
నాగుపాముకు అంత్యక్రియలు
బంటుమిల్లి మండల పరిధిలోని పెందుర్రులో ఉన్న నాగేంద్రస్వామి మందిరంలో భక్తుల పూజలు అందుకుకుంటున్న నాగుపాము ఆదివారం రాత్రి మృతి చెందడంతో భక్తులు సోమవారం గ్రామంలో నిర్వహించారు.
బంటుమిల్లి : బంటుమిల్లి మండల పరిధిలోని పెందుర్రులో ఉన్న నాగేంద్రస్వామి మందిరంలో భక్తుల పూజలు అందుకుకుంటున్న నాగుపాము ఆదివారం రాత్రి మృతి చెందడంతో భక్తులు సోమవారం గ్రామంలో నిర్వహించారు. గతంలో ఓ భక్తుడికి పంట పొలాల్లో నాగుపాము కనిపించడంతో అక్కడే మందిరం నిర్మించి రోజూ పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు.
మందిరలో సంచరించే నాగుపాము ఆదివారం రాత్రి కలలోకి వచ్చి నేను చనిపోతున్నానని, గ్రామంలో ఊరేగింపు నిర్వహించి దహన సంస్కారా లు చేయాలని చెప్పినట్లు ఓ మహిళ గ్రామస్తులకు తెలిపింది. సోమవారం మందిర పరిసరాల్లో నాగుపాము మృతి చెంది కనిపించింది. నాగుపాము కళేబరాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహిం చి దహన సంస్కారాలు నిర్వహించారు. పరిసర గ్రామాల భక్తులు చూసేందుకు భారీగా తరలి వచ్చారు.