అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం భార్యను వేధిస్తున్న కేసుకు సంబంధించి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బి.రాధారాణి గురువారం తీర్పునిచ్చారు.
అప్పటి నుంచి కలహాలతోనే వీరి కాపురం సాగింది. భర్త వేధింపులు తట్టుకోలేక లక్ష్మి 2010 జనవరి 25న బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ పి.సుబ్బారావు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఉమ్మడి వెంకటేశ్వర్లుకు ఉమ్మడి మూడేళ్ల జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు.