్తరించిన ఈ మెగా ప్రిజన్.. లాటిన్ అమెరికాలోనే అతి పెద్ద జైలు. ఇందులో 40 వేల మంది వరకూ ఖైదీలను బంధించవచ్చు.పేరుమోసిన క్రిమినల్ గ్యాంగ్స్... ప్రత్యేకించి MS-13, బార్లో-18 సభ్యుల్ని ఇక్కడే బంధిస్తుంది ఎల్ సాల్వడార్. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 ఆగస్టు నాటికి ఇందులోని ఖైదీల సంఖ్య 14,500. ఈ జైలు విషయంలో ప్రశంసలు తక్కువగా, విమర్శలు ఎకువగా వినిపిస్తాయి. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడేవారు ‘సెకోట్’ను సమర్థిస్తారు. మానవ హక్కుల సంస్థలు మాత్రం పదునైన విమర్శలతో విరుచుకుపడతాయి. ఎల్ సాల్వడార్ ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఈ జైల్లో ఎక్కువ మంది ఖైదీలున్నట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.అతి ఇరుకైన ఈ కారాగారంలో ఒక్కో ఖైదీకి లభించే చోటు కేవలం 6.45 చదరపు అడుగులు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇది విరుద్ధం. ఈ జైల్లో పరిస్థితులు అత్యంత కఠినంగా, ప్రమాదకరంగా ఉంటాయి. దేశ జనాభా ప్రకారం చూస్తే ప్రతి లక్ష మంది పౌరుల్లో 1,659 మంది ఖైదీలతో ఎల్ సాల్వడార్... ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఖైదీలున్న దేశం. దోషులుగా నిర్ధారితులై తమ జైళ్ళలో ఉన్న కొందరు ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలని అమెరికా భావిస్తోంది.ఈ మేరకు ఎల్ సాల్వడార్‌కు అగ్రరాజ్యం ‘మాంచి ఆఫర్’ ఇచ్చింది కూడా. అయితే అమెరికా రాజ్యాంగం తమ దేశ పౌరులకు భద్రత కల్పించింది. నేరస్థుల పౌరసత్వాన్ని లాక్కొనే హక్కు ఎవరికీ లేదని అమెరికా కోర్టులు కూడా గతంలో తీర్పులు వెలువరించాయి. దీని ప్రకారం నేరగాళ్లను బహిష్కరించే, వేరే దేశానికి వెళ్లగొట్టే అధికారం అమెరికాకు లేదు.అయితే తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించుకునే అవకాశాల్ని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్వేషిస్తున్నారు. పదే పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను అతి తక్కువ ఫీజు చెల్లించి ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను తాను పరిశీలిస్తున్నట్టు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. దీనిపై విపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అమెరికా ఖైదీలను తమ దేశంలో బంధిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అధికమవుతుందని, మానవ హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ఎల్ సాల్వడార్ స్వచ్ఛంద సంస్థలు ఆక్రోశిస్తున్నాయి.::జమ్ముల శ్రీకాంత్(Credit: Reuters) -
ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ళు జైలు శిక్ష
-
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్ -
కామాంధుడికి 20 ఏళ్ల జైలు
జగిత్యాల జోన్: బాలునిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం.. 2019 ఏప్రిల్ 4న జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ శివారులోని మామిడి తోటలో కాయలు తెంపుకొందామంటూ అదే గ్రామానికి చెందిన గోగుల సాయికుమార్.. ఒక బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ బాలునిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ పృథీ్వధర్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన అప్పటి సీఐ రవికుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి.. నిందితుడు సాయికుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఖైదీ కాదు, గూఢచారి!
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది. అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది. అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు. అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్ఎన్ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది. అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది. అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్లు, సోఫాలు, ఆర్ట్ పీస్‌లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్‌ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని. ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు. ‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్‌జీ...’’ అన్నారు.ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే! ‘‘పోనీ ఇమ్రాన్‌జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది! ‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన. విజిటర్స్ రూమ్‌లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్‌కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్‌కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది. నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు! గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.‘‘తనెలా ఉన్నారు సఫ్దర్జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్‌జీ...’’ అన్నారు సఫ్దర్!! -
ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..
నీటి నడిబొడ్డునున్న ఈ కట్టడం ఒక చెరసాల. ఇది ఇస్టోనియాలోని వసలెమా పారిష్ పట్టణ సమీపంలోని రుమ్ము గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాలరాతి గనులు, సున్నపురాతి గనులు ఉండేవి. సోవియట్ హయాంలో ఇక్కడ రుమ్ము, ముర్రు చెరసాలల్లో బందీలుగా ఉండే ఖైదీలతో ఈ గనుల్లో పనులు చేయించుకునేవారు. గని నుంచి వెలికి తీసిన సున్నపురాతిని శుద్ధి చేయడానికి చాలా నీటిని వాడేవాళ్లు. ఈ నీరు గనిని లోతుగా తవ్విన ప్రాంతంలోకి చేరి నిల్వ ఉండటం మొదలైంది. క్రమంగా ఈ నీరు ఖాళీ అయిపోయిన గని ప్రాంతమంతా నిండిపోయి, మడుగులా మారింది. చెరసాల చుట్టూ గనులు తవ్వడంతో ఇప్పుడు రుమ్ము చెరసాల భవనం నీటి మధ్యలో ఇలా మిగిలింది. ముర్రు చెరసాలను 2001లో రుమ్ము చెరసాలలో విలీనం చేశారు. తర్వాత ఈ చెరసాల 2012లో శాశ్వతంగా మూతబడింది. దీనిని చూడటానికి అప్పుడప్పుడు ఆసక్తిగల పరిశోధకులు, విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
ఇండియన్ ఆయిల్ చొరవ.. ఖైదీల జీవితాల్లో వెలుగు
జైలులో ఉన్న ఖైదీలు, బాలనేరస్థుల జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య , 'పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్' 8వ దశను, 'నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్' 5వ దశను ప్రారంభించారు.ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ రెండు కార్యక్రమాలు.. 22 జైళ్లు, జువైనల్ హోమ్‌లలో 1000 మందికి పైగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఇండియన్ ఆయిల్ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలకు స్పోర్ట్స్ కోచింగ్, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉంది.పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్, నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్ ప్రారంభించిన సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ మాట్లాడుతూ.. కార్పోరేట్ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ అగ్రగామిగా నిలిచి జైలులో ఉన్న వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నాను. జైలు జీవితాలను గడిపిన వారు క్రీడల్లో రాణించేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జైలు అధికారులు.. ఖైదీలు, బాలనేరస్థులు మెరుగైన జీవితాన్ని నిర్మించడంలో మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకోవడం గొప్ప విషయం. దీనికోసం ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు.ఇప్పటికే ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవతో.. ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) నిర్వహించిన ఖైదీల ఇంటర్కాంటినెంటల్ “చెస్ ఫర్ ఫ్రీడమ్” ఆన్లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పూణేలోని యెరవ్డా జైలులోని ఖైదీలు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఖైదీలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కారణంగా శ్రీకాంత్ మాధవ్ వైద్యకు ప్రపంచ చెస్ సమాఖ్య 'ఫ్రెండ్ ఆఫ్ ఫిడే" అనే ప్రతిష్టాత్మక బిరుదును అందించింది.‘పరివర్తన్-ప్రైజన్ టు ప్రైడ్’ కార్యక్రమం 2021 ఆగస్టు 15న ప్రారంభమైంది, అయితే ‘నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్’ను 2023 జనవరి 26న మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఖైదీలను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. -
స్వయం ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్కు పదేళ్ల జైలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్‌కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్ను అరెస్టు చేసింది.2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది. -
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్‌పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!) -
హత్య కేసులో.. అన్నదమ్ములకు యావజ్జీవం!
కరీంనగర్: తమపై పెట్టిన హత్యాయత్నం కేసు ను రాజీ కుదర్చుకోవడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ని హత్య చేసిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్షతోపా టు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యా ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికా ర్జున్ కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం వేంపేట కు చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయంతోపా టు ఉపాధిహామీలో మేట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడంటూ సదరు మహిళ భర్త జెల్ల రమేశ్, అతని తమ్ముడు జెల్ల మహేశ్ 2020 మార్చి 3న కత్తితో రాజేందర్‌పై దాడి చేశారు. దీంతో రాజేందర్ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అన్నదమ్ములపై కేసు నమోదైంది.ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ కేసును రాజీ చేసుకోవా లంటూ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగింది. రాజీకి రాజేందర్ ససేమిరా అన్నాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 2020 మే 19న గ్రా మ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన రాజేందర్‌పై జెల్ల రమేశ్, జెల్ల మహేశ్ విచక్షణరహితంగా కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందా డు.రాజేందర్ భార్య హరిణి ఫిర్యాదు మేరకు అప్ప టి మెట్పల్లి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐలు రవికుమార్, ఎల్.శ్రీనివాస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధి కారులు కిరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి రమేశ్, మహేశ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
అసాంజ్‌కు ఎట్టకేలకు స్వేచ్ఛ!
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఆయనను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదేళ్లుగా బ్రిటన్‌లో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో అసాంజ్ విడుదలకు మార్గం సుగమమయ్యింది. దాని ప్రకారం అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు యూకే జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు.చార్టర్డ్ విమానంలో ఉత్తర మరియానా ఐలాండ్స్‌లోని సైపన్ ద్వీపానికి బయల్దేరారు. అక్కడి అమెరికా ఫెడరల్ కోర్టులో బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణకు హాజరవుతారు. అమెరికా వెళ్లడానికి అసాంజ్ నిరాకరించడంతో ఆ్రస్టేలియా సమీపంలో అమెరికా అ«దీనంలో ఉండే ఈ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం... గూఢచర్య చట్టాన్ని అతిక్రమిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలను అసాంజ్ అంగీకరించనున్నట్లు సమాచారం.ఆయనపై మోపిన 18 అభియోగాలను కలిపి ఒకే కేసుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. అసాంజ్ నేరాంగీకార వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆయనకు శిక్ష ఖరారు చేస్తారు. ఇప్పటికే బ్రిటన్‌లో అనుభవించిన ఐదేళ్ల శిక్షతో సరిపెట్టి విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే ఆ వెంటనే అసాంజ్ నేరుగా స్వదేశం ఆ్రస్టేలియాకు వెళ్లనున్నారు. ధ్రువీకరించిన వికీలీక్స్ అసాంజ్ విడుదలను వికీలీక్స్ సంస్థ ధ్రువీకరించింది. ఈ మేరకు సామాజిక వేదిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘1,901 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన జూన్ 24న విడుదలయ్యారు. అసాంజ్ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపింది.ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి అసాంజ్ సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజ్ స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజ్ అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.అరెస్టు... ఆశ్రయం జైలుఅసాంజ్ 2010 అక్టోబర్‌లో బ్రిటన్‌లో అరెస్టయ్యారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే ఆయన్ను స్వీడన్‌కు అప్పగించాలని 2011 ఫిబ్రవరిలో లండన్ కోర్టు ఆదేశించింది. దీనిపై బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా లాభం లేకపోయింది. దాంతో అసాంజ్ కొంతకాలం లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్‌లో ఆ ఆశ్రయం రద్దయింది. అనంతరం బ్రిటన్ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో శిక్ష పూర్తయ్యాక కూడా జైలులోనే ఉన్నారు. అసాంజ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదమున్నందున అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్ కోర్టు 2021లో చెప్పింది.ఉత్కంఠగా ఉంది భార్యఅసాంజ్ భార్య స్టెల్లా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడారు. భర్త రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. న్యాయవాది అయిన ఆమె అసాంజ్‌ను 2022లో ఆయన జైల్లో ఉండగానే పెళ్లాడారు. అసాంజ్ చార్టర్డ్ విమాన ప్రయాణ ఖర్చు 5 లక్షల డాలర్లని ఆయన అభిమానులు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించడానికి ఫండ్ రైజింగ్ ప్రచారం మొదలు పెట్టామన్నారు. -
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు! -
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
క్రిప్టో కింగ్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్‌టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
హైతీలో తీవ్ర అరాచకం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్ఎన్ తెలిపింది. బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
ప్రియుడిని 100సార్లు పొడిచి చంపినా.. అమెకు శిక్షపడలేదు.. ఎందుకు!?
కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు అనుకోకుండా ప్రమాదవశాత్తు నేరం చేసినందుకు ఏళ్ల కొద్ది జైల్లో మగ్గి శిక్ష అనుభవిస్తుంటారు. మరికొందరూ అత్యంత కిరాతకంగా హత్య చేసి కూడా చిన్న లాజిక్‌తో చాలా సునాయాసంగా బయటపడతారు. అయితే ఆ వ్యక్తులు చేసిన నేరం చూస్తే క్షమించేలా ఉండదు. కానీ వాళ్లకు శిక్ష ఎందుకు పడలేదనే ప్రశ్న మిగిలుంటుంది. అదృష్టమా లేక తలరాత అనుకోవాలో కూడా తెలియదు. అలాంటి షాకింగ్ ఘటనే అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలో బ్రైన్ స్పెజ్చెర్ 32 ఏళ్ల మహిళ తాను ఎంతగానో ప్రేమించిన 26 ఏళ్ల చాడ్ ఓ మెలియాను దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. విచారణలో ఏకంగా వందసార్లు పైగా కత్తితో అతికిరాతకంగా పొడిచినట్లు వెల్లడైంది. పైగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ కూడా ఆమె చేతితో కత్తినే పట్టుకునే ఉంది, ఓమెలియా రక్తపు మడుగులో ఉన్నాడు, అదీగాక పోలీసులు ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆమె ఆ కత్తిలో తన గొంతుపై గాయం చేసుకునే యత్నం కూడా చేసింది. స్పెజ్చెర్నే చంపిందనేందుకు పూర్తిసాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆమెకు శిక్షపడలేదు. పైగా జడ్జీ ఆమెకు కొద్దిపాటి జైలు శిక్ష విధించి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ స్పెజ్చెర్ పూర్తి స్ప్రుహలో ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోవడమే ఆమెను జైలు పాలు కాకుండా చేసింది. నిజానికి ఈ ఘటనకు కొద్దిరోజులు ముందు ఇద్దరు కలుసుకుంటూ హాయిగా ఉన్నారు. సరిగ్గా 2018లో థౌజండ్ ఓక్స్లోని ఓ మెలియా అపార్ట్మెంట్లో ఇరువురు కలిసి గంజాయి తాగారు. అయితే స్పెజ్చెర్ ఫస్ట్ షాట్ గంజాయి తీసుకున్నప్పుడు అంతగా మత్తులో లేదు. అయితే ఆమెను మరింత గంజాయి తీసుకోవాల్సిందిగా ఓమెలియా ఒత్తిడి చేయడంతో మరో షాట్ తీసుకుంది. దీంతో ఇరువురు పూర్తిగా మత్తులో జోగుతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అధికంగా గంజాయి తీసుకోవడంతో స్పెజ్జెర్ సైకోటిక్‌గా మారిపోయింది. తాను ఏం చేసిందో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లిపోయింది. తాను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తే అతి కిరాతకంగా 100 సార్లు పొడిచి మరీ హతమార్చింది. ఆ రోజు ఆమె పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాములు స్థితికి రాకపోగా అదే ఉన్మాదస్థితితో తనను తాను హతమార్చుకునేంత దారుణ స్థితికి వచ్చేసింది. సమయానికి పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి స్పెజ్చెర్ ప్రాణాతో బతికిబట్టగట్టగలిగింది. అయితే పోలీసులు ఓ మెలియా ఆ ఘటనలో అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. అయితే కోర్టులో స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది ఆమె స్ప్రుహలో ఉండి చేసిన నేరం కాదని గట్టిగా వాదించారు. పైగా అతడే ఆమెను గంజాయి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అన్నారు. తన క్లయింట్ నాటి ఘటనలో ఏం జరగుతుంది, తానేం చేస్తుంది అనేది కూడా తెలియని దారుణ స్థితిలో ఉందని అన్నారు. వాస్తవానికి ఆమె కావాలని చేసిన హత్య మాత్రం కాదని కూడా అన్నారు. దీంతో న్యాయమూర్తి ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదు. పైగా ఇరువురు ఇష్టపూర్వకంగా గంజాయి సేవించి ఉండటంతో జరిగిన ఘటనే అని ఈ కేసుని కొట్టిపడేసింది కోర్టు. అంతేగాదు తెలియని స్థితిలో చేసిన నేరానికిగానూ ఆమెకు రెండేళ్ల ప్రోబేషన్ శిక్ష తోపాటు వంద గంట సామజికి సేవ కూడా చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు పట్ల బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ గంజాయి తాగిన ప్రతి ఒక్కరూ మరో వ్యక్తి చంపేయొచ్చు అనేలా ఉంది ఈ తీర్పు అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక స్పెజ్చెర్ న్యాయవాది మాత్రం జడ్డి ఓర్లీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరీ ఈ విధంగా తీర్చు ఇచ్చారని ప్రశంసించాడు. ఈ తీర్పు పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాని అన్నారు. ఆయన దీన్ని మత్తులో జరిగిన అనుకోని ఘోరమే తప్ప తన క్లయింటే స్వతహాగా మంచిదే అని వెనుకేసుకొచ్చాడు స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది. ఏదీమైన మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు తమకే గాక తామెంత ఇష్టపడ్డ వాళ్లను కూడా దూరం చేసుకునేలా చేస్తుంది. సరిదిద్దుకోలేని తప్పులను చేయిస్తుంది. ఇలాంటి ఉందంతాలు కోకొల్లలు కూడా. అందువల్ల దయచేసి ఇలాంటి వ్యసనాలకు బానిసలై ఉన్మాదులుగా మారి మిమ్మల్ని మీరు కోల్పోయి, మీ వాళ్లను దూరం చేసుకోకండి. (చదవండి: ఇదేం ఆఫర్ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?) -
మరో కాలాపానీ: అల్కట్రాజ్.. ఒకనాటి కారాగారం
బ్రిటిష్ హయాంలో అండమాన్‌లోని కాలాపానీ జైలు గురించి అందరికీ తెలుసు. ఇది అమెరికన్ ద్వీప కారాగారం. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో తీరానికి ఆవల ఉన్న చిన్న దీవి అల్కట్రాజ్. ఒకప్పుడు అమెరికన్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాళ్లను బంధించేందుకు ఇక్కడ కారాగారాన్ని నిర్మించింది. కేవలం 2.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ఏకాంత దీవిలో కట్టుదిట్టమైన జైలును 1775లో నిర్మించారు. ఇది 1963 వరకు పనిచేసింది. పెలికాన్ పక్షులకు విడిది కేంద్రంగా ఉన్న ఈ దీవిలోని జైలు నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. జైలు గోడలు దాటి బయటపడినా, చుట్టూ భీకరమైన సముద్రం. సముద్రంలో ఈతకొట్టాలని తెగించినా, ఇక్కడి సముద్ర జలాలు గడ్డకట్టించేంత చల్లగా ఉంటాయి. అవతలి తీరం చేరేంత వరకు ఈతకొడుతూ బతికి బట్టకట్టడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి జైలు మూతబడిన తర్వాత ఇది కేవలం చారిత్రక కట్టడంగా మాత్రమే మిగిలింది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి, ఈ జైలును చూసి పోతుంటారు. -
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
పిల్లలపై వేధింపులు.. నిందితునికి 707 ఏళ్లు జైలు శిక్ష..!
కాలిఫోర్నియా: అమెరికాలో పిల్లలపై వేధింపులకు పాల్పడిన ఓ రాక్షసునికి న్యాయస్థానం 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది! 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు అశ్లీల చిత్రాలు చూపించిన కేసుల్లో ధర్మాసనం దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. మాథ్యూ జక్ర్జెవ్స్కీ(34) బేబీకేరింగ్ తరహా సేవలు అందించేవాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న 16 మంది మగ పిల్లలను లైంగికంగా వేధించాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు కూడా చూపించేవాడని న్యాయస్థానం గుర్తించింది. ఈ నేరాల్ని నిందితుడు 2014 నుంచి 2019 మధ్య పాల్పడ్డాడు. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలపై మాథ్యూ వేధింపులు జరిపాడు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ విదేశాలకు వెళ్తుండగా.. 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో తాజాగా తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. దోషిపై ఎలాంటి దయ చూపించవద్దని, ఉరిశిక్ష విధించాలని ధర్మాసనాన్ని ఇద్దరు పిల్లలకు చెందిన బామ్మ కోరింది. తమ పిల్లలను చూసుకోవడానికి ఇలాంటి రాక్షసున్ని నియమించుకున్నందుకు బాధపడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథ్యూ తన రహస్యాలను బయటకు చెప్పకుండా పిల్లలను హెచ్చరించేవాడని ఓ బాలుడి తల్లి దుయ్యబట్టింది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత మ్యాథ్యూ నేరాలకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. తాను పిల్లలకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపాడు. పిల్లల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. తాను ఎలాంటి అపరాధం చేయలేదని, తన చర్యలను సమర్థించుకున్నాడు. ఇదీ చదవండి: Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే.. -
ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..!
తమిళనాడు: పెరోల్‌పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు వచ్చిన జీవిత ఖైదీ సంచలన ఆరోపణలు చేశాడు. జైలులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. వివరాలు.. సేలం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ, చైన్నె తండయార్‌పేటకు చెందిన హరి అలియాస్ హరికృష్ణన్ (35) గతేడాది జూన్‌న్‌లో 3 రోజుల పెరోల్‌పై వెళ్లాడు. అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన వార్డెన్ రామ కృష్ణన్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసులో జీవిత ఖైదీ హరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి సేలం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఖైదీ హరి అపస్మారక స్థితికి చేరుకోగానే జైలు అధికారులకు వాయిస్ మెసేజ్ పంపాడు. పెరోల్‌పై వెళ్లి తిరిగి వచ్చినందుకు అధికారులకు డబ్బులు చెల్లించాలని.. చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నాడు. కోయంబత్తూరు జైలు శాఖ డీఐజీ షణ్ముగసుందరం విచారణ చేపట్టారు. విచారణ జరిపి పెరోల్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మెమో ఇచ్చారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో పెరోల్‌పై వచ్చిన ఖైదీని 3 రోజుల పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు వార్డెన్లు కూడా పట్టుబడ్డారు. వారిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పెరోల్ తర్వాత జైలుకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు చెల్లించినట్లు ఖైదీ హరి అధికారులకు తెలిపాడు. -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్‌కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
కేసుల వలయంలో డోనాల్డ్ ట్రంప్.. ఇప్పట్లో బయటపడేనా..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 78 కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు ఈ అభియోగాలు అన్నిటిలోనూ శిక్ష పడి, ఏకకాలంలో శిక్ష అనుభవించినా జీవితకాలం పాటు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 76కు చేరుకుంది. ఒకవేళ అభియోగాలన్నీ నిరూపణ అయ్యి ఆయన దోషిగా తేలితే మాత్రం ఆయా నేరాల శిక్షా సమయాన్ని బట్టి ట్రంప్ జీవితకాలం ఖైదును అనుభవించాల్సిందే. శృంగార తారకు చెల్లింపుల వ్యవహారంతో మొదలైన కేసుల పరంపర వైట్ హౌస్ రహస్య పత్రాల కేసుతో ఆయన మెడకు ఉచ్చు మరింత బిగిసింది. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదై ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు వైట్ హౌస్ అధికారులు వాంగ్మూలం ఇవ్వడంతో ట్రంప్ ఇరుకున పడ్డారు. అసలే వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి అభ్యర్థి రేసులో కూడా డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కేసుల ఊబి నుండి బయట బయట పడతారా? బయటపడినా వైట్ హౌస్ చేరుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
లైంగికదాడి కేసు: రూ.10 లక్షలు నష్టపరిహారం 20 ఏళ్ల జైలు శిక్ష
అన్నానగర్: పరమక్కుడి సమీపంలో ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కేసులో రామనాథపురం మహిళా కోర్టు గురువారం ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని పొన్నకరై గ్రామానికి చెందిన సంజీవిగాంధీ (35). ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు. ఇతను ప్లస్‌టూ విద్యార్థినిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంజీవిగాంధీ పలుమార్లు లైంగికదాడి చేశాడు. దీంతో విద్యార్థిని గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సంజీవిగాంధీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని నవంబర్ 12, 2019న పరమకుడి మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంజీవిగాంధీని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ రామనాథపురం కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం న్యాయమూర్తి గోపినాథ్ సమక్షంలో కేసు విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో సంజీవిగాంధీకి 20 ఏళ్ల జైలు శిక్ష, బాధిత విద్యార్థినికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది. -
జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకువచ్చి పెళ్లి!
కోల్‌కతా: వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇద్దరి ఖైదీల జీవితంలో అలానే జరిగింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారిద్దరూ అనుకోకుండా జైలులో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని ఓ జైలులోని ఇద్దరు ఖైదీల ప్రత్యేక ప్రేమకథ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. హసీమ్‌కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్లు శిక్ష విధించి ఇద్దరినీ తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. అనుకోకుండా జైల్లో ఉండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఖైదీలిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి వారి కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెరోల్‌పై విడుదలైన తర్వాత వాళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తూర్పు బర్ధమాన్‌లోని మోంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెరోల్ అనంతరం వీరువురు అదే జైలుకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. చదవండి ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్.. యువతి ఆత్మహత్యాయత్నం -
సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా..
యువతులతో బలవంతంగా సెక్స్ రాకెట్ నడిపిన వ్యవహారంలో ప్రముఖ అమెరికన్ నటి ఎలిసన్ మాక్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నటి ఎలిసన్ పలువురు యువతులను బలవంతంగా ఈ రొంపిలోకి లాగిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెపై దర్యాప్తు చేపట్టిన అనంతరం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. ఆమెకు ఈ శిక్ష సెప్టెంబరు 29 నుంచి అమలుకానున్నదని సమాచారం. కాగా అదే కోర్టులో జడ్జిల సమక్షంలో తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానని ఎలిసన్ పేర్కొంది. కాగా ఈ తీర్పు వెలువడక ముందు ఎలిసన్ బాధితులతో, వారి కుటుంబ సభ్యుల ముందు ఏడుస్తూ తాను చేసిన పనులు అమానవీయమైనవని, తాను ఎన్ఎక్స్ఐవీఎం నేత కీథ్ రెనాయర్ను పూర్తిగా విడిచిపెట్టేశానని తెలిపింది. అతనికి కొంతకాలం క్రితం అపహరణ, ఇతర నేరాల కింద 120 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కీథ్ ఎన్ఎక్స్ఐవీఎం పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. దానిలో ఆయన మినహా మిగిలినవారంతా మహిళా సభ్యులే ఉన్నారు. ఈ గ్రూపు సభ్యులు మహిళలతో జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవారు. ఈ గ్రూపులోని మహిళా సభ్యులు కీథ్తో శారీరక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇతర మహిళలపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ గ్రూపులోని ఎలిసన్ ఇటువంటి పనులకు ఎంతగానో సహకరిస్తుంటుంది. యువతులను అపహరించడం లాంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించేది. ‘స్మాల్ విలే’తో అనూహ్య ఆదరణ ఎలిసన్ మాక్ డబ్ల్యుబీ టెలివిజన్ సిరీస్ ‘స్మాల్ విలే’తో ఎంతో ప్రజాదరణ పొందింది. ఎలిసన్ అత్యధిక వెబ్‌సిరీస్‌లలో నటించింది. ఆమె నటించి బోల్డ్ సీన్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1982 జూలై 29న జన్మించిన ఎలిసన్ చిన్న వయసులోనే తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. 2001 నుంచి 2011 వరకూ ప్రసారమైన సూపర్‌మ్యాన్ స్టోరీ ఆధారంగా రూపొందిన టెలివిజన్ షోలో ఆమె విలేకరి క్లో సులివన్గా నటించి అందరి అభినందనలు అందుకుంది. ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
అమలాపురం టౌన్: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పీఆర్ రాజీవ్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
జైలుకు పోవాలన్న ఆతృత వాళ్లకెందుకు?
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే. నిజాం కాలంలో.. నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి.. జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. ఉదయం 6.30 నుంచే.. ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్వైజర్ రౌండ్‌కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది. మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్‌లో ఉంచేవారు. ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్‌తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్‌ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫీల్ ది జైల్ ప్రారంభించాలి శిథిలమైన ఫీల్ ది జైల్‌కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి. – అఖిల్ యాదవ్, సంగారెడ్డి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్‌జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..
మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ మాదిరి రివేంజ్ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ. వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త.. పేరు మోసిన డ్రగ్ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది. అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారి కల్నల్ గాబ్రియేల్ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు. చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. (చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు') -
వెరైటీ వెడ్డింగ్: 4 గంటలు బెయిల్.. జైలులో యువతి వివాహం
స్నేహం, ప్రేమ.. వీటి కోసం మనకు నచ్చిన వాళ్లని ఎంచుకుంటుంటాం, అయితే పెళ్లి విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్టే కొందరికి ఊహించని రీతిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి పెళ్లి ఈ తరహాలోనే జైలులో జరిగింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ చంపారన్‌లోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ తన కుటుంబంతో కలిసి లక్నోలో సత్సంగానికి వెళ్లాడు. జైలులో పెళ్లి... అక్కడ అతనికి యూపీలోని కప్తంగంజ్కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ గోపాల్‌గంజ్‌లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. ఇటీవల మార్చి 5న కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను రాహుల్ ఆసుపత్రిలో చేర్చాడు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కుమార్‌పై అత్యాచారం చేశాడని ఆరోపణలతో పోలీసులతో అతడిని అరెస్ట్ చేయించి జైలుకు తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. చివరికి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే రాహుల్ జైలులో ఉండడంతో గోపాల్‌గంజ్‌లోని సీజేఎం కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతించింది. దీంతో అతని పెళ్లికి నాలుగు గంటల పెరోల్ బెయిల్ లభించింది. గోపాల్‌గంజ్‌లోని చనావే జైలు నుంచి నాలుగు గంటలపాటు పెరోల్‌పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తావే దుర్గా ఆలయంలో జరిగిన ఈ అపూర్వ వివాహానికి అబ్బాయి, అమ్మాయితో పాటు పోలీసులు కూడా పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో వివాహ వేడుక తర్వాత, థావే వాలి కోర్టులో దంపతులు భార్యాభర్తలుగా నిర్ధారించింది. తావే దుర్గ గుడిలో ఓ నేరస్థుడి వివాహ వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ వినూత్న వివాహం ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం
పాకిస్తాన్ ఓ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో పోలీసులు వెంటనే అప్పమత్తమయ్యారు. వివరాల్లోకెళ్తే..దైవదూషణ ఆరోపణలపై 20 ఏళ్ల మహ్మద్ వారిస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనుకోకుండా ఓ గుంపు పోలీస్టేషన్‌లోకి ప్రవేశించి వారిస్‌పై దాడి చేసి హతమార్చింది. అంతేగాదు వారిసి మృతదేహానికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తుండగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో ఆ గుంపును అడ్డుకోలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి పాక్‌లో దైవదూషణ కూడా నేరమే, దీనికి మరణశిక్ష విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇలాంటి ఘటనలు పాక్‌లో గతంలో చాలానే జరిగాయి. అంతేగాదు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ విషయమై పలుమార్లు పాక్‌ని విమర్శించింది కూడా. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు సమాచారం. అలాగే ఆ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపకుండా అడ్డుకోవండంలో విఫలమైనందుకు పలవురు పోలీసులను కూడా సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం) -
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్‌పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్‌డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023 -
న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు
సాక్షి, చెన్నై: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎస్. శంకర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం తన ఛానల్లో న్యాయ మూర్తులు, న్యాయవర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయశాఖ అవినీతి మయమైందని అందులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాన్ని మధురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి, నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. చదవండి: (మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి) -
మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగింది? బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్‌ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్‌లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab 🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM — ESOHR (@ESOHumanRightsE) August 16, 2022 సల్మా విడుదలకు డిమాండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది. In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX — ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022 సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం) -
ఉక్రెయిన్ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!
