
కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శుభ్రో కమల్ ముఖర్జీ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శుభ్రో కమల్ ముఖర్జీ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రస్తుతం కర్ణాటక సీజేగా ఉన్న ధీరేంద్రనాథ్ హరిలాల్ వాఘేలాను ఒడిషా సీజేగా బదిలీ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 2015, ఏప్రిల్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ముఖర్టీ.. జూన్ 1 నుంచి తాత్కాలిక సీజేగా కొనసాగుతున్నారు.