కార్యకర్తల సంబరాలు
చంద్రగిరి(తిరుపతి రూరల్): చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడం, జైలు నుంచి విడుదల కావడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరిలోని పార్టీ కార్యాలయంలో బండారు జ్యోతి, హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. పార్టీ మండలాధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడే నాయకుడు డాక్టర్ చెవిరెడ్డి అని కొనియాడారు.
అధికార మదంతో టీడీ పీ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం, అమాయకులను వేధించ డం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అనీల్, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బుజ్జి, నాగరాజు, గంజి మణి పాల్గొన్నారు.
చెవిరెడ్డికి బెయిల్
Published Wed, Jul 13 2016 1:03 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement
Advertisement