ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత్ ఆరంభంలో తడబడినా పోరాడుతోంది.
కార్డిఫ్: ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత్ ఆరంభంలో తడబడినా పోరాడుతోంది. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది.
భారత్ ఆరంభంలో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ధవన్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. వోక్స్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఈ దశలో రోహిత్, రహానె జట్టును ఆదుకున్నారు. వీరిద్దూ మూడో వికెట్కు 91 పరుగులు జోడించారు. కాగా హాఫ్ సెంచరీకి చేరువలో రహానె (41) అవుటవగా, రోహిత్ (52) హాఫ్ సెంచరీ చేసిన వెంటనే వెనుదిరిగాడు. భారత్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లకు 140 పరుగులు చేసింది. ధోనీ, రైనా క్రీజులో ఉన్నారు.