Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP Govt corruption in the name of new liquor policy1
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!

సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్‌ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్‌ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్‌ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్‌ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్‌ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్‌ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే సాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్‌ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్‌బుక్‌ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్‌ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్‌ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసినా రిలీవ్‌ చేయలేదు. చివరికి సిట్‌ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్‌ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్‌ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్‌ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్‌సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిరెడ్‌బుక్‌ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్‌ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్‌ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్‌ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్‌ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్‌ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్‌ కేసిరెడ్డి ప్రైడ్‌ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్‌ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్‌ శాఖ, బెవరేజస్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్‌ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మ­కాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్‌ జగన్‌ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్‌ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్‌ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్‌ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్‌ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్‌ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్‌ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్‌పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్‌సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్‌ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్‌ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్‌ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్‌ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్‌ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్‌ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్‌ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్‌ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్‌. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌. వికాట్‌ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్‌ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్‌ చేసిన వికాట్‌.. భారతీ సిమెంట్‌ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్‌ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్‌ జగన్‌ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్‌ జగన్‌ కుటుంబం వికాట్‌ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్‌ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్‌ జగన్‌ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్‌ పాడుతోంది. వైఎస్‌ జగన్‌ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్‌ జగన్‌ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్‌ జగన్‌ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్‌ ప్రాజెక్టులు, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్‌ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్‌ జగన్‌ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది.

100 people died in northern Burkina Faso2
బుర్కినా ఫాసోలో మారణహోమం..100 మందికి పైగా మృతి

ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. బుర్కినా ఫాసో సహెల్ ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్‌గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్‌ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులుజేఎన్‌ఐఎమ్‌ ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు. ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్‌పోర్టును ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు. ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారుల్ని నిర్బందించారు. అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో బీభత్సం సృష్టించారని చెప్పారు. Presidente de Burkina Faso, Ibrahim Traoré, gran líder de África que lucha contra el colonialismo de Francia, Alemania, Israel y EEUU. pic.twitter.com/s2uFuVA7pP— El Fantasma (@AlTopeyPunto198) May 13, 2025అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా సహెల్ బుర్కినా ఫాసో దేశంలో సైనిక పాలన కొనసాగుతుంది. ఆఫ్రికాలోని 11 దేశాల భూ భాగాల్లో సహెల్ ప్రాంతం ఒకటి. ఆ 11 దేశాల్లో 2.3 కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫాసో ఒకటి. అయితే ఆఫ్రికా దేశాల్లో సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపు సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టును కోల్పోయింది. అనునిత్యం బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించేందుకు ఆల్‌ఖైదాలాంటి ఉగ్ర సంస్థలు మారణహోమం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ హింస వల్లే 2022లో రెండు సార్లు భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Air India, IndiGo cancel flights to multiple cities3
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్‌!

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025

YS Jagan To Visit Kallittanada In Sri Sathya Sai District Updates4
నేడు శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుగు పయనం అవుతారు.

2 Indian Students Died In US Car Crash5
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్‌ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్‌(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్‌ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేసింది.మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…— India in New York (@IndiainNewYork) May 12, 2025

tamilaga vetri kalagam party win 105 seats in Tamil nadu?6
విజయ్‌కు 105 సీట్లు?

సాక్షి, చెన్నై: విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్‌ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్‌ సినీమా షూటింగ్‌ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాలు విజయ్‌ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్‌ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్‌ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్‌ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్‌ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్‌ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్‌ చేసుకుంటుండడం గమనార్హం.

Suspected drones were engaged in Jammu and Kashmir Samba district7
మళ్లీ డ్రోన్ల కలకలం.. నేలమట్టం చేసిన భారత బలగాలు

జమ్మూ/చండీగఢ్‌: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్‌ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్‌ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్నాయి. మే 8వ తేదీన సైతం ఇదే సాంబా సెక్టార్‌లో పాకిస్తానీ డ్రోన్లు రావడం, భారత బలగాలు పేల్చేయడం తెల్సిందే. అమృత్‌సర్, హోషియార్‌పూర్‌లో బ్లాక్‌ఔట్‌ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్‌లోని అమృత్‌సర్, హోషియార్‌పూర్‌ జిల్లాల్లో సోమవారం స్థానిక యంత్రాంగం బ్లాక్‌ఔట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లో సరిహద్దు సమీప ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. జలంధర్‌ పరిధిలోని ప్రాంతాల్లోనూ పాక్షికంగా బ్లాక్‌ఔట్‌ను అమలుచేశామని జలంధర్‌ డిప్యూటీ కమిషన్‌ హిమాన్షు అగర్వాల్‌ తెలిపారు. పాకిస్తాన్‌తో పంజాబ్‌ 553 కి.మీ.ల మేర సరిహద్దు పంచుకుంటోంది. సోమవారం సైతం అమృత్‌సర్‌లో సైరన్‌ శబ్దాలు వినిపించాయి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని అమృత్‌సర్‌ ప్రజలకు ఇప్పటికే సందేశాలు పంపించామని అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ సాక్షి సాహ్నీ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా అమృత్‌సర్, పఠాన్‌కోట్, ఫజిల్‌కా, ఫిరోజ్‌పూర్, తర్న్‌ తరన్‌ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. పఠాన్‌కోట్, అమృత్‌సర్‌ జిల్లాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలకూ మంగళవారం సెలవు ప్రకటించారు.