కీవ్: ఉక్రెయిన్‌లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదీ చదవండి: డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు.. -
ఒడిశా ప్రభుత్వం ముందడుగు.. వారి బాల్యానికి భరోసా!
భువనేశ్వర్: నేరారోపణతో తల్లిదండ్రులు జైలు పాలైన సందర్భాల్లో ఆయా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇంట్లో ఆదరణ లేక ఆ పిల్లలు కూడా నేర చరితులుగానే తయారవుతున్నారు. మరికొంత మంది రోడ్డున పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను సమూలంగా మార్చి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నిబంధనల ప్రకారం జైలులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలు అలనాపాలనా చూసుకునేందుకు నిర్ధారిత నిబంధనల పరిధిలో ఇదే తరహా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీల బిడ్డల చదువులు, వారి మానసిక, శారీరక ఆరోగ్యం, ఇతరేతర సంక్షేమ, సంరక్షణ కార్యకలాపాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలకు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కారాగారవాసం 60 రోజులు పైబడితే ఈ సదుపాయం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమానికి రాష్ట్ర మహిళ–శిశు సంక్షేమశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఆరేళ్ల లోపు ఉన్న బాలల సంక్షేమం పట్ల విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. బాల నేరస్తుల చట్టం ప్రకారం శిశు సంక్షేమ కమిటీ జైలు బయట ఉన్న బాలల సంక్షేమం, సంరక్షణకు జారీ చేసిన మార్గదర్శకాల పరిధిలో ఉన్న బాలలకు మధ్యాహ్న భోజనం లభిస్తుంది. ఈ మార్గదర్శకాల వాస్తవ కార్యాచరణ సరలీకరించేందుకు జైలు ఆవరణలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇది నోడల్ అంగన్వాడీ కేంద్రంగా పని చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఈ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. టీకాలు.. పౌష్టికాహారం.. బాల ఖైదీలు అధికంగా ఉన్న జైళ్ల ఆవరణలో జైలు మాన్యువల్ నిబంధనల పరిధిలో తాత్కాలిక అంగన్వాడీ కేంద్రం అదనంగా ఏర్పాటు అవుతుందని విభాగం తెలిపింది. తల్లిదండ్రులతో కారాగారంలో ఉంటున్న బిడ్డలకు పౌష్టికాహారం, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం చేపడతారు. తక్కువ మంది పిల్లలు ఉన్న అంగన్వాడీ కేంద్రం సిబ్బంది జైలు ఆవరణలో ఏర్పాటైన తాత్కాలిక అదనపు అంగన్వాడీ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తారని మహిళ–శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. తల్లి అంగీకారంతో 6 ఏళ్ల బాలలకు సంరక్షకుల చెంతనే ఉండేందుకు అనుమతిస్తారు. జిల్లా సురక్షా యూనిట్ జైలులో ఉంటున్న తల్లీబిడ్డలను అవగాహన పరిచి, అనుబంధ సౌకర్యాలు కల్పిస్తుంది. 6 నుంచి 14 ఏళ్ల బాలలకు విద్యాభ్యాసం తప్పనిసరి. తల్లిదండ్రులు కారాగారంలో ఉండి బయట ఉన్న పిల్లల చదువులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు విద్యా ప్రోత్సాహక పథకాలు వర్తింపజేస్తారు. బిజూ శిశుసురక్షా యోజన, ఫాస్టర్ కేర్ వంటి పథకాలు కార్యాచరణలో ఉన్నట్లు మహిళ–శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న బిడ్డలతో కనీసం నెలకు ఒకసారి వ్యక్తిగతంగా కలవడం లేదా ఫోన్ ద్వారా మాట్లాడటం వంటి సదుపాయం కల్పిస్తారు. జిల్లా, సర్కిల్ జైలు అధికారులు ప్రతి 3నెలలకు ఒకసారి బిడ్డల మానసిక వికాసం ఇతరేతర అంశాలను అనుబంధ వర్గాలతో సంప్రదించి సమగ్ర నివేదిక దాఖలు చేయాలని విభాగం ఆదేశించింది. -
జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే పెళ్లి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోబోతున్నారని వికీలీక్స్ మీడియా బృందం తెలిపింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం అసాంజే జైల్లో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో జైలులోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరగనుంది. వికీలీక్స్ ప్రకారం, వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమానికి జైలు వెలుపల చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్‌ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. -
పుతిన్‌ని వ్యతిరేకిస్తే ఖతం... జైల్లోనే మగ్గిపోయేలా ప్రతి పక్ష నాయకుడి పై కేసులు
President Vladimir Putin’s most ardent foe in prison: ఉక్రెయిన్ పై రష్యా గత మూడు వారాలకుపైగా ఘెరంగా విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యుకుడికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచదేశాలు, ఆఖరికి అంతర్జాతీయ న్యాయ స్థానం సైతం యుద్ధం వద్దన్న తగ్గక పోవడంతో వ్లాదిమిర్ పుతిన్‌కి సంబంధిచిన వ్యక్తిగత వ్యవహార శైలి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ తన ప్రతిపక్ష నాయకుడిని కూడా అలాగే ఇబ్బుందులకు గురిచేసి జైలు పాలు చేశాడని అతని రాజకీయ విమర్శకులు అంటున్నారు వివరాల్లోకెళ్లే,....రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ పుతిన్‌కి పరమ బద్ద శత్రువని చెబుతున్నారు. అతని పై రష్యా అధికారులు సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోయేలా కేసులు పెట్టారు. ఈ మేరకు రష్యా కోర్టు అలెక్సీ నవల్నీని ఛీటింగ్, కోర్టు దిక్కారాలకు పాల్పడినందుకు గానూ సుమారు 8 లక్షలు జరిమాన విధించడమే కాకుండా తోమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. నిజానికి నవాల్నీ పెరోల్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసు విషయమై రెండున్నర జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పడూ మళ్లీ తనకు ఫౌండేషన్ సంబంధించి డబ్బును అపహరించారని, విచారణ సమయంలో న్యాయమూర్తిని అవమానించారని ఆరోపణలతో శిక్ష విధించారు. అతను జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే 2021లో అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. తదనంతరం అతని సహచరులను, మద్దతుదారులను అణిచివేయడమే కాకుండా నేరారోపణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో వాళ్లు రష్యాని వదిలి వెళ్లిపోయారు. నిజానికి నవల్నీ అవినీతిపై పోరాడేందుకు ఒక ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు పుతిన్ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టేవాడు. దీంతో రష్యా అధికారులు అతనిని అణిచివేసేలా కేసులు పెట్టి కటకటాల్లో ఉండేలా చేశారు. అంతేకాదు అతని ఫౌండేషన్‌కి సంబంధించిన దాదాపు 40 ప్రాంతీయ కార్యాలయాల నెట్వర్క్ తీవ్రవాదంగా నిషేధించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు సుదీర్ఘం కాలంలో జైల్లో మగ్గిపోయాలా శిక్షలు విధించారు. నవల్నీ మద్దతుదారులు ఇది రాజకీయ కుట్ర అని, అతనిపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. (చదవండి: హిట్లర్ నుంచి మిస్ అయినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!) -
చిన్నారిపై లైంగికదాడి కేసు: 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు(తమిళనాడు): చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ శతాధిక వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పూందమల్లికి చెందిన పరశురామన్ (103) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతని ఇంట్లో ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవారు. ఈ నేపథ్యంలో 2018లో ఇంట్లో ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన పరశురామన్ ఒంటరిగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు చదవండి: Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే? అయితే బాలికకు రెండు రోజుల తరువాత ఆరోగ్య సమస్యలు రావడంతో అనుమానం వచి్చన తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం బాధితులు ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరశురామన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. బాలికపై లైంగిక దాడికి దిగిన పరశురామన్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
నోళ్లు తెరిచిన జైళ్లు
క్రిమినల్ కేసుల్లో అసలైన దోషులను గుర్తించి శిక్షించడానికీ, అమాయకులకు న్యాయం అందించేం దుకూ న్యాయస్థానాలు సాగించే సుదీర్ఘ విచారణల పర్యవసానంగా జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఈ పోకడ ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదేళ్లక్రితం వరకూ మొత్తం ఖైదీల్లో విచారణ ఖైదీల శాతం సగటున అత్యధికంగా 65 వరకూ ఉండగా, ఇప్పుడది 76 శాతానికి పెరిగిందని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కకుమించి ఖైదీలను జైళ్లలో కుక్కితే సంస్కరణాలయాలు కావలసిన ఆ కారాగారాలు కాస్తా పశువుల కొట్టాలుగా మారతాయనీ, సరికొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు అవి దోహదపడతాయనీ పాలకులు గుర్తించకపోవడం విచారకరం. ఒకపక్క కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విలయం సృష్టిస్తోంది. పర్యవసానంగా అన్ని విభాగాల పనితీరూ కుంటుబడింది. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. న్యాయవ్యవస్థ సైతం అనివార్యంగా సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. సహజం గానే జైళ్లపై దీని ప్రభావం పడుతోంది. శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలయ్యేవారితో పోలిస్తే కొత్తగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలవుతున్న వారి సంఖ్య 2020 తర్వాత తీవ్రంగా పెరిగిందని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ)లోని గణాంకాల ఆధారంగా ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ నివేదిక నిర్ధారించింది. దాని ప్రకారం ఢిల్లీ జైళ్లలో 2019లో విచారణ ఖైదీలు 82 శాతం ఉండగా, మరుసటి సంవత్సరానికి అది 90.7 శాతమైంది. జమ్మూ కశ్మీర్లో 83.4 శాతం నుంచి 90.5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ లలో విచారణలో ఉన్న ఖైదీల శాతం గణనీయంగా పెరిగింది. పంజాబ్‌లో 2019లో విచారణ ఖైదీలు 66 శాతం ఉండగా, అది కాస్తా 85 శాతమైంది. హరియాణాలో 64.4 నుంచి 82 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 54.2 నుంచి 70 శాతానికి పెరిగింది. నిజానికి ఈ గణాంకాలన్నీ 2020 నాటి లెక్కలు. ఆ సంవత్సరం న్యాయస్థానాలు సైతం సరిగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల విచారణలు మందగించాయి. ఆ తర్వాతైనా పెద్దగా మెరుగుపడింది లేదు గనుక ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విచారణలు జరపడం వల్ల కొంత ప్రయోజనం కనబడిన మాట వాస్తవమే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 అమలు చేయడంతో కేసుల సంఖ్య అపారంగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా 16,43,690 కేసులు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవంగా శిక్షార్హమైన వారెందరో, అమాయకులెవరో తేల్చడం న్యాయ వ్యవస్థకు తలకుమించిన పని. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల సాధారణ పరిస్థితుల్లోనే జైళ్లలో ఎన్నో సమస్యలేర్పడ తాయి. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆ సమస్యలు మరింత ఉగ్రరూపం దాల్చడంలో ఆశ్చర్యంలేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతుండటం వల్ల 200 శాతానికి మించి ఖైదీలున్న జైళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిచోట కరోనాను అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? కారాగారాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నా మని ప్రభుత్వాలు చెబుతూనే వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చిన ఖైదీలను కొన్ని రోజులపాటు అక్కడ ఉంచటం, జైలు మాన్యువల్ అమలును ఆపి, విజిటర్స్ రాకుండా కట్టడి చేయడం అందులో కొన్ని. కానీ ఖైదీల మానవ హక్కులు ఆవిరికావడం మినహా వీటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. న్యాయవాదులుగానీ, వారి బంధువులుగానీ నేరుగా ఖైదీలను కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. లాకప్ డెత్‌లు, అసహజ మరణాల విషయంలో అంతకుముం దున్న జవాబుదారీతనం కూడా అడుగంటింది. కనుకనే 2020లో లాకప్ డెత్‌లు ఏడు శాతం పెరగ్గా, ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు వంటి అసహజ మరణాలు 18.1 శాతం హెచ్చయ్యాయి. తగినన్ని అధికారాలున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తే మన జైళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో వెల్లడవుతుంది. దేశమంతా లాక్డౌన్ అమలైన కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అందువల్ల విడుదలైనవారి శాతం అంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, పెద్ద వయసు, జండర్ వంటి ప్రాతిపదికలు కాక, ఖైదీల విడుదలను పాలనాపరమైన వ్యవహారంగా కమిటీలు పరిగణించడంవల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పరిమితికి మించి ఖైదీలుండటం, అదే సమయంలో తగినంతగా సిబ్బంది లేకపోవడం జైళ్లలో అవినీతికి, అమానవీయతకు, ఇతర వైపరీత్యాలకూ దారితీస్తోంది. జైళ్లు సంస్కర ణాలయాలని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా అందులో చిత్రహింసలు విడదీయరాని భాగమని ‘డిసిప్లిన్ అండ్ పనిష్: ద బర్త్ ఆఫ్ ద ప్రిజన్’ పుస్తకంలో మైఖేల్ ఫాకల్ట్ అంటాడు. మనిషిలో అమానవీయతను పెంచి, నేర ప్రవృత్తికి అలవాటు చేసే జైళ్ల స్థితిగతులను చక్కదిద్దడానికి సిబ్బందిని పెంచడం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడటం, జవాబుదారీతనాన్ని పునఃప్రతిష్టించడం కీలకం. వీటిపై న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దృష్టి సారించడం తక్షణావసరం. -
చిన్నమ్మ మెడకు ‘లగ్జరీ’ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసినా చిన్నమ్మ శశికళను కారాగారం నీడ వెంటాడుతూనే ఉంది. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సమయంలో లగ్జరీ జీవితం కోసం రూ.2 కోట్లు లంచం ఎరవేసిన వ్యవహారం రుజువై చిన్నమ్మ మెడకు బిగుసుకుంటోంది. వివరాలు.. తమిళనాడులో 1991–96 మధ్యకాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అప్పటి సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నలుగురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జయ మరణం తరువాత 2017 ఫిబ్రవరి 15వ తేదీన తుదితీర్పు వెలువడింది. దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాకాలాన్ని పూర్తిచేసుకుని విడులయ్యారు. బెంగళూరు జైల్లో శశికళ సాధారణ ఖైదీలాగ కాకుండా లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించడం, ఇళవరసితో కలిసి బెంగళూరులో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వారికి ఈ వెసులుబాటు కల్పించిన జైలు ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది. డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయ్యాయి. కాగా చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్ట్ 25న తొలివిడత చార్జిషీటు దాఖలైంది. ఈ కేసు కర్ణాటక హైకోర్టులో బుధవారం మరోసారి విచారణ వచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ హాజరై జైలు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా తుది చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈకేసుపై త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్‌లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్‌పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్‌లో ఆర్మీ బ్యారక్‌పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్‌లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై..
కర్నూలు (లీగల్)/బనగానపల్లె రూరల్: ఇంటి యజమానికి నమ్మకస్తుడిగా ఉంటూ అతని భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి కర్నూలు ఏడవ అదనపు జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో శివనాగిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. తన ట్రాక్టర్‌కు బందెల పెద్దయ్య అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. 2015 మార్చి 24వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని భార్య (26)పై అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే బందెల పెద్దయ్యపై నందివర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5,500 లు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్.చినబాబు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.నరేంద్రనాథ్ రెడ్డి వాదనలు వినిపించారు. -
ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష
South Korea Park Geun Hye Freed After 5 Years From Prison: అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హే దాదాపు ఐదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017లో పార్క్‌ని అరెస్ట్ చేయడమే కాక 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గతవారం పార్క్‌కు ప్రత్యేక క్షమాభిక్షను మంజూరు చేశారు. (చదవండి: చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!) అంతేకాదు గతాన్ని మర్చిపోయి దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి.. కరోనా పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూన్ జే-ఇన్ వెల్లడించారు. పైగా గత ఐదేళ్లుగా కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలు పార్క్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని అందువల్ల తాను దీనిని కూడా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. అయితే పార్క్ విడుదలకు పిలుపునిచ్చేలా పార్క్ మితవాద అనుకూల సమూహాలు వారానికోసారి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ మేరకు పార్క్కూడా ప్రజల ఆందోళనలకు కారణమైనందుకు క్షమపణలు చెప్పడమేకాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు మూన్‌కి ధన్యవాదలు తెలిపారు. పైగా పార్క్ మాజీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అయిన కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ, మూన్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నందున పార్క్ విడుదలైంది. అంతేకాదు వందలాది మంది పార్క్ మద్దతుదారులు ఆమె విడుదలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రి బయటే గడ్డకట్టే చలిలో ఆమె రాక కోసం పుష్పగుచ్చలతో వేచిఉండటం విశేషం. అయితే ఆమె తదుపరి మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఏదైనా క్రీయాశీల పాత్ర పోషిస్తుందా అనే విషయం పై ఎలాంటి స్పష్టత లేదు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి
జొహన్నస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని వేలం వేయడాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న జరగనున్న ఓ ప్రైవేట్ వేలంపాటలో ఆ తాళం చెవికి ధర కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అసలు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుం డా వేలంవేయడ మేంటని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. మండేలాకు చెందిన కళ్లద్దాలు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలూ వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామన్నారు. మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్ ఉన్నాడు. మండేలాకు, క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో .. రాబిన్ ద్వీపానికి టూర్ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్ ఒకటి క్రిస్టో చెంతకు చేరింది. ఆ డూప్లికేట్ కీను అమెరికాకు చెందిన గెన్సీస్ ఆక్షన్స్ అనే వేలం సంస్థకు విక్రయించాడు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు కీ కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. గది మాస్టర్ కీ(అసలైన తాళం చెవి) జైలులోనే ఉందని, డూప్లికేట్‌కు ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని మంత్రి చెప్పారు. -
జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!
జైలును కళలకు కేంద్రంగా మార్చడం ఏమిటి? అని సందేహంగా చూడకండి. నిజానికి ఇది చాలా ప్రసిద్ధిగాంచిన జైలు. ఈ జైలులోంచి ఎందరో గొప్ప గొప్ప కవులు పుట్టుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ జైలు అధికారులు ఆ జైలుని వేలం వేయాలని చూస్తున్నారు. అయితే ఒక వీధి కళాకారుడు తన కళలతో వేలం ద్వారా వచ్చేంత డబ్బను ఇస్తానంటూ ఆ జైలుని భవనాలు అభివృద్ధి చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని తపిస్తున్నాడు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) అసలు విషయంలోకెళ్లితే... ఇంగ్లాండ్‌కి చెందిన అజ్ఞాత వీధి కళాకారుడు బ్యాంక్సీ జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడానికి మిలియన్లు సేకరిస్తున్నాడు. అయితే ఈ జైలు రీడింగ్ జైలుగాప్రసిద్ధి చెందింది. అంతేకాదు ప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత అయిన ఆస్కార్ వైల్డ్‌ను కలిగి ఉంది. అంతేకాదు జైలు అంటే ఒక నరకకూపంగా భావిస్తాం. అలాంటి ప్రదేశాన్ని కళకు కేంద్రంగా మార్చి పరిపూర్ణమైనదిగా చేయాలని తపిస్తున్నట్లు చెబుతాడు. ఈ మేరకు బ్యాక్సీ "క్రియేట్ ఎస్కేప్" పేరుతో గోడ చిత్రాలను వేస్తాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజల ఆ జైలు గోడల పై వేసిన చిత్రాల పట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు ఈ చిత్రాలను విక్రయించిన సోమ్ము జైలు అధికారులు వేలంలో ఆర్జించాలనకున్న దాదాపు రూ 100 కోట్లుకి సరిపోతుందని హామీ కూడా ఇస్తాడు. అయితే ఈ చిత్రం ఈ నెల ప్రారంభంలో బ్రిస్టల్ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడుతుందని, పైగా రూ 130 లక్షల వరకు సేకరించిగలనని ధీమా వ్యక్తం చేస్తాడు. ఈ మేరకు బ్యాంక్సీ ఈ జైలుని ఆర్ట్ సెంటర్‌గా మార్చేలా ప్రచారం కూడా చేస్తాడు. జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చాలనే ప్రచారానికి ఇప్పటికే నటులు డేమ్ జూడి డెంచ్, సర్ కెన్నెత్ బ్రనాగ్, కేట్ విన్స్లెట్, నటాలీ డోర్మెర్ నుండి మద్దతు లభించింది. అంతేకాదు బ్యాంక్సీ దీనికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) View this post on Instagram A post shared by Banksy (@banksy) -
అత్యాచారం కేసు: 16 ఏళ్ల జైలు శిక్ష.. ఆ మచ్చ తొలిగేదెలా
న్యూయార్క్: అత్యాచారం కేసులో చేయని నేరానికి నేరస్తుడిగా 16 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తికి ఉపశమనం లభించింది. 1982లో ప్రముఖ రచయిత అలిస్ సెబోల్డ్‌పై అత్యాచారం జరిగింది. అయితే ఆమె సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ఉన్నప్పుడు ఆంథోని బ్రాడ్‌వాటర్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ‘లక్కీ’ అనే పుస్తకంలో రాసింది. అయితే తాగాజా 1982 సమయంలో ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆంథోని బ్రాడ్‌వాటర్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఒనోండగా కౌంటీ జిల్లా అటార్నీ విలియం ఫిట్జ్‌పాట్రిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోర్డాన్ కఫీ ఈ కేసుపై విచారణ చేపట్టి.. నేరారోపణతో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రాడ్‌వాటర్ అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్‌లో అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో 61 ఏళ్ల ఆంథోని బ్రాడ్‌వాటర్ కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం బ్రాడ్‌వాటర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను గత రెండు రోజులుగా ఆనందంగా ఉపశమనంతో ఉన్నానని తెలిపారు. ఈ కేసును తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. 1981లో తనపై అత్యాచారం జరిగిందని, కొన్ని నెలలకు అత్యాచారం జగిగిన వీధిలో ఓ నల్లజాతి వ్యక్తి అయిన బ్రాడ్‌వాటర్ కనిపించడంతో.. అతనే తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ అలిస్ సెబోల్డ్ తన పుస్తకం ‘లక్కీ’లో రాసింది. తర్వాత బ్రాడ్‌వాటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 16 ఏళ్ల పాటు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన బ్రాడ్‌వాటర్‌పై నేరారోపణలు రుజువు కాలేదు. ఆయనపై ఉన్న అత్యాచారం కేసును కోర్టు కొట్టివేసింది. -
జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి
క్విటో: ఈక్వెడార్‌లోని జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కోస్తా తీర నగరం గుయాక్విల్‌లో ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న రెండు గ్యాంగుల నడుమ దాదాపు 8 గంటలపాటు ఈ ఘర్షణ జరిగింది. తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. జైలు అధికారులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) -
అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష
మయన్మార్: మయన్మార్ జుంటా కోర్టు అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్‌స్టర్‌కు చట్టవిరుద్ధమైన పనులు, మిలిటరీని రెచ్చగొట్టేల చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో 11 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మయన్మార్ మిలటరీ బలాగాలు తిరుగాబాటు ధోరణితో డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రెస్‌ని అణిచివేస్తుందన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే డానీ ఫెన్స్టర్ స్థానిక మయన్మార్‌లోని అవుట్లెట్ ఫ్రాంటియర్ పత్రికలో ఒక ఏడాది నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబాన్ని చూడటానికై దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మయన్మార్ మిలటరీ అతన్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఫ్రాంటియర్ పత్రిక తమ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసిన డానీ ఫెన్స్టర్ను ఇలా మూడు ఆరోపణలతో దోషిగా నిర్ధారించి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫెన్స్టర్ నిర్భందించినప్పటి నుంచి జీవితాంతం జైలు శిక్ష విధించేలా దేశద్రోహం, తీవ్రవాదం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడంటూ పేర్కొంది. అంతేకాదు తాము ఫెన్స్టర్ వీలైనంత త్వరగా విడుదలై తమ కుటుంబాన్ని చూడటానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఫ్రాంటియర్ మయన్మార్ తెలిపింది. ఈ మేరకు క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ హార్సీ మిలటరీ చేస్తున్న ఈ పనిని "దౌర్జన్యం"గా అభివర్ణించారు. ఈ సంఘటన వాస్తవిక పరిస్థితులు గురించి వివరిస్తే ఇలానే చాలా ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుందనేలా అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రమే కాక మయన్మార్ జర్నలిస్టులకు కూడా పరోక్షంగా సందేశాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ఫెన్స్టర్ని విడుదల చేసేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ పేర్కొన్నారు. ఈ సమస్య కచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతుందంటూ రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!) -
UP: సెంట్రల్ జైలులో ఖైదీల వీరంగం
-
‘ ప్లీజ్.. నా భర్తను భారత్ జైలుకు తరలించండి’
చెన్నై: శ్రీలంక జైలులో ఉన్న తన భర్తను దయచేసి భారత్ జైలుకు మార్చాలని కోరుతూ మదురై హైకోర్టు బెంచ్‌లో రీఫాయుదీందన్ జాలరి భార్య పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం బదులివ్వాలని బెంచ్ ఉత్తర్వులిచ్చింది. రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మెహరూన్ నిషా మదురై హైకోర్టు బెంచ్‌లో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాల మేరకు.. తన భర్త రీఫాయుదీందన్ జాలరి అని, అతను మత్తుమందు తరలించినట్లు శ్రీలంక పోలీసులు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని, 2013 నుంచి జైలులో ఉంచినట్లు తెలిపారు. భారత్ – శ్రీలంక ఒప్పంద ప్రకారం శ్రీలంక జైలులో ఉన్న పలువురు ఖైదీలు భారతదేశానికి మారారని, అలాగే తన భర్తను భారత జైలుకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత, శ్రీలంక దౌత్య కార్యాయాలకు పిటిషన్ అందజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను భారత జైలుకు మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తులు కె.కల్యాణ సుందరం, పి.పుహళేంది కేంద్ర విదేశాంగ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి తరఫున బదులివ్వాలని ఉత్తర్వులిస్తూ విచారణను వాయిదా వేశారు. -
జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కు ఆదేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే అరెస్టుకు ఆదేశాలిస్తారు. -
టిక్ టాక్ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం'కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని కాపాడాలంటూ ప్రెసిడెంట్ అబ్ధుల్‌ను వేడుకుంది. ‘‘ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏ పాపం చేసింది. చచ్చిపోతుంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. దయ చూపించండి. నేను జైలుకెళితే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. నావైపు తప్పు లేదు కాబట్టే మాట్లాడుతున్నాను కేసును పునఃవిచారణ చేసి తనకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతరమైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హనీన్‌కు కోర్ట్ జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ అబ్ధుల్ తన కోరికను మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా,ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడవు. అందుకే హనీన్ హోసంను ఆ దేశ ప్రభుత్వం ఈ శిక్ష విధించిందనే వాదానలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
ఫ్రీ నస్రీన్.. ఫ్రీ లోజైన్ విడుదల ఉద్యమం
నస్రీన్, లోజైన్.. ఈ ఇద్దరూ అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు. ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకొకరు జైలు వంటి నిర్బంధంలో బయట ఉన్నారు. జైల్లో ఉన్న నస్రీన్‌కు కరోనా వచ్చిందని తాజా సమాచారం! జైలు బయట ఉన్న లోజైన్.. డేగ కళ్ల నిఘాల మధ్య తన అనుదిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరూ రెండు దేశాల వాళ్లు. వీళ్ల కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గళమెత్తింది. ‘ఫ్రీ సస్రీన్.. ఫ్రీ లోజైన్’ అని ఉద్యమించింది. హక్కుల కోసం పోరాడుతున్న మహిళ హక్కుల కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెట్ బయట, నెట్ లోపల ‘ఫ్రీడమ్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్’ అంటూ నిరసనలు, ప్రదర్శనలు మొదలయ్యాయి. నస్రీన్ సొటుడే (57) లాయర్. మానవ హక్కుల కార్యకర్త. స్త్రీ హక్కుల ఉద్యమకారిణి. ఆమె రచనలు, ప్రసంగాలు, సమావేశాలు.. దేశంలో రాజకీయ అస్థిరతకు కారణం అవొచ్చంటూ ఇరాన్ ప్రభుత్వం 2018 జూన్‌లో ఆమెను అరెస్ట్ చేసింది. 38 ఏళ్ల జైలు శిక్ష విధించి, 148 కొరడా దెబ్బలు కొట్టించింది! టెహ్రాన్ సమీపంలో ఆమెను ఉంచిన కర్చక్ జైలు అత్యంత దారుణమైనది, అపరిశుభ్రమైనది. పైగా నస్రీన్ ఇప్పుడు కరోనా బారిన కూడా పడ్డారు. ఆమెను తక్షణం విడిపించి వైద్య చికిత్సకు తరలించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కోరుతోంది. లోజైన్ అల్హత్లౌల్ (31) ప్రజా న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త. ప్రజల తరఫున ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సౌదీ అరేబియా పాలకులకు నచ్చలేదు. అమెను తక్షణం నిలువరిం^è కపోతే దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం అని తలచారు. 2018 మే లో అమెను అరెస్ట్ చేశారు. వెయ్యి రోజులు జైలు శిక్షను అనుభవించాక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. అలాగని స్వేచ్చగా ఉండేందుకు లేదు. మూడేళ్ల ‘గమనింపు’ కాలం విధించారు. ఈ మూడేళ్లూ ఆమె ప్రభుత్వ సమ్మతి లేకుండా అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. పాల్గొంటే మళ్లీ జైలు శిక్ష. వెయ్యి రోజుల శిక్షాకాలంలో అనేక విధాలైన హింసలకు గురయ్యారు లోజైన్. ‘ఆమ్నెస్టీ’ ఈమె కోసం కూడా పోరాడుతోంది. లోజైన్ పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయమని డిమాండ్ చేస్తోంది. నస్రీన్, లోజైన్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలలో ఇంకా ఎంతో మంది మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలోనూ, జైలు వంటి నిర్బంధాలలోనూ దుర్భమైన జీవితాలను గడుపుతున్నారు. వారందరి కోసం ఇప్పుడు ఆమ్నెస్టీ తో పాటు, ‘పెన్’ (పొయెట్స్, ఎడిటర్స్, నావెలిస్ట్స్) అమెరికా, ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, ప్రసిద్ధ అమెరికన్ మ్యాగజీన్ ‘మిస్’, సెంటర్ ఫర్ ఉమెన్స్ గ్లోబల్ లీడర్షిప్ ఉద్యమించాయి. -
బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు!
