Aishwarya Rajesh
-
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గోల్ఫ్ ఆడుతూ చిల్ అవుతున్న ఐశ్వర్యా రాజేశ్హాట్ నెస్ తో కాక రేపుతున్న దిశా పటానీవిచిత్రమైన డ్రస్సులో ప్రియమణి పోజులు50 ఏళ్లకు దగ్గరవుతున్న వన్నె తగ్గని జ్యోతికవింత వేషధారణలో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్చీరలో నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరిబీచ్ రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అను ఇమ్మన్యుయేల్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్.. కొట్టివేసిన కోర్టు
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunam) సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలని విజయవాడకు చెందిన ఎం.లక్ష్మణకుమార్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. ఏదైనా ఒక సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు విషయంలో దర్యాప్తు చేయమని తాము ఈడీని ఆదేశించలేమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అదంతా అధికార యంత్రాంగం పరిధిలో ఉన్న విషయం అని కోర్టు పేర్కొంది.సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది. ఆ సినిమాకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేసింది. కోర్టులో దాఖలు చేసిన పిల్ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉందని పేర్కొంది. భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ విషయంలో ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్ రికార్డ్
హీరో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.అయితే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఇప్పటి వరకు ఈ లిరికల్ వీడియో సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే ఈ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కేవలం మూడు వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా.. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు. -
ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ) -
Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో.. ఎప్పుడంటే?
పొంగల్ బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీలో కంటే ముందుగా టీవీ ఛానల్లో రిలీజ్ కానుంది. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఊరించిన జీ తెలుగు ఫైనల్‌గా టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను వెల్లడించింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్లో సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.థియేటర్లో రిలీజైన ఏ సినిమా అయినా ముందుగా ఓటీటీ (OTT)లోకి వచ్చేది. నాలుగైదువారాల్లో ఓటీటీలోకి రావడం ఆ తర్వాతే టీవీలోకి రావడం జరిగేది. కానీ తొలిసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ పద్ధతికి చెక్ పెట్టింది. ఓటీటీని కాదని ఏకంగా టీవీలో ముందుగా ప్రసారమవుతూ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలువిక్టరీ వెంకటేశ్ హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. సినిమాలో బుల్లిరాజు కామెడీకి జనాలు కడుపుబ్బా నవ్వుకున్నారు. జనాల ఆదరణతో ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. 2027లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. The blockbuster date of #SankranthikiVasthunnam is 𝐌𝐀𝐑𝐂𝐇 𝟏𝐬𝐭 💥🔥StayTuned to #ZeeTelugu 💥#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankrathikiVasthunnamFirstOnTV@VenkyMama @anilravipudi… pic.twitter.com/LUa1F3tkbu— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2025 చదవండి: లుక్స్‌తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్ -
సుడల్ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన నాగచైతన్య
తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్ సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ సీక్వెల్‌గా పార్ట్2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి పుష్కర్ల ద్వయం నిర్మించింది. ఇందులో కదీర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు. -
గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్
-
మాల్దీవుస్‌లో సాక్షి అగర్వాల్ చిల్.. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ లేటేస్ట్ లుక్!
మజాకా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా మన్మధుడు హీరోయిన్ అన్షు..సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ లుక్స్..లైప్ ఈజ్ బూమరాంగ్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న శ్రీలీల..మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
రెండుసార్లు ప్రేమ.. చుక్కలు చూశా.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie)తో ఈ ఏడాదికి శుభారంభం పలికింది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ఎన్నో విమర్శలను దాటుకుని ఈ సక్సెస్‌ను అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంది. ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. మా నాన్న రాజేశ్ చిన్నప్పుడే చనిపోయారు. అప్పుడు నాకు ఎనిమిదేళ్లనుకుంటాను. ఖరీదైన బహుమతిముగ్గురు అన్నల తర్వాత నేను పుట్టాను. మా నలుగుర్ని మా అమ్మ ఒక్కరే కష్టపడి పెంచింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా భూములమ్మేది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. ఇంటింటికీ వెళ్లి చీరలమ్మేది. మమ్మల్ని చదివించడం కోసం చాలా కష్టపడింది. తనను ఎంతో అపురూపంగా చూసుకుంటాను. తనకు ఎప్పుడూ ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటాను. ఇటీవలే అమ్మ చేసిన రుచికరమైన చేపల పులుసుకుగానూ రూ.18 లక్షల విలువైన గాజులు బహుమతిగా ఇచ్చాను.సినిమా..తెలుగులో సినిమా చేస్తే మంచి కథతో, మంచి హీరోతో చేయాలనుకున్నాను. అలా వరల్డ్ ఫేమస్ లవర్ చేశాను. సినిమా అంతగా ఆడకపోయినా నేను పోషించిన సువర్ణ పాత్ర చాలామందికి నచ్చింది. నేను నేచురల్‌గా ఉండేందుకే ఇష్టపడతాను. సౌకర్యంగా అనిపించని దుస్తుల్ని ధరించను. అలాగే నాకు సెట్టవని పాత్రలు కూడా చేయను. అలా ఓసారి దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు నాకంటే మరో హీరోయిన్‌కే బాగా సెట్టవుతుందని చెప్పి ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాను. నేను సూచించిన హీరోయిన్ ఆ సినిమాలో బాగా సెట్టయింది.రెండుసార్లు బ్రేకప్..నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ను. గతంలో రిలేషన్షిప్లో చాలా బాధల్ని అనుభవించాను. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేశాడు. అతడితో బ్రేకప్ అయ్యాక మళ్లీ అదే నరకంలో అడుగుపెట్టాను. రెండోసారి ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను వేధించాడు. ఆ వేధింపులు ఎంతలా ఉండేవంటే.. చేతులెత్తి నన్ను కొట్టేవారు. నేనెంతగానో ప్రేమిస్తే ఇలా జరుగుతుందేంటని బాధపడ్డాను. రెండు రిలేషన్షిప్స్లో వేధింపులు అనుభవించడంతో మళ్లీ ప్రేమలో పడాలంటేనే భయమేస్తోంది.అవకాశాలు రావట్లేదుఎందుకంటే ఒకరికి కనెక్ట్ అయ్యాక.. వారి నుంచి దూరం కావడానికి నాకు కనీసం ఏడాదైనా పడుతుంది. అందుకే ఇంకొకరిని లవ్ చేయాలంటేనే భయంగా ఉంది. ఇకపోతే పెళ్లెప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని నా అండాల్ని నేను భద్రంగా దాచిపెట్టాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత నాకు ఇంతవరకు అవకాశాలు రాలేదు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలన్నది నా కోరిక. రాజమౌళి, శేఖర్ కమ్ములతో పని చేయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.చదవండి: ‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే.. -
ఐశ్వర్య ఇంట్లోనే కాదు బయట కూడా రౌడీనే..: నటి శ్రీలక్ష్మి
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh).. అచ్చ తెలుగమ్మాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్దాలవుతోంది. రామబంటు చిత్రంతో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తమిళ మూవీతోనే! తను ఫస్ట్ హిట్ అందుకున్న మూవీ అట్టకత్తి (2012). తొమ్మిదేళ్లు తమిళంలో హీరోయిన్గా రాణించిన తర్వాత కౌసల్యా కృష్ణమూర్తితో తెలుగువారికి కథానాయికగా పరిచయమైంది.ఎన్నో సినిమాలు..మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, డియర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ అందుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఎల్లకాలం గుర్తుంచుకునే పాత్ర చేయాలని తహతహలాడింది. ఆ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ (Sankranthiki Vasthunam Movie) ఆమె ఇంటి తలుపు తట్టింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా నటించేందుకు సంతోషంగా అంగీకరించింది. తన కష్టం, ప్రయత్నం వృథా పోలేదు.మేనకోడలి సినిమా..సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఐశ్వర్య రాజేశ్ పోషించిన అమాయకపు భాగ్యమ్మ పాత్ర జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఐశ్వర్య సినిమాలో అమాయకురాలైనా ఇంట్లో మాత్రం రౌడీ అంటోంది ఆమె మేనత్త, నటి శ్రీలక్ష్మి (Srilakshmi). సోమవారం నాడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ విక్టరీ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. నా మేనకోడలి సినిమా కదా.. తప్పకుండా సినిమా చూసి తీరాలి. లేదంటే నాకు తన్నులు పడతాయి.పైగా బ్లాక్‌బస్టర్ మూవీ.. చూడకుండా ఎలా వదిలేస్తాను. ఐశ్వర్య.. ఇంట్లో, బయటా రౌడీయే అని శ్రీలక్ష్మి సరదాగా చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య తండ్రి రాజేశ్ తెలుగులో హీరోగా నటించాడు. 38 ఏళ్ల వయసులోనే ఈయన అనారోగ్యంతో మరణించాడు. నటి శ్రీలక్ష్మి తమ్ముడే రాజేశ్.చదవండి: హీరోయిన్లను ఏడిపించా.. ఓసారి భాగ్యశ్రీని అడగండి: డైరెక్టర్ -
ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ఈ మధ్య సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు హిట్టయ్యాయంటే చాలు దానికి కొనసాగింపుగా రెండో భాగం, మూడో భాగం తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.తమిళంలో వచ్చిన బెస్ట్ సిరీస్‌లో సుడల్ ఒకటి అని.. ఇన్నాళ్లకు రెండో పార్ట్ రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సుడల్ మొదటి భాగం 2022లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. పార్తీబన్, కదీర్, ఐశ్వర్య రాజేశ్, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి జంట కథ అందించగా బ్రహ్మ అనుచరణ్ దర్శకత్వం వహించారు. రెండో భాగానికి కూడా వీళ్లే పని చేస్తున్నారు.సుడల్ కథేంటి?తమిళనాడులోని సాంబలూరు అనే చిన్న గ్రామంలో ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఫ్యాక్టరీ తగలబడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్తిబన్) కూతురు నీల కనిపించకుండా పోతుంది. మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? నీల సోదరి నందిని (ఐశ్వర్య రాజేశ్) సొంతూరిని వదిలేసి కోయంబత్తూరులో ఎందుకుంటోంది? ఈ మిస్సింగ్‌ల వెనక నీల హస్తం ఉందా? అనే ఆసక్తికర అంశాలతో సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉంటుంది. Some storms never settle.🌪️#SuzhalS2OnPrime, New Season, Feb 28 pic.twitter.com/sHDaA8sjW8— prime video IN (@PrimeVideoIN) February 11, 2025 చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్ -
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
'కలర్స్ హెల్త్ కేర్'లో ఐశ్వర్య రాజేష్ సందడి
-
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. -
బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ.. మహబూబ్ నగర్లో డాకు మహారాజ్ భామ!
విదేశీ పర్యటనలో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..మహాకుంభ్ మేళాలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ లుక్స్..మహబూబ్‌నగర్‌లో డాకుమహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..కళ్లతోనే ఆకట్టుకుంటోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
చెన్నైలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్.. హాజరైన కోలీవుడ్ సినీతారలు (పోటోలు)
-
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
230 కోట్లు అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి: వెంకటేశ్
‘‘సంక్రాంతి పండగకి నిజాయతీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనుకున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించారు. హిట్ కాదు... ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైంది. గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్(Venkatesh) మాట్లాడుతూ– ‘‘అనిల్‌తో నేనో ఫ్రెండ్‌లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం.. అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఇక నా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేయాలని నేనెప్పుడూ అడగను... వచ్చింది తీసుకోవాలి. ఇప్పటికే మా సినిమా రూ. 230 కోట్లు వసూలు చేయడం అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ–‘‘సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం థియేటర్‌కి రావడం ఆనందంగా ఉంది. రెవెన్యూ సైడ్ కూడా మేం ఊహించినదానికంటే అద్భుతంగా రావడం హ్యాపీ’’ అని చె΄్పారు. ‘‘వెంకటేశ్‌గారి ‘కలిసుందాం రా’ సినిమా పాటలని ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్‌ని కూడా అదే స్థాయిలో ఆస్వాదించడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్‌కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్‌తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..? -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మేము అనుకున్నదే జరిగింది..ఆనందంగా ఉంది: వెంకటేశ్
సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకొని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేశాం. ఇలాంటి ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని తెలుసు. మేం అనుకున్నదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్, నా ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం ఆనందంగా ఉంటుంది’ అన్నారు విక్టరీ వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో వెంకటేశ్(venkatesh) మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా ఉన్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్' అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్(నవ్వుతూ). బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా కాంబినేషన్ లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్ గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్ కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్ కి, ప్రేక్షులందరికీ థాంక్ యూ. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్ లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు. ఈ సక్సెస్ మీట్లో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు నిర్మాత శిరీష్ కూడా పాల్గొన్నారు. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
క్లైమాక్స్ చాలా సర్ ప్రైజ్ చేస్తుంది :వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో వెంకటేశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నా కెరీర్లో వస్తున్న మరో సంక్రాంతి సినిమా ఇది. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా ఉంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్ గా ఉంది. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది. → ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్ గా చేయడానికి ప్రత్యేక కారణమేది లేదు. నేచురల్ గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది.→ ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.→ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్ గా అనిపించి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేయాలనుకున్నా. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్ నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా షటిల్ గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ తో మంచి రేపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలని ఉంది.→ భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.→ సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఓ మంచి చిత్రంతో వస్తున్నాం. క్లైమాక్స్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. → ప్రస్తుతం ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు.సురేష్ ప్రొడక్షన్, సితార వంశీ, మైత్రీ, వైజయంతి మూవీస్ లో కథల పై వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. -
గోదారి గట్టు మీద రామ సిలకవే.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్‌లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్‌లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్‌లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ HD మూవీ స్టిల్స్
-
నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్‌గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్‌లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్‌లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్‌లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
సంక్రాంతి సాంగ్‌తో దుమ్మురేపిన వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్ పరిచయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇప్పటికే చూపించారు. అయితే, ఇప్పుడు సాంగ్ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్ విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
ఏడేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్‌తో వస్తున్న వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం.. ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు భారీ హిట్ అందుకున్నాయి. త్వరలోనే మూడో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్ ఆలపించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆయన గాత్రం నుంచి ఒక పాట రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మూడో సాంగ్ విడుదల నేపథ్యంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర యూనిట్ ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. ఈ సాంగ్‌ను ఎవరితో పాడిద్దాం అని అనిల్ రావిపూడి చర్చిస్తుండగా సడెన్‌గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చేసి నేను పాడతా... నేను పాడతా... అంటూ పట్టుబట్టి మరీ ఈ పాటని ఆలపించినట్టు చిత్ర యూనిట్ ఒక వీడియో పంచుకుంది. అయితే, వెంకటేష్ ఇప్పటికే 2017లో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'గురు'లో ఆయన మొదటిసారిగా తన గాత్రంతో మెప్పించాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెంకటేష్ ఆలపించనున్నాడు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్‌గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
వెంకటేష్ బర్త్‌డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
గోదారి గట్టు మీద...
వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ లొకేషన్స్‌లో జరుగుతోంది. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి కాంబినేషన్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రమణ గోగుల పాడారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
గోదారి గట్టు మీద...
హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరింది. వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లక్ష్మి’కి సంగీతం అందించిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద...’ అంటూ సాగే తొలి పాట త్వరలో రిలీజ్ కానుంది. ‘‘ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌తో కాకుండా పెక్యులియర్ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్ రావిపూడి చెప్పారు. దీంతో రమణ గోగులతో పాడించాం. ఆయన ప్రత్యేకమైన వాయిస్‌తో పాడిన ఈ సాంగ్ మూవీకి ఎక్స్ట్రా మ్యాజిక్ యాడ్ చేయడం ఖాయం. త్వరలో ఈ పాటను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, వీకే నరేశ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్ రెడ్డి. -
హేమా కమిటీలు మాకొద్దు: ఐశ్వర్య రాజేశ్
సినిమా పరిశ్రమలో నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని నివేదికను ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం విడుదల చేసిందో, అప్పటి నుంచే నటీమణుల్లో ఒక ధైర్యం, తెగింపు వచ్చినట్లుంది. ఒక్కొక్కరూ తమ చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. అది ఇప్పుడు కోలీవుడ్ వరకూ పాకింది. దీంతో కోలీవుడ్‌లోనూ హేమా కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలనే డిమాండ్ రావడంతో, దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) అలాంటి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అలాంటి కమిటీ తమిళ చిత్రపరిశ్రమకు అవసరం లేదనే అభిప్రాయాన్ని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొనడం ఆసక్తిగా మారింది. నటిగా చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన నటి ఐశ్వర్యరాజేశ్. ఆదిలో చిన్న చిన్న పాత్రలు పోషించి స్వశక్తితో ఎదిగిన ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ పాత్రలనే కాకుండా దక్షిణాది ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక భేటీలో హేమా కమిటీ గురించి స్పందిస్తూ తనకు అలాంటిదేమీ జరగలేదు అన్నారు. అలాంటివి జరగకూడదనే కోరుకుందాం అన్నారు. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికి అలాంటి ఒక విషయం జరగలేదు. అందువల్ల తమిళ చిత్రపరిశ్రమలో హేమా కమిషన్ లాంటిది అవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా జరిగితే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని, అందుకు కారకులైన వారిపై కఠినశిక్ష వేయాలని పేర్కొన్నారు. మహిళల రక్షణే ముఖ్యం అని నటి ఐశ్వర్యరాజేశ్ అన్నారు. -
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
Aishwarya Rajesh: కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
గ్లామరస్ పాత్రలలో ఎందుకు నటించనంటే..: ఐశ్వర్య రాజేశ్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెండ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయితే, సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడానికే దర్శక నిర్మాతలు యత్నిస్తుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుంటారన్నది వాస్తవం. అయితే, అందుకు భిన్నంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్యరాజేశ్ ఒకరు. కోలీవుడ్‌లో ఐశ్వర్యరాజేశ్‌కు అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్యరాజేశ్ అక్కడ నుంచి గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య రాజేశ్ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కానీ, తాను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదన్నారు. తనకు తగిన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టం అని పేర్కొన్నారు. గ్లామరస్‌గా నటించడం తనకు తగదన్నారు. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదన్నారు. తనకు కుటుంబ కథా చిత్రాలే కావాలనీ, అందులోనూ నటనకు అవకాశం ఉండాలనీ కోరుకుంటు న్నాని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొన్నారు. కాగా ఈమె కన్నడంలో శివరాజ్ కుమార్‌కు జంటగా నటించిన ఉత్తరఖాండ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈమె నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం. -
Miami: వేకేషన్లో బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. వెంకటేశ్–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్ రెడ్డి. -
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’ (ఫొటోలు)
-
వెంకీ సరసన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024 -
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
-
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్ చెప్పారు. -
అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్!
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ పడకి దర్శకత్వంలో కేఆర్జీ స్టూడియోస్ పతాకంపై కార్తీక్‌గౌడ, యోగి జి రాజ్ కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్ జీవి ప్రకాష్‌కుమార్‌తో కలిసి నటించిన డియర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి: -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
యాక్షన్ మూవీలో యంగ్ హీరోయిన్.. పెద్ద ఆఫరే!
పేరుకే తెలుగమ్మాయి కానీ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్లో నటించిన ఈ బ్యూటీ.. తొలిసారి ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్) డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన నేను.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. చైన్నెలోని ఆదివారం జరిగిన ఓ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసింది. ప్రతి సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పింది. సహజంగా నటించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటానని అందుకే ఈ మూవీ అవకాశం దక్కిందని తెలిపింది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
అర్జున్‌కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
భార్య గురక పెడితే... ఫన్నీగా సినిమా ట్రైలర్
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. గుడ్‌నైట్ సినిమాలో భర్తకు గురక ఉంటే ఇక్కడ భార్యకు గురక ఉంది. ఈమె గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం సరికొత్తగా అనిపిస్తుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. -
ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్ స్టార్ క్రికెటర్
నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్, నటి ఐశ్యర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం డియర్. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్‌మగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిఫేక్ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్ అశ్విన్ స్వయంగా తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. అశ్విన్‌తో హీరోయిన్ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానిని అశ్విన్ కూడా తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. అశ్విన్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్ పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్‌గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. Excited to unveil the #DeAr trailer!🎉 Happy to have played a small part in it 😁. Check it out and let me know what you think ❤️ ▶️ https://t.co/bqvULPCmRi#DeArTrailer #DeArFromApril11 @NutmegProd @tvaroon #AbhishekRamisetty #PruthvirajGK @mynameisraahul #RomeoPictures… pic.twitter.com/tB1S6KXYUI — Ashwin 🇮🇳 (@ashwinravi99) April 5, 2024 -
హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ఐశ్వర్య..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మరోసారి లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తున్నారు. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే ఈయన వరుసగా పది జనరంజకమైన కథా చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. అలా ఇంతకుముందు యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మరకత నాణయం, రాక్షసన్, ఓ మై కడవులే, బ్యాచిలర్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. తాజాగా ఈ సంస్థ నిర్మిస్తున్న వలయం చిత్రం ద్వారా భారతి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. డీజీ వైష్ణవ్ కాలేజ్ విద్యార్థి అయిన ఈయన టీవీ ఛానెళ్లు, మీడియా హౌస్‌లలో పనిచేసి, పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు. కాగా వలయం చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు నటుడు దేవ్ ముఖ్య పాత్రను చేస్తున్నారు. నటుడు చేతన్, తమిళ్, ప్రదీప్ రుద్ర, హరీష్ పేరడీ, సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శనివారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. చిత్ర షూటింగ్‌ను చైన్నె చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్ రాజ్ శిష్యుడు మహేంద్ర ఎం.హెండ్రీ ఛాయాగ్రాహకుడిగా పరిచయం అవుతుండగా మైఖెల్ బ్రిట్టో సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: సమంతకు రీ ఎంట్రీలోనే బిగ్ ఆఫర్.. ఆ హీరోకు కూడా ఇదే చివరి సినిమా -
హనీ రోజ్ అలాంటి లుక్స్ .. బోల్డ్ ట్రీట్‌తో డోస్ పెంచిన శ్రద్దా దాస్!
పింక్ డ్రెస్‌లో రెచ్చగొడుతోన్న హనీ రోజ్.. వైట్ డ్రెస్‌లో హన్సిక అలాంటి పోజులు.. బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేశ్ క్యూట్ లుక్స్... జపాన్‌లో చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. బ్లూ డ్రెస్‌లో సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఆరెంజ్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ బోల్డ్ ట్రీట్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
డైరెక్టర్‌తో వివాదం.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌కి ఓ దర్శకుడి మధ్య మాటల యుద్ధం. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయనేమో తను ఆమె దగ్గర సినిమా కోసం వెళ్తే చేయనని చెబుతోందని అంటున్నారు. ఐశ్వర్య ఏమో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండని కౌంటర్స్ వేస్తోంది. దీంతో అసలేం జరిగిందిరా బాబు సినీ ప్రేమికులు తల గోక్కుంటున్నారు. ఇంతకీ అసలేంటి వివాదం? ఏం జరుగుతోంది? తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్.. తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత తర్వాత హీరోయిన్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా సరే ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో పూర్తిగా తమిళం వరకు పరిమితమైపోయింది. అలాంటి ఈమెపై దర్శకుడు వీరపాండియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) 2011లో దర్శకుడు వీర పాండియన్.. 'అవర్గళుమ్ ఇవర్గళుమ్' అని ఓ సినిమా తీశాడు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ ఓ హీరోయిన్. తాజాగా ఓ మీడియా ప్రకటన విడుదల చేసిన ఈ డైరెక్టర్.. 'ఐశ్వర్య రాజేశ్‌ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేశా. ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నా సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించట్లేదు. ఆమె ఆర్థికంగా కష్టపడుతున్న సమయంలో ఆటో ఖర్చులకు కూడా నేనే డబ్బులు ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. దీనిపై పరోక్షంగా స్పందించిన ఐశ్వర్య రాజేశ్.. దర్శకుడు వీరపాండియన్ పేరు చెప్పకుండా ట్వీట్ చేసింది. 'చాలా మంది ఓ అంశాన్ని మాత్రమే విని మాట్లాడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది' అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?) Thought of the Day 😊 pic.twitter.com/sisjRcZnQC — aishwarya rajesh (@aishu_dil) January 29, 2024 -
సిస్టర్‌గా కనిపించనున్న ఐశ్వర్య రాజేశ్..
కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో రాణిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈమె మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అలా కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం ఈమె జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో చెల్లెలు, అక్క వంటి పాత్రలో నటించినా హీరోయిన్గా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అలా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ స్థాయిని పెంచిన చిత్రం కనా. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఆ తరువాత పలు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు వరుసగా రావడం మొదలుపెట్టాయి. అలా ఐశ్వర్య ఖాతాలో కపే రణసింగం మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఆ తరహాలో నటిస్తున్న మరో వైవిధ్య కథా చిత్రం సిస్టర్. ద్వారకా ప్రొడక్షన్స్ పతాకంపై బ్రేజ్ కన్నన్, శ్రీలతా బ్రేజ్ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సవరి ముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యోగిబాబు, రెడిస్ కింగ్స్ లీ, సునీల్ రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, బక్స్, శేషు, మారన్, ఆదిత్య ఖదిర్, కరాటే కార్తీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గత డిసెంబర్ నెలలో ప్రారంభమవగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఐశ్వర్య రాజేష్ 34వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఇందులో నటి ఐశ్వర్య.. సిస్టర్‌గా నటిస్తున్నారని.. ఆస్పత్రిలో పని చేసే ఒక నర్సు జీవితంలో జరిగే పలు ఆసక్తికరమైన ఘటనలే ఈ సినిమా కథ అని తెలిపారు. చదవండి: నయనతారపై కేసు, అన్నపూరణి ఆగింది -
Aishwarya Rajesh Birthday: కోలీవుడ్ స్వప్న సుందరి ఐశ్వర్య రాజేశ్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఆ డైరెక్టర్ మూవీలో జేడీ చక్రవర్తి.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి ఆ తరువాత కథానాయకిగా అయిన నటి ఐశ్వర్యా రాజేశ్. హీరోయిన్ అయిన చాలా తక్కువ కాలంలోనే లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే నటిగా ఎదిగిన ఈమె ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కాగా పాత్రల ఎంపికలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అలా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా గోపీ నయినార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: మొన్న ఐటం సాంగ్.. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్) ఈ దర్శకుడు ఇంతకు ముందే నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్ అనే సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా తయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు జయ్ కథా నాయకుడిగా నటిస్తున్నారు. నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తోన్న.. ఈ చిత్రంలో నటి ఈశ్వరీరావు, జాన్‌విజయ్, సుబ్బు పంజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేఎస్.ప్రసాద్ సంగీతమందిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎల్ పతాకంపై ఆర్.రమేశ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కరుప్పర్ నగరం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ టైటిల్ పేరును దర్శకుడు వెంకట్‌ప్రభు ట్విటర్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) Happy to release #GopiNainar 's next flick title #KarupparNagaram starring my Thambi @Actor_Jai @aishu_dil #JDChakravarthy. Best wishes to the whole Team 🎉 Prod by R Ramesh's @RrFilmmakers & Hemant Raj 's #AGL @ThenandalFilms @venkate25571670 #EswariRao #JohnVijay… pic.twitter.com/MF2kqxPPfI — venkat prabhu (@vp_offl) November 7, 2023 -
ఎవరూ ఊహించని పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాజేష్
టాలీవుడ్,కోలీవుడ్‌లలో వైవిధ్య కథా పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించన విధంగా నర్సు అవతారం ఎత్తారు. ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తున్న కొత్త చిత్రం తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ద్వారకా ప్రొడక్షన్‌పై ప్లాసీ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సవరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ విశ్వాసం, రజనీకాంత్ 'పెద్దన్న' చిత్రాలకు సంభాషణలు అందించారన్నది గమనార్హం. నటుడు యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, సుమన్‌రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, భగవతీ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని తమిళ్ అళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఆస్పత్రి నేపథ్యంలో సాగే కామెడీ, థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నర్సుగా నటిస్తున్నారని చెప్పారు. చిత్రం ఆధ్యంతం వినోదభరితంగా సాగుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించేదిగా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్
సహజమైన నటన అంటేనే తనకు ఇష్టమని అంటోంది ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్. తాను ఏ సినిమాలో నటించిన సహజ నటన కోసమే పరితపిస్తానని ఆమె తెలిపారు. చైన్నెలోని మొగప్పైర్‌లో ఉన్న పేజీ 3 లగ్జరీ మేక్ఓవర్ స్టూడియో సంస్థ మొదటి సంవత్సరం వేడుకలు నటి ఐశ్వర్య రాజేష్, పారిశ్రామిక వేత్త వీణా కుమారవేల్, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్త మీనాక్షి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు వారి వారి రంగాల్లో రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సినీ తారలను స్ట్లైలింగ్ చేయడంలో బ్యూటీ సంస్థల పాత్ర ఎనలేనిది అని కొనియాడారు. తాను సినిమా ల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలపైనే కాకుండా సహజమైన నటన పై దృష్టి పెడతానన్నారు. అందువల్లే తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇందులో నిర్వాహకులు షణ్ముగ కుమార్ పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే మలయాళ చిత్రం పులిమాడలో ఐశ్వర్య రాజేశ్ కనిపించింది. -
ఆ వెధవని చంపిన పాపం లేదు.. అంతగా వేధించాడు
-
బాడీ షేమింగ్ చేసి.. బాగా హింసించేవారు..!
-
చిన్నప్పుట్టి నుంచి కష్టా పడుతూ పెరిగా : ఐశ్వర్య రాజేష్
-
నా చిన్న వయసులోనే మా నాన్న చనిపోయారు: ఐశ్వర్య రాజేష్
-
ఏం చేయడానికైనా రెడీ అంటున్న నటి ఐశ్వర్య రాజేష్
-
కెన్యా వేకేషన్లో మెగా ఫ్యామిలీ.. క్వీన్‌లా మారిపోయిన నిత్యామీనన్!
►కెన్యా వేకేషన్లో చిల్ అవుతోన్న మెగా ఫ్యామిలీ! ►రెడ్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్ లుక్స్! ►థాయ్‌లాండ్ వేకేషన్లో అవనీత్ కౌర్! ►రాణిలా మారిపోయిన నిత్యామీనన్! ►గ్రీన్ శారీలో నోరా ఫతేహీ హాట్ పోజులు! ► బ్లూ డ్రెస్‌లో ఏజెంట్ భామ సాక్షి వైద్య లుక్స్! View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Phani (@phanipoojitha__27) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వస్తోన్న 'అర్జున్'.. క్రేజీ అప్డేట్ ఇదే!
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, నటి ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జంటగా నటించిన చిత్రం తీయవన్ కులైగళ్ నడుంగా. బిగ్‌బాస్ అభిరామి, రామ్‌కుమార్ జీకే రెడ్డి, లోగు, వేల రామమూర్తి, తంగదురై, బ్రేకింగ్ స్టార్ రాహుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీఎస్ఆర్ పతాకంపై జి.అరుణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా దినేష్ లక్ష్మణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంబురాలు చేసుకున్నారు చిత్రబృందం. (ఇది చదవండి: ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత) ఇప్పటికే రిలీజైన తీయవన్ కులైగళ్ నడుంగా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర టీజర్, మోషన్ పోస్టర్, సింగిల్ సాంగ్ ఆడియో విడుదల కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు.. దీనికి శరవణన్ అభిమన్సు ఛాయా గ్రహణం, భరత్ అసీవగన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబోలో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. (ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?) It's a wrap for Aishwarya Rajesh’s upcoming crime thriller #TheeyavarKulaigalNadunga! Teaser coming soon! pic.twitter.com/0VvHN8HEis — Christopher Kanagaraj (@Chrissuccess) September 4, 2023 -
ఐశ్వర్య రాజేశ్ తాజా చిత్రం.. హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం 'డియర్'. నట్ మెగ్ ఫ్రాడక్షన్‌న్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జీ.పృథ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఇళవరసు, నటి రోహిణి, గీతా కై లాసం, తలైవాసల్ విజయ్, బ్లాక్‌షిప్ నందిని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతమందించగా.. జగదీష్ చంద్రమూర్తి ఛాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్) ఈ చిత్ర విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ప్రముఖ చిత్రం నిర్మాణ సంస్థగా పేరు గాంచిన రోమియో పిక్చర్స్ అధినేత పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారన్నది గమనార్హం. ఇంతకుముందు నేర్కండ పారువై, వలిమై, నెంజుక్కు నీతి, వీట్ల విశేషం, ట్రిక్కర్, తుణివు, డైనోసర్స్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. కాగా ఈ సంస్థ తాజాగా డియర్ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. జగదేకవీరుడు.. అతిలోకసుందరి నటుడు మృతి! ) #DeAr - Tamil Nadu theatrical rights bagged by #RomeoPictures. Get ready for exciting updates soon!#DearWithRomeoPictures @aishu_dil @mynameisraahul @tvaroon @NutmegProd @Anand_Rchandran #AbhishekRamisetty @jagadeesh_s_v @editor_rukesh @narentnb @proyuvraaj pic.twitter.com/B9q4BJkcqS — G.V.Prakash Kumar (@gvprakash) August 31, 2023 -
హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అలాంటి కాన్సెప్ట్!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్'. నట్ మెగ్ ప్రొడక్షన్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆయిరమ్' ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 'డియర్' షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డియర్' స్టోరీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల తేదీని వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
ధ్రువ నక్షత్రం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ సీన్స్ కట్?
ధ్రువ నక్షత్రం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఇందులో నటి రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, నటుడు పార్టీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 2017లో ప్రారంభమైంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అలా అటకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బూజు దులుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మనం అనే పాటను విడుదల చేశారు. తాజాగా హిజ్ నేమ్ ఈజ్ జాన్ అనే మరో పాటను విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే చిత్రీకరించిన నటి ఐశ్వర్య రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని తొలగించినట్లు, ఆమె లేకుండా మళ్లీ కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. -
నేను పుట్టిన 5 ఏళ్లకే నాన్న చనిపోయాడు..
-
నువ్వు హీరోయిన్ ఏంటి అని హేళన చేశారు..
-
స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదంటున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. ఆ ఫోటోలోని బేబీ ఇప్పుడొక స్టార్ హీరోయిన్!
తెలుగుమ్మాయి అయినప్పటికీ నటిగా తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నైలో పుట్టి పెరిగినా ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు సినిమా రాంబంటు చిత్రంలో ఓ సీన్లో కనిపించింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించింది. కెరీర్ ప్రారంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన రమ్మీ, పన్నైరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలే పెద్ద హీరోలు తనను పట్టించకోవడం లేదంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? మరెవరో కాదండీ ఇటీవలే ఫర్హానా చిత్రంలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. (ఇది చదవండి: ఇక చాలు ఆపండి, రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్) టాలీవుడ్లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాల్లోనూ నటించింది. నటిగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాని, సాయి ధరమ్ తేజ్‌లతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఫర్హానా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం జూలై 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మె హాస్య నటి శ్రీలక్ష్మికి మేనకోడలు. అయితే ఆమె తండ్రి రాజేష్ 38 ఏళ్ల వయసులో చనిపోయాడు. మద్యానికి బానిసై చనిపోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి రాజేష్ ఒకప్పుడు తెలుగులో గొప్ప నటుడు. ఆ తర్వాత ఐశ్వర్య పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు రాజేశ్ భార్య ఉన్న ఆస్తులన్నీ అమ్మేసింది. చెన్నైలోని టీనగర్లో ఉన్న ఓ ఫ్లాట్‌ను విక్రయించింది. ఆ తర్వాత అద్దె ఇంట్లో ఉన్న ఐశ్వర్య కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఓ ప్రమాదంలో ఐశ్వర్య ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తానే తీసుకుంది. ఓ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో మనాడ మైలాడ అనే రియాల్టీ షోలో విజేతగా నిలిచిన ఆమెకు ఆవగలం వీరిగళంలో ప్రియురాలి పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టకత్తి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది. (ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!) తాజాగా ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. తాను ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో తన అన్న, అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమె జీవితంలో కష్టాలను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. చిన్నతనంలోనే తండ్రి, అన్నయ్యలను కోల్పోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య
హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలుగమ్మాయే కానీ టాలీవుడ్లో రెండే సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ, నానితో కలిసి నటించిన ఆ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయాయి. తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కన బెడితే.. ఈ భామకు తెలుగులో మరో అవకాశం రాలేదు. అలా అని తమిళంలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుందా అంటే అదీ లేదు. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్య చెన్నైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య.. ఇండస్ట్రీ, స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) నన్ను గుర్తించట్లేదు 'తమిళంలో 'కాకా ముట్టై' సినిమాలో చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ చిత్రం చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నన్ను మెచ్చకుంది. అంతా బాగా జరుగుతుంది అనుకునేలోపు ఆఫర్స్ రాకపోవడం షాకయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్లు ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నా కెరీర్ చూసుకుంటే ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటివాళ్లు తప్ప స్టార్ హీరోలు వాళ్ల మూవీస్ లో ఛాన్సులు ఇవ్వట్లేదు. ఇక్కడ సమస్య.. హీరో హీరోయిన్ కి మధ్య ఉన్న ఓ విషయం' నా సినిమాకు నేనే హీరో 'మార్కెట్ విలువ, డిజిటిల్, శాటిలైట్, ఓటీటీ.. ఇలా అన్నీ చూసుకుని హీరోయిన్ ని తీసుకుంటున్నారు. మనం ఆశించిన స్థాయిలో ఉండాలంటే దేనికైనా రెడీ అవ్వాలి. అందుకే నేను స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాను. ఇప్పటివరకు అలాంటివి 15 వరకు చేశాను. కానీ ఇప్పటికీ ఏ స్టార్ హీరో నాకు అవకాశం ఇవ్వట్లేదు. అసలు ఎందుకు పిలవట్లేదో కూడా తెలియదు. అయితేనేం నేను సంతోషంగానే ఉన్నాను. నా సినిమాకు నేనే హీరోగా చేస్తాను. స్టార్ హీరోల సినిమాలు చేయట్లేదని బాధలేదు. ఎందుకంటే నాకంటూ అభిమానులున్నారు' అని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) -
క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
బ్లూ శారీలో ఐశ్వర్య రాజేశ్.. మరింత బోల్ట్‌గా సీతారామం బ్యూటీ పోజులు!
►బ్లాక్ డ్రెస్‌లో టాక్సీవాలా భామ ప్రియాంక జువాల్కర్ పోజులు! ►బ్లూ శారీలో కవ్విస్తోన్న ఐశ్వర్య రాజేశ్! ►మరింత బోల్డ్ లుక్‌లో ది నైట్ మేనేజర్ నటి శోభిత ధూలిపాల! ►షూట్ ధరించిన యాంకర్ సుమ కనకాల! ► బ్లాక్ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) -
‘పుష్ప’ శ్రీవల్లితో ఐశ్వర్య పంచాయితీ..రష్మిక రియాక్షన్ ఇదీ!
సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటే! వారు పొరపాటున నోరు జారినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా విమర్శించేందుకు రెడీగా ఉంటారు నెటిజన్లు. అందుకే చాలామటుకు ఆచితూచి మాట్లాడుతుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారి మాటలు, చేష్టలు జనాలకు అస్సలు నచ్చదు. ఫలితంగా సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడకా తప్పదు! తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విషయంలో అదే జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు ఇచ్చి ఉంటే రష్మిక మందన్నా కంటే బాగా చేసేదాన్ని అని చెప్పినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక ఫ్యాన్స్ మండిపడటంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది ఐశ్వర్య. 'ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమలో ఎలాంటి పాత్రలు పోషించాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి బదులుగా నాకు తెలుగు చిత్రపరిశ్రమ అంటే ఎంతో ఇష్టం. నచ్చిన కథాపాత్రలు వస్తే కచ్చితంగా తెలుగులో నటిస్తానని చెప్పాను. ఉదాహరణకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని చెప్పాను. దురదృష్టవశాత్తూ నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక నటనపై నేను ఎలాంటి కామెంట్ చేయలేదు. సహనటిగా తనపై నాకు ఎంతో అభిమానం ఉంది' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై రష్మిక మందన్నా స్పందించింది. 'హాయ్ లవ్.. ఇప్పుడే చూశానిదంతా! నీ మాటల వెనుక ఉన్న భావాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వు దానికి వివరణ ఇవ్వాల్సిన పని లేదు. నీపై నాకు ఎంత ప్రేమ, గౌరవం ఉందో నీకు బాగా తెలుసు. ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చావు కదా! అందుకు ఆల్ ద బెస్ట్' అంటూ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వివాదానికి తెర పడింది. From the desk of Aishwarya Rajesh#AishwaryaRajesh @aishu_dil pic.twitter.com/J78oNsWQ9B — Yuvraaj (@proyuvraaj) May 17, 2023 చదవండి: షూటింగ్లో ప్రమాదం, సల్మాన్ ఖాన్‌కు గాయాలు -
ఇక చాలు ఆపండి, రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిక్కుల్లో పడింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు ఇచ్చి ఉంటే రష్మిక మందన్నా కంటే కూడా బాగా చేసేదాన్ని అని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. మా రష్మిక కంటే నువ్వేమైనా తోపా? అని ఆమె అభిమానులు ఐశ్వర్యను ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. దీంతో ఓ మెట్టు దిగి వచ్చిన సదరు హీరోయిన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 'ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు నేను.. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తానని చెప్పాను. పుష్పలో శ్రీవల్లి వంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయి. అలాంటి రోల్స్ ఇష్టపడతానని సమాధానమిచ్చాను. దురదృష్టవశాత్తూ నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక మందన్నా పనితనాన్ని నేను కించపరిచినట్లు వార్తలు రాశారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. నా తోటి నటీనటులపై నాకు అపారమైన గౌరవం ఉంది. నేను మామూలుగా మాట్లాడిన మాటకు హానికరమైన ఉద్దేశ్యాలను జోడించి పుకార్లు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపేయండి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ షేర్ చేసింది ఐశ్వర్య రాజేశ్. చదవండి: మెగా హీరో సెన్సేషన్.. వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష -
ఫర్హానా సినిమాపై విమర్శలు.. స్పందించిన చిత్రయూనిట్
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫర్హానా. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే ఫర్హానా చిత్రం ఒక మతాన్ని అవమానించే విధంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తమ సంస్థ నుంచి ఇంతకు ముందు పలు ప్రజాదరణ పొందిన కథా చిత్రాలు వచ్చాయన్నారు. వివాదాస్పద కథా చిత్రాలను నిర్మించడం తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదన్నారు. ఫర్హానా అందరూ చూడాల్సిన మంచి కథా చిత్రం అన్నారు. సెన్నార్ బోర్డు ధ్రువపత్రాన్ని పొంది విడుదల చేస్తున్న చిత్రమని పేర్కొన్నారు. అలాంటి చిత్రం గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే దీన్ని వివాదంగా మార్చడం సమంజసం కాదన్నారు. మతసామరస్యానికి చిహ్నం మన తమిళనాడు అని, ఫర్హానా ఏ మతాన్ని కించపరచదని తెలిపారు. మతసామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి చిత్రాలను తాము నిర్మించమని పేర్కొన్నారు. చదవండి: కస్టడీ నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా: నాగచైతన్య -
ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా...! కామెడీతో ఆడుకుంది
-
నాన్న తెలుగులో హీరో, నాకేమో ఇక్కడ ఆఫర్స్ రావడం లేదు: హీరోయిన్
ఐశ్వర్య రాజేశ్ మన తెలుగమ్మాయే. కానీ తను తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్యర్య మాట్లాడుతూ తెలుగు తెరకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'నేను తెలుగమ్మాయినే! మా నాన్న రాజేశ్, తాత తెలుగు సినిమాలు చేశారు. మా అత్త తెలుగులో 500కి పైగా సినిమాలు చేసింది. ఇంట్లో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాం. అమ్మ ఎప్పుడూ అడిగే ప్రశ్న.. మీ నాన్నగారు తెలుగులో హీరోగా 40 సినిమాలు చేశారు. నువ్వేమో ఒక్క సినిమా కూడా చేయట్లేదు అనేవారు. నేను ఎన్టీఆర్, ఏఎన్నార్లకు పెద్ద ఫ్యాన్. మంచి బ్లాక్‌బస్టర్ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అలా వరల్డ్ ఫేమస్ లవర్‌తో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేశాను. అప్పటికీ మా అమ్మ మళ్లీ ఓ ప్రశ్న అడిగింది. తమిళంలో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్నావు. మరి తెలుగులో ఎందుకు చేయవని ప్రశ్నించింది. అప్పుడు నేనేమన్నానంటే.. తెలుగులో అలాంటి సినిమాలు చేయాలంటే నేను పెద్ద స్టార్ అయి ఉండాలన్నాను. అయితే తెలుగు బిడ్డనయినప్పటికీ నాకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. స్టార్ హీరోల సరసన, పెద్ద సినిమాల్లో నటించే ఆఫర్స్ నాకు తక్కువగా వచ్చాయి' అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్. చదవండి: ఏడాదిన్నర కొడుకును నేలకేసి కొట్టిన నటి భర్త -
వారి నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది
‘‘ఫర్హానా’ నాకు స్పెషల్ మూవీ. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. డైరెక్టర్, నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’’ అన్నారు æ ఐశ్వర్యా రాజేష్. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫర్హానా’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ–‘‘సినిమాని సెలబ్రేట్ చేసే ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ మంచి కంటెంట్‌ని సెలబ్రేట్ చేస్తారు. ఆ నమ్మకంతో ‘ఫర్హానా’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం’’అన్నారు. ‘‘ఫర్హానా’ నా మూడో చిత్రం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది పక్కా తెలుగు సినిమాలా ఉంటుంది’’ అన్నారు నెల్సన్ వెంకటేశన్. ‘‘గత ఏడాది మేం రిలీజ్ చేసిన ‘ఒకే ఒక జీవితం’ని ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ‘ఫర్హానా’తో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్ఆర్ ప్రభు. ‘‘ఫర్హానా’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్, నటి ఐశ్వర్యా దత్తా. -
కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు) -
హీరోగా ఐశ్వర్య రాజేష్ సోదరుడు
నటి ఐశ్వర్య రాజేష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో కింద నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. కాగా తాజాగా ఆమె అన్నయ్య మణికంఠ రాజేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందే ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన డ్రైవర్ జమున చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించారు. అదేవిధంగా ఇటీవల బిగ్‌బాస్ రియాల్టీ గేమ్‌షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలో తన అన్నయ్యకు సపోర్టుగా నటి ఐశ్వర్యరాజేష్ ప్రచారం చేశారు కూడా. తాజాగా ఈయన కథానాయకుడుగా వెబ్‌సీరీస్‌లో నటిస్తున్నారు. దీనికి మైడియర్ డయానా అనే టైటిల్ నిర్ణయించారు. దీనికి పీకే విజయ్, గిరిధర్ రామ్ గణేశ్‌ల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాలక్ష్మి అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఐనాకుమార్, అక్షయ ప్రేమనాథ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌సీరీస్‌కు వాట్స్ ప్రభు చాయాగ్రహణం, గుహ గణేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌సీరీస్ శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వెబ్‌సీరీస్ యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. -
యంగ్ హీరోతో జతకడుతున్న ఐశ్వర్య రాజేశ్
సంగీత దర్శకుడిగా, నటుడి రాణిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈయన హీరోయిజానికే కాకుండా కంటెంట్‌కు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడిగా తమిళంతోపాటు తెలుగులోనూ దూసుకుపోతున్నారు. త్వరలో అతడు నటి ఐశ్వర్య రాజేష్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన ఐశ్వర్య రాజేశ్ తానేమిటో నిరూపించుకుని కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు. కాగా శుక్రవారం చెన్నైలో జరిగిన ఫ్రూబే షాపు ప్రారంభోత్సవ వేడుకలో జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కాంబినేషన్లో సినిమా రానున్నట్లు ధ్రువీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చదవండి: ఆ విషయంలో నయనతార కంటే హన్సిక ముందంజ సుశాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్, వీడియో వైరల్ -
నిర్మాతల లాభాలపైనే నా పారితోషికం: నటుడు బాలాజి
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఏ.లక్ష్మణన్, వెంకట్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రన్ బేబీ రన్. నటుడు దర్శకుడు ఆర్జే బాలాజి కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేష్ కథానాయకిగా నటించారు. నటి రితిక, వివేక్ ప్రసన్న, విశ్వ, రాజా అయ్యప్ప ప్రధాని పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ చాయాగ్రహణం, శ్యాంసిఎస్ సంగీతాన్ని అందించారు. చదవండి: నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ మలయాళ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక టీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు జయన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తాను మలయాళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో చిత్రం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ కథను లక్ష్మణన్‌కు చెప్పగా ఆయనే నటుడు ఆర్జే బాలాజీని హీరోగా సూచించారన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కథ వినగానే బాగా నచ్చిందని అంతగా దర్శకుడు కథను పకడ్బందీగా తయారు చేశారని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ తనను కలిసి చిరునవ్వుతోనే కథలు చెప్పారన్నారు. అంద 7 నాట్కళ్ చిత్రం కె..భాగ్యరాజ్‌కు మరుజన్మే ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రతిభావంతులైన టీమ్‌ను నియమించుకున్నారన్నారు. నిర్మాత లక్ష్మణన్ ఖర్చుకు వెనకాడకుండా ప్రముఖ సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని భారీగా నిర్మించారన్నారని తెలిపారు. తన పారితోషికం గురించి అడుగుతున్నారని, అది నిర్మాతల లాభాలను బట్టి ఉంటుందని ఆర్జే బాలాజి పేర్కొన్నారు. -
మహిళా ఆటో డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె ఇప్పుడు సాధారణ హీరోయిన్ గానే కాదు. లేడీ ఓరియంటెడ్ కథా త్రాల హీరోయిన్గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటింన చిత్రం డ్రైవర్ జమున. మహిళా డ్రైవర్‌గా బలమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించారు. కింగ్స్ లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ గురువారం ఒక ప్రైవేట్ చానల్లో మహిళా ఆటోడ్రైవర్లను కలిశారు. ఇందులో చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికిపైగా మహిళ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రీల్ మహిళా డ్రైవర్ ఐశ్వర్య రాజేష్‌తో రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. నటి ఐశ్వర్య రాజేష్ వారి సాధక బాధకలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను కానుకగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు అభినందిస్తున్నారు. -
ముగ్గురు పిల్లల తల్లిగా ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: ఆరంభ దశలోనే కాక్కాముట్టై త్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిం తన నట జీవితానికి గట్టి పునాదులు వేసుకున్న నటి ఐశ్వర్యరాజేష్. ఆ తర్వాత కథా బలమున్న చిత్రాల్లో నటిస్త హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా ఎదిగారు. తాజాగా ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటించనుండడం విశేషం. ఈ చిత్రం పేరు ఫర్హానా. ఇంతకుముందు ఒరునాళ్ కత్తు, మాన్స్టర్ చిత్రాలతో విజĶæలను అందుకున్న దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. వైవిధ్య భరిత కథా చిత్రాలు ని ర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. నటి ఐశ్వర్య రాజేష్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు రమేష్ చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ఐ శ్వర్య దత్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ స్పె షల్ అపిరెన్స్ ఇవ్వడం విశేషం. దీనికి జస్టిన్ ప్రభాకర్ సంగీతాన్ని, గోకుల్ పినాయ్ చాĶæగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తె లుపుతూ ఎప్పుడు జనసంచారంతో నిండి ఉండే ప్రాంతం చెన్నైలోని ఐస్‌హౌస్ అన్నారు. ఈ చిత్ర కథానాయిక నివసించే ప్రాంతం అదేనన్నా రు. స్థానిక ప్యారిస్ ప్రాంతం కూడా ఇలానే ఉంటుందన్నారు. టెక్నాల జీ ఎంత అభివృద్ధి చెందుతున్నా నగరం ఎంతగా విస్తరిస్తున్నా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఎదుగుదలే కనిపించదన్నారు. అ లాంటి ఐస్‌హౌస్ ప్రాంతమే ఫర్హానా చిత్ర నేపథ్యం అ న్నారు. అక్కడ ఒక పేరున్న చెప్పుల దుకాణాన్ని ని ర్వహించే ఐశ్వర్య రాజేష్ కాలానుగుణంగా ఆ వ్యా పారం కుంటుబడడంతో ముగ్గురు పిల్లలతో కూడి న కుటుంబపోషణ నిమిత్తం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అలాంటి ఆమె జీవిత పయనమే ఫర్హానా అని తెలిపారు. ఫర్హానా పాత్రలో ఐశ్వర్యరాజేష్ అద్భుతంగా నటించారని, జిత్త న్ రమేశ్ ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటించారని చెప్పారు. -
తొలిసారి జతకట్టిన జీవీ ప్రకాశ్-ఐశ్వర్య రాజేశ్
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేశ్ తొలిసారిగా జతకడుతున్నారు. వీరిద్దరు హీరోహీరోయన్లుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సేతుమ్ అయిదు పొన్ చిత్రం ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నోట్ మేక్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకు ముందు మలయాళంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ది టీచర్ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాణిక్ చిత్రాన్ని రూపొందిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్ గీతాకైలాసం, బ్లాక్ షీప్ నందిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, కృపాకరన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్ర పూజా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చదవండి: ‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్ -
‘డ్రైవర్ జమున’లో యాక్షన్ సీన్స్ డూప్ లేకుండ చేశా: హీరోయిన్
లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న నటి ఎవరంటే ఐశ్వర్యరాజేష్ అని చెప్పవచ్చు. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డ్రైవర్ జమున’. 18 రీల్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వత్తికుచ్చి చిత్రం ఫేమ్ కింగ్స్ లిన్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్, ధరెంతంటే! ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి ఐశ్వర్యరాజేష్ మాట్లాడుతూ.. డ్రైవర్ జమున చిత్రం తనకు చాలా స్పెషల్ అన్నారు. కింగ్స్ లిన్ ప్రతిభావంతుడైన దర్శకుడని, ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని చెప్పారు. ఈ చిత్రం తరువాత ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఇందులో క్యాబ్ డ్రైవర్‌గా నటించిన తాను ఫైట్స్, రిస్కీ సన్నివేశాలను డూప్ లేకుండా నటించానని చెప్పారు. చదవండి: వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా? తనకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అని, ఈ చిత్రంలో 70 శాతం కార్ డ్రైవింగ్ సన్నివేశాలే ఉంటాయని తెలిపారు. దీంతో ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపారు. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తున్నట్లు ఉన్నారు అన్న ప్రశ్నకు ఐశ్వర్యరాజేష్ బదులిస్తూ అలా ప్లాన్ చేసి నటించడం లేదని, వచ్చిన అవకాశాల్లో మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు చెప్పారు. అలాగని హీరోల చిత్రాల్లో నటించనని చెప్పడం లేద న్నారు. అలాగే తెలుగు తదితర ఇతర భాషలో నటిస్తున్నా, ప్రస్తుతానికి తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లు ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. -
ఐశ్వర్య రాజేశ్ ‘స్వప్న సుందరి’ షూటింగ్ పూర్తి
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్వప్న సుందరి’. వైవిధ్య భరిత పాత్రలకు కేరాఫ్‌గా ఉన్న నటి ఈమె. కాగా ఇంతకుముందు పలు భారతీయ చిత్రాలను విదేశాల్లో పంపిణీ చేసిన హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ వ్యూ బాక్స్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం స్వప్న సుందరి. ఈ చిత్రానికి లాకప్ చిత్రం ఫేమ్ ఎస్.జీ.చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటి లక్ష్మీప్రియ, దీప శంకర్, కరుణాకర్, రెడిన్ కింగ్స్ లీ, మైమ్ గోపీ, సునీల్‌రెడ్డి, అగస్టీన్, బిజాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాలమురుగన్, విఘ్నేష్ రాజగోపాలన్‌ల ద్వయం ఛాయాగ్రహణం, విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని, అజ్మల్ పాటలకు సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది డార్క్ కామెడీ జానర్లో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. నటి ఐశ్వర్య రాజేష్ చిత్రంలో వినోదభరిత పాత్రలో చాలా చక్కగా నటించారని చెప్పారు. చిత్ర కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయన్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిందని, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే చిత్ర టీజర్‌ను, సింగిల్ ట్రాక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
డార్క్ కామెడీ నేపథ్యంలో.. ‘స్వప్న సుందరి’
తమిళ సినిమా: భారతీయ చిత్రాలను విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్రముఖ సంస్థ హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ, వ్యూ బాక్స్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం స్వప్న సుందరి. నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి లక్ష్మీ ప్రియ, దీపా శంకర్, కరుణాకరన్, రెడిన్ కింగ్స్ లీ, మైమ్ గోపి, సునీల్ రెడ్డి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. లాకప్ చిత్రం ఫేమ్ ఎస్జీ చార్లెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలమురుగన్, విఘ్నేష్ రాజగోపాలన్ ద్వయం ఛాయగ్రహణం, అజ్మల్, శివాతి్మక ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను తెలుపుతూ.. డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న వైవిధ్య భరిత కథాచిత్రం ఇదని చెప్పారు. నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా హాస్య భరిత పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. డార్క్ కామెడీ కథా చిత్రాలు తమిళ సినిమాకు పరిచయమేనని ఆ తరహాలో వస్తున్న మరో విభిన్న కథా చిత్రం స్వప్న సుందరి అని తెలిపారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని చెప్పారు. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్
చిన్నతనంలో ఐశ్వర్య రాజేష్ చాలా కష్టాలు పడిందట. పేరులో ఉన్న ఐశ్వర్యం తన జీవితంలో లేదని వ్యాఖ్యానించింది. ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారని తెలిపింది. జీవితం తనకు రకరకాల పాఠాలను నేర్పిందని, సినిమా రంగ ప్రవేశానికి ముందు ఆ తర్వాత కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయని వాపోయింది. స్టార్ కథానాయకి పేరు రాకపోయినా పర్వాలేదనీ, మంచి నటి అన్న పేరు తెచ్చుకుంటే చాలన్నారు. తాను నటించిన చిత్రాలు ప్రేక్షకుల మనసులో పదికాలాలపాటు నిలిచిపోతే చేయాలన్నదే తన ఆశని వివరించింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పేరు తెచ్చుకుంది. మాతృభాషలోనూ రాణిస్తోంది. చిన్న చిన్న పాత్రలతోనే ఈమె కెరీర్ ప్రారంభమైంది. కాక్కా ముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కేరీర్‌ను మలుపు తిప్పింది. అందులో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అద్భుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా కథానాయికగా అవకాశాలు తలుపు తట్టాయి. కనా వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంల్లో నటించి తన నటనా సత్తాను చాటారు. ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. -
పారిస్ నగరంలో అందాల ఐశ్వర్య రాజేష్..
నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం డ్రైవర్ జమున చిత్రంలో కాల్‌టాక్సీ డ్రైవర్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బికిన్స్ లిన్ దర్శకత్వం వహించగా, జీబ్రాన్ సంగీతం సమకూర్చారు. 18 రీల్స్ బ్యానర్‌పై చౌదరి నిర్మిస్తున్నారు. కన్నన్ దర్శకత్వం వహించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈఫిల్‌టవర్ దగ్గర దిగిన ఫొటోలను తన ఇన్‌స్ర్ట్రాగామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యక ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తింది. రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డ్రైవర్ జమున’ అనే పేరును ఖరారు చేశారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఐశ్వర్య రాజేష్
నటి ఐశ్వర్య రాజేష్ కథానాయుకగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హ్యాబాక్స్ స్టూడియోస్, హంసినీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్జీ చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి లక్ష్మీప్రియే, నటుడు సునీల్‌రెడ్డి, కరుణాకరన్, మైమ్ గోపి, దీపాశంకర్, కింగ్స్ లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల మురుగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య రాజేష్‌కు ఈ చిత్రం కచ్చితంగా అవార్డులు, రివార్డులు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఊహించని మలుపులతో కామెడీ, పోరాట దృశ్యాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందన్నారు. త్వరలో చిత్ర టైటిల్ తదితర వివరాలను వెల్లడిస్తామన్నారు. -
సహజ నటనతో కట్టిపడేసే తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్
-
తెలుగు తెరపై మలయాళ కుట్టీల హవా.. పవన్, మహేశ్ సినిమాల్లో చాన్స్!
