తుడి చిత్రంలో అభినయ | Abhinaya in thudi movie | Sakshi
Sakshi News home page

తుడి చిత్రంలో అభినయ

Published Mon, Jun 1 2015 5:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

తుడి  చిత్రంలో అభినయ

తుడి చిత్రంలో అభినయ

నటి అభినయ ప్రధాన పాత్రలో వైవిధ్యభరిత థ్రిల్ల ర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం తుడి. మైంటి రామ పతాకంపై రితున్ సాగర్,

 నటి అభినయ ప్రధాన పాత్రలో వైవిధ్యభరిత థ్రిల్ల ర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం తుడి. మైంటి రామ పతాకంపై రితున్ సాగర్, జి.లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి అభినయ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇతర ము ఖ్యపాత్రల్లో సుమన్, బ్రహ్మానందం, సూదుకవ్వుం రమేష్, నళిని నటిస్తున్నారు. వీరితో పాటు మరో నాయకిగా ప్రేర్నా నటిస్తున్నారు.  మరో కీలక పాత్రలో ప్రముఖ న టుడు నటిస్తున్న ఈ చిత్రంలో కమలా థియేటర్ అధినేత చిదంబ రం కొడుకు గణేశ్ మంత్రిగా ప్రాముఖ్యత గల పాత్రలో నటిస్తున్నారు.
 
 కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న రితున్ సాగర్ చిత్ర వివరాలను తెలుపుతూ ఒక నక్షత్ర హోటల్‌లో టైస్టు ఎటాక్ చిత్రకథా ఇతివృత్తం అన్నారు. ఇందులో అభినయ రిసెప్షనిస్టుగా నటిస్తున్నారని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల మధ్య జరిగే సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. చిత్రం ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. ఈయనకిది దర్శకుడిగా తొలి చిత్రం. విజువల్, కమ్యునికేషన్ చదివిన రియాన్ సాగర్ పలు లఘు చిత్రాలను తెరకెక్కించిన అనుభవంతో ఈ తుడి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, మునార్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement