తాగి నడిపితే జైలుకే..
కరీంనగర్ క్రైం : మద్యంతాగి వాహనాలు నడిపితే జైలు కు పంపిస్తామని పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి హె చ్చరించారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు వారి కు టుంబసభ్యుల సమక్షంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైందని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. మద్యం తాగి అజాగ్రత్తగా వాహనాలు నడిపి కుటుంబాలను వీధిపాలు చేయొద్దన్నారు. తమతోపాటు రోడ్డుపై ఎదుటివారికి సైతం ఇబ్బందులు సృష్టించొద్దని సూచించారు. ఇక నుంచి రోజూ డ్రంకెన్‌డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సారి పట్టుబడితే జరి మానా, రెండోసారి లెసైన్స్ద్ద్రుతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించా రు. కుటుంబ సభ్యులు సైతం గమనించి తగిన జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపేందుకే ఈ కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని, వేరే ఉద్దేశ్యం లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగితే కఠిన వ్యవహరిస్తామన్నారు. డ్రంకెన్‌డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌కు సంబంధించిన డాటాబేస్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌పై మందుబాబుల కుటుంబికులు హర్షం వ్యక్తం చేశారు.
మరోసారి తాగం
మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నారుు. మందుతాగడం ద్వారా అందరిముందు చులకన కావడమే కాకుండా ఇంత ఇబ్బందులంటాయని తెలియదు. ఇక నుంచి మద్యం తాగను. ఒక వేళ తాగినా ఇంటిలోనే ఉంటాము.
- చంద్రశేఖర్, మానకొండూరు
ప్రచారం చేస్తాం
గత రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ చాలా ఇబ్బందిగా ఉంది. మరోసారి తాగము. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న వైనంపై ప్రచారం చేస్తాం. ఇక నుంచి పోలీసులకు సహకరిస్తాం. మద్యం తాగి వాహనాలు నడపము.
- సురేష్, కేశవపట్నం