
కానీ పెళ్లి వాయిదా విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా విధుల్లో ఉన్నారు.
మండ్య : కరోనా లాక్‌డౌన్ లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పెళ్లిళ్లు, పేరంటాలు అనేక శుభకార్యాలు అటకెక్కాయి. ఓ మహిళా డీఎస్పీ.. లాక్‌డౌన్ విధుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మండ్య జిల్లాలోని మళవళ్ళి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.జే. పృధ్వీ పెళ్లి ఈ నెల 4న జరగవలసి ఉంది. ద్యామప్ప అనే యువకునితో ఈ నెల 4, 5 వ తేదిల్లో ధార్వాడలో ఏడడుగులు నడవాల్సి ఉండేది. తరువాత ఏప్రిల్ 10వ తేదీన మైసూరులో ఘనంగా రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది.
కానీ విధి మరోలా తలచింది. మండ్య, మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఉవ్వెత్తున పెరగడం, విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆమె జీవితంలో ఎంతో ప్రధానమైన శుభఘడియల్ని వాయిదా వేసుకోవడానికే మొగ్గుచూపారు. కానీ పెళ్లి వాయిదా విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ సంగతి తెలిసి సహచర అధికారులు ఆమె నిబద్ధతను అభినందించారు. ఎంపీ సుమలత అంబరీష్ సైతం కొనియాడారు.