కొత్త సినిమా చర్చ జరుగుతోంది... చర్చ హీరోయిన్ దగ్గర ఆగింది... కొత్త హీరోయిన్ కావాలి... ‘హల్లో మల్లు’ అంటూ టాలీవుడ్ నుంచి మల్లూవుడ్కి ఫోన్ వెళ్లింది.. అలా ఈ ఏడాది అరడజనకు పైగా కేరళ కుట్టిలకు ఫోన్ వెళ్లింది.. తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ మలయాళ కుట్టీల గురించి తెలుసుకుందాం. బాలనటి నుంచి హీరోయిన్గా మారి మలయాళం, తమిళ ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు నజ్రియా నజీమ్. ‘నిరమ్’, ‘రాజారాణి’, ‘బెంగళూరు డేస్’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాల్లోని నటన నజ్రియాను స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ నాని తాజా సినిమా ‘అంటే.. సుందరానికీ’తో తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు.. నజ్రియా భర్త, ప్రముఖ మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక బుల్లితెరపై సూపర్ హిట్ అయి, ఇప్పుడిప్పుడే వెండితెరపై ఫేమస్ అవుతున్న రజీషా విజయన్ ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగులో తొలి అడుగు వేశారు. రవితేజ హీరోగా శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్ అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’, ‘విశ్వాసం’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొంది, ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. మలయాళ హిట్ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా నటిస్తున్నారు అనిఖా. ఇందులో విశ్వస్ సేన్ హీరో. మరోవైపు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే దాదాపు పదిహేను సినిమాలను ఖాతాలో వేసుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పీరియాడికల్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఓ కీ రోల్ చేసే చాన్స్ దక్కించుకున్నారు ఐశ్వర్యా లక్ష్మీ. ‘గాడ్సే’ ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం కానున్నారామె. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకుడు. ఇంకోవైపు మ్యూజిక్ వీడియోస్‌తో ఫేమస్ అయి, హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్నారు సౌమ్యా మీనన్. ఈ బ్యూటీ మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఇక పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు సంయుక్తా మీనన్. ఇందులో రానాకు జోడీగా నటిస్తున్నారు సంయుక్తా. అలాగే కల్యాణ్ రామ్ ‘బింబిసారా’లో కూడా ఓ హీరోయిన్గా నటిస్తున్నారు సంయుక్తా మీనన్. మరి.. ఈ మల్లూవుడ్ కుట్టీలు తెలుగు తెరను ఏ రేంజ్లో రూల్ చేస్తారో చూడాలి. -
కాజల్ ప్లెస్‌లో త్రిష.. సాయేషా స్థానంలో ప్రగ్యా.. చివరి క్షణంలో మారిన తారలు
‘యస్... ఈ సినిమా చేస్తా’... హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘అయ్యో... కుదరడం లేదండీ’... కొన్నాళ్లకు రెడ్ సిగ్నల్ పడింది. మళ్లీ కొత్త హీరోయిన్ వేటలో పడింది సినిమా యూనిట్. ఈ మధ్యకాలంలో ఇలా తారుమారు అయిన తారల జాబితా చాలానే ఉంది. ఒకరు తప్పుకుంటే.. ఇంకొకరికి ఆ చాన్స్ దక్కింది. ఆ ‘తారమారె’ విశేషాలు తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ‘ఆచార్య’ తొలి ప్రియురాలు త్రిషే. 2016లో వచ్చిన ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మరోసారి ‘ఆచార్య’ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకోవడం, ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ రీప్లేస్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ‘ఆచార్య’ చిత్రంలో త్రిష ప్లేస్‌ను కాజల్ రీప్లేస్ చేస్తే కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోల్‌ను త్రిష రీప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ‘భారతీయుడు 2’ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆ పాత్రకు త్రిషను సంప్రదించారట చిత్రదర్శకుడు శంకర్. ‘భారతీయుడు 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తాజా చిత్రాలు ‘పొన్నియిన్ సెల్వన్’, ‘రాంగీ’ (ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది)లో త్రిష నటించారు. సో.. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధం, కమల్‌తో సినిమా కాబట్టి ‘భారతీయుడు 2’కి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగూ ‘భారతీయుడు 2’ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి... ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర నుంచి ఐశ్వర్యా రాజేశ్ కొన్ని కారణాల వల్ల∙తప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మాటకొస్తే ‘భారతీయుడు 2’ సినిమాయే కాదు.. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’లో రానా భార్య పాత్ర ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు ఐశ్వర్యా రాజేశ్. దాంతో రానా భార్యగా సంయుక్తా మీనన్ సీన్లోకి వచ్చారు. ఇక 2015లో ‘అఖిల్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన సాయేషా సైగల్ చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకున్న చిత్రం బాలకృష్ణ ‘అఖండ’. అయితే ఆర్యను పెళ్లి చేసుకున్న సాయేషా తల్లయ్యారు. దాంతో ఆమె ప్లేస్‌ను ప్రగ్యా జైస్వాల్ రీప్లేస్ చేశారు. ఇంకా నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర అమలాపాల్‌కు దక్కిందన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు హిందీకి వెళితే.. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో కథానాయికగా నటించడానికి ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు కీర్తీ సురేశ్. ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇదిలా ఉంటే.. తొలి హిందీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఓ తమిళ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నారు నయనతార. అయితే షారుక్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ కారణంగా యువరాజ్ దయాలన్స్ దర్శకత్వంలో అంగీకరించిన తమిళ సినిమాకు డేట్స్ కేటాయించలేక నయనతార వదులుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటించే అవకాశం శ్రద్ధా శ్రీనాథ్ సొంతమైనట్లు టాక్. వీరే కాదు.. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రీప్లేస్ అయిన తారలు ఇంకొందరు ఉన్నారు. -
‘ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా’.. అన్నట్లు కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్
-
డబ్బింగ్‌కే పదిహేను రోజులు పట్టింది
‘‘రిపబ్లిక్’ పక్కా కమర్షియల్ మూవీ కాదు.. డిఫరెంట్ మూవీ.. రియల్ స్టోరీ ఆధారంగా దేవ కట్టాగారు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు 22 రోజులు పని చేశాం. అయితే డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది. అంటే.. డైరెక్టర్‌గారు ఎంత పర్ఫెక్షన్ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్ చెప్పిన విశేషాలు. ► కరోనా సమయంలో ఓ రోజు దేవ కట్టాగారు ఫోన్ చేసి, ‘రిపబ్లిక్’ స్క్రిప్ట్ గంట పాటు చెప్పారు. హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిశాక ఐదారు గంటల పాటు కథ చెప్పారు. హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారాయన. ఈ చిత్రంలో మైరా అనే ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్ ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉండదు. ► సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా. సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. తన కెరీర్లో ‘రిపబ్లిక్’ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ► ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. పెర్ఫార్మెన్స్ అయినా, గ్లామర్ రోల్స్ అయినా చక్కగా చేస్తారు. అనుష్కగారంటే ఇష్టం. సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. -
సోషల్ హల్చల్: బాధను ఇలా దాచమంటున్న మోనాల్, కింగ్-కాంగ్‌తో ధనుష్
► కింగ్-కాంగ్‌కు గ్రాండ్ వెల్కమ్ అంటూ ఇంటికి ఆహ్వానించిన హీరో ధనుష్ ► అప్పట్లో ఇనోసెంట్ని అంటూ చీరకట్టు ఫొటోలు షేర్ చేసి అనన్య ► బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలు పోతున్నా ఐశ్వర్య రాజేష్ ► నవ్వుతో బాధను ఇలా కప్పేయమంటున్న బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ► ఫ్యాన్స్‌ను షూక్రియా అంటూ పలకరించిన భూమిక ► కూతురికి నటుడు ఆలీ బర్త్‌డే విషెస్ View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) View this post on Instagram A post shared by Ali (@ali_the_actor) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
'భూమిక' నాకు చాలా స్పెషల్ : హీరోయిన్ ఐశ్వర్య
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'భూమిక' చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఫ్యాషన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించారు. పృధ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా,రాబర్ట్ ఛాయాగ్రహణం అందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా ఎకో హారర్ థ్రిల్లర్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు. 'భూమిక' నాకు చాలా స్పెషల్ అని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. కథ కొత్తగా అనిపించడంతో భూమిక చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపింది. . ఇది ఐశ్వర్య రాజేష్‌కు 25వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర 23వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో నెటిఫ్లిక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కావడంతో పాటు విజయ్ టీవీలోనూ ప్రసారం కానుండటం విశేషం. చదవండి : Chiranjeevi Birthday: బర్త్‌డే రోజు ఇలా చేయండి.. ఫ్యాన్స్‌కు చిరు పిలుపు ఆకట్టుకున్న విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్ సింగిల్ -
తెలుగింటి ఆడపడుచుని, రంభలా ఆ పాత్రలు చేయాలని ఆశ: కోలీవుడ్ నటి
చిన్నతనంలో చిత్రాలు చూసినప్పుడు నటి రంభలా తాను కూడా గ్లామరస్ పాత్రలో నటించాలని ఆశపడేదాన్నని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఈమె తాజా చిత్రం తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో నవ నటుడు సుభాష్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని తెలిపారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను ఇందులో పోలీసు అధికారిగా నటించినట్లు తెలిపారు. తను తెలుగింటి ఆడపడుచునని.. చిన్నతనంలో రంభలా గ్లామరస్‌గా నటించాలని ఆశించేదానన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని, అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఈ అమ్మడు తన సినిమా సెలక్షన్లో ఆచితూచి అడుగులు వేస్తుందని, పాత్ర నచ్చితే తప్ప రోల్ చేయడానికి అంగీకరించదని వినికిడి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాకు ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇటీవల ఇందులో ఓ ముఖ్య పాత్రలో ఈ భామ కనిపించనుందని సమాచారం. బన్నీకి చెల్లెలుగా ఐశ్వర్య కనిపించనున్నట్లు అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. -
పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ (బన్నీ)కు చెల్లెలుగా ఐశ్వర్యా కనిపించనున్నట్లు టాక్. అంతేకాకుండా అనుకోసి పరిస్థితుల్లో ఐశ్వర్యా చనిపోతుందని, దీనికి ఓ పోలీసు అధికారే కారణం అవుతాడని,దీంతో అతడిపై పుష్పరాజ్ ఎలా పగ తీర్చుకుంటాడన్న కథాంశాంతో మూవీ ఉండనుందట. మరి ఈ రోల్‌కు ఐశ్వర్యా ఓకే చెబుతుందా? లేక సిస్టర్ రోల్ అని సైడ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటి ఊశ్వరిరౌటేలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇలా అన్ని హంగులతో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి : మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్ 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి' -
ఐశ్వర్య రాజేష్ రీమేక్ మూవీలను ఎందుకు తిరస్కరిస్తోంది?
బహుభాష నటిగానే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళంలో కనా, క.పే.రణసింగం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర తమిళ రీమేక్‌లో ఈమె నటిస్తున్నారు. నటుడు రాహుల్ రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కారైక్కుడి లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ ఇందులో నటించడం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా చిత్రాలను రీమేక్ చేయడం సులభమైన విషయం కాదన్నారు. అదేవిధంగా చిత్రానికి ఒరిజినల్ ఫీల్ తీసుకురావడం కష్టం అన్నారు. అందుకే తాను పలు రేమేక్ చిత్రాలను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కచ్చితంగా నటించాలని భావించానన్నారు. కారణం ఈ చిత్రంలో సమాజానికి అవసరమైన మంచి సందేశం ఉందన్నారు. తాను ఇంతకుముందు క.పే.రణసింగం చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక యువతని కలిసి ఉన్నాను. ఆమెకు పెళ్లంటే తెలియని వయసులోనే వివాహం జరిగిపోయిందన్నారు. సమాజంలో మహిళల అభిప్రాయాలకు విలువ లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. చదవండి: ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు -
టాక్సీ డ్రైవర్ అవతారమెత్తిన ఐశ్వర్యా రాజేష్
వైవిధ్య భరిత కథా పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళంతో పాటు తెలుగులో కూడా గట్టిగా తన సత్తాను చాటుకుంటున్న ఈ నటి తాజాగా ట్యాక్సీడ్రైవర్ అవతారమెత్తారు. డ్రైవర్ జమున అనే చిత్రంలో నటి ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 18 రీల్స్ పతాకంపై డాక్టర్ ఎస్పీ చౌదరి నిర్మిస్తున్నారు. వత్తికుచ్చి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కిన్స్ లిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ఉగాది సందర్భంగా మంగళవారం చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ కథ వినగానే ఇందులో నటించడానికి ఐశ్వర్య రాజేష్ వెంటనే అంగీకరించారని తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ కాల్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి టాక్సీ డ్రైవర్‌గా నటించనున్నారనగానే డ్రైవర్ జమున చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయని నిర్మాత ఎస్వీఎస్ చౌదరి తెలిపారు. చదవండి: జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా? ప్రేక్షకులకు పండగ కానుక.. కొత్త కళలు -
దేవా కథ చెబుతానంటే వద్దన్నాను: సుకుమార్
‘‘ప్రస్థానం’ సినిమాని మనం ఇప్పటికీ మరచిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్, న్యారేషన్ అంత గొప్పగా ఉంటాయి. ‘రిపబ్లిక్’ కథను దేవా చెబుతానంటే వద్దన్నాను. ఎందుకంటే ఓ మంచి దర్శకుడి కథను వినకూడదు.. చూడాలి. ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేశారు. దేవా కట్టా మాట్లాడుతూ– ‘‘సుక్కు సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ‘బాహుబలి’ ఎంత ల్యాండ్ మార్క్ సినిమానో ‘రంగస్థలం’ కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. ‘రంగస్థలం’ కారణంగానే ‘రిపబ్లిక్’ చేశాను’’ అన్నారు. ‘‘సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ‘రిపబ్లిక్’ చిత్రం’’ అన్నారు జె.పుల్లారావు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జె.భగవాన్ . సాయితేజ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు టీచర్ అయితే, బుచ్చిబాబు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.. దేవాగారు మిడిల్ బెంచ్, నేను లాస్ట్ బెంచ్. నిజాయతీగా చేసిన ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. మణిశర్మగారితో పని చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నటులు మనోజ్ నందం, రవివర్మ, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ జై కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిక్సయిపో... ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పా!
‘‘కెరీర్ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ‘టక్ జగదీష్’. ఫుల్ ఎమోషనల్ డ్రామా. ఇది మన మట్టి సినిమా. మన తెలుగు సినిమా’’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది . ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాని మాట్లాడుతూ –‘‘టక్ జగదీష్’ ఫైనల్ కట్ చూసి, బయటకు రాగానే.. ఫిక్సయిపో.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని డైరెక్టర్‌తో చెప్పాను. సమ్మర్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్. మా సినిమానే కాదు... వేసవిలో విడుదలవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామా తీస్తానో.. లేదో తెలియదు. అందుకే నాకు తెలిసిన అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘గ్రేట్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఉన్న సినిమా ఇది. విడుదలయిన కొంతకాలం తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు’’ అన్నారు తమన్ . ‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌కు, యూత్‌కు నచ్చే ఓ మంచి సినిమా తీశాం’’ అన్నారు సాహు. -
మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న డైరెక్టర్
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దర్శక–నటుడు రాహుల్ రవీంద్రన్ . మలయాళంలో ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ’ సినిమా తమిళ రీమేక్‌లో రాహుల్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ . కన్నడ దర్శకుడు. ‘‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాను చూశాను. సూపర్‌గా ఉంది. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను తీయాలి. మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పటి నుంచే నా భార్య (గాయని, అనువాద కళాకారిణి చిన్మయి)కి కన్నడ తెలుసు. 2012లో వచ్చిన నా తమిళ సినిమా ‘విన్ మీన్ గళ్’ స్క్రీనింగ్ టైమ్‌లో కన్నన్ గారిని నేను కలిశాను. అప్పుడు నాతో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో వచ్చి నన్ను సంప్రదించినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఐశ్వర్యా రాజేష్‌లాంటి అద్భుతమైన నటితో నటించడం ఓ చాలెంజ్’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్ . కొత్తగా పెళ్లయిన దంపతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అత్తింటికి తగ్గట్టు ఒదిగిపోవడానికి ఓ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడుతుందనేది ప్రధానాంశం. మలయాళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. -
భరతం పట్టడానికి రెడీ
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా అదేరోజు ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ‘‘అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి..’ అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
డ్రైవర్ జమున
కొత్త సినిమా కోసం స్టీరింగ్ తిప్పడానికి రెడీ అయ్యారు ఐశ్వర్యా రాజేశ్. ఆదివారం ఐశ్వర్యా రాజేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తమిళంలో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. ‘డ్రైవర్ జమున’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కమిట్ అయినట్టు తెలిపారు. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నారు ఐశ్వర్య. కి న్సిలిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘‘ఇలాంటి స్పెషల్ రోజున ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాజేశ్. తెలుగులో నానితో ‘టక్ జగదీష్’లో కనిపించనున్నారు ఐశ్వర్యా రాజేశ్. -
నాని ‘టక్ జగదీశ్’ నుంచి క్రేజీ అప్డేట్
నాచ్యురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నానిని పెళ్లి కొడుకును చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని . టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతుంది తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🤗 APRIL 16th, 2021 పేరు గుర్తుందిగా..... :)#TuckJagadish pic.twitter.com/ZFHEUGi44F — Nani (@NameisNani) January 9, 2021 -
ఈ ఏడాది ప్లాన్ ఇదే
కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ ఏడాది ఏమేం చేయాలా అని ఆల్రెడీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు చాలామంది. మరి మీ ప్లాన్స్ ఏంటి అని హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, లక్ష్మీ రాయ్‌ని అడిగితే ఇలా చెప్పారు. ఆరోగ్యం మీద మరింత దృష్టి పెడతాను 2020 మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదో చెప్పింది. రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలని గుర్తు చేసింది. ఫిట్నెస్ అనేది మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఫిట్నెస్ మనకు ఒకలాంటి ధైర్యాన్ని తీసుకువస్తుంది. మరింత పని చేసే శక్తి, ఉత్సాహం వస్తుంది. ఫిట్నెస్ వల్ల తెలియకుండానే ఒకలాంటి పాజిటివ్ లైఫ్‌స్టయిల్ అలవడుతుంది. ఇక నుంచి మరింత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తపడతాను. మన పూర్వీకులు తీసుకునే రాగులు, మిల్లెట్స్ అన్నీ నా డైట్లో భాగం చేస్తాను. అలానే ఈ ఏడాది కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లోనే భాగమవ్వడానికి ప్రయత్నిస్తాను. – ఐశ్వర్య 2020 నేర్పిన పాఠం మర్చిపోవద్దు గత ఏడాది మనలో చాలామందికి అనుకున్నట్టు జరగలేదు. కానీ మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. మనందరం మర్చిపోయిన విషయాల్ని గుర్తుచేసింది. ఇలాంటి కష్టమైన సందర్భాలే చాలా విషయాలను త్వరగా గ్రహించేలా చేస్తాయి. 2020 నాకు చాలా ఓపిక నేర్పింది. మనలోని ప్రతి ఒక్కరికీ, అలానే మన సమాజానికి మానవత్వం మరింత ముఖ్యం అని చెప్పింది. 2020 నేర్పించిన పాఠాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ పాఠాలతో ఈ మహమ్మారి దాటాలి. మళ్లీ మునుపటి పరిస్థితి త్వరగా వచ్చేలా చేసుకుందాం. – లక్ష్మీరాయ్ -
డబ్బింగ్ జగదీష్
తాజా చిత్రం కోసం టక్ జగదీష్గా మారారు నాని. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. ‘నిన్ను కోరి’ తర్వాత నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ కథానాయికలు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను సోమవారం ప్రారంభించారు నాని. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
ఐశ్వర్య చాలెంజ్
‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్యా రాజేష్. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఐశ్వర్య చాలెంజ్’. కె.ఎ. సూర్యనిధి దర్శకత్వంలో పద్మశ్రీ డా. కూటికుప్పల సూర్యారావు సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ బ్లెసింగ్స్‌తో విడుదల చేశారు. చిత్రనిర్మాణ, నిర్వాహకుడు వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చిత్రీకరణ అంతా మలేసియాలో జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఇచ్చిన రామసత్యనారాయణగారికి రుణపడి ఉంటాను. సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజిగారు ఈ చిత్రానికి మాటలు రాశారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో థియేటర్లలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. -
మీ ఊహకే వదిలేస్తున్నాం!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత మళ్లీ చిత్రీకరణలో బిజీ అయింది ఈ టీమ్. సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఓ ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం తమ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. ‘ఈ సన్నివేశం ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాం’ అని క్యాప్షన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఐశ్వర్య? ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు మరో కథానాయికగా ఐశ్వర్యా రాజేశ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని, ఎన్టీఆర్‌కు ఓ జోడీగా ఐశ్వర్య పాత్ర ఉంటుందని సమాచారం. చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
టక్‌తో రెడీ
నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం పునః ప్రారంభమైంది. ప్రస్తుతం వరి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌తో నాని, మరికొంతమంది నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘జగదీశ్ జాయిన్స్, టక్ బిగిన్స్’ అని షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన సందర్భంగా నాని పేర్కొన్నారు. జగపతిబాబు, రావు రమేశ్, సీనియర్ నరేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
హిట్ సినిమా రీమేక్‌లో...
తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్ నటిస్తారు. ఈ రీమేక్‌కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్ స్టూడియో బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్ని ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం. -
సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి
సాక్షి, హైదరాబాద్: 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం తెలుగులో నానితో ‘టెక్ జగదీశ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక తమిళంలో పలు ప్రాజెక్టులకు సంతాకాలు చేసిన ఐశ్వర్యకు చేతి నిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా సమంత స్థానంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తీస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్‌కు జోడిగా ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట దర్శకుడు సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చివరకు ఈ పాత్రకు దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరో హీరోగా లవర్ బాయ్ సిద్దార్థ నటింస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో గ్రాండ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు ఈ లవర్ బాయ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వు వస్తానంటే.. నేనొద్దంటానా’తో తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్ కొట్టిన సిద్దార్థ్‌కు ఆ తర్వాత సక్సెస్‌లు తక్కువే అని చెప్పుకొవచ్చు. 2016లో పలు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాల్లో నటించినప్పటికి అవి అంతగా గుర్తింపు పొందలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ ‘మహా సముద్రం’తో ఎంట్రీ ఇస్తున్నాడు. -
శర్వాకు జోడీగా...
‘ఆర్ఎక్స్ 100’తో సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. తన తదుపరి చిత్రం ‘మహాసముద్రం’ని శర్వానంద్ హీరోగా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఇందులో శర్వాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారని సమాచారం. ‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు ఐశ్వర్య. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రణసింగం నేరుగా ఓటీటీకే
విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘క పే రణసింగం’. విరుమాండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రైతుల పోరాటం నేపథ్యంలో ఉంటుంది. హీరోహీరోయిన్ రైతుల వైపు నిలబడి ఎలాంటి పోరాటం చేశారన్నది కథాంశం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో(జీ ఫ్లెక్స్) విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది జీ సంస్థ. పేఫర్ వ్యూ (డబ్బు కట్టి వీక్షించడం) పద్ధతిలో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. -
సవతులుగా వరలక్ష్మి–ఐశ్వర్య
రోజురోజుకీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఆదరణ పెరుగుతోంది. వెబ్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుండటంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీవైపు ఆసక్తి చూపుతున్నారు. పైగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. (చదవండి : నా కాన్సెప్ట్‌ను తస్కరించారు) సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, నిత్యా మీనన్ వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తాజాగా వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్యా రాజేష్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. మంచి భావోద్వేగ సన్నివేశాలున్న కథ కావడంతో ఇద్దరూ ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి అంగీకరించారట. దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ తెరకెక్కించనున్న ఈ సిరీస్‌ను ఆనంద వికటన్ సంస్థ నిర్మించనుంది. ఈ సిరీస్‌లో వరలక్ష్మి–ఐశ్వర్య సవతులుగా నటించనున్నారని సమాచారం. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయట. ఇద్దరూ మంచి నటీమణులే కాబట్టి పోటీపడి నటిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య
జీవితం చావడానికి కాదని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. కాక్కా ముట్టై చిత్రంతో తమిళ సినిమాకు తానేమిటో నిరూపించుకున్న నటి ఐశ్వర్య రాజేష్, ఆ తర్వాత వరుసగా కథానాయికగా చిత్రాలు చేస్తున్న ఈమె ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తాజాగా గ్లామర్ పాత్రలకు సిద్ధమవుతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్నారు. అలా గ్లామర్‌తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తున్నారు. ఆ విధంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ తరచూ వారితో సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల అభిమానులతో ముచ్చటించినప్పుడు ఒక అభిమాని మీరంటే తనకు ఎంతో అభిమానమని, మీ నటన చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. అదేవిధంగా మీ కోసం చావడానికి కూడా సిద్ధమని అన్నారు. దీంతో షాక్ అయిన నటి ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత తేరుకుని జీవితం చావడానికి కాదని అతనికి చెప్పింది. ఎప్పుడూ అలాంటి మాటలు అనవద్దని అతన్నుంచి ప్రామిస్ చేయించుకుంది. చదవండి: తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా! -
హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు
అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ పలు హిట్లను తన ఖాతాలో వేసుకొని అటు టాలీవుడ్ ఇటు కోలివుడ్లో ఫుల్ బిజీ నటిగా మారారు. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస లవర్’ చిత్ర ఫలితం ఎలా ఉన్నా సువర్ణ పాత్రలో ఐశ్యర్య నటను అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం నాని చిత్రంలో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని ఓ స్టార్ డైరెక్టర్ కించ పరచే విధంగా మాట్లాడాడు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు. అయితే ఈ అవమానాలేవి నన్ను ఆపలేదు. నేనుబోల్డ్గా ఉంటాను. ఆ లక్షణమే నన్ను నిలబెట్టిందనుకుంటాను. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. అందుకే.. బాధల్ని ఓర్చుకున్నాను’ అంటూ ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యానించారు. ఇక ఐశ్వర్య రాజేశ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేశ్ అప్పట్లో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేశ్ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నటికి కూడా లైంగింక వేదింపులు, వర్ణ వివక్ష తప్పకపోవడం గమనార్హం అని పలువురు వాపోతున్నారు. చదవండి: త్రివిక్రమ్ డైరెక్షన్.. వెంకీ, నాని హీరోలు! యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్లాన్ బి
ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయితే తన దగ్గర ప్లాన్ బి ఉందంటున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. ‘యువర్స్ షేమ్‌ఫుల్లీ’ షార్ట్‌ఫిల్మ్స్ ఫేమ్ విఘ్నేశ్ కార్తీక్ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దిట్టమ్ ఇరండు’లో కథానాయికగా నటిస్తున్నారామె. ‘ప్లాన్ బి’ అనేది ఉపశీర్షిక. లాక్ డౌన్‌కు ముందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘విఘ్నేశ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి అతనితో మాట్లాడాను. నేను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్’ అనే చేస్తున్న సమయంలో ‘దిట్టమ్ ఇరండు’ గురించి విఘ్నేశ్ చెప్పారు. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఇందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇదేదో సూపర్ ఉమెన్ సినిమా కాదు. వచ్చిన అపాయాలను తన ఉపాయాలతో ఓ మామూలు అమ్మాయి ఎలా పరిష్కరించింది? అన్నదే కథాంశం. స్క్రిప్ట్‌లోని ఊహించని మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి’’ అన్నారు విఘ్నేశ్. -
చిన్న విరామం
‘‘లాక్డౌన్ వల్ల భరతనాట్యం నేర్చుకునే వీలు కుదిరింది’’ అంటున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. లాక్డౌన్ వల్ల తన రోజులు ఎలా గడుస్తున్నాయన్న విషయంపై ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘లాక్‌డౌన్‌ను ప్రకటించగానే ముందు నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే నేనెప్పుడూ పనితో బిజీగా ఉండాలనుకుంటాను. గతంలో క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యత సంపాదించాలని ప్రయత్నించాను. అప్పట్లో కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల వల్ల నాకు కొంత ఖాళీ సమయం దొరికింది. దీంతో నేను ఎప్పుట్నుంచో కలలు కంటున్న భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇందుకోసం కొన్ని వారాలుగా ప్రతిరోజూ రెండు గంటలు ఆన్లైన్ క్లాసులను ఫాలో అవుతున్నాను. కానీ కాస్త బ్యాక్‌పెయిన్ రావడంతో ప్రాక్టీస్‌కు చిన్న విరామం ఇచ్చాను. ఈ నొప్పి తగ్గాక సాధన ప్రారంభిస్తాను. ఇంకా ఈ లాక్డౌన్ సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను థియేటర్లో చూడలేకపోయిన సినిమాలను ఇప్పుడు చూస్తున్నాను. టీవీ సీరియల్స్‌ను కూడా ఫాలో అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. -
నాతో నేను టైమ్ స్పెండ్ చేస్తున్నా...
