80 శాతం ఖాతాలకు ఆధార్‌ లింకు | 80% bank accounts, 60% mobile connections linked with Aadhaar | Sakshi
Sakshi News home page

80 శాతం ఖాతాలకు ఆధార్‌ లింకు

Published Mon, Mar 5 2018 3:07 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

80% bank accounts, 60% mobile connections linked with Aadhaar - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌తో అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే 80 శాతం బ్యాంకు ఖాతాలు, 60 శాతం ఫోన్‌ నంబర్లతో ప్రజలు ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఏడీఏఐ) వెల్లడించింది.

లెక్కలోకి రాని డబ్బును ఏరివేసేందుకు ప్రతి బ్యాంకు ఖాతాను 12 అంకెల ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం 2018 మార్చి 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అలాగే పాన్‌ నంబర్‌ను కూడా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. మొత్తం 109.9 కోట్ల బ్యాంకు ఖాతాలకు గాను 87 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement