కార్కాస్: వెనిజులాలోని ఓ జైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 17మంది మృత్యువాతపడ్డారు. పదకొండుమంది గాయాలపాలయ్యారు. చనిపోయినవారిలో తొమ్మిదిమంది పురుషులు ఉండగా ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. రాత్రిపూట ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అయితే, అగ్నిప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. దర్యాప్తు చేపట్టారు. కారాబోబో రాష్ట్రంలోని టోకియుటో వద్ద ఉన్న జైలులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వెనిజులాలోని చాలా జైళ్ల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలు చూస్తుంటాయి.
జైలులో అగ్నిప్రమాదం.. 17మంది మృతి
Published Tue, Sep 1 2015 9:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement