భారత్, ఇంగ్లండ్ల రెండో వన్డే మరికాసేపట్లో ఆరంభంకానుంది.
కార్డిఫ్: భారత్, ఇంగ్లండ్ల రెండో వన్డే ఆరంభమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్, ధవన్ బ్యాటింగ్ కు దిగారు.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశముంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే, ఫలితాన్ని డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తేల్చే పరిస్థితి రావచ్చు. దీంతో టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని కుక్తో పాటు టీమిండియా కెప్టెన్ ధోనీ కూడా భావించాడు. అయితే కుక్ టాస్ గెలిచాడు.