
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆచార్య యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అని మండిపడ్డారు. తెలుగు భాషను ఉద్ధరిస్తానని ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ దీక్ష చేపడతానని ఆయన అన్నారు.