IPL 2025 Cricket reschedule announced8
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్‌ 18వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్‌ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్‌’ మ్యాచ్‌ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.

Aditi Shankar about Bhairavam movie9
తెలుగులో నా ఎంట్రీకి సరైన సినిమా ఇదే: డైరెక్టర్‌ కూతురు

‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్‌’ని విజయ్‌ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్‌ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్‌లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్‌ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో పెన్‌ స్టూడియోస్‌పై జయంతిలాల్‌ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్‌ శంకర్‌) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్‌కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్‌ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్‌ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్‌ అండ్‌ హానెస్ట్‌తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‌గార్లకు తమిళ్‌ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.సెట్స్‌లో షూటింగ్‌ని చాలా ఎంజాయ్‌ చేశాను. రాధామోహన్‌గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్‌కి వచ్చేవారు. విజయ్‌ కనకమేడలగారు క్లారిటీ విజన్‌ ఉన్న డైరెక్టర్‌. శ్రీ చరణ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్‌ చరణ్‌గార్లకు నేను బిగ్‌ ఫ్యాన్‌గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్‌ సినిమాలతోపాటు సవాల్‌తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు.

 India-Pakistan ceasefire effect, Sensex hits 82K, Nifty 50 above 24,700 points10
సీజ్‌ఫైర్‌.. బుల్‌ జోష్‌!

ముంబై: భారత్‌–పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు తీసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా బుల్‌కు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సూచీలు గడిచిన నాలుగేళ్లలో (2021) తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్‌ 2,975 పాయింట్లు లాభపడి 82,430 వద్ద, నిఫ్టీ 917 పాయింట్లు బలపడి 24,925 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం ముగింపు. సూచీల 4% ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.432.56 లక్షల కోట్ల(5.05 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. రోజంతా లాభాలే: గత వారాంతాన భారత్, పాక్‌ల మధ్య సీజ్‌ఫైర్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్‌ ఒప్పందాల పరిణామాల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 1,350 పాయింట్లు బలపడి 80,804 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు ఎగసి 24,420 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు మరిన్ని లాభాలు ఆర్జించగలిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 3,041 పాయింట్లు దూసుకెళ్లి 82,496 వద్ద, నిఫ్టీ 937 పాయింట్లు ఎగసి 24,945 వద్ద గరిష్టాన్ని తాకాయి. → సెన్సెక్స్‌ సూచీలో ఇండస్‌ఇండ్‌ (–3.57%), సన్‌ఫార్మా(–3.36%) మినహా 28 షేర్లూ లాభపడ్డాయి. సూచీల్లో ఐటీ 6.75%, రియల్టీ 6%, మెటల్, టెక్, యుటిలిటీ, పవర్‌ ఇండెక్సులు 5% రాణించాయి. ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్‌ సూచీలు 4–3% లాభపడ్డాయి. → మార్కెట్‌ అనూహ్య ర్యాలీలో రక్షణ రంగ, డ్రోన్ల తయారీ కంపెనీల షేర్లకు డిమాండ్‌ కొనసాగింది. యాక్సిస్‌కేడ్స్‌ టెక్నాలజీస్‌ 5%, డేటా ప్యాటర్న్స్‌ 4%, మిశ్ర ధాతు నిగమ్‌ 3.50%, భారత్‌ ఎల్రక్టానిక్స్‌ 2%, పెరిగాయి. ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ 6%, డ్రోణాచార్య ఏరియల్‌ 5% పెరిగాయి.లాభాలు ఎందుకంటే: → పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్‌ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది. → అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్‌ వార్‌’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్‌ జోష్‌ వచ్చింది. → ఈక్విటీ ఫండ్లలోకి సిప్‌ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మారి్నంగ్‌స్టార్‌ డీబీఆర్‌ఎస్‌ భారత సావరిన్‌ క్రిడెట్‌ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్‌ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.భారీ లాభాల్లో అమెరికాచైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా వాణిజ్య యుద్ధానికి 90 రోజుల విరామం ప్రకటించడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్సు 2.70%, డోజోన్స్‌ సూచీ 2%, నాస్‌డాక్‌ ఇండెక్సు 4% లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్, డాలర్‌ ఇండెక్సులూ పెరిగాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement