
జీవితం చావడానికి కాదని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. కాక్కా ముట్టై చిత్రంతో తమిళ సినిమాకు తానేమిటో నిరూపించుకున్న నటి ఐశ్వర్య రాజేష్, ఆ తర్వాత వరుసగా కథానాయికగా చిత్రాలు చేస్తున్న ఈమె ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తాజాగా గ్లామర్ పాత్రలకు సిద్ధమవుతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్నారు. అలా గ్లామర్తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తున్నారు.
ఆ విధంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ తరచూ వారితో సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల అభిమానులతో ముచ్చటించినప్పుడు ఒక అభిమాని మీరంటే తనకు ఎంతో అభిమానమని, మీ నటన చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. అదేవిధంగా మీ కోసం చావడానికి కూడా సిద్ధమని అన్నారు. దీంతో షాక్ అయిన నటి ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత తేరుకుని జీవితం చావడానికి కాదని అతనికి చెప్పింది. ఎప్పుడూ అలాంటి మాటలు అనవద్దని అతన్నుంచి ప్రామిస్ చేయించుకుంది. చదవండి: తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!
Comments
Please login to add a commentAdd a comment