సాక్షి, నాగోలు: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కోప్రగది సంజయ్(58) ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉండేది. 2017లో ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి సురేష్ నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. చదవండి: బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబు -
విమానంలో పిచ్చి చేష్టలు.. అందరూ చూస్తుండగా ప్యాంటు విప్పి..
వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని మార్చేసింది. కుటుంబాలను, మానవ జీవితాలను అతలాకు తలం చేసింది. అయినా ఇప్పటికీ కొందరు కోవిడ్‌ని అంత సీరియస్‌గా తీసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోన్న వ్యక్తులు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. అలాంటి వాడే కొలరాడోకి చెందిన 24 ఏళ్ళ లాండన్ గ్రియర్. ఆలాస్కా ఎయిర్‌లైన్ ఫ్లైట్‌లో మార్చి 9న ప్రయాణిస్తోన్న సదరు వ్యక్తిని విమాన సిబ్బంది మాస్క్ పెట్టుకోమని పదేపదే కోరారు. గ్రియర్ నిద్రనటిస్తూ, మాస్క్‌పెట్టుకోమని పదే పదే విజ్ఞప్తి చేసినా, వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చాడు. అంతేకాకుండా ఫ్టైట్‌లోనే తన సీటుపైనే మూత్రవిసర్జన చేసి అసహ్యంగా ప్రపవర్తించడంతో తోటి ప్రయాణీకులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో విమానం ల్యాండ్ అయిన అనంతరం 24 ఏళ్ళ లాండన్ గ్రియర్‌ను ఎఫ్బిఐ అరెస్టు చేసింది. డెన్వర్‌లోని జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశారు. గ్రియర్ సీటెల్ నుంచి డెన్వర్‌కి ఫ్లైట్ ఎక్కే ముందు మూడు నుంచి నాలుగు బీర్లను తాగానని ఎఫ్బిఐ ఏజెంట్లతో చెప్పారు. విమాన సిబ్బందిని కొట్టినట్టు తనకు గుర్తు లేదని, తాను మూత్ర విసర్జన చేసిన విషయం కూడా తనకు తెలియదని గ్రియర్ చెప్పుకొచ్చాడు. నిజానికి గ్రియర్ తన ప్యాంట్ విప్పి అసహ్యంగా ప్రవర్తిస్తుండగా విమాన సిబ్బంది హెచ్చరించడంతో తాను మూత్రవిసర్జన చేస్తున్నానిచెప్పాడు. ప్రస్తుతం పదివేల డాలర్ల పూచీకత్తుతో గ్రియర్ విడుదలయ్యాడు. విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అభియోగాలతో అరెస్టయిన ఈ తాగుబోతు నేరం రుజువైతే, గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే దాదాపు రెండు కోట్ల జరీమానా విధించే అవకాశం వుందట. -
నాకు మరణశిక్ష విధించినా సరే..
ఝాంగ్ ఝాన్ పౌర పాత్రికేయురాలు. మే10న చైనా ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఈ నెల28న ఝాన్‌పై విచారణ మొదలవుతోంది. ఆమె చేసిన నేరం కరోనాపై వార్తలు రాయడం! ‘నాకు మరణశిక్ష విధించినా సరే నేను నా మాటపైనే ఉంటాను. వాస్తవాలను భూస్థాపితం చేస్తే ఏనాటికైనా అవి మొలకెత్తక మానవు’ అంటున్నారు ఝాన్. వుహాన్‌లో కరోనా మొదలైనప్పుడు ఆ వార్తల్ని ప్రపంచానికి అందించిన తొలినాళ్ల జర్నలిస్టులలో 37 ఏళ్ల ఝాంగ్ ఝాన్ కూడా ఒకరు. అంతేకాదు, తమ రిపోర్టింగ్‌లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చిపెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో విచారణ లేకుండా గత ఏడు నెలలుగా మగ్గిపోతున్న జర్నలిస్టులలో కూడా ఝాన్ ఒకరు. మిగతా వారంతా పురుషులు. ఝాన్ ఒక్కరే మహిళ. షాంఘై జిల్లా, పుడోంగ్ పట్టణంలోని జైల్లో ఉన్నారు ఝంగ్. ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ జైల్లో నిర్బంధంలో ఉన్న తొలిరోజు నుంచే ఆమె నిరాహార దీక్షలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నాసిక నుంచి ద్రవాహారాన్ని ఎక్కించవలసి వస్తోంది. బాత్రూమ్కి కూడా ఆమెను నడిపించుకుని వెళ్లవలసి వస్తోంది. తలపోటు, తల తిరగడం, కడుపు నొప్పి ఆమెను జీవితాన్ని నరకం చేస్తున్నాయి. చదవండి: కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు మానసికంగా కూడా ఆమె సరిగా లేరు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎంత బ్రతిమాలుతున్నా ఝాన్ తన నిరశనను విరమించడం లేదు. ప్రభుత్వం అయితే పట్టనట్లే ఉంది. ‘‘విచారణ జరిపి, శిక్ష విధించేందుకు అవసరమైనంత వరకే ఆమె జీవించి ఉంటే చాలునని ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఉంది’’ అని ఝాన్ న్యాయవాది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 28 న ‘షాంఘై పుడోంగ్ న్యూ ఏరియా పీపుల్స్ కోర్టు’లో మొదలయ్యే విచారణపై తన క్లయింట్‌కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు కలగడం లేదని ఆయన అంటున్నారు! అసమ్మతిని చైనా పాలకులు అరాచకంగా భావించడమే ఇందుకు కారణం. ఝాంగ్ ఝాన్ పై ఇప్పటికే అసమ్మతివాది అనే ముద్ర ఉంది. చైనా చట్టాల పరిధిలోకి వచ్చేందుకు నిరాకరిస్తున్న హాంగ్‌కాంగ్ కార్యకర్తలకు మద్దతు ఇచ్చిన నేరానికి 2018, 2019లలో ఆమె అనేకసార్లు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలన్నీ ప్రభుత్వానికి తలవొగ్గకపోవడం వల్లనేనని అంటున్న ఝాంగ్.. పాతిపెట్టిన నిజాలు ఎప్పటికైనా మొలకెత్తకుండా ఉండవు అని తన శక్తినంతా కూడదీసుకుని గర్జిస్తున్నారు. -
జనవరి 27న విడుదలకానున్న చిన్నమ్మ..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ ముగ్గురూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు. వీఎన్ సుధాకరన్ మాత్రం ఇంకా చెల్లించలేదు. సుధాకరన్ శిక్షాకాలం త్వరలో ముగుస్తున్నందున జరిమానా చెల్లింపునకు అనుమతి, విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన న్యాయవాదులు సెప్టెంబర్ 8న అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడే నాటికి 122 రోజులు జైల్లో గడిపినందున నాలుగేళ్ల శిక్షాకాలంలో వీటిని మినహాయించుకుని వెంటనే విడుదల చేయాల్సిందిగా సుధాకరన్ న్యాయవాదులు కోర్టుకు విన్న వించారు. విడుదలపై ఆదేశాలు జారీకాగానే జరిమానాను చెల్లిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, జరిమానా చెల్లించగానే శిక్షాకాలం రోజులను కలుపుకుని సుధాకరన్ను వెంటనే విడుదల చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జరిమానా సొమ్ము చెల్లింపునకు న్యాయవాదులు సిద్ధం అవుతుండగా, రెండు మూడు రోజుల్లో సుధాకరన్ విడుదల కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. చదవండి: (కమల్ హాసన్‌కు నిరాశ.. టార్చ్‌లైట్ పోయే..) వచ్చేనెల 27న శశికళ విడుదల.. ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరన్ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. దీంతో వచ్చేనెలాఖరులో శశికళ విడుదల ఖాయమని భావించవచ్చు. -
ఖైదీలకు గుడ్ న్యూస్..మరో 8 వారాలు సేఫ్‌గా!
లక్నో : భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 2,234 మంది ఖైదీలకు మరో రెండు నెలల ప్రత్యేక పెరోల్ మంజూరు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 జైళ్లలో ఉన్న 2,234 మంది ఖైదీను 8 వారాల పాటు పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని మరో 8 వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థీ పేర్కొన్నారు. ఈ మేరకు మే 25న ఓ ప్రకటన విడుదల చేశారు. (ఖైదీకి కరోనా.. క్వారంటైన్‌కు 100 మంది ) దేశంలో మహమ్మారి వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. జైళ్లల్లో సామాజిక దూరం పాటించడం చాలా కష్టతరమైన విషయం. దీంతో జైళ్లలో అధిక రద్దీ కారణంగా కరోనా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు ఇచ్చిన పెరోల్ గడువును మరో 8 వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ ) -
24 గంటలు..77 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి స్త్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో ఏకంగా 77 మంది కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. అలాగే కొత్తగా 1,755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 1,152కు, పాజిటివ్ కేసుల సంఖ్య 35,365కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 25,148 కాగా.. 9,064 మంది(25.63 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. స్వదేశంలో పీపీఈ కిట్ల తయారీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. 2.22 కోట్ల పీపీఈ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.43 కోట్ల కిట్లను భారత్‌లోని స్వదేశీ సంస్థలే తయారు చేస్తున్నాయని పేర్కొంది. గతంలో పీపీఈ కిట్ల కోసం విదేశాలలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వీటిని తయారు చేసే సంస్థలు భారత్‌లో 111 ఉన్నాయని కేంద్ర సాధికార సంఘం–3 చైర్మన్ పి.డి.వాఘేలా తెలిపారు. దేశంలో ప్రస్తుతం 19,398 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో 59,884 వెంటిలేటర్లు మనదేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు. అలాగే 2.49 కోట్ల ఎన్–95/ఎన్–99 మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.49 కోట్ల మాస్కులను స్వదేశీ సంస్థల నుంచే కొంటున్నామని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తిని నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచామన్నారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) దళంలో ఐదుగురు జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ 12 మంది తాత్కాలిక జైలుకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను అధికారులు తాత్కాలిక జైలుకు తరలించారు. వీరిలో 9 మంది థాయ్‌లాండ్ దేశస్తులు. వీరంతా ఓ మసీదులో ఉండగా, ఏప్రిల్ 2న అదుపులోకి తీసుకున్నారు. నాందేడ్ గురుద్వారా మూసివేత మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ హుజూర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేశారు. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో తాజాగా 91 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో జోన్ల వారీగా ‘లాక్డౌన్’ ఎత్తివేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మే 3వ తేదీ తర్వాత తమ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను జోన్లవారీగా ఎత్తివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం చెప్పారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తామని, తొందరపాటుకు తావులేదని అన్నారు. ముంబై, పుణే, నాగపూర్, ఔరంగాబాద్ వంటి రెడ్జోన్లలో లాక్డౌన్ ఎత్తివేతపై ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపుపై ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరించడం తగదని, అలాచేస్తే అక్కడ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ఏ దేశానికిపైనా నిజమైన సంపద ఆ దేశ ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. -
ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్, ధరలు పెంచే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. నిత్యావసరాల కొరత, ధరల పెరుగుదల లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బ్లాక్ మార్కెటింగ్, ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని పేర్కొంది. -
కరోనా : జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి
బొగోటా : కరోనా వైరస్ వ్యాప్తిపై జైళ్లలోని ఖైదీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న వేళ జైలులో కనీస పారిశుద్ధ్యం కరువైందని, సరైన వైద్యసదుపాయాలు లేవని ఆరోపించిన ఖైదీలు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో 23 మంది ఖైదీలు మరణించగా, 83 మంది గాయపడ్డారు. ఈ ఘటన కొలంబియా రాజధాని బొగోటాలోని లా మోడెలో జైలులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 32 మంది ఖైదీలు, ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైలులో పథకం ప్రకారమే అల్లర్లు జరిగాయని చెప్పారు. జైల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదని.. అల్లర్లు సృష్టించేందుకే ఖైదీలు ఇలా చేశారని అన్నారు. జైలులో ఏ ఒక్క ఖైదీకి కూడా కరోనా సోకలేదని, ఎవరినీ ఐసోలేషన్‌లో ఉంచలేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఈ విషయం తెలసుకున్న ఆ జైలులోని ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత బలగాలు జైలు వద్దకు చేరకున్న తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయని వారు అంటున్నారు. చదవండి : లాక్డౌన్ : రోడ్లపైకి జనం.. కలెక్టర్ ఆగ్రహం భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ నిలిపివేత.. -
నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాకాండలో శిక్ష అనుభవించబోతున్న దోషులకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు జనవరి 22 న ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్నట్లు ఢిల్లీ కోర్టు ఈ నెల ప్రారంభంలో డెత్ వారెంట్ జారీ చేసింది. అటు మరణశిక్షకు వ్యతిరేకంగా ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో వీరికి మరణశిక్ష అమలు కానుంది. గత ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న వీరు అనేకసార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారు. అంతేకాదు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 2012 డిసెంబర్ 16 న యువ వైద్య విద్యార్థిని (నిర్భయ)ను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబరు 29న నిర్భయ కన్నుమూయడంతో ఆందోళన ఉరింత ఉధృతమైంది. ఈ కేసులో సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నలుగురు దోషులు, అక్షయ్, ముకేష్, పవన్, వినయ్ శర్మలకు మరణ శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారని వర్గాలు తెలిపాయి. జైల్లో వీరి సంపాదన మొత్తం దాదాపు రూ .1,37,000. గత ఏడు సంవత్సరాల సమయంలో జైలు నియమాలను ఉల్లంఘించినందుకు వినయ్ 11 సార్లు, అక్షయ్ ఒకసారి శిక్ష అనుభవించాడు. ముకేశ్ మూడుసార్లు, పవన్ ఎనిమిది సార్లు నిబంధనలను అతిక్రమించారు. ముకేశ్ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకోగా అక్షయ్ రూ .69 వేలు సంపాదించగా, పవన్ రూ .29 వేలు, వినయ్ రూ .39 వేలు సంపాదించాడు. 2016లో ముగ్గురు దోషులు - ముకేష్, పవన్, అక్షయ్ - 10 వ తరగతికి అర్హత సంపాదించి పరీక్షలకు హాజరయ్యారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వినయ్, 2015 లో, బ్యాచిలర్ డిగ్రీ కోసం ఎంట్రన్స్ పాస్ అయినా కాని అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. ఉరిశిక్ష అమలుకు ముందు దోషులందరి కుటుంబానికి కలవడానికి రెండుసార్లు అనుమతించారు అధికారులు. దీంతో వినయ్‌ను తండ్రి మంగళవారం కలిశారు. కాగా ఈ నలుగురిని ఉరి తీసే ఏర్పాట్లు గత నెలలో ప్రారంభమయ్యాయి. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో వేర్వేరు గదుల్లో ఉంచారు. అటు ఉరితీత సన్నాహకాల్లో భాగంగా జైలు అధికారులు ట్రయల్ కూడా నిర్వహించారు. మీరట్‌కు చెందిన పవన్ జల్లాద్ ఈ నలుగురిని ఉరి తీయనున్నారు. మరోవైపు ముకేష్ దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం మెర్సీ పిటిషన్ పెట్టుకున్నసంగతి విదితమే. చదవండి : నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్! -
నాడు అజిత్‌ను జైలుకు పంపుతానన్న ఫడ్నవీస్
ముంబై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే మాట మరోమారు రుజువైనట్టు కనిపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఇరిగేషన్ స్కాంపై అజిత్ పవార్ జైలుకెళ్లక తప్పదని శపథాలు చేసిన ఫడ్నవీస్ తాజాగా అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, తాను సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. దీంతో 2014లో ఫడ్నవీస్ అజిత్‌పవార్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎన్సీపీని ‘నేచురల్లీ కరప్ట్ పార్టీ’గా అభివర్ణించిన మోదీ ప్రస్తుతం ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
పారిపోయిన ఖైదీలు తిరిగొచ్చారెందుకో!
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు సందు దొరికితే చాలు జైలు నుంచి పారిపోదామని చూస్తారు. మరికొందరు సందు దొరక్కపోయినా గోడలకు కన్నం వేసి మరీ పారిపోదామని వ్యూహాలు పన్నుతుంటారు. ఇండోనేసియాలోని పపువా ప్రాంతంలోని సొరాంగ్ నగరంలోని జైలులో సోమవారం మంటలు వ్యాపించడంతో జైలు నుంచి పారిపోయిన 500 మంది ఖైదీలు పారిపోయారు. వారిలో 270 మంది ఖైదీలు గురువారం తిరిగి జైలుకు చేరుకున్నారు. అలా తిరిగొచ్చిన వారిలో హత్య కేసుల్లో శిక్షలు పడ్డ వారు కూడా ఉన్నారని జైలు అధికార ప్రతినిధి ఎల్లి యోజర్ మీడియాకు తెలిపారు. వారంతా ప్రాణ రక్షణ కోసమే జైలు నుంచి పారిపోయారని, మిగతా శిక్షకాలాన్ని పూర్తి చేసుకునేందుకు తిరిగొచ్చారని ఆయన చెప్పారు. ఏదో అంశంపై ఆందోళన చేస్తున్న పపువా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థులు, స్థానికులు సొరాంగ్ నగరం జైలుకు నిప్పుపెట్టారు. ఖైదీలతో కిక్కిరిసిపోవడం వల్ల జైలు పరిశుభ్రంగా ఏమీ ఉండదని, అయితే తాము ఖైదీలను బాగా చూసుకుంటామని అందుకనే వారంతా తిరిగొచ్చారని ఎల్లీ యోజర్ తెలిపారు. బయట ఆహారం దొరక్కా జైలుకొచ్చే ఖైదీలు ఇంకా ఎక్కడైనా ఉండవచ్చేమోగానీ తమ వద్ద మాత్రం అలాంటి ఖైదీలు లేరని చెప్పారు. శిక్షాకాలం పూర్తి కాకుండా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అపరాధభావం, భయం జీవితాంతం వెంటాడుతుందని, శిక్షాకాలం పూర్తయ్యాక దర్జాగా సాధారణ జీవితం గడపొచ్చని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఆయన అన్నారు. తిరిగొచ్చిన ఖైదీలు కాలిపోయిన జైలు అధికారుల గదులను శుభ్రం చేయడమే కాకుండా మరమ్మతుల్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని, అధికారుల మంచితనానికి వారూ మంచితనమే చూపారని ఎల్లి యోజర్ వ్యాఖ్యానించారు. మిగతా ఖైదీలు కూడా తమ బంధు, మిత్రుల యోగ క్షేమాలు కనుగొని ఒకటి, రెండు రోజుల్లో తిరిగొస్తారని తాము ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
జైలులోకి గంజాయి విసిరిన యువకులు
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్ : ఏలూరు కోటదిబ్బలోని జిల్లా జైలులోకి యథేచ్ఛగా గంజాయి వెళుతోంది. జైలులోని ఖైదీలు భోజన విరామ సమయంలో బ్యారెక్ల నుంచి బయటకు వచ్చే సమయంలో జైలు వెనుక భాగంలోని అంగన్వాడీ స్కూల్ నుంచి కొందరు గంజాయి, గుట్కా, బీడీలను విసరటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం భోజన విరామ సమయంలో ఏలూరుకు చెందిన కొందరు యువకులు జైలులోకి గంజాయి, గుట్కా, బీడీలు, సిగరెట్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన జైలు సెంట్రీలు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఒక ప్రాంతంలో ఇటీవల కొందరు యువకులు కత్తులతో దాడులు చేసుకునేందుకు తిరిగటంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నిందితుల వద్దకు ఈ రోజు కొందరు యువకులు ములాకత్‌కు వచ్చారనీ, భోజన విరామ సమయంలో ఇలా గంజాయి విసిరి ఉంటారని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు అధికారులు, సెంట్రీలు అప్రమత్తంగా ఉండటంతోనే ఇటువంటి వాటికి చెక్ పెడుతున్నామని అంటున్నారు. ఇద్దరు యువకులను అప్పగించాం : బి.చంద్రశేఖర్, జైలు సూపరింటిండెంట్ : ఏలూరులోని జిల్లా జైలులోకి కొందరు యువకులు గంజాయి, గుట్కాలు, బీడీలు బుధవారం విసిరారు. ఈ విషయాన్ని పసిగట్టిన సెంట్రీలు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించాం. ఇదే విధంగా గతంలోనూ కొందరు యువకులు గంజాయి విసురుతూ పట్టుబడగా పోలీసులకు అప్పగించామని, జైలు వద్ద విధులు నిర్వర్తించే సెంట్రీలు అప్రమత్తంగా ఉండడంతో ఇటువంటి వారిని వెంటనే నిలువరించగలుగుతున్నామన్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు మాత్రం తమ వద్ద ఎవరూ లేరని, కేసులేమీ నమోదు చేయలేదని చెప్పడం గమనార్హం. టీడీపీ నేతల సెటిల్మెంట్ ? : జిల్లా జైలులోకి గంజాయి విసురుతూ పట్టుబడిన యువకులు ఇద్దరిని ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఉంచటంతో వెంటనే టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారిద్దరిపై కేసులు లేకుండా బయటకు తీసుకువెళ్ళేందుకు మంతనాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు పెట్టేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ నేతల ఒత్తిడితో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ చిన్న విషయానికి టీడీపీ నేతల జోక్యం పెరిగిపోయిందనీ, ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయాలో తెలియటం లేదంటూ వాపోతున్నారు. -
జైలు సిబ్బందిపై ఖైదీ ఫిర్యాదు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారంలో సిబ్బంది తనను కొట్టారంటూ ఓ ఖైదీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే ఖైదీని తాము కొట్టలేదని జైల్ అధికారులు అంటున్నారు. సెల్ ఫోన్ వాడకం ఈ రచ్చకు కారణమైందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ కేంద్ర కారాగారంలో సుమారు ఏడాది నుంచి శిక్ష అనుభవిస్తున్న మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వీరాపాణి అనే ఖైదీ సోమవారం వాయిదాకు కోర్టుకు వెళ్లాడు. అక్కడ న్యాయమూర్తితో జైల్లో సిబ్బంది తనను అకారణంగా కొట్టారని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడ వీరాపాణికి న్యాయవాది సమక్షంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జైల్ అధికారులు మాత్రం వీరాపాణిని ఎవరూ కొట్టలేదని చెప్పారు. అతనిపై 8 కేసులున్నాయని జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వాటిలో మూడు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులున్నాయన్నారు. మొదట్లో కొన్నాళ్లు రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తుండగా ప్రవర్తన బాగాలేకపోవడంతో కడప జైల్‌కు, అక్కడి నుంచి నెల్లూరు జైల్‌కు తరలించారని, అక్కడ ప్రవర్తన బాగాలేకపోవడంతో ఏడాది క్రితం విశాఖపట్నం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ఉంటూ పెరోల్‌పై బయటకు వెళ్లడానికి విశాఖ పోలీస్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు నమోదైందన్నారు. ఆ కేసుపై విశాఖ కోర్టుకు వాయిదాలకు వెళ్తున్నాడరన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి జైల్‌కు వచ్చినప్పుడు సెల్‌ఫోన్ తీసుకొచ్చాడని, సిబ్బందికి తెలియకుండా దాన్ని లోపలకు తీసుకెళ్లాడన్నారు. జైల్ లోపల నుంచి ఫోన్లో బయటవారితో మాట్లాడుతుండగా సిబ్బంది గమనించి ఫోన్ తీసుకొన్నారన్నారు. దీంతో తనను కొట్టినట్లు జడ్జికి అబద్ధం చెప్పాడన్నారు. జైలు లోపలికి ఫోన్ ఎలా వెళ్లిందో..? జైలు బయట కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జైల్ లోపల కూడా అదేమాదిరిగా భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అమర్చారు. వాయిదాలకు వెళ్లి వచ్చే ఖైదీలను ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది చెక్ చేస్తారు. వారి బంధువులు, స్నేహితులు తీసుకొచ్చిన ఆహార పదార్ధాలను (మిక్చర్, బిస్కెట్లు లాంటివి) పరిశీలిస్తారు. ఇంతచేసినా వీరాపాణి వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనేది చర్చనీయాంశమవుతోంది. వాయిదా నుంచి తిరిగి లోపలకు ప్రధాన ద్వారం నుంచే ఏ ఖైదీ అయినా వెళ్లాల్సిందే. ఈ నెల 6న వాయిదా నుంచి తిరిగి జైల్‌కు వెళ్లిన వీరాపాణి వద్ద సెల్ ఫోన్ ఉన్నట్లు ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించినా చూసీచూడనట్లు వదిలేశారా? ఖైదీలు ఉండే ప్రతి బ్యారెక్ వద్ద సీసీ కెమెరాలున్నాయి. వాటిని నిరంతరం మానటిరింగ్ హాల్లో అబ్జర్వ్ చేస్తారు. వారికి కూడా తెలియకుండా వీరాపాణి ఎలా మాట్లాడగలిగాడు..? జైల్లో సెల్ఫోన్లు ఇంకెంతమంది ఖైదీల వద్ద ఉన్నాయో..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ జైల్ లోపల పరిస్థితి ఎంత పటిష్టంగా ఉందో అనే విషయం తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. -
రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్
అనంతపురం న్యూసిటీ: ఓ ఖైదీని కొన్ని నెలలుగా ఆస్పత్రిలో ఆశ్రయం కల్పించిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి రోగాలు, జబ్బులూ లేకున్నా.. ఓ రోగిగా రికార్డులు సృష్టించి ప్రిజనర్స్ వార్డులో రాజభోగాలు కల్పించిన వైనంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌ను ఈ నెల 17న సాయంత్రం 5.20 గంటలకు ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయంపై ఆరా తీసిన ఆయన అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. అదే హడావుడితో గుట్టుచప్పుడు కాకుండా బుధవారం రాత్రికి రాత్రే ఏడు గంటలకు ఖైదీని డిశ్చార్జ్ చేసేశారు. సీసీ ఫుటేజీల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆస్పత్రి రికార్డులో మాత్రం అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు రాసేశారు. ఇదంతా చూస్తుంటే అంతా పథకం ప్రకారమే ఖైదీని ఆస్పత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది. నిజంగా ఖైదీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఆ సమయంలో ఎందుకు పంపాల్సి వచ్చిందంటూ ఆస్పత్రి వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. నిర్లక్ష్యం నీడలో జిల్లా యంత్రాంగం ‘ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నా సీరియస్‌గా తీసుకోవడం లేదు. పేదలకు మెరుగైన సేవలందిస్తున్నారనే ఒకేఒక్క కారణంతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదు’ అంటూ ఈ ఏడాది వైద్య కళాశాలలో జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో వైద్యాధికారులను సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తుంటే.. సర్వజనాస్పత్రిలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనన్నది స్పష్టమవుతోంది. కేవలం హెచ్చరికలు తప్ప ఆచరణలో ఆ స్థాయి తీవ్రత కనిపించకపోవడంతో సర్వజనాస్పత్రిలో అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లైంది. దీంతో సర్వజనాస్పత్రిలో కీలక అధికారి ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే అతని అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి. ఆ ముగ్గురే కీలకం కొన్ని నె లల పాటు ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డు లో ఖైదీని ఉంచడం వెనుక అ నంతపురం రెండో పట్టణ పోలీసు స్టే షన్లో విధులు నిర్వర్తించే ఓ హోంగార్డు, సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలోని ఓ వైద్యుడితో పాటు మ రో కీలక అధికారి ప్ర మేయం ఉన్నట్లు వి శ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వీరు ముగ్గురు కలిసి ఖైదీకి సర్వజనాస్పత్రిలో ఆశ్రయం కల్పించా రు. వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖైదీ వార్డులో ఉండేలా సహకరిస్తూ వచ్చారు. ఇందుకు గాను వారికి రూ. లక్షల్లో నజరానాను ఆ ఖైదీ సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. -
ఖైదీ దర్జా.. ఆస్పత్రే అడ్డా
ఆయన చేయి తడిపితే చాలు...ఆస్పత్రిలో ఎవరైనా సరే సలాం చేస్తారు. కంటిమీద కునుకు లేకుండా సేవ చేస్తారు. రిపోర్టులు కూడా ఎలా కావాలంటే అలా రాసిస్తారు..ఈ విషయం తెలుసుకున్న ఓ ఖైదీ మూడు నెలలుగా ఇక్కడ తిష్ట వేశాడు. సదరు ఆస్పత్రి కీలక అధికారికి రూ.లక్షలు ముట్టజెప్పాడు. అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తూ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరిలో అనారోగ్య సమస్య ఉందంటూ రెడ్డిపల్లి జైలు నుంచి వచ్చిన ఖైదీ ఇక్కడే ఉండిపోయాడు. రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నా... రోజుకో సమస్య చెబుతూ సపర్యలు చేయించుకుంటున్నాడని ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో నిబంధనలు బంధీలుగా మారాయి. చేయి తడిపితే చాలు ఏ పనైనా సులువుగా చేయించుకోవచ్చనే చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. ఆస్పత్రిలోనే ప్రిజన్ వార్డులో తాజాగా వెలుగుచూసిన ఓ బాగోతం ఈ మాటలకు అద్దం పడుతోంది. ఆ వివరాలిలా ఉన్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు పెద్దాసుపత్రిలో ప్రిజన్ వార్డు ఉంది. రక్త విరేచనాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి 3 నెలల క్రితం ఈ వార్డులో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది సర్జరీ కింద ఆయనకు అడ్మిషన్ ఇచ్చారు. మెడిసిన్ సమస్య ఉందని మరో నెల పొడిగించారు. ప్రస్తుతం ఆర్థో సమస్య ఉందని ఆ వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. రిపోర్టుల్లో కండీషన్ నార్మల్.. ఇదిలా ఉంటే, సదరు వ్యక్తికి సంబంధించిన మెడికల్ రిపోర్టుల్లో మాత్రం ఆయన కండీషన్ నార్మల్‌గా ఉన్నట్లు నిర్ధారణ అవడం చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నా ఎందుకు అతడిని ఇంకా వార్డులో కొనసాగిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సదరు ఖైదీ మామూలు స్థితిలో ఉన్నా వార్డులో ఉంచి సపర్యలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఆయనకు వైద్య సేవలు అందింస్తున్న వారికే తెలియాలి. రూ.లక్షల్లో బేరం! ఈ విషయంపై పరిశీలన జరిపితే ఆసత్పికి సంబంధించిన ఓ కీలకాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రిజన్ వార్డులో రోగిని అడ్మిషన్లో ఉంచడానికి సదరు అధికారికి, ఖైదీకి రూ. లక్షల్లో బేరం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ అధికారి వచ్చినప్పటి నుంచే ఇలాంటి అక్రమాలు మొదలయ్యాయని పలువురు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేయి తడిపితే ఏ పనైనా సరే ఇట్టే అయిపోతుందని అక్కడి కొందరు సిబ్బందినడిగితే తెలిసింది. ఏమైనా అంటే నిబంధనల గురించి మాట్లాడే ఆయనే.. అవేవీ తనకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా స్పందించి, మరిన్ని అక్రమాలకు తావివ్వకుండా సదరు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారించిచర్యలు తీసుకుంటా ప్రిజన్ వార్డులో మూడు నెలలుగా ఓ ఖైదీ ఉన్న విషయం తెలియదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తా. అక్రమం జరిగిందని తెలిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటా. – డాక్టర్ జగన్నాథ్,ఆస్పత్రి సూపరింటెండెంట్ -
చర్లపల్లి జైలు ఖైదీ పరార్
-
జల్లెడని నీళ్లతో నింపండి!
ఒక గురువు తన శిష్యులకు సృజనాత్మకత గురించి అద్భుతమైన పాఠం చెప్పాడు. ఆ పాఠం మనసులో నాటుకుపోయి, తమ సృజనాత్మకత నిరూపించుకునే అవకాశం అడిగారు శిష్యులు. వారి చేతికి ఒక జల్లెడ అందించి దాని నిండా నీరు నింపమని ఆదేశించాడు గురువు. దగ్గరలోని నదికి వెళ్ళి నీటితో జల్లెడ నింపుతున్నారు శిష్యులు. ప్రతిసారీ రంధ్రాల ద్వారా ధారలు కురిసి జల్లెడ ఖాళీ అవుతోంది తప్ప శిష్యులు సఫలీకృతులు కాలేదు. చాలా సేపటి తరువాత వారిని వెతుకుతూ వచ్చిన గురువు జరిగింది తెలుసుకుని చిరునవ్వు నవ్వాడు. జల్లెడ అందుకుని ప్రవాహంలో దిగి నీటి లోపల వదిలాడు. జల్లెడ నీటిలో పూర్తిగా మునిగింది. జల్లెడ నీటితో నిండింది. ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడ్డారు శిష్యులు. ‘‘జల్లెడను వెనక్కు ఇవ్వమనే నిబంధన లేనప్పుడు సృజనాత్మకంగా ఆలోచించి వుంటే జల్లెడ నింపడం సులువయ్యేది’’ అన్నాడు గురువు. శిష్యుల మాదిరిగానే చాలా మంది మూస ధోరణిలో ఆలోచిస్తూనే తమ ప్రయత్నాలను గుర్తించడం లేదని, సృజనాత్మకత మరుగున పడి మసక బారుతోందని గగ్గోలు పెడతారు. ఇందుకు మరో ఉదాహరణ చూద్దాం... జైలులో ఉన్న యువకుడైన కొడుక్కి వృద్ధుడైన తండ్రి ‘వయసు మీద పడి తోట తవ్వలేక పోవడం వలన తల్లికి ఇష్టమైన బంగాళ దుంపలు వేయలేక పోయానని’ ఉత్తరం రాసాడు. ఆ కొడుకు ఆలోచించి ‘‘పొరపాటున కూడా తోట తవ్వకు. అందులో తుపాకులు దాచానని తంతి సమాచారం తిరిగి పంపాడు. ఆ ఉత్తరం చదివిన పోలీసులు మందీ మార్బలంతో వెళ్లి తోట మొత్తం తవ్వించారు. ఆ భూమిలో తుపాకులు దొరకలేదు. పోలీసులు చేసిన పని వివరిస్తూ మరో ఉత్తరం కొడుక్కి రాసాడు తండ్రి. ‘‘జైలులో వున్న నేను ఇంతకన్నా సాయం చేయలేను. ఎలాగూ పోలీసులు భూమిని తవ్వారు. ఇప్పుడు అమ్మకిష్టమైన బంగాళదుంపలు పండించు’’ అని జవాబిచ్చాడు కొడుకు. ఆ యువకుడిలా కొత్తగా ఆలోచిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
ఫైవ్‌స్టార్ జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై పుళల్ సెంట్రల్ జైలు ప్రజల దృష్టిలో నేరస్థులు శిక్షను అనుభవించే కారాగారం. అయితే లోపలున్న కొందరు ఖైదీలకు మాత్రం అదో స్టార్ హోటల్. డబ్బులుపడేస్తే చాలు జీ హుజూర్ అంటూ సర్వం సరఫరా చేసే అధికారులు ఉన్నంతవరకు మాకేం కొదవలేదని ఖైదీలు పదేపదే సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ‘అడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది’ అన్నట్టుగా కొందరు ఖైదీలు బిరియానీ వండుకుంటున్న వీడియో దృశ్యాలు శుక్రవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సహజంగానే అధికారుల్లో ‘సం’చలనం కలిగించాయి. ఖైదీలు స్టార్ హోటల్ సౌకర్యాలను అనుభవిస్తున్నట్టు, జల్సా జీవితం గడుపుతున్నట్లు ఇటీవల వాట్సాప్‌లో వెలువడిన వందలాది ఫొటోలు హల్చల్ చేశాయి. ఆ తరువాత సహజంగానే ఉన్నతాధికారులు రావడం, తనిఖీల పేరుతో జైల్లో హడావుడి చేయడం, 23 టీవీలను, 3 ఎఫ్ఎం రేడియోలను, 50కి పైగా సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, వంటసామగ్రి, సరుకులు స్వాధీనం చేసుకోవడం, కొందరిని సస్పెండ్, మరికొందరిని బదిలీచేయడం షరామాములుగా జరిగిపోయింది. అయితే అధికారుల హడావుడికి ఖైదీలెవ్వరూ బెదరలేదు, అధికారులు సైతం అదరిపోలేదు. ఎందుకంటే జైలు ఖైదీలు కమ్మనైన బిరియానీ స్వయంగా వండుకుంటున్న దృశ్యాలు శుక్రవారం మరోసారి బైటకువచ్చాయి. జైల్లో శిక్షపడిన ఖైదీల బ్యారెక్స్‌కు సమీపంలోని తోటలో కొందరు ఖైదీలు కాయగూరలు, పప్పుధాన్యాలు, బిరియానీ బియ్యం, వండేందుకు ఎలక్ట్రానిక్ సామగ్రి చుట్టూరా పెట్టుకుని, ఎఫ్ఎం రేడియోలో పాటలు వింటూ వంటపనిలో నిమగ్నమై ఉన్న వీడియో దృశ్యాలు చూసి అధికారులు బిత్తరపోయారు. పుళల్‌జైల్లో ఐదుమార్లు తనిఖీ చేసినా ఎఫ్ఎం రేడియోలు, సెల్ఫోన్లు, గంజాయి ఎలా చేరింది. తనిఖీల సమయంలో దాచిపెట్టారా లేక కొత్తగా సరఫరా అయ్యాయా అని తలలు పట్టుకుంటున్నారు. లగ్జరీ ఖైదీలకు అవసరమైన వస్తువులు యథాప్రకారం చేరిపోతున్నట్లు తెలుసుకున్నారు. ఎన్నిసార్లు తనిఖీలు చేసినా పైస్థాయిలో మాకు పలుకుబడి ఉన్నంతవరకు ఏమీ చేయలేరని ఖైదీలు సవాలు విసురుతున్నారు. జైల్లో పెరిగిన ధరలు: తనిఖీల తరువాత జైల్లో ఖైదీల నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపుగా పెరిగిపోయాయి. బీడీ కట్ట రూ.250 నుంచి రూ.500, సిగరెట్ ప్యాకెట్ రూ.600 నుంచి రూ.1200, గంజాయి 20 గ్రాముల ప్యాకెట్ రూ.6 వేల నుంచి రూ.10వేలుగా నిర్ణయించారు. అలాగే చికెన్‌బిర్యానీ రూ.350 నుంచి రూ.700, మటన్ కూర రూ.700 నుంచి రూ.1500, మటన్ చిక్కా రూ.600 నుంచి రూ.1,200, చికెన్ 65 రూ.1000, ఆమ్లేట్ రూ.100, కోడిగుడ్డు రూ.40 గా అమ్ముతున్నారు. జైల్లో ఒకరు లేదా ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉండే వసతికలిగిన గదులకు పెద్ద గిరాకీ ఉంది. వీటిని అధికారికంగా కేటాయించాలంటే అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారుల చేతులు తడిపితే అన్నీ జరిగిపోతాయని సమాచారం. రూ.2లక్షలు అడ్వాన్సు, నెలకు రూ.40 వేలు అద్దె చెల్లిస్తే లగ్జరీ గది కేటాయించేస్తారు. అధికారికి బెదిరింపు: పుళల్ జైల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య ఆ తరువాత హత్యాబెదిరింపులను ఎదుర్కొన్నారు. మదురైలోని తన కిరాయిముఠాకు చెందిన వారు సుబ్బయ్యను బెదిరించడంతో ఆయనతోపాటు మరికొందరికి బందోబస్తు పెట్టారు. -
బలిష్ట
కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. బెంచీలలో మనుషులు కూర్చునే చోట నిండా మనుషులు ఉండడం కోర్టు హాలు నిశ్శబ్దంగా లేకపోవడానికి కారణం కాదు. అక్కడెవ్వరూ లేరు. జడ్జీకి, నిందితుడికి మధ్య వాదన లాంటిది జరుగుతోంది. అందుకే కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ముందే జడ్జి నుంచి అనుమతి తీసుకుని మాట్లాడుతున్నాడు బలిష్ట. ‘‘మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఇవ్వడంలో నాకు ఆసక్తి లేదు. మీరే ప్రశ్నలు వేసుకుని, మీరే సమాధానాలు చెప్పుకుని, మీరే నాకు శిక్ష వేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. పోయే చోటకే పోతాను’’ అన్నాడు బలిష్ట. అతడు ఆ మాట అన్నప్పుడు జడ్జి వింతగా చూశాడు. ‘‘బాబూ, భారతీయ శిక్షాస్మృతి అని ఒకటి ఉంటుంది. అన్నీ ఆ స్మృతి ప్రకారమే ఇక్కడ జరుగుతాయి. నువ్వు శిక్షను అంగీకరించకుండా, నీ నేరం రుజువు కాకుండా నిన్ను చట్టం శిక్షించడానికి లేదు’’ అన్నాడు. ‘‘ఎలాంటి విచారణ లేకుండానే నేను నా నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమై వచ్చాను జడ్జిగారూ. అయితే మీ కోర్టులు నిందితుడు నేరం చేశాడా లేదా అన్నంత వరకే చూసి, లంచ్‌కి వెళ్లిపోతాయి.లేదా, హాలిడేస్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత బలిష్ట అనేవాడు ఏమైపోయాడన్నది ఈ న్యాయస్థానానికి అవసరం లేని విషయం. నా అభ్యర్థన ఏంటంటే.. ఈ నేరాలన్నీ నువ్వే చేశావా అని కాకుండా, ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావు? అని మీరు నన్ను అడగాలని నా ఆశ. అందుకు నేను సమాధానం చెప్పాలని నా ఆకాంక్ష. ఇవన్నీ కుదరవు అనుకుంటే.. శిక్ష విధించి జైలుకో, ఉరికంబానికో పంపించేయండి. నాకేం భయాలు, భీతులు, చింతనలు లేవు’’ అన్నాడు బలిష్ట చేతులు కట్టుకునే నిలబడి. జడ్జి బలిష్ట వైపు పరిశీలనగా చూశాడు. పేరుకు తగ్గట్టు లేడు బలిష్ట. పీలగా ఉన్నాడు. పీలగా ఉన్నవాడొకడు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేంత బలంగా ఉన్నాడంటే.. వ్యవస్థ ఎక్కడో బలహీనంగా ఉందని వాడు కనిపెట్టగలిగాడని! జడ్జి నవ్వాడు. కోర్టు హాల్లో గానీ, కోర్టు బయట గానీ జడ్జిలు నవ్వినట్లు న్యాయ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ ఈ జడ్జి నవ్వాడు. ‘‘ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావో తెలుసుకుని నీలో పరివర్తన తెచ్చేందుకు కోర్టుకు తగిన సమయం ఉండదు. తర్వాతి కేసు రెడీగా ఉంటుంది. ఒకవేళ సమాజంలో అందరూ ధర్మబద్ధంగా నడుస్తూ, ‘ఇవాళైనా ఒక కేసు వస్తే బాగుండు’ అని జడ్జీలు కేసుల కోసం ఎదురు చూసే ఒక కాలం ఓ వెయ్యేళ్ల తర్వాత వచ్చినా.. అప్పుడు కూడా దోషిని నిలబెట్టో, కూర్చోబెట్టో కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యత కోర్టులది కాదు. అందుకు వేరే విభాగాలు ఉంటాయి. సరే, నువ్వు కోరుకున్నట్లుగా ఇప్పుడు నేను నిన్నేం ప్రశ్నలు వేయలేను గానీ, నువ్వు నన్ను ఈ కోర్టు హాలులో ప్రశ్నించే అవకాశం ఇవ్వగలను. నిన్ను అడగందే సమాధానం తెలియనంత ప్రశ్నలు నిన్ను అడగడానికి నా దగ్గర ఏముంటాయి చెప్పు? అయితే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఇవాళ నేను కోర్టు సమయాన్ని వినియోగమో, దుర్వినియోగమో చేయదలచుకున్నాను’’ అన్నాడు నవ్వుతూ జడ్జి. బలిష్ట రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు. ‘‘మిమ్మల్ని ప్రశ్నించేంతటి వాడిని కాదు. నన్ను మాట్లాడ్డానికి అనుమతించినట్లే.. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి చాలు’’ అన్నాడు బలిష్ట. అలా.. వాళ్లిద్దరి మధ్యా మాటలు మొదలవడంతో కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ‘‘జడ్జిగారూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నానని నాపై అభియోగం. అంటే చట్టం చేయవలసిన పనిని నేను చేశానని. చట్ట ప్రకారం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. అయితే నేను చేసిన పనికి నన్ను ప్రేరేపించిన పని చట్టంలో నేరంగా పరిగణన పొందడం లేదు కనుక, నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నట్లు కాదు. చట్టమే నేరాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని నేను అభిప్రాయపడ్డాను. అందుకే ఒక్కొక్కరి మోకాళ్లూ విరగ్గొడుతూ వచ్చాను.’’ అన్నాడు బలిష్ట. జడ్జి వింటున్నాడు. ‘‘జడ్జి గారూ.. మన సమాజంలో హత్య నేరం. ఆత్మహత్య నేరం. అత్యాచారం నేరం. దొంగతనం నేరం. అవినీతి నేరం. అక్రమం నేరం.దాడి జరపడం నేరం. నేను మోకాళ్లు విరగ్గొట్టిన ఆ ఆరుగురో, ఏడుగురో ఈ నేరాలేవీ చేయలేదు కనుక, ఇంకా చట్టం లిస్టులో ఉన్న నేరాలేవీ వాళ్లు చేయలేదు కనుక.. పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ.. వాళ్లను నేరస్థులుగా కాకుండా, వాళ్ల మోకాళ్లను విరగ్గొట్టిన నన్ను నేరస్థుడిగా పరిగణించడం అంటే.. చట్టం నాకు ప్రసాదించిన ‘జీవించే హక్కు’ను నా పక్కన ఉన్నవాడు హరిస్తూ ఉన్నప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉండమని చట్టం చెప్పినట్లే కదా. నా జీవించే హక్కును నేను కాపాడుకునే ప్రయత్నంలో.. నాలాగే ఇంకెందరికో చట్టం ఇచ్చిన జీవించే హక్కును కాపాడే ప్రయత్నంలో నాకు తెలియకుండానే, పట్టలేని కోపంలో.. మోకాళ్లు విరగ్గొట్టానని చట్టం అర్థం చేసుకోలేదా’’ అని అడిగాడు బలిష్ట. కోర్టు హాల్లో బలిష్ట మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. అతడివైపే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు జడ్జి. ‘‘కానీ అబ్బాయ్.. సినిమా థియేటర్లో నీ వరుసలో కూర్చొని ఉన్నవాడు కాళ్లూపుతూ కూర్చున్నాడని, ఏదో ఆఫీస్‌లో ఎవరో నీకు కాళ్లూపుతూ సమాధానం చెప్పాడని, హోటల్లో ఎవరో కాళ్లూపుకుంటూ తింటున్నాడని, అసలు నీకు సంబంధమే లేని వారెవరెవరో, ఎక్కడెక్కడో నీకు దగ్గరగానో, నీకు దూరంగానో కాళ్లూపుకుంటూ నీకు కనిపించారని కోపం తెచ్చుకుని వెళ్లి.. వాళ్ల కాళ్లు, మోకాళ్లు విరగ్గొట్టడం నేరమే కదా! జీవించే హక్కు నీకెలాగైతే ఉందో, వాళ్లకూ.. వాళ్లకు ఇష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదని ఎలా అనగలం?’’ అన్నాడుజడ్జి. ‘‘కానీ జడ్జిగారూ.. ఒకరి జీవించే హక్కు.. ఇంకొకరి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు కదా! నా దృష్టిలో హంతకుడి కన్నా, అత్యాచారం చేసినవాడి కన్నా, దొంగ కన్నా, అవినీతి పరుడికన్నా.. నీచమైన వాడు, హీనమైనవాడు.. ఈ కాళ్లూపుతూ కూర్చునేవాడు! కాళ్లూపుతూ కూర్చున్నాడంటే వాడికి మంచీ మర్యాద లేదని. సంస్కారం లేదని. వాడికొక ధ్యేయం లేదని. ఒక లక్ష్యం లేదని. ఒక బాధ్యత లేదని. ముఖ్యంగా మనుషులంటే గౌరవం లేదని. వాడసలు సరిగా పెరగలేదని. అలాంటి వాడిని శిక్షించే సెక్షన్ మన చట్టంలో లేదని. పబ్లిక్‌లోనే కాదు, పెళ్లాం పిల్లల ముందు కూడా కాళ్లూపడం నేరమే అని ఒక చట్టం తెండి. ఈ కాళ్లూపే దరిద్రులంతా దారికొస్తారు’’ అన్నాడు బలిష్ట. ‘‘ద్రవ్యోల్బణం మన దరిద్రం కాదు జడ్జిగారూ. కాళ్లూపడం మన దరిద్రం’’ అని కూడా అన్నాడు. జడ్జి అతడి వైపు చూశాడు. అతడు జడ్జివైపు చూశాడు. ‘‘ఆగావేం చెప్పూ’’ అన్నట్లు చూశాడు జడ్జి. ‘‘చెప్పడానికేం లేదు’’ అన్నట్లు చూశాడు బలిష్ట. ‘‘అలా చూస్తున్నావేం’’ అని అడిగాడు జడ్జి.బలిష్ట మాట్లాడలేదు. కేసు తర్వాతి రోజుకు వాయిదా పడింది. బలిష్ట వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాతి రోజు జడ్జిగారు కోర్టుకు రాలేదు. ముందురోజు రాత్రి ఎ.. వ.. రో.. ఆయన కాళ్లు విరగ్గొట్టారు!ఆ తర్వాతెప్పుడూ బలిష్ట ఏ వాయిదాకూ రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు! కోర్టు హాల్లో ఎవరైనా కాళ్లూపుతున్నప్పుడు మాత్రం.. జడ్జిగారు భయంతో ‘‘ఆర్డర్.. ఆర్డర్’’ అంటుండేవారు. ఆయన అలా ఎందుకు అంటుండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. - మాధవ్ శింగరాజు -
శక్తి మేరకు కట్టుబాటు
ఆంగ్లేయుల కాలంలో ఓ మసీదు ఇమామ్ సాబ్ ను బ్రిటీషు పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు. ధార్మికంగా నిష్టగా ఉండే ఇమామ్ గారికి జైలులో నమాజు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ శుక్రవారం జుమా నమాజు కోసం మసీదుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. బ్రిటీషు పోలీసులు అనుమతిచ్చేవారు కాదు. అయినప్పటికీ జుమా నమాజు కోసం తలంటు స్నానం చేసి సిద్ధమయ్యేవారు. జుమా నమాజు అజాన్ వేళయిందంటే చాలు అజాన్ పిలుపు వినేందుకు ఎంతో ఆతృతతో జైలు ప్రవేశ ద్వారం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జైలు ఇనుప చువ్వలు పట్టుకుని నిల్చునే వారు. అజాన్ పలుకులు పూర్తిగా విన్న తరువాతనే తన జైలు గదిలోకి వెళ్లి కూర్చునేవారు. ఆయన ప్రతీసారీ శుక్రవారం ఇలానే చేసేవారు. ఎన్నో శుక్రవారాలపాటు ఈ వ్యవహారమంతా గమనించిన జైలరు గారు ఒకరోజు హాఫిజ్ గారిని తన గదికి పిలిపించుకుని ‘‘ఈ జైలు పరిసరాలనుంచి నువ్వు బయటికెళ్లలేవని తెలిసి కూడా ప్రతి శుక్రవారం నమాజు కోసం సిద్ధమయ్యి గేటు దగ్గర అలా ఎందుకు ఎదురు చూస్తుంటావు’’ అని అడిగారు. దానికి ఇమామ్ సాబ్ ‘‘జైలరు గారూ, శుక్రవారం అజాన్ వినగానే పనులన్నీ పక్కనపెట్టి నమాజు కోసం బయలుదేరాలన్నది నా ప్రభువు ఆజ్ఞ. నా శక్తిమేరకు నా ప్రభువు ఆజ్ఞకు కట్టుబడి ఉన్నానని అనుకుంటున్నాను. నా ఈ పరిస్థితిని చూసి అల్లాహ్ తన దాసుల జాబితాలో నాపేరును తప్పకుండా నమోదు చేసుకుంటాడు. ఎందుకంటే అల్లాహ్ ఎవ్వరి పైనైనా శక్తికి మించిన భారం మోపడు. అల్లాహ్ నాకు తప్పకుండా శుక్రవారం నమాజు పుణ్యాన్నిస్తాడు. నా ఈ ఆచరణ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే’’ అని చెప్పాడు! జైలరు గారు ఆశ్చర్యపోయారు. ప్రతీ భక్తుని ఆలోచనా దృక్పథం ఇలానే ఉండాలి. మనం మన పరిధిలో, మన శక్తిమేర ధర్మంపై నిలకడను ప్రదర్శించాలని, ధర్మాజ్ఞలకు కట్టుబడేందుకు కృషిచేయాలని ఈ గాథ తెలియజేస్తోంది – నాజియా -
కోర్టులతో జైళ్ల అనుసంధానం
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలో జైళ్లను కోర్టులతో అనుసంధానం చేస్తున్నామని, ఇక నుంచి ఖైదీల హాజరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జీలే తీసుకుంటారని జిల్లా సబ్‌జైళ్ల అధికారి బి.ఈరన్న అన్నారు. ఈమేరకు అన్ని జైళ్లల్లో టీవీలు, ఆన్‌లైన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరసన్నపేట సబ్‌జైల్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతానికి పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట సబ్‌జైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలను జడ్జి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఎస్కార్టుల సాయంతో ఖైదీలను కోర్టుకు తీసుకువెళ్తున్నామని, ఇక మీదట ఎస్కార్టు అవసరం ఉండదన్నారు. టెక్కలిలో నూతనంగా సబ్‌జైల్ నిర్మాణానికి రూ. 8 కోట్లుతో ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సబ్‌జైల్ ఆవరణలో పెట్రోల్ బంకు కూడా నిర్వహిస్తామన్నారు. ఈమేరకు 2.10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. సోంపేటలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సబ్‌జైల్ భవన సాముదాయ స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగించామని, ఇందుకు గాను వేరోచేట స్థలం కేటాయించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. పాలకొండ జైల్లో కిచెన్ అభివృద్ధికి, నరసన్నపేటలో డబుల్ గేట్ నిర్మాణం, కిచెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జైళ్ల సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట నరసన్నపేట సబ్‌జైల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ఉన్నారు. -
పట్టుబడితే సుక్కలే!
తణుకు : సుక్కేసి.. ఎంచక్కా వాహనంపై చెక్కేసేవారికి ‘సుక్క’లు కనబడతాయని అధికా రులు హెచ్చరిస్తున్నారు. జరిమానా, జైలు శిక్షతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకూ వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. పెరుగుతున్న కేసులు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. పోలీసులు, రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా మందుబాబులు మాత్రం తగ్గడంలేదు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్న ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు పూనుకోవడంలేదు. వెరసి విలువైన ప్రజల జీవితాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో సుప్రీంకోర్టు పోలీసులకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ట్రాఫిక్, సాధారణ పోలీసులు, రవాణాశాఖ అధికారుల సమన్వయంతో వాహనాలపై ప్రయాణించే వారిని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడునెలలపాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసేందుకూ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితో జరిమానా వేసి వదిలేసేవారు. కోర్టులో హాజరు పరిస్తే ఒకటి నుంచి 15 రోజుల వరకూ జైలు శిక్ష విధించేవారు. బీకేర్ ఫుల్..! ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలను అధికారులు మరింత కఠినతరం చేశారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలకు కారకులై బాధితుడి మృతికి కారణమైన డ్రైవర్లపై 304 పార్ట్ 2, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు పడేలా చట్టాలకు పదును పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తున్నారు. ఒక వేళ పట్టుబడిన సమయంలో డ్రైవింగ్ లైసెన్సు లేదని తప్పుడు సమాచారం ఇస్తే ఆధార్ నంబరు ఆధారంగా లైసెన్సు గుర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులన్నీ ఆధార్‌తో అనుసంధానం చేశారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో సంబంధిత వాహన పత్రాలను పరిశీలించి లోపాలుంటే జైలు శిక్ష, అదనంగా రూ.5 వేలు నుంచి రూ. 10 వేలు వరకు రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 6,169 కేసులు నమోదు చేయగా వీరిలో 401 మందికి జైలు శిక్ష విధించి మొత్తం రూ. 41.16 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేశారు. ఇలా ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మొత్తమ్మీద రూ.10 వేల జరిమానాతోపాటు జైలు శిక్ష, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు ఎదుర్కొనక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఇవీ...! వాహనదారుల రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు ఆల్కహాల్ శాతం 30 ఎంజీ ఉంటే నేరంగా పరిగణిస్తారు. అయితే కొత్త చట్టం ప్రకారం దీన్ని 20 ఎంజీకి తగ్గించారు. జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులను కోర్టులో ప్రవేశపెడితే తీవ్రతను బట్టి జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదం చేసి బాధితుడి మృతికి కారణమైనా, రాంగ్ రూట్లో అధిక వేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలు చేసినా, రోడ్డు ప్రమాదం చేసిన వెంటనే బాధితుణ్ని దగ్గరలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చి వైద్యం సహాయం అందించకుండా పారిపోయి అతడి మృతికి కారణమైనా శిక్షార్హులవుతారు. అలాగే ఓవర్ లోడింగ్‌తో డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదం చేసి బాధితుడి మరణానికి కారణమైనా, వస్తు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిం చుకున్నా, పాసింజర్ వాహనాల్లో అనుమతి ఇవ్వబడిన దానికంటే అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డు ప్రమాదాలు చేసి మరణానికి కారణమైనా, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బాధితుల మరణానికి కారణమైనా శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 279 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. మద్యం తాగినప్పుడు స్వయంగా వాహనాలు నడపకుండా జగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. నిబంధనలు ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఇప్పటి వరకు జైలుశిక్షతోపాటు జరిమానా విధించేవారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్సునూ మూడు నెలల పాటు రద్దు చేస్తాం. – ఎన్‌యూఎన్‌ఎస్ శ్రీనివాస్, ఎంవీఐ, తణుకు -
పిల్లలకు బైకిస్తే పెద్దలు జైలుకే..
సిద్దిపేటటౌన్ : మైనర్లు వాహనాలు నడుపుతూ వారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, ఇతరులకు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నారు. పిల్లలు ముచ్చట పడుతున్నారని, వారి సరదా తీర్చటం వారికి వాహనాలు ఇస్తే మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం పెద్దలను జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని వారితో పాటు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు. మరో సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరంగా పరిగణించి వారి తల్లిదండ్రులను జైలుకు పంపించే అవకాశం ఉంది. కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు.. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వాహనాలు నడుతుపూ పట్టుబడిన సుమారు 60 మంది మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు పట్టుబడితే వారి చేత డ్రైవింగ్ లైసెన్స్‌కోసం స్లాట్ బుకింగ్ చేయించి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరు ఉద్ధ్యేశ పూర్వంగానే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని రుజువైతే వారికి 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పిల్లల సరదా తీర్చడం కోసం వారికి వాహనాలు ఇస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పోలీలసులు సూచిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులకు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా వారి క్షేమం కోసం సరదాలను పక్కన పెట్టాలని పోలీసులు కోరుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు.. పిల్లలు మారాం చేసారని, ఇక్కడికి వరకే కదా అని వారికి వాహనాలు ఇస్తూ, అజాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. డ్రైవింగ్ ఫర్ఫెక్ట్గా నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికే వాహనాలు ఇవ్వాలి. దీని వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎంవీ యాక్టు ప్రకారం మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఇలా నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ -
ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలు
దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. 200 మిలియన్ డాలర్ల చీటింగ్ కేసులో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇందులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తికి కూడా 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి డాక్టర్ మొహమ్మద్ హనాఫీ ఆదివారం తీర్పు వెల్లడించారు. గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, రేయాన్ డీసౌజాలు, ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడినట్టు దుబాయ్ న్యాయస్థానం నిర్ధారించింది. నిందితుల్లో ఒక్కొక్కరిపై 500పైగా కేసులు నమోదయ్యాయని, లక్షల డాలర్ల మోసాలకు పాల్పడ్డారని, అభియోగాలు అన్నీ రుజువయ్యాయని న్యాయమూర్తి హనాఫీ వెల్లడించారు. తీర్పు వెలువరించే సమయంలో వందలాదిమంది బాధితులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా దోషుల నుంచి నగదు స్వాధీనం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వారిపై మోపిన అభియోగాలు, తీర్పు ప్రతులను చదవడానికి న్యాయమూర్తికి 10 నిమిషాలకు పైగా సమయం పట్టింది. -
వెళ్లొస్తా..
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ శనివారం అందరి దగ్గర సెలవు తీసుకుని జైలు జీవితాన్ని గడిపేందుకు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. తంజావూరు నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార చెరకు సాయంత్రం చేరుకున్నారు. భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె తంజావూరులోని పరిశుద్ధ నగర్లో ఉన్న నటరాజన్ స్వగృహం అరుణానంద ఇల్లంలోనే ఉన్నారు. ఇంటి నుంచి ఆమె అడుగు బయటకు తీసి పెట్టలేదు. రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివచ్చి ఆమెకు సానుభూతి తెలియజేసి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలతో పదే పదే చిన్నమ్మతో భేటీ అయ్యారు. కుటుంబ విభేదాలతో శిరోభారం కుటుంబ విభేదాలు చిన్నమ్మకు శిరోభారంగా మారాయని సంకేతాలు ఉన్నాయి. నటరాజన్ ఆస్తుల వ్యవహారంతో పాటు, కుటుంబంలో సాగుతున్న విభేదాల పంచాయతీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆస్తుల విషయంగా అక్క కుమారుడు దినకరన్, తన సోదరుడు దివాకరన్ మధ్య సాగుతున్న వివాదం పరిష్కరించడం ఆమెకు కష్టతరంగా మారినట్టు తెలిసింది. అలాగే, మేనల్లుడు వివేక్ రూపంలో దినకరన్‌కు ఎదురవుతున్న సమస్యలు మరో త లనొప్పిగా మారడంతోనే ముందస్తుగానే జైలు కు వెళ్లడానికి ఆమె నిర్ణయించారని తెలుస్తోంది. ఇక, జైలు జీవితం పదిహేను రోజుల పెరోల్ లభించినా, ఇక్కడ అన్ని కార్యక్రమాల్ని 12 రోజుల్లో ముగించుకుని జైలు జీవితాన్ని అనుభవించేందుకు చిన్నమ్మ సిద్ధం అయ్యారు. మూడురోజుల ముందుగానే శనివారం ఉదయాన్నే పయన ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన కర్మక్రియల అనంతరం రాత్రంతా ఆమె ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయాన్నే బెంగళూరుకు పయనం అయ్యారు. అక్కడున్న బంధువులు, ఆప్తులు, సన్నిహితులు, పార్టీ వర్గాల నుంచి సెలవు తీసుకుని కాస్త ఉద్వేగానికి లోనైనట్టుగా కారులో ఎక్కి కూర్చున్నారు. అందర్నీ నమస్కారంతో పలకరిస్తూ ముందుకు సాగారు. ఆమె వాహనం వెన్నంటి అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్, తంగ తమిళ్ సెల్వన్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో తంజావూరులో బయలుదేరిన శశికళ వాహనం సాయంత్రం ఐదున్నర గంటలకు పరప్పన అగ్రహార జైలుకు చేరుకుంది. తంజావూరు నుంచి వెళ్లిన వాహనాలను, తన వెన్నంటి వచ్చిన వారందరినీ రాష్ట్ర సరిహద్దుల నుంచి వెనక్కు వెళ్లిపోవాలని శశికళ ఆదేశించడం గమనార్హం. అన్నింటినీ అధిగమిస్తారు శశికళ బయలుదేరి వెళ్లడంతో ఆమె సోదరుడు దివాకరన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన సోదరికి కష్ట కాలం అని, అన్నింటినీ అధిగమించి ఆమె తప్పకుండా బయటకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. కాగా, నటరాజన్‌తో ఉన్న స్నేహం మేరకు డీఎంకే ఎమ్మెల్యేలు కేఎన్ నెహ్రు, రామచంద్రన్ శశికళను ఉదయం పరామర్శించి వెళ్లారన్నారు. శశికళను అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా సంప్రదించారని, తమ సానుభూతి తెలియజేశారన్నారు. తాము స్వయంగా వస్తే, ఎక్కడ పదవులు పోతాయోనని వారికి భయం ఉండడం వల్ల అందుకే వారంతా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు పేర్కొన్నారు. -
వెనెజులా జైలులో 68 మంది దుర్మరణం
కారకస్: వెనెజులాలోని కారాబొబొ రాష్ట్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం జైలు నుంచి బుధవారం ఖైదీలు తప్పించుకోవడానికి యత్నించిన ఘటనలో మంటలు చెలరేగి 68 మంది దుర్మరణం చెందారు. జైలు నుంచి తప్పించుకోవడంలో భాగంగా ఖైదీలు పరుపులకు మంట పెట్టారనీ, భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మృతుల్లో 66 మంది ఖైదీలు కాగా, ఇద్దరు మహిళా సందర్శకులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని పేర్కొన్నారు. -
ఖమ్మం జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
ఖమ్మంరూరల్: స్థానిక రామన్నపేటలో గల జిల్లా జైలులో మాదాసు శ్రీనివాస్ అనే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల క్రితం హత్యకేసులో జీవిత ఖైదుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే నెలరోజుల పెరోల్ కింద ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి, రెండు రోజులక్రితం తిరిగి జైలుకు వచ్చాడు. అప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తుండటంతో జైలు అధికారులు ఒక దఫా కౌన్సెలింగ్ ఇచ్చారు. తన జీవితం జైలులో పూర్తవుతుందని, ఇక తాను ఏమీ చేయలేనని మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి ఖైదీలతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున గది డోర్ కర్టెన్‌కు ఉన్న ఇనుప క్లిప్పులతో మెడపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఖైదీలు విధుల్లో ఉన్న జైలు వార్డర్‌కు చెప్పపడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ సెలవులో ఉండటంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటకు పంపారు. వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. -
మద్యం తాగి నడిపితే జైలుకే
మంచిర్యాల క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో గురువారం డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు, వారి కుటుంబం సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతన్నాయన్నారు. ప్రమాదాల్లో మృతి చెందినవారు ఎక్కువశాతం తలకు బలమైన గాయాలు తగలడం వల్లనేనన్నారు. తలకు హెల్మెట్ వాడటం వల్ల రక్షణగా ఉంటుందని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపిన వారు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు సార్లు పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మూడోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేసేందుకు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సతీశ్, ఎస్సై, ఏఎస్సై భవానీ పాల్గొన్నారు. -
వైద్యునికి 175 ఏళ్ల జైలు శిక్ష!
వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన జిమ్నాస్టిక్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించాడు. మెడికల్ ట్రీట్మెంట్ పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్న డాక్టర్‌కు ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడింది. అమెరికాకు చెందిన డాక్టర్ లారీ నసార్ జిమ్నాస్టిక్ మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో మిచిగాన్ కోర్టు డాక్టర్‌కి 40 నుంచి 175 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇలాంటి నీచునికి జైలు బయట బతికే అర్హత లేదు అంటూ కోర్టు తీర్పులో పేర్కొంది. కోర్టు విచారణకు 160 మంది మహిళలు హాజరై డాక్టర్ తమను లైంగికంగా వేధించాడని కోర్టులో విన్నవించుకున్నారు. బాధితుల్లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జిమ్నాస్ట్ సైమోన్ బైల్స్, అలీ రైజ్మాన్, గ్యాబీ డగ్లస్, మెక్ కాలే మరోనే లాంటి అథ్లెట్లు ఉన్నారు. -
వదినామరదళ్లు! కన్నడం పరవళ్లు
జైలు జీవితం ఎందుకని అడిగితే... చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి అని చెప్తాం. నిజానికి నేరం చేసిన వారిని జైల్లో ఉంచడం వెనుక ఉన్న పరమార్థం వారిలో పరివర్తన తీసుకురావడమే. అలాంటి పరివర్తన అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మొదలైనట్లే ఉంది. నాలుగేళ్ల శిక్షలో భాగంగా శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నారు. అక్కడ ఆమె ‘అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్’ (వయోజన అక్షరాస్యత కార్యక్రమం)లో చేరి కన్నడ అక్షరాలు దిద్దుతున్నారు. కన్నడలో పదాలు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్లాస్‌లకూ హాజరవుతున్నారు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మౌనమే సమాధానం శశికళ కన్నడ భాషను ఏ మేరకు నేర్చుకున్నారనేది నిర్ధారించడానికి అధికారులు ఇప్పటికే ఒక మౌఖిక కూడా నిర్వహించారు. అయితే ఆ రోజు శశికళ మౌనవ్రతంలో ఉండటంతో ఏ ప్రశ్నలకూ నోరు తెరిచి సమాధానం ఇవ్వలేదు. మౌఖికంగా సమాధానాలివ్వకపోయినా ఆమె కన్నడ అక్షరాలు, పదాలను చక్కగా రాస్తున్నారని, సిలబస్‌ను చక్కగా పూర్తి చేశారనే ఒక అంచనాకు రావడానికి అది సరిపోతుందని జైలు వర్గాలు అంటున్నాయి. అంటే.. ‘లిటరసీ ప్రోగ్రామ్’లో విజయవంతంగా పాల్గొన్నట్లు శశికళ చేతికి త్వరలోనే ఒక సర్టిఫికెట్ రాబోతోంది. శశికళతోపాటు అదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆమె మరదలు ఇళవరసి కూడా కన్నడం నేర్చుకుంటున్నారు. మహిళలకు లైబ్రరీ! ఇప్పటి వరకు పరప్పన సెంట్రల్ జైలులో మహిళల విభాగంలో లైబ్రరీ లేదు. ఇప్పుడు శశికళ చొరవతో లైబ్రరీని విస్తరించి మరో రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి విచారణ ఖైదీలకు, మరొకటి మహిళా ఖైదీల కోసం. మహిళల లైబ్రరీ కోసం ముప్పై వేలు పెట్టి వార్తాపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ కలిపి 91 పత్రికలు తెప్పించడానికి రంగం సిద్ధమైంది. ర్యాక్‌లు రెడీ అవుతున్నాయి! – మంజీర -
జైలుకు వెళ్లినా బుద్ధిమారలేదు
బనశంకరి : జైలుకు వెళ్లినా ఓ కామాంధుడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. తన దగ్గరకు రావాలంటూ ఓ మహిళను వేధింపులకు దిగిన సంఘటన బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... బ్యాటరాయనపుర మురికివాడలో సెల్వకుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటి ముందు నివాసం ఉంటున్న పద్మావతిపై ఇతని కన్నుపడింది. ఆమె బయటకు వచ్చే సమయంలో సెల్వ కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సెల్వ తల్లిండ్రులకు తెలిపినా కూడా వారు అతనికే మద్దతు పలికారు. పద్మావతిని భయపెట్టడానికి ఓ రోజు బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో గర్భిణి అయిన ఆమె తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైంది. ఈ కేసులో సెల్వకుమార్‌ను పోలీసులు జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చినా కూడా సెల్వకుమార్ పద్దతి మార్చుకోలేదు. ఇతడి ఆగడాలను భరించలేని పద్మావతి ఇంటి ముందు సీసీ కెమెరాలు అమర్చుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సర్దుకుపోండి అని చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. -
హైదరాబాద్‌లో అడుక్కుంటూ కనిపిస్తే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించి జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చంచల్‌గూడ కేంద్ర కారాగారం వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోంను పురుష యాచకుల కోసం, చర్లపల్లి కేంద్ర కారాగారం పక్కన ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం వర్క్ హౌస్ కమ్ స్పెషల్ హౌస్‌గా ఉపయోగించనుంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం–1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాంకా ట్రంప్‌తో పాటు 1,500 మంది బిగ్షాట్స్.. వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్ఐఐసీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకుండా ఏరాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుష, మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోమ్‌ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర జైళ్లశాఖకే అప్పగించింది. చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్స్‌పాల్‌ను పురుష యాచకుల వర్క్‌హోంకు సూపరింటెండెంట్‌గా, చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్‌ను మహిళా యాచకుల వర్క్ హోంకు సూపరింటెండెంట్‌గా నియమించింది. -
కారాగారంలో కీచకపర్వం
మహిళలకు బాహ్య ప్రపంచంలోనే కాదు కారాగారంలోనూ రక్షణ లేదనే దారుణ ఉదంతం పుదుచ్చేరి జైలులో చోటుచేసుకుంది. జైల్లో నుంచే నేరాలకు పాల్పడేందుకు అధికారులే సహకరిస్తున్నారు. విలాసాల కోసం పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకుపంపుతున్నారు. వారి వల్ల ఇతర మహిళా ఖైదీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసింది. ఇలాంటి దురాగతాలపై పుదుచ్చేరి జైళ్ల ఐజీ నేతృత్వంలో విచారణ సాగుతుండగా కొందరిని ఇప్పటికే సస్పెండ్‌చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: మగ, మహిళా ఖైదీలు కలుసుకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన సిబ్బందే వారి రాసలీలలకు సహకరిస్తున్న సంఘటనలు పుదుచ్చేరి కేంద్ర కర్మాగారంలో చోటుచేసుకున్నాయి. గురువారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక (మాలైమలర్) ద్వారా అనేక వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రంలో జరిగే నేరాలకు సంబంధించిన వారిని పుదుచ్చేరి కాలాపట్టిలోని కేంద్ర కారాగారంలో పెడతారు. ఈ జైలులో సుమారు 600 మంది ఖైదీలున్నారు. వీరిలో వందమంది మహిళా ఖైదీలు. జైలులో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంచేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. మహిళా జైలు పరిధిలో మహిళా సిబ్బందే విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ జైలులో పేరొందిన కొందరు రౌడీలను అరెస్ట్‌చేసి పెట్టి ఉన్నారు. వీరు జైలులో ఉంటూనే బయట ఉన్న తమ ముఠా సభ్యులతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఖైదీలకు సెల్ఫోన్లను అందుబాటులో ఉంచుతూ వారి రౌడీరాజ్యాన్ని పాలించేందుకు సహకరిస్తున్న వారు గతంలో సస్పెండయ్యారు. మహిళా ఖైదీలతో పురుష ఖైదీల రాసలీలలు ఇదిలా ఉండగా, ఖైదీలకు మరిన్ని సేవలు అందించేందుకు జైలు వార్డన్లు తెగించారు. ఒక పేరొందిన రౌడీ, మహిళా దాదా పరస్పరం కలుసుకునేందుకు జైలు అధికారులే ఏర్పాట్లుచేసినట్లు తేలింది. ఈ జైల్లో మర్డర్ మణికంఠన్ అనే పేరొందిన రౌడీ ఉన్నాడు. అతనిపై హత్య, కిడ్నాప్, డబ్బు దోచుకోవడం వంటి అనేక కేసులున్నాయి. ఈ ఏడాది జనవరిలో పుదుచ్చేరి మాజీ స్పీకర్ వీఎమ్‌సీ శివకుమార్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో కారైక్కాల్‌కు చెందిన మహిళా దాదా ఎళిలరసిని అరెస్ట్‌చేసి పుదుచ్చేరి జైల్లో పెట్టారు. మణికంఠన్, ఎళిలరసి కలుసుకునేందుకు జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఈ విషయం జైళ్లశాఖ ఐజీ పంకజ్‌కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో అర్ధరాత్రి వేళ జైల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనందరాజ్, చీఫ్‌వార్డన్ వీరవాసు, వార్డన్లు కలావతి, మదివానన్‌లను ఐజీ సస్పెండ్ చేశారు. మణికంఠన్, ఎళిలరసి తమ శత్రువులను హతమార్చేందుకు జైలులోనే కుట్ర పన్నినట్లు ఐజీ జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. మహిళా ఖైదీలకు లైంగిక వేధింపులు జైల్లో పురుష, మహిళా ఖైదీలు ఎంతమాత్రం కలుసుకునేందుకు వీలులేకుండా చేసిన ఏర్పాట్లకు జైలు సిబ్బందే గండికొట్టారు. పురుష, మహిళా ఖైదీలు రహస్యంగా కలుసుకునే జైలు సిబ్బందే ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా పేరొందిన పురుష ఖైదీలు మహిళా ఖైదీలను కలుసుకునేందుకు ప్రధానంగా ముగ్గురు వార్డెన్లు సహకరిస్తున్నట్లు సమాచారం. సదరు రౌడీల వల్ల మహిళా ఖైదీలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. జైలులోని నాలుగు గోడల మధ్యనే మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు. ఏయే పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకు పంపారో తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ బాగోతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వార్డెన్లను ఉన్నతాధికారులు ఇప్పటికే విచారించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేయవచ్చని తెలుస్తోంది. -
400 ఏళ్ల నాటి చరిత్రను ప్రశ్నించినందుకు జైలు
బ్యాంకాగ్ : నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగినట్టు చెబుతున్న థాయ్‌లాండ్ రాజుల చరిత్రలో ఓ అంశాన్ని ప్రశ్నించినందుకు 85 ఏళ్ల థాయ్‌లాండ్ విమర్శకుడిని సోమవారం ఇక్కడి సైనిక కోర్టులో హాజరుపరిచారు. రాజును అవమానించారన్న ఆరోపణలకు సంబంధించిన ఆయనపై ‘లీజ్ మెజెస్టీ లా’ కింద అధికారికంగా కేసును నమోదు చేశారు. ఈ చట్టం కింద ఆయనకు మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సులక్ శివరక్ష అనే వద్ధుడు 2014 సంవత్సరంలో ఓ బహిరంగ వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 1593లో ప్రముఖ థాయ్‌లాండ్ రాజు నరేసువాన్, బర్మా రాజు మధ్య జరిగిన నాంగ్ సరాయ్ యుద్ధాన్ని ప్రస్తావించారు. చరిత్ర పుస్తకాలు చెబుతున్నట్లు ఆ యుద్ధంలో నిజంగా నరేసువాన్ ఏనుగ్గునెక్కి పోరాడి విజయం సాధించారా? అని ప్రశ్నించారు. చరిత్రను ప్రశ్నించడం కూడా అవసరమన్నారు. మూడేళ్ల క్రితం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సులక్ శివరక్ష మరిచిపోయారో లేదో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఎప్పుడో మరచిపోయారు. ఇంతకాలం ఏమి జరిగిందో ఏమోగానీ సోమవారం నాడు సైనిక అధికారులు వచ్చి శివరక్షను పట్టుకెళ్లి కేసు పెట్టారు. మూడేళ్లపాటు పట్టించుకోని సైనిక అధికారులు ఇప్పుడు తనపై ఎందుకు కేసు పెట్టారో అర్థం కావడం లేదని శివరక్ష వ్యాఖ్యానించారు. బహూశా పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నించరాదన్నది ప్రస్తుతం ప్రభుత్వం వైఖరై ఉంటుందని అన్నారు. అయినా ప్రతి విషయాన్ని తరచి చూడడం, విమర్శించడం తన నైజమని, ఈ నైజాన్ని తాను వదులుకోనని చెప్పారు. డిసెంబర్లో మరోసారి కేసు విచారణ ఉందని, బహూశ ఆరోజున శిక్షను ఖరారు చేయవచ్చని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. రాజులను, వారి కుటుంబ సభ్యలను విమర్శించరాదని ‘లీజ్ మెజెస్టీ లా’ చెబుతోంది. అయితే బతికున్న రాజులను విమర్శించకూడదా? వారు మరణించాక కూడా విమర్శించకూడదా? అన్న అంశంపై చట్టంలో స్పష్టత లేదు. అందుకని అవసరాన్ని బట్టి పాలకులు చట్టానికి భాష్యం చెబుతూ వస్తున్నారు. 2014లో అధికారాన్ని కైవసం చేసుకున్న థాయ్ సైన్యం ఇప్పటి వరకు ఈ చట్టం కింద 93 కేసులను దాఖలు చేసి, 138 మందిని విచారించింది. -
కళ్లతో కోట్ల సంపాదన..!
నార్త్ కరోలినా : అతనో దొంగ. ఓ రేపిస్ట్. ఐదు నేరారోపణలతో జైలు జీవితం గడుపుతున్నాడు. అలాంటి వ్యక్తి జీవితం ఒక్కసారి టర్న్ అవుతుందని, అతని కోటీశ్వరుడు అవుతాడని ఎవరైనా అనుకుంటారా?. మేఖీ జీవితంలో అలాంటి సంచలనం జరిగింది. ఓ మోడలింగ్ కంపెనీ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి బెయిల్‌పై అతన్ని విడిపించుకుంది. అందుకు ఓ కారణం ఉంది. మేఖీ హెటెరోక్రోమియా అని కంటి జబ్బుతో బాధపడుతున్నాడు. కానీ ఆ జబ్బే అతని పాలిట వరంగా మారింది. హెటెరోక్రోమియా జబ్బు వల్ల కళ్లు రెండూ వేర్వేరు రంగుల్లోకి మారుతాయి. ఫొటోలో మేఖీ కళ్లు ఎలా మారయో చూడండి. మేఖీ ఫొటోను చూసిన మోడలింగ్ కంపెనీ అతని గురించి వివరాలు కనుక్కుని మోడలింగ్ చేయాలని కోరింది. మోడలింగ్ ఏజెన్సీ ఆఫర్‌తో మేఖీ ఎగిరి గంతేశాడు. మోడల్‌గా మారిన అనంతరం మేఖీ తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇన్‌స్టాలో మేఖీకి 20 వేల ఫాలోవర్స్ ఉన్నారు. -
కోచ్‌కు 105 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో కాలిఫోర్నియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాధమిక పాఠశాలలో ఏడుగురు చిన్నారి బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన కోచ్ రోనీ లీ రోమన్‌కు (44) కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జిన్హువా వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. రోమన్‌పై మైనర్ బాలికలను వేధించిన ఘటనలకు సంబంధించి మొత్తం 7కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. పాఠశాల ఆవరణలో ఆరుగురికిపైనా, ఏడవది బాధిత బాలిక ఇంట్లో జరిగిందని విచారణలో తేలింది. 8నుంచి 11సంవత్సరాల వయసున్న బాలికలపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం కొలరావులోని కాహువేన్ ఎలిమెంటరీ స్కూల్లో, హాలీవుడ్‌లోని వైన్ ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో రోమన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 7న ప్రాసిక్యూషన్ అతణ్ని దోషిగా నిర్ధారించడంతోకోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
మరో వారందాకా ఇల్లే జైలు
- ఆగస్టు 2వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ముద్రగడ - కలెక్టర్ ఉత్తర్వులను అందజేయబోయిన పోలీసులు - తిరస్కరించిన పద్మనాభం - వచ్చే నెల 3 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని ముద్రగడ నిర్ణయం కిర్లంపూడి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్ర రెండో రోజు గురువారం కూడా అడుగు ముందుకు సాగలేదు. కర్ఫ్యూను తలదన్నే రీతిలో విధించిన ఆంక్షలతో పోలీసులు ఆయనను స్వగ్రామం కిర్లంపూడిలోని ఇంటి నుంచి బయటకు కదలనివ్వలేదు. ముద్రగడను 24 గంటల క్రితం ఒక రోజు గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ముద్రగడ పాదయాత్రపై మరో వారం రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. దీంతో ముద్రగడకు ఆగస్టు 2వ తేదీ వరకు ఇల్లే జైలు కానుంది. సెక్షన్ 144 సబ్‌క్లాజ్(30) కింద జిల్లా కలెక్టర్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఈ సెక్షన్ గృహనిర్భందానికి సంబంధించినది కాదని ఆలస్యంగా గుర్తించిన జిల్లా ఎస్పీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్రకు సంబంధించిన ఆంక్షలను మాత్రమేనని వివరించారు. ముద్రగడను పోలీసులు ఇంటి నుంచి కదలనివ్వడం లేదు. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆయన, ఆయన అనుచరులు, పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగస్టు 2వ తేదీ వరకు అనుమతి ఇవ్వకపోతే 3న మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించారు. వచ్చే నెల 2వ తేదీ వరకు గృహ నిర్బంధం విధించారని, ఇల్లు దాటి వెళ్లడానికి వీల్లేదంటూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ముద్రగడకు పోలీసులు అందజేయబోగా ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ముద్రగడ తన చేతులు ముందుకు చాచి... బేడీలు వేసి తీసుకువెళ్లండి. ఎందుకీ ఉత్తర్వులని ప్రశ్నించారు. అనుచరులతో భేటీ వచ్చే నెల 2వ తేదీ వరకు గృహ నిర్బంధం విధించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముద్రగడ తన ఇంట్లో అనుచరులతో భేటీ అయ్యారు. న్యాయపరమైన వ్యవహారాలు, ఉద్యమ భవిష్యత్‌ను చర్చించారు. హైకోర్టు న్యాయవాదులు, మాజీ ఐఎఎస్ అధికారులతో ఫోన్లలో మాట్లాడారు. 3వ తేదీ ఉదయం పాదయాత్ర ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
రూప 2.0: వేటు పడినా తగ్గని డీఐజీ
బెంగళూరు: శశికళకు బెంగుళూరు జైలు అందుతున్న వీఐపీ ట్రీట్మెంట్ వివరాలను బయటపెట్టిన డీఐజీ రూపపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అయినా వెనక్కు తగ్గని ఆమె శశికళకు జైలులో అందుతున్న లగ్జరీలకు సంబంధించి రెండో రిపోర్టును సోమవారం సమర్పించారు. చట్ట విరుద్దంగా శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందని రిపోర్టులో ఆమె పేర్కొన్నారు. రిపోర్టులోని అంశాలు ఇలా .. శశికళ అవసరాల కోసం జైలులో ఐదు సెల్‌లకు తాళం వేయకుండా ఉంచారు. శశికళ నడవడానికి జైలులోని కారిడార్‌లో కొంతభాగం బారికేడ్‌లా నిర్మించారు. శశికళకు తెచ్చే ఆహారం ప్రత్యేక వాహనాల్లో వస్తుంది. ఆమెకు ప్రత్యేకంగా బెడ్‌తో పాటు సకల సదుపాయాలు జైలులో సమకూర్చారు. రూప సమర్పించిన మొదటి రిపోర్టు కర్ణాటక జైళ్ల శాఖను ఓ కుదుపు కుదిపింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎస్ఎన్ రావు ఆ రిపోర్టును నిరాకరించినా.. రూప మాత్రం పబ్లిక్‌గా రిపోర్టుపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య.. హైలెవల్ విచారణకు ఆదేశించారు. సోమవారం రూపపై బదిలీ వేటు కూడా పడింది. ఆమెను ట్రాఫిక్ వింగ్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూప బదిలీపై మాట్లాడిని సీఎం.. ఆమెను బదిలీ చేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. ఆమెను ఎందుకు బదిలీ చేయకుడదంటూ మీడియాను ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ విడుదల
జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్(71) జైలు నుంచి విడుదలయ్యారు. ఇక్కడి పెరోల్ బోర్డు ఆయన శిక్ష పూర్తికాకుండానే ఆదివారం విడుదల చేసింది. జెరూసలేం మేయర్‌గా, దేశ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రోత్సహించడానికి ఎహుద్ లంచం తీసుకున్నారని కేసు నమోదైంది. 2014లో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2006లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైన ఎహుద్ పాలస్తీనాతో శాంతిస్థాపనకు విశేషంగా కృషిచేశారు. ఓ దశలో జెరూసలేంలోని కొంత భాగాన్ని శాంతి ఒప్పందం ద్వారా వదులుకునేందుకు సైతం సిద్ధపడ్డారు. మరోవైపు జైలు నుంచి ముందస్తుగా విడుదల అయిన ఎహుద్ కొన్ని మాసాల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుందని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి అస్సఫ్ లిబ్రటి తెలిపారు. -
ఇక్కడే కుట్ర
నేర ప్రణాళికలకు జిల్లా జైలే అడ్డా ►శిక్ష అనుభవిస్తూ ఒక్కటవుతున్న క్రిమినల్ మైండ్స్ ►విడుదల అనంతరం పక్కగా చోరీలు ►హత్యలకూ వెనకాడని వైనం ►పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పరివర్తన చెందే స్థలం జైలు. వివిధ నేరాలలో శిక్ష పడి జిల్లా జైలుకు వస్తున్న కొందరు ఖైదీలు అందుకు విరుద్ధంగా రాటుదేలుతున్నారు. ఇతర ఖైదీలతో కలిసి నేరాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బయటకు వచ్చి పక్కాగా అమలు చేస్తున్నారు. వారిలో మార్పుతీసుకురావడంలో జైలు అధికారుల కృషి నీరుగారుతోంది. నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్) : వారంతా ఎక్కడెక్కడి వారో తెలియదు.. అంతా ఒక్కటవుతున్నారు.. చేసిన నేరాలే వారిని ఒక్కటిగా చేస్తున్నాయి. సారంగపూర్‌లోని జిల్లా జైలే వారికి వేదికగా మా రింది. వివిధ నేరాల్లో శిక్ష పడి జైలులో శిక్ష అనుభవించేందుకు వచ్చే కొంతమంది ఖైదీలు.. పరివర్తనలో మార్పు చెందకపోగా ఒకరి నేర చరిత్రను ఒకరు తెలుసుకుంటూ దోస్తీ చేస్తున్నారు. ఈ రకమైన చోరీకి నీ లాంటివాడే సరైనోడు అంటే, ఆ రకమైన నేరానికి నీ లాంటి వాడి సహకారం అవసరమంటూ జైలులోనే దొంగతనాలకు, నేరాలకు వ్యూహరచనలు చేస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఒకచోట కలుసుకుంటున్నారు. జైలులో వేసుకున్న ప్రణాళికలను అమలు పరిచేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ రకమైన ఘటనే ఇటీవల మాక్లూర్ మండలం చిన్నాపూర్ గండిలో రామాలయం పూజారీ నారాయణదాస్ దారుణహత్య. నిందితులలో ఒకరు ఆటోడ్రైవర్ దుబ్బాక లక్ష్మణ్ ది నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామం కాగా, మరో నిందితుడు నర్ర ఎల్లయ్య ది ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామం. వీరిద్దరూ వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపారు. కోర్టు వీరు చేసిన నేరాలపై శిక్ష విధిస్తూ జిల్లా జైలుకు పంపింది. అక్కడ వీరిద్దరు పరిచయం అయ్యారు. ఒకరి నేర చరిత్రను ఒకరు తెలుసుకున్నారు. జైలులోనే చోరీలకు ప్రణాళికలు రచించుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేసే క్రమంలో చిన్నాపూర్ గండిలో ఆలయ పూజారిని దారుణంగా హత్య చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీరిని పట్టుకున్నారు. జైలులో వీరి పరిచయం..అనంతరం చోరీలకు పాల్పడడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. నేరాలపై అవగాహన కల్పిస్తున్నా .. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండేలా జైలు అధికారులు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. న్యాయ సేవాసంస్థ ఆ ధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ నేరాలకు ఎటువంటి శిక్షలు ఉంటాయి, నేర చరిత్ర వలన ఖైదీలు, వారి కుటుంబాలు ఎంత నష్టపోతున్నా యో వివరిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలతో కొంతమంది ఖైదీల్లో మార్పువచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతుండగా.. మరికొంత మంది బుద్ధి మా రక తిరిగి నేరబాట పడుతున్నారు. జైలు లో శిక్ష అనుభవించిన ఖైదీలు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జైలు, పోలీసు అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జైలంటే జైలూ కాదు స్వర్గంగా ఉందీ చూడు..