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్ రాశీకన్నా కూడా అదే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ఉదయాన్నే మా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను. బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడానికి సహాయం చేస్తున్నాను. ప్రస్తుతం వంట నేర్చుకుందాం అనుకుంటున్నాను. రోజులో సగం దాంతోనే గడిచిపోతోంది. ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నాను. కొన్ని సార్లు యోగా లేదంటే ఎక్సర్సైజ్ చేస్తా. అదే నన్ను రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. ప్రస్తుతం ’పవర్ ఆఫ్ ఇంటెన్షన్’ అనే బుక్ చదువుతున్నాను. సాయంత్రాలు ఓ గంటా గంటన్నర ధ్యానం చేస్తున్నాను. సరదాగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నా. మళ్లీ రాత్రి అమ్మతో కలసి ఏదో ఒకటి కుక్ చేస్తున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. బిజీగా ఉన్నప్పుడు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేస్తున్నా. చదువుతున్నాను, సినిమాలు చూస్తున్నా, నా రూమ్ శుభ్రం చేసుకుంటున్నా. ఈ లాక్ డౌన్‌తో నాతో నేను టైమ్ స్పెండ్ చేసే వీలు దొరికింది. గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు. (మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ) ఇంటి పనులతో సమయం గడిచిపోతోంది హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మాట్లాడుతూ...‘మాములు రోజుల్లో నేను ఇంట్లో ఉంటే టీవీ షోలు, సినిమాలు, ఆన్లైన్ షాపింగ్‌లకు టైమ్ కేటాయిస్తాను. కానీ ఇప్పుడు కరోనా కారణంగా నా జీవనశైలి కాస్త భిన్నంగా గడుస్తోంది. ప్రస్తుతం మా ఇంట్లో పనివారు ఎవరూ లేరు. అందుకుని ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం (హెల్దీ ఫుడ్) వంటివి చేస్తున్నాను. పిజ్జా తయారు చేశాను. ఇది హెల్దీ పిజ్జా. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులను కలవకూడదు. అందుకే హౌస్ పార్టీ యాప్ ద్వారా కనెక్టై ఉన్నాను. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..) సమయం ఉంటే వాళ్లతో చాటింగ్, ఆన్లైన్ గేమ్స్ అడుతున్నాను. లేకపోతే ఇంట్లో పనులతోనే రోజు గడిచిపోతోంది. నా దగ్గర ఓ డాగీ (కుక్క) ఉంది. దాని బాగోగులు చూసుకుంటున్నా. బయటకు తీసుకుని వెళ్లకూడదు కాబట్టి టెర్రస్ మీదకు తీసుకుని వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఇంకా రోజుకి రెండు పుస్తకాలు చదివేలా నా టైమ్‌ను కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ చాలెంజింగ్ సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉందాం.’ అని పిలుపునిచ్చారు. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) -
రాజమండ్రికి జగదీష్
పొల్లాచ్చి నుంచి రాజమండ్రికి మకాం మార్చారు హీరో నాని. ‘నిన్ను కోరి’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరసర ప్రాంతాల్లో జరుగుతోంది. ‘‘పొల్లాచ్చిలో జరిగిన తొలి షెడ్యూల్లో నాని, రీతూ వర్మలతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. ఒక పాట, ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. -
నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్
నిత్యం షూటింగ్‌లు, మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉండే నటీనటులు ఏ మాత్రం కాస్త సమయం దొరికితే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా కోలీవుడ్‌లో బిజీ మారిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ షూటింగ్ స్పాట్లో నోరూరించే వేడివేడి ఎగ్‌దోశ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తను దోశ వేసిన వీడియోను ఐశ్వర్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. పా.రంజిత్ నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి దర్శకుడు అమీర్ శిష్యుడు సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో నాని ‘టక్ జగదీష్’ చిత్రంలో కూడా నటిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: ఐశ్వర్యకు మరో బంపర్ ఆఫర్ ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ -
నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్
-
ఐశ్వర్యకు మరో బంపర్ ఆఫర్
నటి ఐశ్వర్యరాజేశ్‌కు మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టిందని తెలిసింది. ఇమేజ్ను పక్కన పెట్టి నచ్చిన పాత్రను చేసే నటి ఈ చిన్నది. ఆదిలో కథానాయకిగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే అభినందనలు అందుకుంది. అలా నటించిన కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్యరాజేశ్ జీవితాన్ని మలుపుతిప్పిందనే చెప్పాలి.ఆ తరువాత పలు హీరోయిన్ పాత్రల్లో నటించే అవకాశాలు వరిస్తున్నాయి. అయినా పేరు వస్తుందనిపిస్తే చెల్లెలు పాత్రలనూ వదులుకోవడం లేదు. తెలుగు ఇంటి ఆడపడుచు అని ముద్ర వేసుకున్న ఆమె ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాలు పెట్టింది. ఇలా తమిళం, తెలుగు భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామను తాజాగా ఒక హీరోయిన్ సెంట్రిక్ పాత్ర వరించినట్లు సమాచారం. దర్శకుడు పా.రంజిత్ నిర్మించనున్న తాజా చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ కథానాయకిగా నటించనుందని సమాచారం. దీనికి దర్శకుడు అమీర్ శిష్యుడు సతీష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఐశ్వర్యరాజేశ్ ఇప్పటికే కనా అనే క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించి సక్సెస్‌ను అందుకుందన్నది తెలిసిందే. తాజాగా మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్నమాట.(కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ తప్పదు) ప్రస్తుతం తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు టక్ జగదీశ్ అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. ఇకపోతే ఆమె నటించిన ధ్రువనక్షత్రం, ఇదం పొరుల్ యావెల్ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉంది. కాగా ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనిపిస్తోంది. కారణం ఇటీవల ఈ అమ్మడు తీసుకున్న గ్లామర్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(రాశీ ఖన్నా బెదిరించేది) -
రాశీ ఖన్నా బెదిరించేది
‘‘నా సినిమాలకి బజ్ ఉండేది మీవల్లే (అభిమానులు) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ప్రేక్షకుల వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను నటించిన ఏ సినిమాకి వెళ్లినా మీకు ఒక కొత్త అనుభూతి ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో షూటింగులో ఉండటం వల్ల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి ఎక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. రాశీఖన్నా అయితే ‘నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి’ అని రోజూ ఫోన్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు. మీరే చెప్పాలి’’ అన్నారు. ‘‘మా నాన్నగారు ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ లాంటి సినిమాలు వైజాగ్‌లో తీశారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వేడుకకి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎ. వల్లభ. ‘‘మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో ఈ సినిమా చేశాడు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చెయ్యండి’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. -
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
పొల్లాచిలో షురూ
‘నిన్ను కోరి’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మరోసారి కలిశారు హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ. వీరిద్దరి కాంబినేషన్లో ‘టక్ జగదీష్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పొల్లాచిలో నేడు ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది
‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజర్ బావుంది అన్నారు. కానీ నా పాత్రకి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పాత్ర రాశీఖన్నా ఎందుకు చేసింది? అన్నారు. యాక్టర్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉండలేం కదా. ఎప్పుడో ఓసారి దాన్ని బ్రేక్ చేయాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో అలాంటి ప్రయత్నం చేశాను. ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాశీఖన్నా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కేయస్ రామారావు నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో నేను చేసిన యామినీ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రోల్. చాలెంజింగ్‌గా అనిపించింది. ► యామినీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. నా పాత్ర నేనే చేసినట్టుంది. నిజ జీవితంలో నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. స్ట్రాంగ్ ఉమెన్ ఎమోషనల్ సైడ్‌ని బయటకు చూపించకూడదనుకుంటాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► సాధారణంగా నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ► సినిమాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నేనే ఉండాలి అనుకోను. మనం చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నాకేం ప్రాబ్లమ్ లేదు. యాక్టర్‌గా నేను చాలా సెక్యూర్‌గా ఉంటాను.ఒకవేళ ఈ సినిమాలో నా పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోమంటే ఐశ్వర్యా రాజేశ్ చేసిన పాత్ర చేస్తాను. ► వేలంటైన్స్ డే అంటే నాకు ఇష్టం. ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని చెబుతుంటారు. వేలంటైన్స్ డేకి ఇది పర్పెక్ట్ సినిమా. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటిస్తాను. ► ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ‘అర్జున్ రెడ్డి 2’ అన్నారు. కానీ ట్రైలర్‌తో ఆ అభిప్రాయం మారిపోయింది. విజయ్ గడ్డంతో ఉంటే అర్జున్ రెడ్డిలానే ఉంటారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. -
ఆ పేరొస్తే చాలు
‘‘బాక్సాఫీస్ వసూళ్ల గురించి నేను పట్టించుకోను. నా పాత్రకి న్యాయం చేయడానికి 100శాతం కష్టపడతా. నా నటన బాగుందనే పేరు వస్తే చాలనుకునే మనస్తత్వం నాది’’ అని కేథరిన్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి, అనుబంధాలు వంటి అంశాలను ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో చక్కగా చెప్పారు. ఆధునిక ఆలోచనలతో స్వంతంత్ర భావాలున్న స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నేనొక బొగ్గు గనిలో పని చేస్తుంటాను. ఆ ప్రాంతంలో పని చేసే హీరోతో నాకున్న అనుబంధం ఏంటి? అతని జీవితంపై నా ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు ఉన్నా అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉన్న చిత్రాల్లో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విజయ్ దేవరకొండతో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటూ పనిలో మాత్రం పర్ఫెక్షన్ కనబరచాలని తపిస్తాడు. ఇది నా కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సవాల్‌తో కూడిన పాత్రలు చేసి, ప్రేక్షకుల అభిమానం పొందాలనుకుంటున్నా’’ అన్నారు. -
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్
-
ట్రైలర్ రెడీ
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇజబెల్లా నటించారు. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు విజయ్. ఈ లుక్స్ ఉన్న మిస్టరీకి ఈ గురువారం క్లూ దొరుకుతుంది. ఈ చిత్రం ట్రైలర్ గురువారం విడుదల కానుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతోంది. -
కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ తప్పదు
‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు తక్కువగా చేయడం నా కెరీర్ ఎదుగుదలకు మైనస్ అవుతుందని అనుకోవడం లేదు. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. బాగానే సంపాదిస్తున్నా’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కథానాయికలుగా రాశీఖన్నా, కేథరీన్ , ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా నటించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► 2018లో ఓ అవార్డు ఫంక్షన్ కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్రాంతిమాధవ్‌గారు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నాకు తెలిసి గత పదేళ్లలో సువర్ణలాంటి పాత్రను ప్రేక్షకులు చూసి ఉండరు. ఈ సినిమాలో నాతో పాటు ముగ్గురు హీరోయిన్లు నటించారు. కానీ కథ రీత్యా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది. ► విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో హీరోయిన్స్‌కు మంచి పాత్రలు దక్కాయనిపించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నా పాత్ర బాగానే ఉంటుంది. క్రాంతిమాధవ్‌గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. సహజత్వానికి చాలా దగ్గరగా సినిమాలు తీస్తుంటారు. కేయస్ రామారావుగారు మంచి నిర్మాత. ► కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సన్నివేశాలు తప్పవు. అనవసరంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండకూడదు. నేను నటించిన ‘వడచెన్నై’ చిత్రంలో నాలుగు లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ తరంలో దాదాపు అందరూ ఓపెన్ గానే ఉంటున్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఫ్లా్లప్ అయితే హీరోయిన్ అన్‌లక్కీ అని కొందరు అంటుంటారు. ఆ లాజిక్ నాకు అర్ధం కాదు. ► ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. జయలలితగారి బయోపిక్‌లో నటించాలనుకున్నాను. ఇప్పుడు జయలలితగారి బయోపిక్స్ వస్తున్నాయి. నా ఫేవరెట్ యాక్ట్రస్ సౌందర్యగారి బయోపిక్‌లో నటించాలని ఉంది. కాకపోతే కాస్త నా కలర్ తక్కువగా ఉంటుందేమో (నవ్వుతూ). తమిళంలో నేను నటించిన ‘వానమ్ కొట్టటుమ్’ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది. విజయ్ సేతుపతిగారితో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నాని ‘టక్ జగదీష్’లో కీలక పాత్ర చేస్తున్నాను. ► నా చిన్నప్పుడే మా నాన్నగారు (రాజేష్) మరణించారు. ‘కాక్కముట్టై’ (2014) సినిమాకు ముందు నా పేరు స్క్రీన్ పై ఐశ్వర్య అని ఉండేది. ఆ తర్వాత ఐశ్వర్యా అయ్యర్, ఐశ్వర్యా లక్ష్మీ ఇలా కొంతమంది ఐశ్వర్య పేరుతో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నా పేరు మార్చుకోవాలనుకున్నాను. ‘కాకముట్టై’తో నా పేరును ఐశ్వర్యా రాజేష్‌గా మార్చుకున్నాను. ఆ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. మా నాన్నగారి పేరు నాకు కలిసొచ్చింది. అలాగే మా నాన్న నాతోనే ఉన్నారనే ఫీలింగ్ కలిగింది.