పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖారారయ్యాయి. మొత్తంగా 18 ప్యాకేజీలకు గానూ సుమారు 30 వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారయినట్లు సమాచారం అందింది.
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖారారయ్యాయి. మొత్తంగా 18 ప్యాకేజీలకు గానూ సుమారు 30 వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారయినట్లు సమాచారం అందింది. ఫైనాన్షియల్ బిడ్ ల పరిశీలన నేటితో పూర్తియింది. ప్యాకేజీల వారిగా ఆయా కంపెనీలకు టెండర్లు ఖారారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్యాకేజీల వారీగా నవయుగ, రాఘవ, పీఎస్ కేకేఎన్ ఆర్, మెగా, ఎస్‌డబ్ల్యూ కంపెనీలకు టెండర్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులలో ముందడుగు వేసింది.