వెనెజులా జైలులో 68 మంది దుర్మరణం | 68 dead after riot and fire at Venezuela police station | Sakshi
Sakshi News home page

వెనెజులా జైలులో 68 మంది దుర్మరణం

Mar 30 2018 3:09 AM | Updated on Sep 5 2018 9:47 PM

68 dead after riot and fire at Venezuela police station - Sakshi

కారకస్‌: వెనెజులాలోని కారాబొబొ రాష్ట్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం జైలు నుంచి బుధవారం ఖైదీలు తప్పించుకోవడానికి యత్నించిన ఘటనలో మంటలు చెలరేగి 68 మంది దుర్మరణం చెందారు. జైలు నుంచి తప్పించుకోవడంలో భాగంగా ఖైదీలు పరుపులకు మంట పెట్టారనీ, భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కున్నారని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. మృతుల్లో 66 మంది ఖైదీలు కాగా, ఇద్దరు మహిళా సందర్శకులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement