సవతులుగా వరలక్ష్మి–ఐశ్వర్య  | Varalaxmi And Aishwarya Are Acting In Web Series | Sakshi
Sakshi News home page

సవతులుగా వరలక్ష్మి–ఐశ్వర్య 

Published Wed, Aug 12 2020 9:39 AM | Last Updated on Wed, Aug 12 2020 10:01 AM

Varalaxmi And Aishwarya Are Acting In Web Series - Sakshi

రోజురోజుకీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఆదరణ పెరుగుతోంది. వెబ్‌ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతుండటంతో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీవైపు ఆసక్తి చూపుతున్నారు. పైగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
(చదవండి : నా కాన్సెప్ట్‌ను తస్కరించారు)

సమంత, కాజల్‌ అగర్వాల్, తమన్నా, నిత్యా మీనన్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు వెబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తాజాగా వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్యా రాజేష్‌ కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. మంచి భావోద్వేగ సన్నివేశాలున్న కథ కావడంతో ఇద్దరూ ఈ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి అంగీకరించారట. దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్‌ తెరకెక్కించనున్న ఈ సిరీస్‌ను ఆనంద వికటన్‌ సంస్థ నిర్మించనుంది. ఈ సిరీస్‌లో వరలక్ష్మి–ఐశ్వర్య సవతులుగా నటించనున్నారని సమాచారం. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయట. ఇద్దరూ మంచి నటీమణులే కాబట్టి పోటీపడి నటిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement