మంజూరు అయినా లోన్ డబ్బులు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్న బ్యాంక్ మేనేజర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మంజూరు అయినా లోన్ డబ్బులు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్న బ్యాంక్ మేనేజర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట్ గ్రామంలోని గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సాయిబాబా.. లింగాల మండలం మానాజిపేటకు చెందిన కురుమయ్య అనే వ్యక్తికి మంజూరైన లోన్ ఇవ్వడానికి రూ. 5 వేలు లంచం అడిగాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అచ్చంపేటలోని ఆయన స్వగృహంలో ఆయనకు డబ్బులు ఇస్తుండగా.. దాడి చేసిన ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.