
విజయ్ దేవరకొండ
ఎంత గొప్ప ప్రేమికుడు కాకపోయుంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అని చెప్పుకుంటారు? విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు తనో ప్రపంచ ఫేమస్ లవర్ అంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌పై కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, కేథరిన్ థెరీసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లా హీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ముఖం నిండా రక్తపు మరకలతో సీరియస్‌గా చూస్తున్న విజయ్ లుక్ ఆసక్తి క్రియేట్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ గుమ్మడి, సంగీతం: గోపీ సుందర్.