పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం అంతా అవినీతిమయంగా మారిం దని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపీ నేత నాగం
కొందుర్గు (షాద్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం అంతా అవినీతిమయంగా మారిం దని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం పద్మారం గ్రామపంచాయతీ లక్ష్మీదేవిపల్లిలో ప్రాజెక్టు నిర్మించనున్న స్థలాన్ని ఆయన పరిశీలించా రు. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారంలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఆరోపణలు నిజం కాకుంటే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన ప్రేమ లక్ష్మీదేవిపల్లిపై ఎందుకు చూపడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయన్నారు.