ఓస్లో: ప్రపంచంలో జైలు అనగానే ఊచలున్న, గాలి వెలుతరురాని నాలుగు గదుల గోడ, రుచీ పచిలేని తిండి, చుట్టూ తుపాకులతో కాపలాకాచే పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం, పోలీసు పద ఘట్టనలు, కాపలా కుక్కల అరుపులు గుర్తొస్తాయి. జైలంటే ఏ మాత్రం స్వేచ్ఛలేని దుర్భర జీవితం. నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆ జైలుపక్షుల దైనందిన జీవితం గురించి వింటే మనమే నేరం చేసి జైలుకు వెళితే బాగుండునేమో అనిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేపకుండానే క్రమశిక్షణతో పొద్దునే లేస్తారు. అందరూ వ్యాయామం చేస్తారు. కొందరు జైల్లోనే ఉన్న జిమ్‌కు వెళతారు. కసరత్తు చేస్తారు. కండలు పెంచుతారు. టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత ఆపక్కనే ఉన్న బీచ్‌కు వెళతారు. సన్‌బాత్ చేస్తారు. కొందరు సముద్రంలో జలకాలాడుతారు. పైన్ చెట్లను నీడన సేదతీరుతారు. ఆ తర్వాత జైలు నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు గాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఎక్కువ వరకు ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులు ఉండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటరు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. సొంతంగా ఎవరికిష్టమైన బట్టలు వారు కొనుక్కోవచ్చు, వాటిని వేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. అన్ని సౌకర్యాలు ఉండడం ఒక్కటే ఇందుకు కారణం కాదు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడి పోతారు. వివిధ ఉద్యోగాలను కల్పించేందుకు కూడా నార్వే ప్రభుత్వం సహకరిస్తుంది. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో తీవ్ర హింసాత్మక నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. ఒక్కసారి నేరం చేసినవారు, మరోసారి నేరం చేయకుండా వాళ్లలో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. ఒకసారి జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాక మరో రెండేళ్లలోనే అలాంటి నేరం చేసి జైలుకు వచ్చే వారి సంఖ్య నార్వేలో 20 శాతం మాత్రం. అదే అమెరికాలో మళ్లీ జైలుకు వచ్చే వారి సంఖ్య 50 శాతానికిపైగా ఉంది. నార్వేలో యావజ్జీవ శిక్ష ఉండదు. తీవ్ర నేరాలకు గరిష్ట శిక్ష 21 ఏళ్లు. మరీ తీవ్రమైన మానవ హననానికి పాల్పడితే 30 ఏళ్ల జైలు శిక్ష. 60 శాతం ఖైదీలకు మూడు నెలలలోపే శిక్షలు పడతాయి. 90 శాతం ఖైదీలకు ఏడాది లోపే శిక్ష అనుభవిస్తారు. బాస్టాయ్ జైలు నుంచి సాధారణంగా ఎవరూ పారిపోరు. 2015లో ఓ ఖైదీ సర్వ్బోర్డు ద్వారా పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. అలా పట్టుబడిన వ్యక్తిని కొంత కఠినమైన మరో జైలుకు తరలిస్తారు. -
మోసం కేసులో భారత–అమెరికన్‌కు జైలు
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నవీన్ శంకర్ సుబ్రమణ్యం గ్జేవియర్ (44) అనే భారత–అమెరికన్‌కు మోసం కేసులో అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్లోరిడాలోని ఎసెక్స్ హోల్డింగ్స్ సంస్థకు మాజీ సీఈవో అయిన నవీన్ శంకర్ ఈ సంస్థ ద్వారానే దాదాపు 100 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు వెల్లడైంది. మొదటి స్కీమ్‌లో వీరిలో కొందరి నుంచి 33 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.213 కోట్లు)ను సేకరించి చిలీలోని ఇనుప గనుల్లో పెట్టుబడి పెట్టినట్లు.. రెండో స్కీమ్‌లో దాదాపు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.75 కోట్లు)ను దక్షిణ కరోలినాలోని ఎకానమిక్ డెవలప్మెండ్ ఫండ్‌లో పెట్టినట్లు నవీన్ నమ్మించారు. అనుమానం వచ్చి కొందరు నిలదీయగా కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి వద్ద సేకరించిన దాన్ని కొందరు పాతవారికిచ్చేశాడు. జనవరిలో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవగా నవీన్ శంకర్ దోషిగా తేలటంతో మియామీ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజామాబాద్ జైలుకు శివరాజ్
- మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అధికారులు - 14 రోజుల కస్టడీకి ఆదేశం సాక్షి, నిజామాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌ను సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారు జామున బోధన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య ముందు హాజరుపర్చారు. వారం క్రితమే శివరాజ్‌ను అదుపులోకి తీసు కున్న సీఐడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో బోధన్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివరాజ్‌ను 14 రోజు ల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యా యమూర్తి సౌజన్య ఆదేశించారు. అనంతరం శివరాజ్‌ను నిజామాబాద్ సబ్‌జైలుకు తరలిం చారు. కాగా వారం క్రితం శివరాజ్‌ను పట్టు కున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం శివ రాజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి అర్ధరాత్రి బోధన్‌కు తరలించారు. అరెస్టు ప్రక్రియలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రెండు నెలలుగా పరారీలో.. రూ.వందల కోట్ల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో శివరాజ్ ప్రధాన నిందితుడు. అతని కుమారుడు సునీల్ ఏ–2గా ఉన్నాడు. మిగతా ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాజ్‌తో పాటు, అతని కుమారుడు సునీల్ రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పరారీలోనే ఉన్న సునీల్ కోసం సీఐడీ ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సునీల్‌ను కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని రికార్డులు స్వాధీనం ఈ కేసులో సీఐడీ అధికారులు శివరాజ్‌కు సంబంధించిన మరిన్ని రికార్డులను మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. నిజామా బాద్‌లో పలుచోట్ల దాచిన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీఐడీ అధికారులు సేకరించారు. తాజాగా మంగళ వారం కూడా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివరాజ్‌ను కస్టడీకి ఇవ్వాలని గురువారం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. -
'ఆయన జైల్లోనే చనిపోతారేమో'
హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు, మైనార్టీల గురించి మాట్లాడితే.. ప్రభుత్వం వారిపై నక్సల్స్ అనే ముద్ర వేస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. భావప్రకటనా హక్కును కాలరాస్తోందని అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవయసు కావడంతో అనేక వ్యాధులకు గురైన సాయిబాబాకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లోని పోలీసు బలగాల మారణకాండను ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్లిన టీడీఎఫ్ నాయకులను పోలీసులు అక్కడే నిర్భందించారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ... ఈ నెల 23న బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 6 గంటలకు రాజకీయ ఖైదీల విడుదల పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
వరకట్నం వేధింపు కేసులో మూడేళ్ల జైలు
కోవూరు : అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం భార్యను వేధిస్తున్న కేసుకు సంబంధించి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బి.రాధారాణి గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంలోని కాశీపాళెం ప్రాంతానికి చెందిన సన్నికంటి లక్ష్మికి నెల్లూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఉమ్మడి వెంకటేశ్వర్లుతో 2007 జనవరి 25న వివాహమైంది. అప్పటి నుంచి కలహాలతోనే వీరి కాపురం సాగింది. భర్త వేధింపులు తట్టుకోలేక లక్ష్మి 2010 జనవరి 25న బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ పి.సుబ్బారావు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఉమ్మడి వెంకటేశ్వర్లుకు ఉమ్మడి మూడేళ్ల జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు. -
కళా రూపాలు
హ్యూమర్ ప్లస్ నాటకాలకు ముగింపు ఉండదు. ఒకచోట తెరపడితే ఇంకోచోట లేస్తూ ఉంటుంది. పాత నాటకాలే తమిళనాడులో మళ్లీ వేశారు. పాత్రలు మారాయంతే. అమ్మ ఎలా చనిపోయిందో ఎవరూ చెప్పరు కానీ, ఒకాయన కళ్లు మూసుకుని అమ్మ ఆత్మతో మాట్లాడతాడు! ఒకావిడ సమాధిపై పిడిగుద్దులు గుద్ది మరీ అమ్మ ఆత్మను తట్టి లేపుతుంది. ఇకపై నాటకం చెన్నైలో, బెంగళూరు జైలు నుంచి ప్రాంప్టింగ్. జైల్లో పుట్టడం వల్లే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు జైళ్లు అధోగతిలోనే ఉండడం వల్ల అక్కడికెళితే చాలు.. తత్వం, వేదాంతం అన్నీ ఒంటపడతాయి. జైళ్ల సంస్కరణలు అని పుస్తకాలు రాస్తూ ఉంటారు కానీ సంస్కారం, జైలు.. ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఇళ్లకు రంగులు కొట్టడం ఆ మధ్యనొచ్చింది కానీ ముఖాలకు రంగులేసుకోవడం చాలా పురాతన ప్రక్రియ. అయితే అప్పుడు నాటకమేదో, జీవితమేదో కొంచెం తేడా తెలిసేది. ఇప్పుడు రెండూ కలిసిపోయి ఎవడి డైలాగులు వాడే ఇన్‌స్టంట్‌గా చెప్పేస్తున్నాడు. నా చిన్నప్పుడు మా ఊళ్లో రామాంజనేయ యుద్ధం నాటకం జరిగింది. మూడో ఆంజనేయుడు ఎవరికీ కనపడకుండా ఎక్కడో నిద్రపోయాడు. దాంతో రెండో ఆంజనేయుడే మూడో ఆంజనేయుడి అవతారం ఎత్తాడు. భారతంలో పద్యాలు పాడినా జనం వన్స్‌మోర్ అన్నారు. ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో తెలియకుండా నాటకం చూడడానికి జనం అలవాటు పడ్డారు. పూర్వం మైకులు లేకపోవడం వల్ల నటులు గట్టిగా అరిచేవాళ్లు. రాగం తీస్తే దోమలు జుమ్మంటూ టౌన్ గేటు వరకు ప్రయాణించేవి. మైకులొచ్చిన తరువాత కూడా కొంతమంది పరిషత్ నటులు గిట్టిగా గావుకేకలు పెట్టేవాళ్లు. వీళ్ల వల్ల రవీంద్రభారతిలో ప్రేక్షకులు స్పృహ కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సామాజిక స్పృహ ఎక్కువైతే వచ్చే ఇబ్బందే ఇది. భటుడి వేషాన్ని ఏళ్ల తరబడి వేస్తున్న నటుడు ఒక్కసారిగా వేషం మార్చి తిరుగుబాటు వీరుడిగా మారితే రౌద్రానికి బదులు హాస్యరసం పుడుతుంది. పన్నీర్ సెల్వాన్ని పన్నీర్ బెటర్ మసాలాగా అంగీకరించకపోవడానికి కారణమిదే. పెద్దమ్మ కాళీమాత అయితే చిన్నమ్మ మహిషాసురమర్దిని. సివంగిని బోనులో పెట్టారు కానీ ఊచలు కొరికి ఎప్పుడైనా మీద పడుతుందని బోలెడంత మంది వణికి చస్తున్నారు. నాటకాల కంటే తోలుబొమ్మలాట ఇంకొంచెం ఓల్డ్. ఈ ఆర్ట్‌కి సంబంధించిన ప్రసిద్ధ కళాకారులంతా ఢిల్లీలో ఉంటారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు అన్నీ వాళ్లే చెబుతూ ఉంటారు. బొమ్మలు మాట్లాడుతున్నాయని మనం భ్రమపడతాం. ఆడించేవాళ్లు అప్పుడప్పుడూ మారుతారు కానీ ఆట మారదు. ఢిల్లీ నుంచి బుర్రకథ వినిపించడం కూడా మామూలే. అక్కడ కథ చెబితే ఇక్కడ పక్క వాయిద్యాలు వినిపిస్తూ తందాన అంటూ ఉంటారు. హోదా లేదు ప్యాకేజీనే అని బుర్ర కళాకారుడు అనగానే ఇక్కడి వాయిద్య నిపుణులు తాన తందనాన అంటారు. లేదంటే బుర్ర రామకీర్తనే. ఢిల్లీలో ప్రసిద్ధ మెజీషియన్లు కూడా ఉంటారు. పావురాన్ని మాయం చేసి చిలకల్ని సృష్టించినట్లు, వెయ్యి రూపాయలు మాయం చేసి రెండు వేలు సృష్టిస్తారు. వెయ్యి వల్ల ముప్పు ఉంటే రెండువేల వల్ల రెండింతలు ముప్పు కదా! రెండు రెళ్లు నాలుగంటే కీళ్లు విరుగుతాయి. లెక్కల్లో కూడా సొంత అభిప్రాయాలు ఉంటేనే ముద్దు. ఏనుగు తికమక పడి వరమాలని లె చ్చి మావటి మెళ్లో వేసినట్లు పళనిస్వామి నక్కతోకని తొక్కినా అది కరవకుండా కుర్చీలో కూచో పెట్టింది. రొట్టె విరిగి నేతిలో పడితే కొలెస్ట్రాల్ పెరిగితే పెరగవచ్చు కానీ, నెయ్యి రుచే వేరు. తేనె తాగుదామని కందిరీగల తుట్టెని కదిలించాడు పన్నీర్. కందిరీగలు కుడుతుంటే ఢిల్లీ వైఫై కూడా మోడెం ఆఫ్ చేసుకుంది. షేక్స్పియర్కి మించిన డ్రామా.. రాజకీయాల్లో ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఈగలు, దోమలు పోతున్నా లెక్క చేయకుండా ప్రజలు నోరెళ్లబెట్టి చూస్తూనే ఉంటారు. – జి.ఆర్.మహర్షి -
శశికళ పట్ల అంత సానుభూతి ఎందుకు?
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు చిన్నమ్మ శశికళకు దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించినప్పటికీ ఆమె వర్గీయుల్లో లేదా ఆమె అభిమానుల్లో ఎందుకు మార్పు రావడం లేదు. ఆమెను ఎందుకు దోషిగా చూడడం లేదు? ఇప్పటికీ ఆమెను చిన్నమ్మగా ఎలా గౌరవించగలుగుతున్నారు? పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరు పోలీసు స్టేషన్‌కు బయల్దేరిన శశికళను ఓ స్వాతంత్ర్య యోధురాలిని సాగనంపటానికి వచ్చినట్లుగా తండోప తండాలుగా ఎలా తరలివచ్చారు, ఎందుకు తరలివచ్చారు? ప్రజలకు రాజకీయ నాయకుల అవినీతి కేసులు పట్టకుండా పోతున్నాయా? ఏ రాజకీయ నాయకుడు అవినీతి పరుడుకాకుండా ఉన్నాడా అన్న నిర్లిప్త ధోరణి ప్రజల్లో పెరిగిపోతుందా? అవినీతి కేసులో శశికళకు జైలు శిక్ష పడితే తమిళనాడులో ఏర్పడిన సంక్షోభం దానంతట అదే సమసిపోతుందని రాష్ట్ర గవర్నర్ సహా పలు వర్గాలు భావించాయి. శశికళ శిబిరంలో ఉన్నవారు ఖాళీ చేసి అంతా తన శిబిరంలో చేరిపోతారని, ఇక తానే ముఖ్యమంత్రిని అవుతాననుకున్న పన్నీర్ సెల్వం నమ్మకం కూడా వమ్మయింది. రాజకీయ నేతల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అవినీతి మచ్చలేని పన్నీర్ సెల్వం పంచన చేరితే పంచుకునేది ఏమీ ఉండదు, దండుకునేది ఏమీ ఉండదని శశికళ వెనక చేరిన వారు భావించి ఉండవచ్చు. అందుకనే చిన్నమ్మ చెప్పినట్లు పళనిస్వామికి మద్దతిస్తే ప్రయోజనాలు పొందవచ్చని ఆశించి ఉండవచ్చు! ఇలాంటి ధోరణి పాలకపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నేతల్లో ఉంది. అంతేకాదు, ఎక్కడాలేని విధంగా ఒక్క భారత దేశంలోనే అవినీతి కేసుల విషయంలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం రక్షించుకునే వ్యూహాలు కూడా ఉన్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అనేక కుంభకోణాల ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని బోను ఎక్కించేందుకు ఇంతవరకు మోదీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అవినీతి స్కాముల్లో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని శపథం చేసిన బీజేపీ నాయకులు కూడా ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు. రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసే వ్యక్తంటూ మన్మోహన్‌ను ఎద్దేవ చేసే మోదీ ఆయనపై కేసు పెట్టేందుకు మాత్రం ముందుకు రారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల కేసుల్లో మోదీని ప్రత్యక్షంగా ఇరికించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘మౌత్ కే సౌదాగర్, కూన్ కే దలాల్’ అంటూ సోనియా, రాహుల్ గాంధీలు విమర్శించారు తప్ప, అవకాశం ఉన్నప్పుడు మోదీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1993లో జరిగిన ముంబై అల్లర్లలో శివసేన పాత్ర ఉందని వెల్లడించిన శ్రీకష్ణ కమిటీ నివేదికను అమలు చేస్తామని హామీ ఇచ్చిన నాటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ విషయంలో మన పొరుగు దేశాలు ఎంతో ముందున్నాయి. బంగ్లాదేశ్‌లో ఖలేదా జియా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా అరెస్టయ్యారు. ఆ తర్వాత షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఖలేదా జియా పెద్ద కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇక పాకిస్తాన్లో ఇలాంటివి సర్వసాధారణం. 1996లో బేనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని సైన్యం రద్దు చేసినప్పుడు ఆమె ప్రవాస జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఆమె సోదరుడు ముర్తజా భుట్టో హత్య కేసులో ఆమె భర్త ఆసిఫ్ అలీ జర్దారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ముషార్రఫ్ సైనిక కుట్ర అనంతరం నవాజ్ షరీప్‌కు ఉరితీయాల్సి ఉండింది. సౌదీ అరేబియా రాజు ఫాద్ జోక్యంతో ఆయనకు ఆ ఉరి తప్పింది. మన దేశంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులు మాటలతోనే ఒకరినొకరు శిక్షించుకుంటారు. అవినీతి కేసుల విషయానికొస్తే అంతా ఒకటే కులం. పరస్పరం రక్షించుకోవడమే వారి అభిమతం. ఇప్పుడు అవినీతి కేసులను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నది తమిళనాడులోనే చూస్తున్నాం. –– ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
హత్యకేసులో జీవిత ఖైదు
కర్నూలు(లీగల్): స్నేహితుడినే హత్యచేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5వేల జరిమాన విధిస్తూ జిల్లా నాల్గవ అదనపు న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. కర్నూలు చిత్తారి గేరికి చెందిన షేక్ మహబూబ్‌బాషా గని గల్లికి చెందిన చౌదరి జహంగీర్ ఖురేషి స్నేహితులు. జహంగీర్ ఖురేషి తరచుగా మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మిత్రుడి అన్న కుమార్తెతో జహంగీర్ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహబూబ్‌బాషా తన అన్న కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు. అందుకు జహంగీర్ నిరాకరించడాన్ని మనసులో ఉంచుకుని 2013 జనవరి 5వ తేదీన అతడు స్థానిక జమ్మిచెట్టు సమీపంలో పేకాట ఆడుతుండగా దాడి చేసి హత్యచేశాడు. హతుడి అన్న చౌదరి ఇక్బాల్ ఖురేషి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి టి.రఘురాం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున పీపీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష
నల్లచెరువు (కదిరి) : మద్యం తాగి ఆటో నడుపుతూ నల్లచెరువు మండలం ప్యాయలవాండ్లపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన కె.పూలకుంటకు చెందిన మహబూబ్‌బాషాకు జైలు శిక్ష పడింది. నాలుగు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. -
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే..
►కనీసం రెండు రోజులైనా తప్పనట్లే... ►న్యాయ విభాగంతో పోలీసుల భేటీ ►నగరంలోని స్థితిగతులపై వివరణ ►నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దూసుకుపోదాం...ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే రూ.వందో, రూ.రెండొందలో ఇచ్చి వచ్చేద్దాం...అనుకుంటున్నారా? ఇకపై అలా కుదరదు. మంగళవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిక్కితే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కోర్టులు కనీసం రెండు రోజుల జైలుశిక్ష విధించనున్నాయి. సోమవారం నగర ట్రాఫిక్ పోలీసులు– న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్‌జే రాధారాణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని ట్రాఫిక్ కోర్టుల న్యాయమూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి మంగళవారం నుంచి ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేయనున్నట్లు డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇదీ నగరంలోని సీన్... గత ఏడాది ఆఖరి నాటికి నగరంలోని వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది. అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య 20 లక్షలకు మించట్లేదు. మొత్తం వాహనాల్లో టూ వీలర్స్ సంఖ్య 45 లక్షల వరకు ఉండగా... ఈ తరహా లైసెన్సులు కేవలం 10 లక్షలే జారీ అయ్యాయి. మరోపక్క గత ఏడాది ప్రమాదాల్లో మృతుల సంఖ్య 371గా ఉండగా... వీరిలో 190 మంది వరకు ద్విచక్ర వాహనచోదకులే ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వచ్చి మృత్యువాతపడ్డారు. ఈ గణాంకాలను న్యాయ విభాగానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన ట్రాఫిక్ విభాగం అధికారులు సిటీలోని పరిస్థితుల్ని కళ్లకు కట్టారు. మరోపక్క గత నెల 22న పాతబస్తీలోని షంషేర్‌గంజ్ ప్రాంతంలో ఓ ఆటో జంగయ్య ప్రాణాలు తీసింది. శనివారం తాడ్బంద్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదం ఇద్దరు విద్యార్థుల్ని బలిగొంది. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు లైసెన్స్ లేదు. యాక్సిడెంట్స్ వీడియోలను న్యాయమూర్తులకు చూపించిన ట్రాఫిక్ పోలీసులు వాస్తవాలను వారి దృష్టికి తీసుకువెళ్ళారు. విదేశాల్లో అయితే ఇలా... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ఏడాదిన్నరగా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరికి న్యాయస్థానాలు రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నాయి. లైసెన్స్ లేని వాహనచోదకులపై ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యల్నీ ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా, దుబాయ్‌ల్లో ఇలా చిక్కిన వారు విదేశీయులైతే వారిని స్వదేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. జరిమానాలు సైతం 10 వేల నుంచి 20 వేల డాలర్లు, ఏడాది నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్షలు విధిస్తారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారమూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఈ వివరాలను న్యాయ విభాగానికి వివరించిన ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి ఇలాంటి వాహనచోదకులకు కనీసం రెండు రోజుల జైలు శిక్ష విధించాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారని డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కాగా జైలుశిక్ష పడిన వారి వివరాలు ఆధార్ సంఖ్యతో సహా డేటాబేస్ ఏర్పాటు చేస్తామంటున్నారు. పాస్‌పోర్ట్, వీసాలతో పాటు ప్రభుత్వ, కొన్ని ఇతర ఉద్యోగాలకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వెరిఫికేషన్ నివేదికతో పాటు డేటాబేస్‌లో సరిచూడటం ద్వారా సదరు వ్యక్తికి ఈ శిక్ష పడిందని పోలీసులు సంబంధిత శాఖకు నివేదించనున్నారు. దీని ఆధారంగా జైలుకు వెళ్ళిన ఉల్లంఘనులకు పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌తో కుదరదు ‘సిటీలో అనేక మంది వాహనచోదకులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. దీన్ని దగ్గర పెట్టుకుని ఎవరికి వారు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి తనంతట తానుగా వాహనం నడుపకూడదు. ఓ వ్యాలిడ్ లైసెన్స్ కలిగిన వారి పర్యవేక్షణలోనే నడపాలి. ద్విచక్ర వాహనమైతే లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వెనుక, తేలికపాటి వాహనమైతే ఆ వాహనంలో వ్యాలిడ్ లైసెన్స్ హోల్డర్ ఉండాల్సింది. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వాహనాలకు కచ్చితంగా ‘ఎల్’ బోర్డ్ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా అది లైసెన్స్ లేకుండా వాహనం నడపటంతో సమానమే’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
షాకింగ్: జైలుకు నిప్పు, 150మంది ఖైదీలు పరారీ
రియోడిజనిరో: బ్రెజిల్ లో మరోషాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. సావోపోలో రాష్ట్రంలోని బౌరు జైలులో ఖైదీలు రెచ్చిపోయారు. ఖైదీల అంతర్గత పోరు ఆవరణలో బీభత్సం సృష్టించింది. ఖైదీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దీంతో జైలు లో కొంత భాగానికి నిప్పుపెట్టారు. అనంతరం జైలు గోడల్ని బద్దలు కొట్టి కనీసం 150మంది ఖైదీలు పారిపోయారు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో జైళ్లలో హింసాత్మక సంఘటనలకు దీనికి ఎలాంటి సంబంధంలేదని మిలటరీ పోలీస్ అధికారులు ప్రకటించారు. కఠినమైన క్రమశిక్షణ మూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారిలో 100 మంది తిరిగి పట్టుకున్నట్టు జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేశంలోని జైళ్లలో అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి. వీటిలో130 మందికిపైగా ఖైదీలు హత్యకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనల్లో అధికారుల ఆరోపణలను పరిశీలకులు వ్యతిరేకించారు. జైళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంవలనే తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయని విమర్శిస్తున్నారు. కాగా బ్రెజిల్ లోని ఇతర జైళ్లతో పోలిస్తే సంఖ్య పరంగా బౌరు జైల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా వార్తా సంస్థ ఏజెన్శియా బ్రసిల్ ప్రకారం, బౌరు జైలును 1,124 అనువుగా రూపొందించగా 1,427 ఖైదీలు ప్రస్తుతం ఉన్నారు. -
ఇన్విజిలేషన్‌లో నిర్లక్ష్యం వహిస్తే జైలుకే!
పదో తరగతి పరీక్షల్లో అమలుచేస్తూ ప్రభుత్వ ఆదేశాలు నిర్లక్ష్యంగా ఉండే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు.. రూ.5 వేల నుంచి లక్ష జరిమానా 1997 నాటి ఉత్తర్వులు.. ఇప్పుడు కచ్చితంగా అమలుకు నిర్ణయం పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేసేందుకు సదుపాయాలు కరువు ఇలాగైతే ఇన్విజిలేషన్ విధులు చేయబోమంటున్న ఉపాధ్యాయులు సాక్షి, హైదరాబాద్: పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక జైలుశిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు జరి మానా కూడా విధించనుంది. ఈ మేరకు 1997 నాటి యాక్ట్ 25, సెక్షన్ 10లోని నిబంధనలను పదో తరగతి వార్షిక పరీక్షల్లో కచ్చితంగా అమలు చేయాలంటూ సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా విద్యాధికారుల (డీఈవోల)ను ఆదేశించింది. దాని ప్రకారం నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లకు 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉండే డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు తెలపడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ఇన్విజిలేషన్ చేసేందుకు 31 వేల మంది మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11,478 పాఠశాలలకు చెందిన దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,600 వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభా గం చర్యలు చేపట్టింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో 10 మంది చొప్పున 26 వేల మంది ఇన్విజిలేటర్లు, 5 వేలకు పైగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అవసరం. మొత్తంగా పరీక్ష కేంద్రాల్లో 31 వేల మంది టీచర్లు పనిచేస్తారు. అయితే తాజాగా జారీ అయిన ఆదేశాలతో టీచర్లలో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేషన్ విధులకు హాజరైతే రోజుకు కేవలం రూ.22 ఇచ్చే విద్యాశాఖ... చాలా వరకు తమ తప్పు ఉండని వ్యవహారంలో కూడా కఠిన శిక్ష విధించాలని నిర్ణయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నా రు. కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేయడం, పరీక్ష విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత వేయడం వంటి చర్యలు చేపడుతున్నారని, అది తప్పుకాదని... కానీ టీచర్లపై క్రిమినల్ కేసుల నమోదు, జైలుశిక్ష, జరిమానాల వంటివి ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్విజిలేషన్ విధులే తమకు అవసరం లేదని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. ఎన్నెన్నో సమస్యలు.. పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పాఠశాలల్లో విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. ప్రత్యేక గదుల్లో బాలబాలికలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా అక్కడక్కడా బాలికలను ప్రత్యేక గదుల్లో మహిళా టీచర్లతో చెక్ చేయిస్తున్నా... బాలురను మాత్రం గేట్ వద్దే పైపైన తనిఖీ చేసి లోనికి పంపుతున్నారు. అక్కడ దొరకని విద్యార్థులు.. పరీక్ష హాల్లోకి స్క్వాడ్ వచ్చినపుడు చిట్టీలతో దొరికిపోయినా, పక్కవారి పేపర్లో చూసి రాస్తున్నా ఇన్విజిలేటర్లకు తంటాలు తప్పవు. ఇదే టీచర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా అవసరమైతే పరీక్షహాల్లో విద్యార్థులను ఇన్విజిలేటర్ తనిఖీ చేయాలనుకున్నా సమస్యలున్నాయి. మహిళా టీచర్ ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలురను, పురుష టీచర్ ఉంటే బాలికలను పూర్తిస్థాయిలో చెక్ చేయడం సాధ్యం కాదు. టీచర్లేమైనా హంతకులా? ‘‘ప్రభుత్వ నిర్ణయం టీచర్లలో మానసిక ఆందోళనకు దారితీస్తుంది. పరీక్ష సమయంలో విద్యార్థి అనుకోకుండా పక్కకు చూసినా సదరు ఇన్విజిలేటర్లు విద్యార్థులను భయాం దోళనలకు గురి చేసే ప్రమాదం ఉంటుంది. ఇది విద్యార్థికి కూడా నష్టదాయకం. ఈ విషయంలో శాఖాపరమైన చర్యలు చేపడితే తప్పులేదు. టీచర్లేమీ హంతకులు కాదు. జైలు శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన యాక్ట్ 25లోని సెక్షన్ 10లో ఉన్న నిబంధనలు తొలగించాలి..’’ – ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునశర్మ -
జైల్లో దారుణం.. 10 మంది హత్య
రియో డీజెనిరో: జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్‌లో 10 మంది హత్యకు గురయ్యారు. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డొ నార్టెలో గల అల్కాకుజ్ జైలులో జరిగిన ఈ పాశవిక ఘటనలో ముగ్గురు ఖైదీల తలలను ప్రత్యర్థులు వేరు చేశారని అధికారులు వెల్లడించారు. అల్కాకుజ్ జైలులో శనివారం మధ్యాహ్నం అల్లర్లు మొదలైనట్లు స్థానిక న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. కొంతమంది దుండగులు.. ప్రత్యర్థుల బ్యారక్‌లపై దాడి చేసి హతమార్చారని జైళ్ల కొఆర్డినేటర్ జెమిల్టన్ సిల్వా వెల్లడించారు. ఘటన జరిగిన జైలును పోలీసులు చుట్టుముట్టి అన్ని దారులను మూసివేసినట్లు తెలిపారు. జైలు లోపల ఆయుధాలతో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అల్కాకుజ్ జైలులో 620 మంది ఖైదీలను ఉంచడానికి సౌకర్యాలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 1000 మందికి పైగా ఖైదీలున్నారు. 2015 నవంబర్‌లో కూడా ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి. -
ఖైదీ నం.1
జైలు శిక్ష.. ఒక్కరోజే కొత్త అనుభూతినిస్తున్నసంగారెడ్డి పాత జైలు ♦ రూ. 500 కట్టి మీరూ బందీ కావొచ్చు ♦ నాలుగు గోడల మధ్య జీవితం ఉద్విగ్నం, దుర్భరం అంటున్న ‘ఖైదీలు’ ♦ గడచిన 8 నెలల్లో స్వీయబందీలైన 14 మంది సాక్షి, హైదరాబాద్ మనం ఫోన్‌కు ఖైదీలం. వాట్స్‌యాప్, ఫేస్బుక్, చాటింగ్.. ఒకటేమిటి ఫోన్ గీసిన గిరిలో బందీలం! చేతిలో ఫోన్ ఆడకపోతే ఆలోచన రాదు, అడుగు పడదు. అలాంటి ఫోన్ మనకు దూరమైతే..? ఆప్యాయంగా పలకరించే మనవాళ్లు కన్పించకుంటే..? ఊహించుకుంటేనే భయంకరం కదా..! మరి రోజులు.. నెలలు.. ఏళ్లు.. ఖైదీలు జైలు గోడల మధ్య ఎలా గడుపుతారు?? ఇదిగో ఇలా... ఆ నాలుగు గోడల మధ్య.. అది సంగారెడ్డి పాత జైలు. ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించారు. వారిలో కిషన్, ప్రవీణ్ న్యాయవాదులు. రవి కుమార్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని లోనికి తీసుకెళ్లారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీ యూనిఫామ్‌తో ఆ ముగ్గురు యువకులు బ్యారెక్స్‌లోకి వెళ్లారు. సినిమాల్లో చూడ్డమేగానీ జైలు గది ఎలా ఉంటుందో చూసిన అనుభవం లేదు. అందులో కాలుపెట్టగానే మనసులో ఒకింత తెలియని ఆందోళన. కానీ.. నిజం ఖైదీలం కాదుగా.. మరో 24 గంటల్లో విడుదలవుతాం కదా అన్న ఆలోచన మనసును తట్టడంతో మళ్లీ మామూలైపోయారు. రోజంతా జైల్లో గడిపారు. జీవితం అందించిన ఓ కొత్త పాఠాన్ని మదిలో పదిలపరుచుకున్నారు. ‘క్షణికావేశంలో కానీ, వ్యూహాత్మకంగా కానీ నేరం చేయొద్దు..’బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మౌనంగా ఎవరికివారు అనుకున్నమాట ఇది!! మీరూ ‘ఖైదు’కావొచ్చు... దేశంలో ఎక్కడా లేనట్టు సంగారెడ్డి పాత జైలు ఓ కొత్త అనుభూతిని పంచుతోంది. ఒకప్పుడు కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచిన ఈ జైలు ఇప్పుడు... ‘ఖైదీ అనుభవం’పంచుతోంది. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ఆలోచన నుంచి పుట్టిన ఓ కార్యక్రమం ‘ఖైదీ’లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. జైలు జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తిని స్వీయానుభవంగా మార్చుకోవాలనుకునేవారు ఓ రోజు అందులో అచ్చం ఖైదీలాగా ‘బందీ’కావచ్చు. ఇందుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం జూన్ 5న మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. గడచిన ఎనిమిది నెలల్లో 14 మంది ‘జైలు అనుభూతి’పొందారు. హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్–1 ప్రధానిగా ఉన్న సమయంలో 1796లో సంగారెడ్డిలో ఈ జైలు రూపుదిద్దుకుంది. తెలంగాణలో ఇదే అతి పురాతన జైలు. ఇప్పుడది చారిత్రక వారసత్వ కట్టడం. కంది సమీపంలో కొత్తగా నిర్మితమైన అధునాతన భవన సముదాయంలోకి జైలు తరలించటంతో ఇప్పుడిది మ్యూజియంగా మారింది. ‘ఖైదీ’లు ఏమంటున్నారంటే..? కొత్త కోణాన్ని పరిచయం చేసింది నాకు కోపం చాలా ఎక్కువ. చిరాకులో ఉన్నప్పుడు నియంత్రణ కోల్పోతా. ఆ సమయంలో ఆవేశం నా మనసు మాట విననివ్వదు. కానీ.. ఈ 24 గంటల ‘జైలు జీవితం’నా స్వభావానికి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఆవేశానికిలోనయ్యేలోపు మనసు నియంత్రణలోకి వస్తోంది. గొడవలకు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఆ ‘జైలు జీవితం’నాకు తారసపడొద్దు. అక్కడ ఒక్కో నిమిషం ఒక రోజుతో సమానం. జీవితంలో అంతకుమించిన దుర్భర ఘట్టం మరొకటి ఉండదేమో విజయ్‌కుమార్, మహారాష్ట్రలో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్(పుణె) బాబోయ్.. అదో సాహసం సాయంత్రం నుంచి ఉదయం వరకు ఎవరూ కనిపించరు. బ్యారెక్‌లో ఒంటరిగా గడపటం.. తలుచుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బయటకు పంపరు, మూత్రవిసర్జన చేయాలన్నా గదిలో ఓ మూలన సగం గోడతో ఉండే టాయిలెటే గతి. బోర్‌గా అనిపిస్తుంది.. తినాలనిపించదు.. నిద్ర సరిగా ఉండదు. కానీ అదో మంచి అనుభవాన్నిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కారణాలు వెతుక్కుంటాం, పరిష్కారం దిశగా చూస్తాం. ఇక్కడది కనిపిస్తుంది. – సామ్రాట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజల్లో ఆలోచన పుట్టించాలనే: వీకే సింగ్, డీజీ, తెలంగాణ జైళ్ల శాఖ కొందరికి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని విషయాలు బుర్రకెక్కవు. నేరం చేసి జైలుకు వెళ్తే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో స్వయంగా తెసుకుకునేందుకు చక్కటి అవకాశమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అండమాన్‌లోని పురాతన జైలును మ్యూజియంగా మార్చారు. తెలంగాణలో అతి పురాతన జైలు సంగారెడ్డి పాత జైలు. కొత్త భవనం కట్టాక పాతదాన్ని కూల్చకుండా మ్యూజియంగా మార్చాలనుకున్నాం. అందులో ఓ భాగాన్ని అందుకు కేటాయించాం. రెండో భాగాన్ని ‘జైలు అనుభూతి’కోసం వాడాలనుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోని పురాతన జైళ్లను కూడా ఇలా మార్చాలనే యోచన అధికారుల్లో వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది ఇప్పటివరకు 14 మంది ‘ఫీల్ ది జైల్’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. వేరే రాష్ట్రాల నుంచి యువకులు ఫోన్ చేసి తేదీలు బుక్ చేసుకుంటున్నారు. వచ్చినవారు మంచి అనుభూతితో వెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం అధ్యయనంలో భాగంగా చెన్నై నుంచి ఓ యువతి వచ్చింది. ఆమెకు రక్షణగా ఇద్దరు మహిళా గార్డులను వినియోగించాం. ఎలాంటి భయం లేకుండా జైలు జీవితాన్ని గడిపి వెళ్లొచ్చు. – జి.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా సబ్‌జైళ్ల అధికారి బంగ్లా అధికారుల సందర్శన ఈ జైలును ఇటీవల బంగ్లాదేశ్ అధికారులు సందర్శించారు. ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి ఢాకాలోని పురాతన జైలును కూడా ఇలాగే తీర్చి దిద్దాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ దేశ ప్రధాని వద్దకు ఈ ప్రతిపాదన వెళ్లింది. ఆ దేశంలో నేరాల సంఖ్య ఎక్కువే. ప్రజల్లో మార్పు కోసం ఈ ఆలోచన భేషుగ్గా ఉపయోగపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. అలాగే వారం క్రితం తీహార్ జైలు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఇది మంచి ఆలోచన అంటూ కితాబిచ్చారు. ఇదీ టైం టేబుల్.. ఉదయం 6: బ్యారక్ తెరిచి ‘ఖైదీ’ని బయటకు వదులుతారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాసేపు యోగా చేయించి గార్డెనింగ్ పని అప్పగిస్తారు. 7: టీ ఇస్తారు. తర్వాత ‘విద్యాదానం’పథకంలో భాగంగా చదువు నేర్పిస్తారు. అక్షరాస్యులైతే పుస్తకాలిచ్చి చదువుకోమంటారు. 8: బ్రేక్‌ఫాస్ట్. తర్వాత కాసేపు స్వేచ్ఛగా విహరించే అవకాశం. 11: మధ్యాహ్న భోజనం. అనంతరం విశ్రాంతి మధ్యాహ్నం 2: టీ సాయత్రం 5: రాత్రి భోజనం 6: బ్యారెక్‌లోకి పంపి తాళం వేస్తారు బ్రేక్‌ఫాస్ట్ ఇలా.. సోమవారం: చపాతి, ఆలూ కుర్మా; మంగళవారం: పొంగల్; బుధ: చపాతీ కుర్మా; గురు: ఉప్మా; శుక్ర: పొంగల్; శని: చపాతీ కుర్మా; ఆది: పులిహోర లంచ్: అన్నం పప్పు, పచ్చడి, రసం, బుధవారం ఉడికించిన గుడ్డు, ఆదివారం మాంసాహారం (తొలి ఆదివారం మటన్, మిగతా మూడు ఆదివారాలు చికెన్) డిన్నర్: కూర, పెరుగుతో అన్నం నిబంధనలెన్నో... ఈ జైల్లో గడపాలనుకునేవారికి తల్లిదండ్రుల/కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తప్పనిసరి. వారితో ఫోన్లో మాట్లాడించాకే అనుమతిస్తారు. ఆ 24 గంటలు ఫోన్ అనుమతి ఉండదు. ఎలాంటి వస్తువులు లోనికి అనుమతించరు. పుస్తకాలు తెచ్చుకోవచ్చు. కానీ కమ్యూనిస్టు భావజాలంతో కూడినవి ఉంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వచ్చినవారి మానసిక స్థితిని గమనించాకే అనుమతి ఇస్తారు. మైనర్లను అనుమతించరు. -
తోడికోడలు హత్య కేసులో జీవిత ఖైదు, జరిమానా
కర్నూలు(లీగల్) : డబ్బు కోసం తోడు కోడలు యశోదమ్మ(47)ను హత్య చేసిన కేసులో ఓ మహిళకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా ఆరవ అదనపు కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూపాడు గ్రామానికి చెందిన కె.యశోదమ్మ(47) పొదుపులక్ష్మి గ్రూపు సభ్యురాలిగా ఉండేది. గద్వాల మండలం మొల్ల చెరువు గ్రామానికి చెందిన తోడి కోడలు గ్రేసమ్మ అప్పుడప్పుడు యశోదమ్మ ఇంటికి వచ్చి ఉంటుండేది. యశోదమ్మ ఇతరులకు అప్పులు ఇస్తుండటం, అభరణాలతోపాటు కర్నూలులో ప్లాటు ఉన్నట్లు తెలుసుకుంది. 2014 డిసెంబర్ 28న ఇద్దరు పొదుపులక్ష్మి గ్రూపు సమావేశానికి వెళ్లి డబ్బు తెచ్చుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో యశోదమ్మను గ్రేసమ్మ గొంతు నులిమి చంపేసింది. రెండు, మూడు రోజులు ఇంట్లో ఉండి 31వ తేదీన బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లిపోయింది. ఇంట్లో శవం కుళ్లిన వాసన వస్తుండడంతో వరుసకు తమ్ముడైన జేమ్స్ వెళ్లి చూడగా విషయం బయటపడింది. అతని ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం గ్రేసమ్మ మరో వ్యక్తి వేణుగోపాలాచారితో కలిసి హత్య చేసినట్లు ఇప్పుకుంది. దీంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొదటి నిందితురాలైన గ్రేసమ్మ అలియాస్ రాణిపై హత్యానేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు. 2వ నిందితుడిపై సాక్ష్యాలు లేకపోవడంతో కేసు కొట్టివేశారు. -
ఎనిమిది మందికి యావజ్జీవ శిక్ష
- హత్య కేసులో ఆదోని కోర్టు సంచలన తీర్పు - ముద్దాయిలు అందరూ దాయాదులే ఆదోని/రూరల్ : ఆదోని 2వ అదనపు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఆస్పరి మండలంలోని అట్టెకల్లు గ్రామానికి చెందిన బోయ జల్లి బుడుబుడుకుల ఆంజినేయ(58) హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. ఆదోని కోర్టులో వ్యక్తి హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష విధించడం ఇదే ప్రథమం. డీఎస్సీ కొల్లి శ్రీనివాసరావు ఇస్వి పోలీసు స్టేషనులో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వివరించారు. 2011 ఆగస్టు 17న సాయంత్రం అదే గ్రామానికి చెందిన బోయ జల్లి బుడుబుడుకుల ఆంజినేయ(58) హత్యకు గురి అయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. హతుడి సోదరుడు కౌలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పరి పోలీసులు అదే గ్రామానికి చెందిన బోయ పత్తికొండ జయరాముడు, లక్ష్మన్న, నర్సన్న, చిన్న నరసన్న, నౌనెపాటి, లింగన్న, పెద్ద సంజన్న, చిన్న సంజన్నపై కేసు నమోదు చేశారు. వీరంతా అన్నదమ్ముల సంతానం. అరెస్ట్ తరువాత నిందితులు బెయిలుపై విడుదల అయ్యారు. ఐదు సంవత్సరాలకు పైగా కోర్టులో కేసు విచారణ జరిగింది. బాధితుల తరుపున పీపీ రఫత్ వాదన వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.400 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కనువిప్పు కావాలి ఆంజినేయ హత్య కేసు తీర్పు అసాంఘిక శక్తులు, హత్యలకు పాల్పడే వారికి కనువిప్పు కావాలని డీఎస్సీ కొల్లి శ్రీనివాసరావు అన్నారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు జైలు పాలు కావడంతో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల పాలయ్యాయని అన్నారు. నేరం చేసే ముందు ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచిస్తే వెంటనే మారిపోతారని పేర్కొన్నారు. కేసును సాక్షాధారాలతో కోర్టులో రుజువు చేసిన ఆస్పరి పోలీసులను ఆయన అభినందించారు. ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే పోలీసులు, కోర్టును ఆశ్రయించాలే తప్ప ప్రతీకారాలకు పోకూడదని సూచించారు. అందరూ వయస్సు పైబడిన వారే శిక్షకు గురైన వారిలో అందరూ వయస్సు పైబడిన వారే. అన్నదమ్ముల సంతానమే వీరిలో చిన్న నరసన్న, నర్సన్న .. పెద్ద సంజన్న, చిన్న సంజన్న.. నౌనెపాటి, లింగన్న స్వయానా అన్నదమ్ములు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వారు జైలు పాలు కావడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది. చిచ్చురేపిన కుందేలు వేట దాదాపు 30 ఏళ్ల క్రితం కుందేలు వేటలో వచ్చిన విభేదాలే చిలికి చిలికి గాలి వానలా మారాయి. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాయి. ప్రతీకారాలకు ఇరు వర్గాల నుంచి ముగ్గురు హత్యకు గురి కాగా ఎనిమిది మంది జైలు పాలయ్యారు. ప్రతీకార జ్వాలలు కుటుంబాలను దహించి వేస్తాయని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. -
ఖైదీల ఘర్షణ: 60 మంది మృతి
బ్రెజిల్ లోని ఓ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 60 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మనాస్ లోని అమెజాన్ జంగిల్ నగరంలో గల జైలులో రెండు డ్రగ్ గ్యాంగ్ ల మధ్య రేగిన వాగ్వాదమే ఇందుకు కారణమని తెలిసింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ భద్రతా అధికారి చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారని తెలిపారు. కొందరు ప్రత్యర్ధులను చంపిన తర్వాత వారి శవాలను జైలు గోడ అవతలికి విసిరేశారని చెప్పారు. మరికొందరు జైల్లో నుంచి తప్పించుకుపోయారని వెల్లడించారు. సోమవారం తెల్లవారుజాము సమయానికి జైల్లో అతికష్టం మీద శాంతియుత వాతావరణం నెలకొల్పినట్లు తెలిపారు. అయితే, బ్రెజిల్ జైళ్ల విధానాన్ని పలు అంతర్జాతీయ సంస్ధలు విమర్శిస్తూ వస్తున్నాయి. బ్రెజిల్ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉంటారు. దీంతో తరచుగా అక్కడి జైళ్లలో గొడవలు జరుగుతుంటాయి. -
నేరం చేసిన 30 ఏళ్లకు తీర్పు
అహ్మదాబాద్: నేరం చేయకున్నా ఒక్కోసారి శీఘ్రంగా శిక్షలకు గురయ్యేవారు కొందరైతే.. నేరం చేసినప్పటికీ దశాబ్దాలు గడిచినా ఆ శిక్షకు గురవ్వకుండా దర్జాగా తిరిగే వ్యక్తులు కొంతమంది. న్యాయవ్యవస్థను తప్పుబట్టలేంగానీ, వారి వద్ద ఉన్న డబ్బు, న్యాయవ్యవస్థలోని లొసుగులు ఉపయోగించుకొని ఇలాంటివి చేస్తుంటారు. కానీ, చివరకు శిక్ష మాత్రం పడుతుంది. కానీ, ఆలోగా జరగాల్సినవి జరిగిపోతాయి. సరిగ్గా గుజరాత్లో ఓ కేసు విషయంలో ఇదే జరిగింది. కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషులకు శిక్ష విధించే సరికి అందులో ఒకరు ఇప్పటికే చనిపోయి ఉండగా మరొకరు నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. అది కూడా మూడు దశాబ్దాల తర్వాత. అంటే ముప్పయ్యేళ్ల తర్వాతన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో ప్రకాశ్ త్రివేది, లక్ష్మీచంద్ పర్మార్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిద్దరు 1982 నుంచి 1984 మధ్య పోస్ట్మేన్లుగా పనిచేశారు. ఆ సమయంలో మనీ ఆర్డర్లు, పోస్టల్ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్టులు, చెక్కులు దొంగిలించడమే కాకుండా నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అలా దొంగిలించిన సొమ్మంతా ఆ ఖాతాల్లో జమచేశారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో 1986లో కేసు ఫైల్ చేసిన పోలీసులు వారిని అరెస్టు కోర్టుకు అప్పగించగా వారిని జైలులో వేసింది. అయితే, వారు బెయిల్ సహాయంతో బయటకొచ్చి హైకోర్టులో సవాల్ చేశారు. చివరకు ఈ కేసును సీబీఐ విచారించి వారు నేరం చేసినట్లు కోర్టుకు ఆధారాలతో సహా అందించింది. దీంతో కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి నాలుగేళ్లు జైలు జీవితం గడపాలని ఆదేశించింది. అయితే, లక్ష్మీచంద్ పర్మార్ ఇప్పటికే చనిపోగా నాలుగు వారాల్లోగా ప్రకాశ్ త్రివేదిని కోర్టుకు తీసుకురావాలని పోలీసులకు ఆదేశించింది. -
పొట్టేలు దొంగతనం కేసులో వ్యక్తికి జైలు
బొమ్మనహళ్ : పొట్టేలు దొంగతనం కేసులో మండల పరిధిలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన డోనేకల్ గంగన్నకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. గంగన్న పొట్టేళ్లను దొంగతనం చేసినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 26న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్షను జడ్జి అప్పలస్వామి ఖరారు చేశారు. -
అదనపు కట్నం కేసులో 8 ఏళ్ల జైలు
చిలమత్తూరు : అదనపు కట్నం వేధింపులతోపాటు భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పరిగి మండలం కాలువపల్లికి చెందిన వి.హరికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ జమాల్ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీలోని కంబాలపల్లికి చెందిన అలివేలమ్మతో హరికి 2013లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని అలివేలమ్మ 2014 డిసెంబర్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి కోర్టు అభియోగాలు రుజువు కావడంతో హరికి ఎనిమిదేâýæ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
ముగ్గురు దొంగలపై పీడీ యాక్ట్
రాంగోపాల్‌పేట్: రైల్వే స్టేషనలో ప్రయాణికుల దృష్టి మరల్చి విలువైన లగేజీతో పాటు నగదును కొట్టేస్తున్న ఓ ముఠాలోని ముగ్గురు నిందితులపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ (25), సరోజ్ కుమార్ (19), రవిశంకర్ కుమార్ (24) నగరానికి వలస వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు గత కొంత కాలంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషనకు వచ్చి రైల్వే టికెట్ కన్ఫమ్ కాని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను టార్గెట్ చేసుకునేవారు. వారి దగ్గరకు వెళ్లి ఒకడు టీసీగా పరిచయం చేసుకుని టికెట్ కన్ఫమ్ చేయిస్తామని నమ్మించి వారి లగేజీ, డబ్బుతో ఉడాయించే వాళ్లు. గోపాలపురం పోలీస్ స్టేషన పరిధిలో రెండు, చిలకలగూడ పోలీస్ స్టేషన పరిధిలో ఒక కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితులను ఈ నెల 5న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారిపై పీడీ ఆక్ట్ నమోదు చేయాలని సీపీ దృష్టికి తీసుకుని వెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. -
తాగి నడిపితే జైలుకే..
కరీంనగర్ క్రైం : మద్యంతాగి వాహనాలు నడిపితే జైలు కు పంపిస్తామని పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి హె చ్చరించారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు వారి కు టుంబసభ్యుల సమక్షంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైందని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. మద్యం తాగి అజాగ్రత్తగా వాహనాలు నడిపి కుటుంబాలను వీధిపాలు చేయొద్దన్నారు. తమతోపాటు రోడ్డుపై ఎదుటివారికి సైతం ఇబ్బందులు సృష్టించొద్దని సూచించారు. ఇక నుంచి రోజూ డ్రంకెన్‌డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సారి పట్టుబడితే జరి మానా, రెండోసారి లెసైన్స్ద్ద్రుతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించా రు. కుటుంబ సభ్యులు సైతం గమనించి తగిన జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపేందుకే ఈ కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని, వేరే ఉద్దేశ్యం లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగితే కఠిన వ్యవహరిస్తామన్నారు. డ్రంకెన్‌డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌కు సంబంధించిన డాటాబేస్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌పై మందుబాబుల కుటుంబికులు హర్షం వ్యక్తం చేశారు. మరోసారి తాగం మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నారుు. మందుతాగడం ద్వారా అందరిముందు చులకన కావడమే కాకుండా ఇంత ఇబ్బందులంటాయని తెలియదు. ఇక నుంచి మద్యం తాగను. ఒక వేళ తాగినా ఇంటిలోనే ఉంటాము. - చంద్రశేఖర్, మానకొండూరు ప్రచారం చేస్తాం గత రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ చాలా ఇబ్బందిగా ఉంది. మరోసారి తాగము. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న వైనంపై ప్రచారం చేస్తాం. ఇక నుంచి పోలీసులకు సహకరిస్తాం. మద్యం తాగి వాహనాలు నడపము. - సురేష్, కేశవపట్నం -
బ్యాంకు ఉద్యోగికి జైలుశిక్ష
వెలుగోడు: వేల్పనూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పని చేసిన భాస్కర్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. వేల్పనూరు స్టేట్ బ్యాంక్‌లో పొదుపు లక్ష్మి గ్రూప్‌లకు సంబంధించి 2013లో రూ.1.40 లక్షలు గోల్మాల్ జరిగింది. ఈ మేరకు పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులు, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు క్యాషియర్ భాస్కర్ డబ్బును స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆత్మకూరు కోర్టులో నిందితుడిని హాజరు పరుచగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ తీర్పు ఇచ్చారు. -
మహిళ మృతి కేసులో భర్త, అత్త, ఆడబిడ్డకు పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, మహిళ మరణానికి కారకులైన నేరం రుజు వు కావడంతో చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన నేరస్తులు మ్యాదర రమేష్(భర్త), మ్యాద ర సౌందర్య(అత్త), పోతుల వసంత(ఆడబిడ్డ)కు పదేళ్ల జైలుశిక్ష, రూ.8000 చొప్పున జరిమానా విధి స్తూ సోమవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాల్వ నర్సయ్య కూతురు సుకన్యకు మ్యాదర రమేష్‌తో 2013 జూన్ 2న వివాహమైంది. పెళ్లి సమయంలో రమేష్‌కు రూ.1.30 లక్షల నగదు, బంగారం వస్తు సామగ్రి కట్నకానుకలుగా ఒప్పుకున్నారు. అందులో రూ.50 వేలు తర్వాత ఇస్తామని చెప్పారు.కొద్దికాలం ఇరువురు బాగానే ఉన్నారు. తర్వాత ఇవ్వాల్సిన రూ.50 వేలతోపాటు అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు, ఆడబిడ్డలు సుకన్యను వేధించసాగారు. ఈ క్రమం లో 2015 జూలై1న అపస్మారక స్థితిలో ఉన్న సుకన్యను అంబులెన్ స ద్వారా చిట్యాల దవాఖానకు తీసుకొచ్చారు. అప్పటికే సుకన్య మృతిచెందిందని డాక్టర్ తెలిపారు. అత్తారింటి వారే వేధించి విషమిచ్చి తన కూతురిని చంపారని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సుకన్య మరణానికి కారణం భర్త రమేష్, అత్త సౌందర్య, ఆడబిడ్డ వసంతేనని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో ఐపీసీ సెక్షన్ 304 (బి) కింద నేరస్తులకు పది సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమాన విధిస్తూ తీర్పును జడ్జి నర్సిం హులు వెల్లడించారు. అలాగే వివాహితను వేధింపులకు గురిచేసినందున ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద మూడేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమాన, కట్నం కోసం పీడించినందుకుగాను వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ఆరు మాసాల జైలుశిక్ష, రూ.500 చొప్పున జరిమాన విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని, గతంలో గడిపిన జైలుశిక్ష కాలాన్ని మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును ప్రాసిక్యూషన్ తరఫున పీపీ విజయాదేవి వాదించగా లైజన్ ఆఫీసర్ వి.భద్రునాయక్ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.సుభాష్ కోర్టులో ప్రవేశపెట్టారు. -
సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!
సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముకేశ్‌కు జైలు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహాన్ని రమ్మంటూ హల్చల్ చేసిన ముకేశ్‌కు కోర్టు శనివారం జైలు శిక్ష ఖరారు చేసింది. ఎర్రమంజిల్ కోర్టు న్యాయమూర్తి.. నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. వివరాలను దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బిహార్ ప్రాంతానికి చెందిన ముకేశ్(35) బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఈ ఏడాది మే 22న జూపార్కుకు వచ్చి సింహాల ఎన్క్లోజర్ను చూస్తూ మద్యం మత్తులో అందులోకి దూకాడు. జూ సిబ్బంది పాపయ్య, బషీర్, సింగ్, సారుు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివలు చాకచాక్యంగా వ్యవహరిస్తూ సింహాల దృష్టి వేరే వైపు మళ్లించి ముకేశ్‌ను రక్షించారు. పోలీసులు ముఖేశ్‌పై ఐపీసీ 448, 38 సెక్షన్లతో పాటు అటవీ యాక్ట్ 1972 చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న అతనికి న్యాయమూర్తి శనివారం శిక్ష ఖరారు చేశారు. -
మళ్లీ నిర్మిస్తే జైలుకే
కూల్చివేసిన కట్టడాలను తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు * మంగళవారం ఒక్కరోజే 204 నిర్మాణాల కూల్చివేత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాలాలపై కట్టడాలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. కూల్చిన వాటిని తిరిగి నిర్మిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడానికి సైతం వెనుకాడవద్దని నిర్ణయించింది. అంతేగాకుండా కూల్చివేతల ఖర్చును సైతం వారి నుంచి వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని 669 సెక్షన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఒత్తిళ్లకు తలొగ్గవద్దంటూ ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో మంగళవారం మరింత ముమ్మరం చేశారు. నాలాలపై నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలతోపాటు శిథిలమైన భవనాలను కూల్చివేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 204 నిర్మాణాలను కూల్చివేశారు. ఆగని అక్రమ నిర్మాణాలు... అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ(బీఆర్ఎస్) కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కూడా భారీయెత్తున అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చిం ది. దీంతో అధికారులు గత జనవరిలో సర్వే జరిపించారు. గతేడాది అక్టోబర్ 28 నాటికి నిర్మాణమై ఉన్న వాటికి మాత్రమే బీఆర్ఎస్ వర్తిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా 583 అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటిలో దాదాపు 460 నిర్మాణాలను కూల్చివేశారు కూడా. అయితే ఆ తరువాత కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయి. దీంతో భవిష్యత్తులో ఎవరూ అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా ఉండేందుకుగాను జీహెచ్ఎంసీ యాక్ట్ 669ను ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయడంతో పాటు నిర్మించుకుంటున్నవారిని అరెస్టు చేయవచ్చని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపా రు. ఇప్పుడు కూల్చివేస్తున్న నిర్మాణాలను ఎవరైనా తిరిగి నిర్మిస్తే ఈ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కూల్చివేతల వ్యయాన్ని సైతం వారి నుంచే రాబడతామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులెవరైనా అక్రమాలను ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం కనబరిచే అధికారులు, సిబ్బందిని ఏకంగా సర్వీసు నుంచే తొలగిం చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో త్వరలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుండడంతో కఠిన చర్యలకు అవకాశముంటుందని భావిస్తున్నారు. వేగంగా కూల్చివేతలు... నాలాలపై ఆక్రమణల తొలగింపునకు బెంగళూరు విధానాన్ని అనుసరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. వేగంలో మాత్రం ఆ నగరాన్ని మించిపోయారు. బెంగళూరులో నాలాలపై 1,913 నిర్మాణాల్ని గుర్తించి నెలరోజుల్లో 200 నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ ఒక్కరోజులోనే 204 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘ఇవాళ చేసింది గుడ్జాబ్.. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగండి..’ అని అధికారులకు మెసేజ్ పంపారు. ‘బడా’ అక్రమాలను వదిలేస్తున్నారు? * రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బడాబాబుల జోలికి వెళ్లకుండా కేవలం నిరుపేదలకు చెందిన నిర్మాణాలనే కూలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓల్డ్ కర్నూల్ రోడ్డుపై ఫంక్షన్‌హాళ్లను నిర్మించి వరద నీరు వెళ్లకుండా అడ్డుకున్న వారి నిర్మాణాలను వదిలేసి.. తమపై ప్రతాపం చూపుతున్నారని వాపోయారు. * బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని అంతగానికుంట చెరువు (తాజ్‌బంజారా లేక్)ను ఆక్రమించి నాలా వెంబడి 600 గజాల స్థలంలో ప్రైవేట్ వ్యక్తి పార్కు నిర్మించుకున్నట్లు గుర్తించారు. * కూకట్పల్లి సర్కిల్లోని హైదర్‌నగర్ బృందావన్ కాలనీలో ఇంటి నిర్మాణానికి మాత్రం అనుమతి పొంది మూడు షట్టర్లు వేశారు.వాటిని పూర్తిగా కూల్చకుండా తూతూమంత్రంగా సగం కూల్చి వెళ్లిపోయారు. * బేగంపేట్ అల్లంతోట బావి ప్రాంతంలో నాలాను ఆక్రమించి వేసుకున్న దాదాపు 40 గుడిసెలను అధికారులు నేలమట్టం చేశారు. అధికార యంత్రాంగం భారీగా అక్కడికి చేరుకోవడంతో గుడిసెల్లో నివాసం ఉంటున్నవారు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు కూల్చివేశారు. * సోమవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయనగర్‌లో చేపడుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపును మూసాపేట డివిజన్ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ నిలిపివేయగా వెళ్లిపోరుున అధికారులు.. మంగళవా రం అటువైపు రాకపోవడం గమనార్హం. కోర్టుల్లో 6 వేల కేసులు జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న కేసులపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సెల్స్‌తో మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. మొత్తం గా దాదాపు 6 వేల కోర్టు కేసులు ఉన్నాయని వారు ఈ సందర్భంగా వివరించారు. ఫిర్యాదులే ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసే వారికి సీఎం కేసీఆర్ రూ.10వేల నజరానా ప్రకటించడంతో జీహెచ్ఎంసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు రోజుల్లోనే 118 ఫిర్యాదులు వచ్చినా.. నజరానాకు సంబంధించి విధివిధానాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఒకే అక్రమ నిర్మాణం గురించి ఎక్కువ మంది తెలియజేస్తే బహుమతిని ఎవరికి ఇవ్వాలి, అందరికీ పంచి ఇవ్వాలా... బహుమతుల మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుందా, జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఇవ్వాలా అన్న విషయాలపై స్పష్టత కోరనున్నారు. అయితే ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాలకు ఇది వర్తించదని.. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలకు వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ గుర్తించిన అక్రమ నిర్మాణాలేవో ప్రజలకు తెలియనందున ఆ వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపర్చాలని అధికారులు యోచిస్తున్నారు. -
ఉగ్రవాది ఒబేద్ ఉర్ రెహ్మాన్‌కు ఐదేళ్ల శిక్ష
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న ప్రముఖుల్ని హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన ఉగ్రవాది ఒబేద్ ఉర్ రెహ్మాన్‌కు బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇతడి స్వస్థలం పాతబస్తీ ఉప్పుగూడలోని గుల్షన్‌కాలనీ. 2012లో ఈ కుట్రను ఛేదించిన బెంగళూర్ పోలీసులు ఒబేద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో 18 మందిని అరెస్టు చేశారు. ఆపై ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. వీరిలో 13 మందిని దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం ఈ నెల 16నే తీర్పు వెలువరించినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మగ్బూల్ కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే ఇతడికి మహ్మద్ అక్రమ్‌తో పరిచయమైంది. అప్పటికే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అక్రమ్ పాస్‌పోర్ట్ సంపాదించుకున్నా... వీసా లభించలేదు. ఈ విషయం మగ్బూల్కు చెప్పడంతో హైదరాబాద్ వెళ్లి ప్రయత్నాలు చేయమని సలహా ఇచ్చాడు. వీసా దొరికే వరకు ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం, చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పాడు. నగరానికి చెందిన కొందరి సహాయం తీసుకోమని వారి పేరు, వివరాలు అందించాడు. ఈ రకంగా అక్రమ్ 2011లో సిటీకి వచ్చాడు. సౌదీ అరేబియాకు వీసా ప్రయత్నాల్లో ఉంటూనే సైదాబాద్ ప్రాంతంలో జ్యూస్ సెంటర్ నిర్వహించాడు. ఒబేద్ సమీప బంధువు మక్సూద్ సైతం నాందేడ్‌కు చెందినవాడే కావడంతో ఇతడికి మగ్బూల్‌తో పరిచయం ఉంది. దీంతో సైదాబాద్‌లో జ్యూస్ సెంటర్ నిర్వహిస్తున్న అక్రమ్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మక్సూద్ ఒబేద్‌ను కోరాడు. ఇలా ఒబేద్, అక్రమ్ల మధ్య పరిచయం పెరిగింది. అక్రమ్ దాదాపు మూడు నెలల పాటు ఈ వ్యాపారం చేసినా ఇక్కడున్న రోజుల్లో ఎప్పుడూ ఉగ్రవాద భావాలు ప్రదర్శించలేదు. బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఎట్టకేలకు వీసా లభించడంతో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఓ పాకిస్తానీతో ఏర్పడిన పరిచయం ఫలితంగా ఉగ్రవాద బాటపట్టాడు. ఆ తర్వాత ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఒబేద్‌ను కూడా ట్రాప్ చేసి తన దారిలోకి నడిపించాడు. సిటీకి చెందిన ముగ్గురు ప్రముఖుల్ని టార్గెట్ చేసిన ఈ మాడ్యుల్ వారి వివరాలను ఒబేద్ ద్వారా సేకరించింది. ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఒబేద్ సహా మొత్తం 18 మందని అరెస్టు చేయగా... 13 మందిపై నేరం రుజువైంది. ఎన్ఐఏ కోర్టు ఒబేద్‌కు వివిధ సెక్షన్ల కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. -
డ్రైవర్‌కు జైలు శిక్ష
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా) : అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలం అల్లాపల్లికి చెందిన కె.మునెప్ప(40) మరణానికి కారకుడైన కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా దిగవూరు పంచాయతీ కాగితి గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్ ఎస్.మహబూబ్‌బాషాకు చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టు గురువారం శిక్ష వేసింది. ఏపీపీ రామకృష్ణ, మదనపల్లె రూరల్ ఎస్ఐ రవిప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం...2011లో మదనపల్లె నుంచి మహబూబ్‌బాషా టెంపోను నడుపుకుంటూ కర్ణాటకకు బయలుదేరాడు. అదే సమయంలో అల్లాపల్లెకు చెందిన మునెప్ప వెంకటేశ్వరస్వామి దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. మార్గమధ్యంలోని బెంగళూరు రోడ్డులో గల చిప్పిలిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో ఢీకొని అతను అక్కడికక్కడే మరణించారు. అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితునికి మదనపల్లె ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మోహనరావు మూడు నెలల సాధారణ జైలుతో పాటు రూ.3 వేలు జరిమానా విధిస్తూ తీర్పువెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరపున రామకృష్ణ వాదించారు. -
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
భువనగిరి అర్బన్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి అదనపు సెషన్స్ జడ్జి సిపి.విందేశ్వరి శుక్రవారం తీర్పు చెప్పినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూలిమామిడి శశిధర్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. భూతగాదాల నేపథ్యంలో 2012వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన గంగదేవి పర్వతాలు దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్య, మేకల యాదయ్య, గంగదేవి చంద్రయ్య, కంటి బుచ్చయ్య, మేకల పర్వతాలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి పోచంపల్లి ఎస్ఐ అర్జునయ్య నిందితులపై కేసు నమోదు చేశారు. తదనంతరం చౌటుప్పల్ సీఐ తిరుపతన్న నేర అభియోగపత్రాలను కోర్టులో దాఖలు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్యపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.10 జరిమానా విధించినట్లు తెలిపారు. -
నిరోధ్లో మొబైల్ పెట్టి పావురం వీపుపై కట్టి..
