
బయట బతకలేక జైలుకెళ్తున్నారు!
జపాన్‌లో ఆయుర్ధాయం ఎక్కువ. ఫలితంగా వృద్ధులూ పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికో కొత్త సమస్య వచ్చి పడింది.
జపాన్‌లో ఆయుర్ధాయం ఎక్కువ. ఫలితంగా వృద్ధులూ పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికో కొత్త సమస్య వచ్చి పడింది. వృద్ధులకు తగిన ఆదాయం ఉండట్లేదు. దాంతో జీవనవ్యయాన్ని భరించలేకపోతున్నారు. ఖర్చులను తట్టుకోలేక... ఉద్దేశపూర్వకంగా ఏదో చిన్న నేరం చేసేసి జైలుకు వెళ్లిపోతున్నారు. జైలులో అయితే అన్నీ ఫ్రీ. జపాన్ చిన్న నేరాలకు కూడా కఠిన శిక్షలు ఉంటాయి.
ఏదైనా స్టోర్ నుంచి శాండ్‌విచ్‌ను దొంగిలించినా రెండేళ్ల శిక్ష పడుతుంది. ఇటీవల షాప్ లిఫ్టింగ్ కేసుల్లో జైలుకు వస్తున్న వారిలో 35 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వృద్ధులే ఉంటున్నారట. దాంతో దీనిపై దృష్టి పెట్టిన సామాజికవేత్తలు... వారు బయట జీవనవ్యయాన్ని భరించలేకే... ఫ్రీగా కూడు, గుడ్డ దొరుకుతుందని ఉద్దేశపూర్వకంగా జైలుకు వెళుతున్నారని తేల్చారు. వృద్ధులకు పని కల్పించడానికి జపాన్‌లో కొన్ని పథకాలున్నా... ఇప్పుడు వీరి ఆదాయాన్ని మరింత ఎలా పెంచొచ్చనే విషయంలో అధ్యయనం చేస్తున్నారు.