ప్రస్తుతం రూ.1400 గా ఉన్న వరి కనీస మద్దతు ధరను రూ.1800కు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు.
ప్రస్తుతం రూ.1400 గా ఉన్న వరి కనీస మద్దతు ధరను రూ.1800కు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. బుధవారం కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్ఆన్ ను కలిసిన ఆయన ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందించారు.
మద్దతు ధరలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అతీతంగా అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని విస్మయం వ్యక్తం చేశారు.