అది తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలు. ఎత్తయిన గోడ.. దానికి కరెంటు సరఫరాతో ఫెన్సింగ్.. జైలు లోపలాబయటా కాపలాదారులు. ఓ రకంగా చెప్పాలంటే చీమ కూడా లోపలికి దూరనివ్వనింత పటిష్టమైన భద్రతగల విశాలమైన జైలు ప్రాంగణం. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో ఉండేవాళ్లంతా ఏదో ఒక నేరాల్లో ఉన్న ఖైదీలే ముఖ్యంగా బందిపోట్లు.. డ్రగ్స్ బారిన పడిన వారు.. లైంగిక దాడులకు దిగేవారు. సుదీర్ఘకాలం జైలు శిక్షపడితేనే ఖైదీలను ఈ జైలుకు తరలిస్తారు. అలాంటి భద్రతగల జైలులోని ఖైదీకి సహాయం చేసేందుకు ఓ పావురం ఎగిరొచ్చింది. వీపుపై ఓ మొబైల్ ఫోన్.. అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. అయితే, దాని ప్రయత్నానికి మధ్యలోనే గండిపడింది. జైలు అధికారుల కంటపడింది. దీంతో ఆ పావురాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న జైలు గార్డులు అవాక్కయ్యారు. చాలా పకడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్‌ను కలిపి అవి వర్షానికి తడవకుండా నిరోధ్లో పెట్టి ప్యాక్ చేసి ఆ పావురం వీపునకు కట్టి పంపించిన తీరుతో ఖిన్నులయ్యారు. పావురానికి అమర్చిన ఆ ప్యాకెట్‌ను స్మాల్ నెయిల్ కట్టర్ ద్వారా తొలగించి అనంతరం దానిని గాల్లోకి విడిచిపెట్టారు. పరిశీలిన కోసం మొబైల్‌ను, పెన్‌డ్రైవ్‌ను తీసుకెళ్లారు. దీని ప్రకారం జైలు నుంచి సెటిల్ మెంట్లు కూడా జరుగుతున్నాయని వారు కొత్తగా కనుగొన్నారు. ఈ పావురానికి వాటిని ఇచ్చి పంపించినవారికోసం దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు!
బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఓ భూస్వామికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కర్ణాటకలోని జిల్లా రెండో అదనపు సెషన్స్, స్పెషల్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయపుర జిల్లా హన్నుక్తి గ్రామంలో రాకేశ్ దశరథ్ ఓ పేరుమోసిన ఆసామి. అయితే దాదాపు మూడేళ్ల కిందట ఓ బాలుడితో తన ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ భూస్వామి తనను లైంగిక చర్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు విజయపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నమోదైంది. గతవారం కిందట తాజాగా జరిపిన విచారణలో రాకేశ్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. కోర్టులో ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ ఆ భూస్వామికి పదేళ్ల కఠినశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
జైల్లో ఖైదీ వద్ద సెల్‌ఫోన్
తిరువొత్తియూరు : పుళల్ జైలులో గస్తీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఖైదీ వద్ద సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జైలు ఆవరణలో పడి ఉన్న పార్సిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సదరు పార్సిల్‌ను సిబ్బంది తెరచి చూశారు. అందులో మూడు సెల్ఫోన్లు, చార్జర్లుతోపాటు సిమ్‌కార్డులు, గంజాయి ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి జైలులో ఎవరి కోసం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫోన్ స్వాధీనం చేసుకున్న ఖైదీ విఘ్నేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. -
హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం
అనంతపురంలో ఏడాదిన్నర కిందట జరిగిన హత్య కేసులో ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన అంబారపు మంగల రవికుమార్ వేధింపులు తాళలేక భార్య సంధ్యారాణి 2014లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో అరెస్టయ్యి.. బెయిలుపై వచ్చిన రవికుమార్‌పై బావమరిది నేరేడు జల్లా నాగేంద్ర కక్ష పెంచుకున్నాడు. బావను హత్య చేయటానికి స్నేహితులు కంబగిరి బాలకష్ణ,షేక్మౌలాలీతో కలిసి కుట్ర పన్నాడు. 2015 ఫిబ్రవరి రెండో తేదీ రాత్రి సుమారు 8.30 సమయంలో రామనగర్ రైలేగేటు వద్ద రొట్టెలు కొని ఇంటికి వెళుతున్న రవికుమార్‌ను ద్విచక్రవాహనంలో వచ్చి అటకాయించారు. అతని వెంట ఉన్న స్నేహితుడు మంగలశ్రీనివాస్ను బెదిరించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరైన రవికుమార్‌ను సుత్తితో మోది.. పెట్రోలు పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆస్పత్రి చేరిన రవికుమార్ మరుసటి రోజు మృతి చెందాడు. అంతకు ముందే అతడి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదుచేశారు. హత్యానేరం కూడా కలిపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్ బి.నాగలింగం 17 మంది సాక్ష్యులను విచారణ చేశారు. ప్రధాన నిందితుడు నాగేంద్ర, అతని స్నేహితుడు బాలకష్ణలపై నేరారోపణలు రుజువు కావడంతో ఇద్దరికీ యావజ్జీవ కఠిన కారాగారశిక్ష విధిస్తూ నాలుగవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పుచెప్పారు. మరొక నిందితుడు షేక్మౌలాలీపై నేరం రుజువుకాకపోవటంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. -
టీఆర్ఎస్కు అనుకూలంగా జానా..!
-
ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? : జానారెడ్డి
* మా సందేహాలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులా: జానారెడ్డి * ముఖ్యమంత్రి అధికార దర్పంతో మాట్లాడుతున్నారు * చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే అధికారపక్షమైనా జైలుకు వెళ్లాల్సిందే * మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రక తప్పిదం సాక్షి, హైదరాబాద్: ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సీఎంకు మంచిది కాదని, తమిళనాడులో పరువునష్టం కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో అణచివేత విధానం సరికాదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రాజెక్టుల విషయంలో ప్రజల అభిప్రాయాలను, నష్టం జరిగే అంశాలను కాంగ్రెస్ ప్రశ్నించింది. వాటికి జవాబు చెప్పాల్సింది పోయి సీఎం అధికార దర్పంతో మాట్లాడుతున్నారు. ఊతపదాలు కాకుండా హుందాగా వ్యవహరించాలి. రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తీసుకురావొద్దు. గతంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న సీఎం.. ఇప్పుడు చేస్తున్నదేమిటో చెప్పాలి. ప్రజల అభివృద్ధికి, శాశ్వత ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏం చేస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ఏటా కరెంటు బిల్లులే రూ.8 వేల కోట్లు! మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రక తప్పిదమని జానారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. 152 మీటర్లకు మహారాష్ట్రను ఒప్పించడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసిందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని, అది అధికార పక్షానికి కూడా వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు సంబంధించిన డీపీఆర్ కావాలని జూన్ 21న మంత్రికి లేఖ రాస్తే ఇప్పటిదాకా సమాధానం రాలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా రూ.8 వేల కోట్లు కరెంటు బిల్లులే కట్టాల్సి ఉంటుందన్నారు. ‘‘వ్యక్తిగా నేను ఉండొచ్చు.. లేకపోవచ్చు.. కానీ రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం జర గొద్దన్నదే మా బాధ. 152 మీటర్ల ఎత్తుతో చేపట్టిన పనులు ఆపాలని మహారాష్ట్ర సీఎం లేఖ రాసింది నిజం కాదా? దీనిపై అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకుపోలేదు? ‘నేను ఇక్కడ ఉన్నా.. రా’ అని సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ సవాల్ చేయడం సరికాదు’’ అని అన్నారు. రైతుల పొలాలకు నీళ్లిస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటనని చెప్పారు. మాటకు మాట మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్న అవకతవకలను సరిదిద్దడం దేవుడి వల్ల కూడా కాదన్నారు. గద్వాల జిల్లా కోసం ప్రజలు బలంగా అభిప్రాయం వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమూరును నాలుగు జిల్లాలుగా చేయాలని కోరారు. -
నానమ్మతో జైలుకు..
జ్యోతినగర్ (కరీంనగర్): రామగుండం ఎన్టీపీసీలో ఓ మహిళ బలవన్మరణం చిన్నారులు నానమ్మతో జైలుకు వెళ్లేందుకు కారణమైంది. రామగుండం ఎన్టీపీసీకి చెందిన రామలింగేశ్వరావు,సునీత దంపతుల కుమారుడు రామోజీరావుకు కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన కళ్యాణితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. కళ్యాణికి అమ్మానాన్నలు లేకపోవడంతో మేనమామలు వివాహం చేశారు. వీరికి యోగేంద్రవర్మ, బాలాదిత్య ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 1న కల్యాణి ఆత్మహత్య చేసుకుంది. అత్త, మామల ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమని ఆమె లేఖ రాసింది. కల్యాణి మరణవార్తను తెలుసుకున్న బంధువులు భర్త, అత్త,మామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్ కళ్యాణి భర్త రామోజీరావుతో పాటు అత్త సునీత, మామ రాంలింగేశ్వరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చిన్నారులను చేరదీసేందుకు కళ్యాణి బంధువులు వెనుకాడటంతో చిన్నారులు సైతం నానమ్మతో జైలుకు వెళ్లక తప్పలేదు. -
చెవిరెడ్డికి బెయిల్
కార్యకర్తల సంబరాలు చంద్రగిరి(తిరుపతి రూరల్): చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడం, జైలు నుంచి విడుదల కావడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరిలోని పార్టీ కార్యాలయంలో బండారు జ్యోతి, హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. పార్టీ మండలాధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడే నాయకుడు డాక్టర్ చెవిరెడ్డి అని కొనియాడారు. అధికార మదంతో టీడీ పీ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం, అమాయకులను వేధించ డం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అనీల్, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బుజ్జి, నాగరాజు, గంజి మణి పాల్గొన్నారు. -
సాకర్ స్టార్ మెస్సీకి జైలు శిక్ష
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ లియోనెల్ మెస్సీకి స్పానిష్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రీమియర్ లీగ్స్ లో బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మెస్సీ.. ఆదాయపన్ను ఎగవేశారనే నేరం రుజువు కావడంతో స్పెయిన్ కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు రెండు మిలియన్ యూరోల జరిమానాను కూడా విధిస్తున్నట్లు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెస్సీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి జార్జ్ మెస్సీకి కూడా 21 నెలల జైలు శిక్షతోపాటు 1.5 మిలియన్ యూరోల జరిమాన విధించింది. తీర్పు వెలువడగానే మెస్సీ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మెస్సీ, అతని తండ్రి కోర్టుకు మొరపెట్టుకున్నారు. దీంతో న్యాయమూర్తి.. తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లొచ్చని ఊరడించారు. ప్రపంచంలో భారీగా ఆదాయాన్ని గడిస్తోన్న ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. ప్రీమియర్ లీగ్స్ ద్వారా వేలకోట్ల డాలర్లు పోగేసుకుంటోన్న మెస్సీ.. ఆ మేరకు పన్ను చెల్లించడం లేదంటూ స్పెయిన్ ఐటీ శాఖ మూడు కేసులను నమోదు చేసింది. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు చెప్పింది. ఏళ్లుగా అర్జెంటీనా జట్టు సారధిగా, ఫార్వర్డ్ ఆటగాడిగా కొనసాగిన మెస్సీ గత నెలలో జాతీయజట్టు నుంచి తప్పకున్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్స్ లో చిలీ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా జట్టును అభిమానులు మొదట తిట్టుకున్నా.. మెస్సీ రాజీనామా ప్రకటనతో కాస్త చల్లబడ్డారు. గత ఫుల్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
మంత్రి శంకర్ మళ్లీ చిక్కాడు!
37 ఏళ్లలో 24 సార్లు అరెస్టు 228 చోరీ కేసుల్లో నిందితుడు తాజాగా నాలుగు చోట్ల పంజా సిటీబ్యూరో: ఘరానా దొంగ మంత్రి శంకర్ మరోసారి చిక్కాడు. గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు.. తాజాగా నాలుగు చోట్ల పంజా విసిరాడు. నిందితుడిని అరెస్టు చేసిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.4 లక్షల విలువైన సొత్తు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ 1979 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 228 కేసుల్లో నిందితుడిగా ఉండి 24 సార్లు అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఐదు కేసుల్లో దోషిగా తేలడంతో న్యాయస్థానం ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇతడిపై చిలకలగూడ ఠాణాలో సిటీ డోషియర్ క్రిమినల్ (సీడీసీ) షీట్ కూడా ఉంది. జంట కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరే ఇతడికి శివన్న, శివప్రసాద్ వంటి మారు పేర్లూ ఉన్నాయి. 1998 నుంచి 2009 వరకు రామంతపూర్‌లోని నేతాజీనగర్‌లో నివసించాడు. 2009 నుంచి తన మకాంను మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాలోని ఔసా పట్టణానికి మార్చాడు. ముగ్గురు భార్యలు, ఏడుగురు సంతానం ఉన్న శంకర్ ప్రస్తుతం మూడో భార్య షాలినితో కలిసి జీవిస్తున్నాడు. ‘సింగిల్ హ్యాండ్’తో నేరాలు చేసే ఇతగాడు ద్విచక్ర వాహనంపై సంపన్నులు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ప్రధాన ద్వారం పగులగొట్టి లోపలకు ప్రవేశించి సొత్తు ఎత్తుకుపోతాడు. దీన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ జల్సాలు చేస్తాడు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో చోరీలు చేసిన ఆరోపణలపై 2014లో బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ఉస్మానియా వర్సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడంతో గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చాడు. వస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ, బోయిన్పల్లి, నాచారంతో పాటు కూకట్‌పల్లిలోనూ నాలుగు నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. మంత్రి శంకర్ నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని కేసును ఓయూ పోలీసులకు అప్పగించారు. -
ఆదాయ పన్ను ఎగ్గొడితే జైలుకే!
రుణాలు పుట్టవు, గ్యాస్ సబ్సిడీ అందదు ♦ ఆస్తుల క్రయ విక్రయాలకూ చెక్ ♦ ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ♦ కఠిన చర్యలకు ఐటీ శాఖ సన్నద్ధం ♦ ముక్కుపిండి వసూలు చేసే కార్యాచరణ ♦ రిటర్నులు దాఖలు చేయకపోయినా చిక్కులే న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసింది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుండా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాసు సబ్సిడీ అందకుండా చేయడం వంటి పలు చర్యల ద్వారా వారిని దారికి తేవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పన్ను ఎగవేతదారుల విషయంలో అనుసరించాల్సిన చర్యలతో ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇటీవల జరిగిన ఐటీ అధికారుల వార్షిక సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టారు. కార్యాచరణ ప్రణాళిక... దేశంలో ఆదాయపన్ను పరిధిలోకి వచ్చికూడా రిటర్నులు దాఖలు చేయని వారి సంఖ్య 2014లో 22.09లక్షలుగా ఉండగా ఈ సంఖ్య 2015 నాటికి 58.95 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారుల పాన్ నంబర్లను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపడం ద్వారా సంబంధిత వ్యక్తుల పేరుతో ఎలాంటి ఆస్తుల లావాదేవీలకు అవకాశం లేకుండా చేయాలని కార్యాచరణ ప్రణాళికలో ఐటీ శాఖ ప్రతిపాదించింది. ఎగవేతదారులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఐటీ అధికారులందరికీ పంపనుంది. ఎగవేతదారుల నుంచి బకాయిల వసూలు, వారికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసేందుకు వీలుగా ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సిబిల్ నుంచి తెలుసుకోవాలని కూడా నిర్ణయించింది. సీబీడీటీ మార్గదర్శనం ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాలని ఐటీ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సైతం మార్గదర్శనం చేసింది. అరెస్ట్‌లు, నిర్బంధంతోపాటు వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించింది. ఈ మేరకు సీబీడీటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధాన పత్రంలో ఆదాయపన్ను అధికారులను ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 276 సీ(2) ప్రకారం ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు, జరిమానాకూ అవకాశం ఉంది. పన్ను వసూలు అధికారి (టీఆర్వో) ఐటీ చట్టంలో ఉన్న ఈ అధికారాలను వినియోగించుకుని పన్నులు రాబట్టాలి. కానీ, ఈ దిశగా చర్యలు తక్కువగా ఉంటున్నాయని, టీఆర్వోల వ్యవస్థను మరింత పటిష్టపరిచి, మరిన్ని సౌకర్యాల కల్పనతోపాటు వారికి సిబ్బందిని కేటాయించాలని సీబీడీటీ సూచించింది. కావాలని పన్ను ఎగవేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అవసరమైన కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వెనుకాడవద్దని కోరింది. పన్ను ఎగవేతదారుల ఆస్తులను అటాచ్ చేసి వాటిని ఏడాదిలోపు విక్రయించేందుకు వీలుగా టీఆర్వోల పనితీరును పర్యవేక్షణ అధికారులు పరిశీలించాలని ఆదేశించింది. రూ. కోటి బకాయి ఉన్నా, పేర్లు బహిర్గతమే... ప్రస్తుతం రూ.20కోట్లకు పైగా పన్ను బకాయి పడిన వ్యక్తులు, సంస్థల పేర్లను వెల్లడిస్తూ ఆదాయపన్ను శాఖ జాతీయ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. అలాగే, తన వెబ్సైట్లోనూ ప్రముఖంగా పేర్కొంటోంది. ఇకపై రూ.కోటి ఆ పైన బకాయి ఉన్న వ్యక్తులు, సంస్థల పేర్లను కూడా ఇలానే బహిరంగ పరచాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 271 ఎఫ్ ప్రకారం పన్ను వర్తించే ఆదాయం పొందుతున్న వారు తప్పనిసరిగా గడువులోపు రిటర్నులు దాఖలు చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 276సీసీ ప్రకారం ఆదాయ వివరాలతో రిటర్నులు దాఖలు చేయని వారికి ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయని ప్రతీ కేసును ప్రత్యేకంగా పరిశీలించి ఈ చట్టాల కింద చర్యలు చేపట్టాలని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆదాయపన్ను కమిషనర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2,58 లక్షలకు పెరిగినట్టు ప్రణాళిక తెలియజేస్తోంది. వీటిలో ఈఏడాది 1.33 లక్షల కేసులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని విధించారు. -
పోతే జైలుకు.. లేదంటే భూమిలోనే..
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఏటూరునాగారం: ప్రకృతితో సావాసం చేసే గిరిజనులు జైలుకు వెళ్లడమో.. లేదంటే పోడు భూమిలోనే ఉండడం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సున్నం రాజయ్య మాట్లాడుతూ 2005కి పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతున్నా పాలకులు పట్టించుకోవ డం లేదన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేతకానితనాన్ని నడిరోడ్డుకు ఈడుస్తామన్నారు. పోడు భూములపై స్పష్టమైన సర్వే చేయిస్తామని ఉన్నతాధికారుల హామీని ఐటీడీఏ పీవో వెల్లడించడంతో ధర్నా విరమించారు. -
లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే
జవదేకర్ జోస్యం సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి లోకాయుక్తా వస్తే, అమ్మ మళ్లీ జైలు కెళ్లినట్టే. అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నినాదం ఆమె నోటి మాటే, అని చమత్కరిస్తున్నారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ నినాదాల్ని అందుకుని ఉన్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు విడుదల చేసుకున్న మేనిఫెస్టోల్లో ‘లోకాయుక్తా’ నినాదం తప్పని సరిగా ఉన్నాయి. అవినీతిని రూపు మాపాలంటే లోకాయుక్తాతోనే సాధ్యం అన్నట్టుగా ప్రచారాల్లో గళం విప్పే పనిలో పడ్డాయి. ఇంతవరకు బాగానే, ఉన్నా లోకాయుక్తా వస్తే మాత్రం జైలుకు వెళ్లేది జయలలితే అని గంటాపథంగా జవదేకర్ వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. చెన్నైలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన జవదేకర్ జయలలితను ఉద్దేశించి సెటెర్లు విసిరారు. గతంలో ఇంటికి 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ అని ప్రకటించి లీటరు రూ. పదికి అమ్ముకున్న వాళ్లు, విద్యుత్ మిగులు అని ఎన్నికల ఫీట్లు చేస్తున్న వాళ్లు, ఇప్పుడేమో లోకాయుక్తా అన్న నినాదం అందుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. లోకాయుక్త అమ్మ పెదవి నోటి మాటకే పరిమితం. అది అమలయ్యేది డౌటే. ఎందుకంటే, అది వస్తే జైలుకు వెళ్లేది జయలలితే అని చమత్కరించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తు ల కేసు సుప్రీంలో వి చారణలో ఉన్నం దు, రాష్ట్రంలో లోకాయుక్తా అవసర మా..? అని పెదవి విప్పే అన్నాడీఎంకే వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో లోకాయుక్త వస్తే, అమ్మ ఒక్కట్టేనా...?తాతయ్య అండ్ ఫ్యామిలీ వెళ్లదా..? అని జవదేకర్‌కు ప్రశ్నల్ని సంధించే వాళ్లు ఉండడం ఆలోచించాల్సిందే. అవినీతిలో డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందే అని వ్యాఖ్యానించే కమలం పెద్ద, ఒక్క అమ్మకే జైలు అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. -
ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలు
సాక్షి, సిటీబ్యూరో: మెడికల్ షాప్ లెసైన్స్ కోసం లంచం తీసుకొని పట్టుబడ్డ డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ సీఐ నాగేశ్వర్రావు కథనం ప్రకారం... ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శిలో ఉంటున్న ఫిర్యాదుదారుడు పి.ఆంజనేయులు...ఆరేళ్ల క్రితం బీఎన్‌రెడ్డి నగర్లో మెడికల్ షాప్ ఏర్పాటు చేద్దామని లెసైన్స్ కోసం దరఖాస్తు చేశారు. లెసైన్స్ మంజూరు చేయాలంటే తనకు రూ. 4,500 లంచం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని లంచం డబ్బు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ రుజువు కావడంతో నిందితుడు వెంకటేశ్వర్లుకు కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. -
బయట బతకలేక జైలుకెళ్తున్నారు!
జపాన్‌లో ఆయుర్ధాయం ఎక్కువ. ఫలితంగా వృద్ధులూ పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికో కొత్త సమస్య వచ్చి పడింది. వృద్ధులకు తగిన ఆదాయం ఉండట్లేదు. దాంతో జీవనవ్యయాన్ని భరించలేకపోతున్నారు. ఖర్చులను తట్టుకోలేక... ఉద్దేశపూర్వకంగా ఏదో చిన్న నేరం చేసేసి జైలుకు వెళ్లిపోతున్నారు. జైలులో అయితే అన్నీ ఫ్రీ. జపాన్ చిన్న నేరాలకు కూడా కఠిన శిక్షలు ఉంటాయి. ఏదైనా స్టోర్ నుంచి శాండ్విచ్ను దొంగిలించినా రెండేళ్ల శిక్ష పడుతుంది. ఇటీవల షాప్ లిఫ్టింగ్ కేసుల్లో జైలుకు వస్తున్న వారిలో 35 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వృద్ధులే ఉంటున్నారట. దాంతో దీనిపై దృష్టి పెట్టిన సామాజికవేత్తలు... వారు బయట జీవనవ్యయాన్ని భరించలేకే... ఫ్రీగా కూడు, గుడ్డ దొరుకుతుందని ఉద్దేశపూర్వకంగా జైలుకు వెళుతున్నారని తేల్చారు. వృద్ధులకు పని కల్పించడానికి జపాన్‌లో కొన్ని పథకాలున్నా... ఇప్పుడు వీరి ఆదాయాన్ని మరింత ఎలా పెంచొచ్చనే విషయంలో అధ్యయనం చేస్తున్నారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్టు
కాకినాడ రూరల్ : పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడిన అంతర్ జిల్లా పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి రూ. 39 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. బుధవారం సర్పవ రం పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. అంతర్ జిల్లా నేరస్తుడైన చప్పిడి వీరవెంకట సత్యనారాయణ పాత నేరస్తుడు. ఇతడు కోరంగి, కాకినాడ, ద్రాక్షారామ, మండపేట, ఉప్పల్ (హైదరాబాద్), పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు, కొవ్వూరుల్లో నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలుశిక్షలు అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిపై గతేడాది గొల్లపాలెం పోలీసు స్టే షన్లో కేసు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మం డలం తూర్పు విప్పరులో నిందితుడు ఉన్నట్టు స్పెషల్ క్రైం పార్టీకి సమాచారం అందింది. అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పోలీసు లు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30,97,507 విలువైన 143 కాసుల బంగారం, రూ.4,09,349 విలువైన 11.5 కిలోల వెండి, రూ.3.22 లక్షల నగదు, చోరీలకు వాడిన బైక్ మొత్తం రూ.39.09 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. గొల్లపాలెం, కోరంగి, ద్రాక్షారామ, పామర్రు, అంగర, పోడూరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వల్లభనేని పవన్‌కిశోర్, స్పెషల్ క్రైమ్ పార్టీ ఎస్సైలు వై.రవికుమార్, ఎండీఏఆర్ ఆలీఖాన్, ఏఎస్సై ఎం.పాపరాజు, హెచ్‌సీ వి.సుబ్బారావు, కానిస్టేబుళ్లు కె.రాంబాబు, రామాంజనేయులు అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ ఆకురాతి పల్లపురాజు పాల్గొన్నారు.