నోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబుతో పాటు టీడీపీ గట్టిగా సమర్థించిందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు.
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబుతో పాటు టీడీపీ గట్టిగా సమర్థించిందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం క్రెడిట్‌ను ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ తీసుకుందని పేర్కొన్నారు.
చంద్రబాబు డిజిటల్ ఎకానమీ కమిటీకి కన్వీనర్‌గా పనిచేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే కోరుతున్నారని అన్నారు. చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరికి తేడా ఏమీ లేదని, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదన్నారు.