Mahabubnagar
-
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్‌నగర్ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్‌నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం. దేవస్థానం చరిత్ర...పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం...మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. స్థలపురాణం... ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి..?బస్సు మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూల్ నుండి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.సీజన్లో పెళ్లిళ్ల హోరు...అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బస...మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
నాగర్ కర్నూల్: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్, యశిత్..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్‌డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లోని పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్‌కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు. -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్‌తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
మటన్ కర్రీ వండలేదనే కోపంతో భార్యను చంపిన భర్త
సాక్షి,మహబూబ్ నగర్: జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. సీరోల్ ఎస్సై సీఎహెచ్ నాగేష్ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్ కూర తెచ్చాడు.మటన్ తినాలని ఉంది. అందుకే మటన్ తెచ్చా. వెంటనే మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
నేడు SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు. ప్రమాద స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో మరోచోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా చేశారు. ఇక, ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.నలుగురి ఆనవాళ్లు దొరికినా..టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు చోట్ల ఏడు మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్, నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్‌గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్‌తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.సమస్యగా మారిన బురద, ఊట నీరు..టన్నెల్ లోపల 13.50 కి.మీ దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజ్మెంట్, బార్డర్రోడ్ ఆర్గనైజషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు. టన్నెల్లోపల13 కి.మీ వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్‌లో వేసి తరలించారు. -
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో భాగంగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.. ఈరోజు(శుక్రవారం) SLBC టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ కోసం ఆపరేషన్ చేపట్టారు.. ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టగా.. కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు.టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు..ఈరోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని శకలాలు ఆచూకీ లభించింది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.జీపీఆర్ టెక్నాలజీ ద్వారా..టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేశారు.మరో రెండు రోజుల్లో పడుతుంది..ఈ టన్నెల్ చిక్కుకున్న వారి సమాచారం కావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది సీఎం సింగరేణి సిఎండి బలరాం. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు, కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామన్నారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్‌లో ఈరోజు ఏం చేస్తారంటే?
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చుజీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. -
నాకు హెలికాప్టర్లో తిరగాలి అన్న షోకు లేదు
మహబూబ్ నగర్: మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను రెండు, మూడు నెలల్లో పునః ప్రారంభిస్తామన్నారు మంత్రి.‘ పదేళ్ల పాటు అధికారుంలో ఉన్న బీఆర్ఎస్.. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతోంది. హరీష్ రావు మాటలు పూర్తి అబద్ధాలు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల గ్రావిటీ ద్వారా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వారు సరైన పని చేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి, మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వచ్చేవి.మేము ప్రజాస్వామ్యుతంగా జరిగిన ప్రమాదంపై అందరూ చూసేందుకు అనుమతి ఇస్తున్నాం. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ల హయాంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు పనులు చేశారు. వారి హయాంలోనే నీటి పారుదల శాఖ నిర్వీర్యం అయ్యింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా పరామర్శకు రాలేదు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేవాదులలో ఏడుమంది చనిపోతే, అస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి. హరీష్ ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడారా?, ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.దేవాదులలో ఏడు మంది చనిపోతే.. ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి హరీష్ రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా..ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి.ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి లో 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నిరంది ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీకి కరెంట్ కట్ చేస్తే డి ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయి అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశాడు. నాకు హెలికాప్టర్ లో తిరగాలి అన్న షోకు లేదు.. నేను ఓ పైలట్ ను. భారతదేశంలో టన్నెల్ ప్రమాదాలలో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా మా ప్రభుత్వం సహి చర్యలు నిర్వహించింది. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు ప్రత్యేక అబద్ధాలు ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను’ ’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. -
సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
మహబూబ్‌నగర్: తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిపై నలుగురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నవాబుపేట మండలం మరికల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన బైండ్ల నర్సింహులు (32) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో పలుమార్లు గొడవ చోటు చేసుకుంది. ఏడాది క్రితం నర్సింహులుపై వివాహిత సోదరులు దాడికి పాల్పడ్డారు. ఆరునెలల క్రితం అతడి ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. మంగళవారం వ్యవసాయ పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు మూకుమ్మడిగా దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడిని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి మరోసారి దాడిచేశారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యతో పాటు చుట్టుపక్కల వారు వారించి, అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు నర్సింహులు మృతికి కారణమైన జోగు యాదయ్య, అతడి సోదరులు శ్రీను, నర్సింహులు, బాల్రాజ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు ప్రధాన కారకురాలైన వివాహితపై సైతం పలువురు దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో గుట్టుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిపై పట్టణ పోలీసులు దాడులు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని బీరోలు చౌరస్తాలోని ఓ ఇంటిలో కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన రమణయ్యగౌడ్ కొన్ని నెలలుగా వ్యభిచార దందాను గుట్టుగా నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు వ్యభిచార గృహాంపై దాడులు చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ఫోన్లు, నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే 20 రోజుల క్రితం ఇదే తరహాలో జిల్లాకేంద్రంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో పట్టుబడిన ఘటన మరవక ముందే మరోసారి పట్టణంలో వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో దాగి ఉన్న ప్రధానసూత్రదారులెవరో గుర్తిస్తే తప్ప ఈ దందాను కట్టడి చేయొచ్చని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
మావోయిస్టుల చొరబాట్లు లేవు: డీజీపీ జితేందర్
సాక్షి,మహబూబ్‌నగర్:ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దులో గస్తీ పెంచామని, రాష్ట్రంలోకి మానోయిస్టుల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం లేదని డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం(జనవరి17) మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్ష జరిపిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు.‘అన్ని రకాల క్రైంపై సమీక్ష చేశాం. ప్రమాదాలు,నేరాల తగ్గుదల కోసం సూచనలు చేశాం. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కర్ణాటక,ఛత్తీస్‌గఢ్ పోలీసులతో కలిసి నేరస్తుల కోసం పనిచేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.కొత్త స్టేషన్ల ఏర్పాటే కాకుండా పాతవాటిని కూడా అప్ గ్రేడ్ చేయాలను కుంటున్నాం,రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ డబ్బుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. కాగా, గడిచిన కొన్ని నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు కలకలం రేపాయి. ఈ ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ పలువురు పోలీసులు కూడా మృత్యువాత పడ్డారు. పోలీసులపై మావోయిస్టుల ప్రతీకార దాడులు కూడా పెరగడంతో వారి ప్రాబల్యం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణలోనూ మావోయిస్టులు మళ్లీ బలపడొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డీజిపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టు ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ -
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’
మహబూబ్‌నగర్: బిహార్ తాపీ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యను చూస్తున్నాడనే కారణంతో భర్త.. ఓ యువకుడిపై దాడికి పాల్పడి మరో యువకుడిని ఐరన్‌రాడ్‌తో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈఘటన మంగళవారం అర్ధరాత్రి వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి సోదరుడి కథనం ప్రకారం.. బిహార్‌లోని ఖగారీయా జిల్లా పస్రహ తా నా మండలం జంజారా గ్రామానికి చెందిన ముని దూల్చంద్రకుమార్ రెండేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చారు. ఇక్కడ అద్దెకుంటూతాపీ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం చంద్రకుమార్ తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్(16), మరో యువకుడు పవన్ కూడా వరంగల్ రాగా ముగ్గురు కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. పనిచేసే చోట వీరికి ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో అద్దెకుంటున్న బానోత్ నగేశ్ పరిచయమయ్యాడు. ఇటీవల నగేశ్ అత్తామామలు చంద్రకుమార్ ఉండే ఇంట్లో ఓ రూమ్‌లో అద్దెకు దిగారు. నగేశ్ భార్య తన పిల్లలను తీసుకుని తరచూ పుట్టింటికి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల నగేశ్ తన భార్యను చూస్తున్నారని అనుమానంతో చంద్రకుమార్, దిల్‌ఖుషికుమార్ వద్దకు వచ్చి ‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి దిల్ఖుషి కుమార్ రూమ్‌కు వెళ్లగా చంద్రకుమార్ తన స్నేహితులు గుల్షాన్, బాదిల్తో కలిసి చిన్న బ్రిడ్జి ఏరియాలోని మేఘనా బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నగేశ్, అతడి బావమరుదులు అశోక్, బన్నీ ద్విచక్రవాహనంపై అక్కడి చేరుకుని చంద్రకుమార్‌ను చితకబాది చంపేందుకు యత్నిస్తుండగా తప్పించుకున్నాడు. రాత్రి 12గంటలకు వరకు బయటే ఉండి అనంతరం భయపడుకుంటూ రూమ్‌కు వెళ్లగా తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్ రక్తమడుగులో చనిపోయి ఉన్నాడు. దీంతో నగేశ్ తన భార్యపై అనుమానంతో తనను చంపడానికి యత్నించగా తప్పించుకున్నానని, తమ్ముడు ముని దిల్ఖుషికుమార్ను కిరాయికి ఉన్న ఇంట్లోనే హత్య చేశాడని చంద్రకుమార్ మిల్స్‌కాలనీ పీఎస్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీపీ నంది రామ్‌నాయక్.. ఇన్స్పెక్టర్ వెంకట రత్నం, సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీ లించి హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. మృతుడి సోదరుడు చంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు.నేరస్తుల కోసం గాలింపు: ఏసీపీభార్యపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నామని ఏసీపీ నందిరామ్‌నాయక్ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నారని చెబుతుండడం గమనార్హం.ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి బోధిస్తూ టీచర్ కనిపించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా బజారులో ఊర్దూ మీడియం ప్రాథమిక పాఠశా లలో ఐదో తరగతి వరకు మొత్తం 15 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈమేరకు సోమవారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి హెచ్ఎం పాఠాలు బోధించారు. మరో టీచర్ సెలవులో ఉన్నారని తెలిపారు. కాగా టీచర్లు వంతులవారీగా పాఠశాలలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ చేసేటప్పుడు.. ఒకరు సెలవులో ఉన్నారని చెప్పడం పరిపాటిగా మారిందని వారు ఆరోపించారు. -
మహబూబ్ నగర్లో కంపించిన భూమి
మహబూబ్‌నగర్, సాక్షి: తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. ఈసారి మహబూబ్ నగర్లో స్వల్పస్థాయిలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రతతో నమోదైందని అధికారులు వెల్లడించారు.శనివారం మధ్యాహ్నాం 1గం.22ని. ప్రాంతంలో దాసరిపల్లి పరిధిలో భూమి కంపించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో.. జూరాల ప్రాజెక్టు ఎగువన, దిగువన భూమి కంపించింది. తాజాగా.. ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం గోదావరి తీర ప్రాంతం వెంట.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కనిపించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కొన్ని చోట్ల కూడా కొన్నిసెకన్లపాటు భూమి కంపించడం గమనార్హం.ఇదీ చదవండి: తెలంగాణను వణికించిన భూకంపం! -
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు నెరవేర్చి తీరుతాం: భట్టి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదలరైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. -
చర్చకు సిద్దమా.. బీజేపీ, బీఆర్ఎస్కు రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్‌నగర్: పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు అంటూ గులాబీ పార్టీపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా? అని ప్రశ్నించారు. చర్చకు ఎవరు వచ్చినా తాము సిద్దమే అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని అమిస్తాపూర్ రైతు పండుగ ముగింపు సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రైతుల రుణమాఫీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30 ప్రాధాన్యత ఉన్న రోజు. గతేడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబడ్డారు. నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఆనాడు పాలమూరు బిడ్డల కన్నీళ్లను నేను చూశాను. 70 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం వచ్చింది. పాలమూరు కష్టాలు నాకు తెలుసు. రైతుల కష్టాలు కూడా నాకు తెలుసు. ఏడాది పాలనలో రూ.54వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. ఏడాది క్రితమే నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాం. సీఎం పదవి బాధ్యత.. జవాబుదారితనంతో పని చేస్తున్నాను.ఈరోజు వరి వేసుకుంటే రూ.500 బోనస్ ఇస్తామన్నది మా ప్రభుత్వం కాదా?. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు. ఆనాడు వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్ కాదా?. కాళేశ్వరానికి లక్షా రెండువేల కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా రికార్డు స్థాయిలో సాగు జరిగింది. గతంలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకున్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా?. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా చర్చకు మేం సిద్దం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారు. ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి కేవలం రూ.11వేల కోట్ల రుణమాఫీనే చేశారు. పంటలకు కనీస మద్దతు ధర తెచ్చిన ఘనత మాది. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్.. రైతులను ఉచిత విద్యుత్ ఇచ్చారు. సమైక్య పాలనలో కంటే కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగింది. పాలమూరులో గెలిచిన కేసీఆర్ జిల్లాకు ఏం చేశారు అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ మాటలు నమ్మి గిరిజనులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టేవాళ్లా. కొండగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని నేను అనుకున్నాను. లగచర్లలో కుట్ర ప్రకారమే దాడి జరిగింది. గొడవ చేసి మంపెట్టారు. విపక్షాల వలలో పడొద్దు. రైతులు కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. వినకుండా కొందరు ఆవేశపడ్డారు. ఈ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి రూ.73వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాం. పదేళ్లలో ఏ ప్రాజెక్ట్‌ను నిర్మించకపోగా.. పాలమూరును ఎడారిగా చేశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చాం.. మీలా రైతులను గాలికి వదిలేయలేదు. కొన్ని సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదు. బీఆర్ఎస్ లాగా వదిలేయం అని కామెంట్స్ చేశారు. -
ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో సీఎం రేవంత్ పర్యటన
-
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగసభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఐటీ కాంతుల్లేని దివిటీ.. పల్లి!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ శివారు దివిటిపల్లిలో ఏడాదిన్నర క్రితం నిర్మించిన ఐటీ టవర్ ప్రస్తుతం నామమాత్రంగా కొనసాగుతోంది. దీనికి రూ.కోట్లు వెచ్చించి.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.. దీనికి ప్రధాన కార ణం ఐటీ కంపెనీలు ఇక్కడికి రాకపోవడమేనని తెలుస్తోంది.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ‘సాక్షి’బృందం గురువారం ఐటీ టవర్‌కు వెళ్లగా వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌హెచ్–44కు అతి సమీపంలో ఉన్నా.. జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)కి అతి సమీపంలోని దివిటిపల్లిలో ఐజీ గ్రీన్ కారిడార్ కోసం 2019లోనే 377 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇందులో సుమారు రూ.50 కోట్లతో నాలుగు ఎకరాలలో (జీ ప్లస్4) ఐటీ టవర్‌కు తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఇందులో మొత్తం లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తుల భవనాన్ని అన్ని హంగులతో అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు. ఒక్కొక్క అంతస్తులో 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఎనిమిది ఐటీ కంపెనీల చొప్పున ఉండేలా వదిలారు. దీనికి 2023 మే 6న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 32 ఐటీ కంపెనీల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎన్‌హెచ్–44 చేరడానికి ప్రత్యేక రోడ్డుతో పాటు 24 గంటల ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం ఉంది.ఈ భవనం చుట్టూ లాన్లో పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం.. ఆపై వాహనాల పార్కింగ్ కోసం విశాల స్థలం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభంలో తొమ్మిది ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేసేవారు. అందరినీ శిక్షణ పేరిట నెలకు రూ.15 వేలనుంచి రూ.20 వేల వరకు ఆయా సంస్థల నిర్వాహకులు నియమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు వెనక్కి.. గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏడు కంపెనీలు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిపోయాయి. వీటిలో జువెన్ టెక్నాలజీ, హెచ్ఆర్ఎస్, ఇ–గ్రోవ్ సిస్టమ్స్, ఇంటిట్యూస్, ఫోర్ ఓక్స్, ఐటీవర్షన్–360, అర్పాన్ టెక్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం రెండు ఐటీ సంస్థలు మాత్రమే ఉండగా 44 మంది ఉద్యోగులే మి గిలారు. వీటిలో గ్లోబల్ లాజిక్ (రెండో అంతస్తు) సంస్థను అప్పట్లో 75 మంది ఉద్యోగులతో ప్రారంభించారు. ఇక్కడ ప్రస్తుతం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో సంస్థ ముల్లర్ డాట్ కనెక్ట్ పేరిట మూడో అంతస్తులో 26 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. వీరందరూ జిల్లాకేంద్రంతో పాటు జడ్చర్ల పట్టణంలో నివసిస్తూ.. ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాబ్‌లలో ఐటీ టవర్‌కు వచ్చి పనిచేసి వెళ్తున్నారు. తమ కంపెనీ ఉద్యోగులు, ఉత్పత్తులపై ‘సాక్షి’ బృందానికి వివరించేందుకు నిర్వాహకులు నిరాకరించడం గమనార్హం. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదని వారు చెప్పుకొచ్చారు. కనీసం ఉద్యోగుల ఫోన్ నంబర్లు అయినా ఇవ్వలేదు. -
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే! -
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు.. మాగనూర్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. -
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్‌జిల్లా:మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు. -
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా పబ్బ సురేశ్‌బాబు
ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్‌బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్గా ఎన్నికయ్యారు. కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. -
పాలమూరుకు మేం నిధుల వరద పారిస్తాం
-
కురుమూర్తి స్వామి దయ వల్లే సీఎం అయ్యా: రేవంత్ రెడ్డి
సాక్షి, మహబూబ్ నగర్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయంగా కోపం ఉంటే నాపై చూసుకోండి కానీ.. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే అలాంటి వాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కురుమూర్తి స్వామి దయ వల్లే తాను సీఎం అయ్యానని రేవంత్ చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తి స్వామి దయే. తిరుపతి వెళ్లటానికి వీలులేని వాళ్లు కురుమూర్తి స్వామిని దర్శించుకుని తరించే గొప్ప క్షేత్రం. ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవు. 900 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి, ఘాట్ రోడ్డుకు 110 కోట్లు మంజూరు చేశాను. ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తాం. మన్యంకొండ, కురుమూర్తి ఆలయాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్దం చేసి పంపించండి.తెలంగాణలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలో ఇక్కడికి పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. ఇక్కడ ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో పచ్చని పంటలు పండాలి. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఈ ప్రాంతం ఇచ్చింది. పాలమూరు రుణం తీర్చుకుంటాం.కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభిస్తాం. ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేస్తుంటే కొందరు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయంగా కోపం ఉంటే నాపై చూసుకోండి కానీ.. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే అలాంటి వాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారు. వెనుకబడిన జిల్లా సంపూర్ణ అభివృద్ధికి బాధ్యత నాది. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రెండు వేల మంది స్థానిక యువకులకు అమర రాజా పరిశ్రమలలో ఉద్యోగులు కల్పించాలని యాజమాన్యానికి సూచించాం అని చెప్పుకొచ్చారు. -
మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ కేసు నమోదు
-
రూ.6,66,66,666.66 తో అమ్మవారికి అలంకరణ.. చూపు తిప్పుకోలేరు!
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.6,66,66,666.66 కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని, పూజా మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి విచ్చేశారు.యాదగిరిగుట్ట కిటకిటయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని సుమారు 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.32,50,448 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
మహబూబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
తిరుపతి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఓ కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
TG: ఇక జిల్లాల వంతు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా అటు జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు రెవెన్యూ అధికారులు. క్రిష్టియన్పల్లిలో సర్వే నెంబర్ 523లోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసులు కలిసి కూల్చివేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఘటనా స్థలంలోనే అధికారులు ఉండి.. కూల్చివేతలు కొనసాగించారు.ఇక, హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలువురి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చెరువును ఆక్రమించి కాలేజీల నిర్మాణాలు జరిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ అంశం ఆసక్తికరంగా మారింది. -
భర్తకు రెండో వివాహం చేసిన భార్య..
మహబూబాబాద్ అర్బన్ : ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ దేవాలయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్, సరిత దంపతులకు కొన్ని ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతుల చిన్న కుమారై సంధ్య వరుసకు సురేశ్‌కు మరదలు అవుతుంది. సంధ్య మానసిక దివ్యాంగురాలు. సంధ్యను ఇష్టపడుతున్నట్లు సురేశ్ తన భార్య సరితకు చెప్పడంతో ఆమె భర్త రెండో వివాహనికి అంగీకరించింది. దీంతో బుధవారం ఇరువర్గాల పెద్దలు, భార్య సరిత సమక్షంలో పట్టణంలోని భక్తమార్కండేయ దేవాలయంలో వివాహం జరిపించారు. కాగా, భర్తకు రెండో వివాహం జరిపించిన విషయం సోషల్ మీడియాలో, జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. దీనిపై సరితను వివరణ కోరగా సంధ్యను తన భర్త సురేశ్ ఇష్టపడ్డాడని, సంధ్య మానసిక దివ్యాంగురాలు అన్నారు. పిల్లల మనసత్వం కలదని, తన పిల్లల మాదిరిగానే చూసుకుంటానని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు..వివాహం జరగకముందు సంధ్య సోదరి భర్త నాగరాజు ఉదయం 11 గంటలకు తన మరదలు మానసిక దివ్యాంగురాలు కావొచ్చన్నారు. కానీ రెండో వివాహం చేయడం నేరమని గొడవకు దిగి 100 డయల్‌కు కాల్ చేశాడు. బ్లూకోర్టు సిబ్బంది వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని ఆధార్ కార్డు పరిశీలించారు. పెళ్లికూతురు మేజరని, ఇరువురి ఇష్టపూర్వకంగా వివాహం జరుగుతుందని తెలిపారు. 100 డయల్‌కు కాల్ చేసిన వ్యక్తిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఇదిలా ఉండగా రెండో వివాహాన్ని పోలీసులే ప్రోత్సహించారని పలువురు పెద్దలు పేర్కొన్నారు. -
రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: జైపాల్ రెడ్డి ఓ సిద్దాంత కర్త అని.. నమ్మిన సిద్దాంతాల కోసం పని చేసిన గొప్ప నాయకుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ సెంటర్ ఆమనగల్లులో ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిని త్వరలో నాలుగు లైన్లుగా మారుస్తామని రేవంత్ అన్నారు. ముచ్చర్లలో ఆగస్టు1న యంగ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 50 ఎకరాల్లో రూ. 100 కోట్లతో పనులు మొదలు పెడతాం.. దీంతో యువత నైపుణ్యాలు పెరుగుతాయని రేవంత్ అన్నారు.జూలై 31 నాటికంటే ముందే రూ.లక్షన్నర లోపు రుణమాఫీ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని రేవంత్ అన్నారు.‘‘కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కసీటు కూడా రాదు. కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేసి అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలి’’ రేవంత్ పిలుపునిచ్చారు. -
మహబూబ్‌నగర్ : కల్కి కారు.. నాగీ సందడి..(ఫొటోలు)
-
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
'700 ఏళ్ల పిల్లలమర్రి' చిగురించింది
-
త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని, ఆ అవకాశం తనకు మాత్రమే వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.‘‘సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్యలపై సమీక్ష చేశాం. కార్యకర్తల కష్టంతో కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల ఆపకుండా చేయాలని అధికారులను ఆదేశించాను. నేను మీలో ఓ కార్యకర్తను. కేసీఆర్‌ను ఓడించడమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి. త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం. మిమ్మల్ని గెలిపించే భాద్యత మాది, మీ ఎమ్మెల్యేలది. దేవాలయ, మార్కెట్ కమిటీ, గ్రంధాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకుంటా. కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్ధాయికి వచ్చాను. వారిని విస్మరించను. గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్ కనుమరుగవుతారు. 4 రోజులుగా ఢిల్లీలో కాలుకాలిన పిల్లిలాగా కేటీఆర్, హరీష్ రావు ప్రధానిని కలిసేందుకు తిరుగుతున్నారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూపు- 1 అధికారులను నియమించాలని మేం ప్రయత్నిస్తుంటే కొందరు దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదావేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేసి తీరుతా’’ అని సీఎం రేవంత్ అన్నారు. -
నాకు చెప్పలేదు.. నన్ను అవమానించారు డీకే అరుణ సంచలన కామెంట్స్
-
మహబూబ్‌నగర్: హోరా హోరీ లెక్కింపులో డీకే అరుణ విజయం
మహబూబ్‌నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్‌రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు. అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది. -
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
-
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
-
Mahabubnagar MLC Bypoll Updates: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
counting Updatesమహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయంబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. హరీశ్ రావు శుభాకాంక్షలుమహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024 మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఈ చిత్ర ప్రదర్శన.. భళా!
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలకు ధీటుగా పాలమూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఆరు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుచేశారు.ఆకట్టుకుంటున్న చిత్రాలు..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం బయట గోడలపై వేసిన క్రీడాకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులకు అవగాహన కలిగేలా ఆయా క్రీడల్లో రాణిస్తున్న ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు ఇండోర్ స్టేడియానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మధు క్రీడాకారుల చిత్రాలు గీశారు. స్టేడియం ప్రధాన ద్వారం గోడపై ఓవైపు ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, మధ్యలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టేడియానికి మరోవైపు క్రికెటర్లు విరాట్ కొహ్లి, సిరాజ్, షటిల్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ చౌదరితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల చిత్రాలు గీయడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రహరీపై 36 గంటల్లోనే 300 లకుపైగా క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశాను. అదే విధంగా వాలీబాల్ అకాడమీలో క్రీడల బొమ్మలను వేశాను. – మధు, ఆర్టిస్ట్, మహబూబ్నగర్ఇవి చదవండి: బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా? -
పాలమూరు.. ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో పోటాపోటీ ఉండొచ్చన్న సర్వేల అంచనాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వరుస పర్యటనలు, అక్కడి నాయకులు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తున్నారని.. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వీలైనప్పుడల్లా పర్యటిస్తూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాపై రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు లోక్‌సభ ఎన్నికపైనా దృష్టిపెట్టారు. అటు అధిష్టానానికి, ఇటు తనకు సన్నిహితుడైన వంశీచంద్‌రెడ్డికి లోక్‌సభ టికెట్ ఇప్పించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకముందు, తర్వాత చాలాసార్లు వంశీతో భేటీ అయి ప్రచారం, ఇతర అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. అంతేకాదు వీలైనప్పుడల్లా మహబూబ్‌నగర్ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లిన రేవంత్.. రెండు సభల్లో పాల్గొన్నారు.రెండుసార్లు కొడంగల్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లింది మూడే సార్లు కావడం గమనార్హం. తాజా సభల్లో, కార్యక్రమాల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కూడా పాలమూరులో గెలుపే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. 70ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచి్చందని.. పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ చెప్తున్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూరు, వాల్మికి బోయ కులస్తులతో భేటీ అయి హామీలివ్వడం ద్వారా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను అమలు చేశారు. మ్మెల్యేలకు ‘స్పెషల్’గా హామీలిస్తూ.. పాలమూరులో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని.. ఇందుకోసం ఆ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోభాగంగానే మహబూబ్‌నగర్ సభ వేదికగా ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పింస్తామని ప్రకటించారని అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా మంచి మెజార్టీ తీసుకురావాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు సమాచారం. -
కేసీఆర్ కథలకు కాలం చెల్లింది: రేవంత్ కౌంటర్
సాక్షి, మహబూబ్‌నగర్: కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని, తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని చెప్పారు. కేసీఆర్ కథలకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకు ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ చైరస్తా నుంచి క్లాక్ టవర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. క్లాక్ టవర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడుతూ.. పార్లమెంటులో నోరు లేకపోయినా, పాలమూరులో ఇల్లు లేకపోయినా 2009 లోక సభ ఎన్నికల్లో కేసీఆర్‌నును పాలమూరు ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. అయినా కేసీఆర్ పాలమూరు జిల్లాకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో ప్రాజెక్టులు కట్టలేదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సహకరించలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్లో ఏరోజు పాలమూరు గురించి మాట్లాడలేదని విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘ప్రజలు కారును బొంద తీసి పాతిపెట్టారు. కారును తూకం పెట్టి అమ్ముడే. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ వైపు చూస్తూ నీ సంగతేంటో చూస్తాం. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చుద్దాం. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటా. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. చదవండి: లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధులు కేంద్రం నుంచి 30 వేల కోట్లు రాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గజ్వేల్ దొరలు-గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారు. 70 ఏళ్లలో పాలమూరుకి మంత్రి పదవి ఇవ్వడానికి మీన మేషాలు లెక్క పెట్టారు. అలాంటిది 70 ఏళ్ల తర్వాత పాలమూరుకి సువర్ణ అవకాశమొచ్చింది. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత మాది. మీ బిడ్డగా అడుగుతున్న. ఒక్కసారి పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించి ఇవ్వండి. డీకే అరుణ మోదీ చేతిలో ఉంది. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్ధాలు పెడుతున్నారు. వంద రోజులు కాకమునపే ప్రభుత్వాన్ని కులదోయాలని కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ కాలం చెల్లింది, కారు షెడ్డుకు పోయింది. నాడు పలుగు పారాబట్టి పాలమూరు నుంచి వలసలు పోయేటోళ్లు. నేడు అదే పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ట పెంచాడు. పాలమూరు అభివృద్ధి కావాలంటే రెండు ఎంపీ సీట్లు గెలవాల్సిందే. వంశీ చంద్ రెడ్డిని, మల్లు రవిని లక్ష మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని రేవంత్ కోరారు -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది. -
జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా
కోస్గి/కొడంగల్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. తన కోసం ఎంతో చేసిన ఈ ప్రాంతాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి కొడంగల్‌కు వచ్చారు. ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం లాహోటీ కాలనీలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డుతూ... త్వరలో కొడంగల్‌కు సిమెంట్ పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు ఉన్నాయని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. ‘కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం సులభతరం అవుతుంది. భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. పట్టా భూములకు ఇచ్చే ధరను అసైన్మెంట్ భూములకూ ఇస్తాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 8న కొడంగల్‌కు మళ్లీ వస్తానన్నారు. కోస్గిలో పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొడంగల్ మండలం అప్పాయిపల్లికి ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలన్నారు. బూత్, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సమర శంఖారావం సభకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పాలమూరు జిల్లాలో హోలీ సంబరాలు
-
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
నా గెలుపు ఎవరు ఆపలేరు
-
తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ: రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌కు తెలంగాణ ‘ఆత్మ’ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెల్వనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. గొల్డెన్ తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిదని ప్రశ్నించారు.ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా. అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్ ‘తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”“సమగ్ర అభివృద్ధికి చిరునామా” అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా... రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్”… — KTR (@KTRBRS) March 6, 2024 -
కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానని స్పష్టం చేశారు. మన మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలనేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని తెలిపారు. ఈ మేరకు బుధవారం మహబూబ్‌నగర్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అతిథి మన వద్దకు వస్తే గౌరవించాలని.. ప్రధాని సభకు వెళ్లానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సహకారం అందించకపోతే చాకిరేవుపెడతానని అన్నారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి విమర్శించిన సీఎం.. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ మందువేసుకొని ఫామ్ హౌజ్‌లో ఉన్నావని కేసీఆర్‌ను ఉద్ధేశించి మండిపడ్డారు. గద్వాలు నీళ్లు తెస్తామన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని నిలదీశారు.? ‘అసూయ నా మీద విషం కక్కుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు.. తొంబై రోజుల మా పాలనకు రెఫరెండం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నాం. కేసీఆర్‌కు ఒంట్లో బాగాలేకపోతే.. అసెంబ్లీకి రాకుండా నల్గొండకు ఎందుకు వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థదిగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఇండనివ్వరా? 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? మా ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ.. బొందపెడతాం. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది నా ఆన’ అంటూ రేవంత్ ప్రసంగించారు -
బీజేపీ జితేందర్ రెడ్డి: ఆనాడు దున్నపోతు.. ఇప్పుడు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్ చేశారు. దీంతో, బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాదా, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తూ అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇక, ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్కు ట్యాగ్ చేశారు. What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge — AP Jithender Reddy (@apjithender) February 29, 2024 కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక, గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్ధం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. -
కనులపండువగా సింగపట్నం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం (ఫొటోలు)
-
కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో ఉన్న కృష్ణానది వంతెన
-
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
మహబూబ్‌నగర్ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉద్రిక్తత.. డీసీఎంకు నిప్పు.. బాలానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
విషాదం: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంతో ఉన్న రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఉన్న జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నేవీ ఉద్యోగి వసంత్ కుమార్‌కు బదిలీ కావడంతో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో, కుటుంబ సభ్యులు అందరూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
మహబూబ్‌నగర్‌లో అరాచక పాలన నడుస్తోంది: మిథున్ రెడ్డి
-
మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
-
పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్ ప్రకంపనలు..
సాక్షి, మహబూబ్‌నగర్ : పాలమూరు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిక్కెట్లు ఆశించి భంగపడినవారు హస్తం గూటిని వీడుతున్నారు. రాత్రికి రాత్రే కొందరు అసమ్మతి నేతలు కండువాలు మార్చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ వచ్చిన సమయంలోనే నాగం జనార్థనరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో కారు పార్టీలో జోష్ పెంచుతోంది. పాలమూరు రాజకీయాలు వస్తున్న మార్పులు ఏంటి ? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కుతున్నారు. ఈ పరిణామాలు వేగంగా సాగుతుండటంతో జిల్లా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత కాంగ్రేస్ పార్టీలో చేరటంతో గులాబీ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కాంగ్రేస్లో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులకు సంబంధించి మొదటి జాబితాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, గద్వాల సీట్లు ఆశించిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి దక్కడంతో నాగం జనార్థనరెడ్డి, జగదీశ్వరరావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాగం ఇప్పటికే కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా తమ అనుచరుతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. తనకు సీటు రాకపోవటంతో ఆగ్రహంగా ఉన్న నాగంకు అధికార పార్టీ నేతలు గాలం వేశారు. మత్రులు కేటీఆర్..హరీష్ రావులు నాగంను కలిసి మంతనాలు జరపడం.. పార్టీలోకి ఆహ్వానించటం అందుకు ఆయన సమ్మతించటం ...వెంటనే నాగం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవటం చకచకా సాగిపోయాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించారు. ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల కాకుండా చివర్లో నారాయణపేట నుంచి పోటీచేయాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించారు. ఎర్ర శేఖర్ అందుకు నిరాకరించారు. చివరికి ఎర్ర శేఖర్‌ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి సంప్రదించి..కేటీయార్ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. వనపర్తిలో సీటు ఆశించి భంగబడ్డ మెగారెడ్డికి మద్దతుగా వనపర్తిలో కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని మెగారెడ్డికి ఆయన అభిమానులు సూచించారు. మీ అభిష్టం మేరకే నడుచుకుంటానని మెగారెడ్డి ప్రకటించారు. దేవరకద్ర నుంచి సీటు ఆశించిన కొండా ప్రశాంత్‌రెడ్డి సైతం తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. కాంగ్రేస్ అభ్యర్ది మధుసూధన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. మరోవైపు సోమవారం నాడు దేవరకద్ర అభ్యర్థిని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు. మక్తల్ సీటు ఆశించిన నేత కూడా అనుచరులతో మాట్లాడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా అన్ని చోట్లా రెబల్స్ బరిలో దిగితే కాంగ్రేస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని పార్ఠీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న వేళ తాజా ఘటనలు నేతల్ని కలవరపెడుతున్నాయి. స్వంత జిల్లాలో అధిక స్దానాలు గెలవాలని భావించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి నేతలు పార్టీని వీడటం తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త వెనకబడిందనుకున్న అధికార పార్టీకి ఒకేరోజున పెద్దస్థాయిలో కలిసి వచ్చింది. బీజేపీ నేత పి.చంద్రశేఖర్..కాంగ్రెస్ నేతలు నాగం జనార్థనరెడ్డి, ఎర్ర శేఖర్లు గులాబీ పార్టీలో చేరడం వారికి సముచిత స్థానం ఉంటుందన్న సంకేతాలు పార్టీ పెద్దలు ఇస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఇటీవలే..వనపర్తికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు..మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడ బీఆర్ఎస్ పార్టీలో చేరటం బీయారెస్‌కు కలిసివచ్చే అంశాలుగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతల్ని బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీల్లోకి నాయకుల రాకపోకలతో కింది స్థాయి వరకు మార్పులు జరుగుతాయా? లేక అక్కడితో ఆగిపోతాయా? అనేది చూడాలి. -
రెండో రోజు రాహుల్ పర్యటన.. పలువురు కాంగ్రెస్‌లోకి చేరిక
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం వరకు నొవాటెల్ హోటల్లోనే ఉండనున్న రాహుల్.. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెండింగ్ సీట్లపై పీసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్ భేటీతో వామపక్ష సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌లోకి గడ్డం వివేక్? కాసేపట్లో నోవోటెల్ హోటల్‌కు మాజీ ఎంపీ వివేక్ వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది. రాహుల్‌తో వివేక్ భేటీ అవుతారని, కొడుకు వంశీతో సహా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో చేరికను ఖండించిన బీజేపీ నేత గడ్డం వివేక్‌వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటించారు. చదవండి: ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్ -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లోకి సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇంకా కొందరు నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. సీనియర్ నేతలు కూడా పార్టీలు మారుతుండటం విశేషం. ఇక, తాజాగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ కీలక నేత అధికార బీఆర్ఎస్లో చేరారు. వివరాల ప్రకారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా పేరున్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి శేఖర్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఇక, ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. మరోవైపు, ఎర్ర శేఖర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ఒక్క సీటుకు జాబితా.. దేనికి సంకేతం?
సాక్షి, హైదరాబాద్: కేవలం ఒకే ఒక సీటుకు అభ్యర్థి ని ప్రకటించి... అదీ రెండో జాబితా అంటూ పేర్కొనడం దేనికి సంకేతమనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొదటి జాబితాను 55 మందితో విడుదల చేయాలని భావించినా 52 మందితో ఈనెల 22న తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మిగిలిపోయిన మూడింటిలో ఒకటైన మహబూబ్‌నగర్‌కు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఢిల్లీ నుంచి ఒకే పేరుతో జాబితా వెలువడింది. పార్టీ టికెట్ కోసం మహబూబ్‌నగర్ నుంచి జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ నుంచి ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి దరఖాస్తు చేసుకోగా, ఒకే కుటుంబానికి రెండు సీట్లు కేటాయించే అవకాశాలు లేవని స్పష్టమైంది. తొలి జాబితా ఖరారుకు ముందే తాను లోక్‌సభకే పోటీచేస్తానని, మహబూబ్‌నగర్ సీటును తన కుమారుడికి కేటాయించాలని జితేందర్ కోరడాన్ని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఐతే ఈ ఒక్క సీటుకోసం జాబితా ఇవ్వకుండా మిథున్‌కు టికెట్‌పై భరోసా ఇచ్చి మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈవిధంగా జితేందర్‌రెడ్డి తన పంతం నెగ్గించుకోవడంతో మరికొందరు కూడా ఇలాగే తాము అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకే పోటీ చేస్తామనే డిమాండ్‌ను ప్రోత్సహించినట్లవుతుందని అంటున్నారు. రెండో సీట్లో పోటీకి సంజయ్ సై? హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీకి ఈటలకు అవకాశమిచ్చినందున తనకూ కరీంనగర్‌తోపాటు వేములవాడలోనూ పోటీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదేకాకుండా సంగారెడ్డి సీటును దేశ్‌పాండేకు ఇవ్వాలని సంజయ్ కోరుతుండగా, పులిమామిడి రాజుకు ఇవ్వాలని ఈటల పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయడానికి కిషన్‌రెడ్డి విముఖత వ్యక్తం చేస్తుండటంతో అంబర్‌పేట నుంచి ఎవరిని బరిలో నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి నగర సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావును బరిలో దింపుతారా లేక బీసీకి ఇవ్వాలనే యోచనతో మాజీ ఎమ్మెల్యే సి.కృష్ణాయాదవ్‌కు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మిగిలిన సీట్లపై కసరత్తు మరో 45 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహఇన్‌చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ శుక్రవారం కసరత్తు చేసినట్లు తెలిసింది. మలి జాబితాను నవంబర్ 1న ప్రకటిస్తారని అంటున్నారు. జనసేనకు ఆరుదాకా సీట్లు కేటాయించే అవకాశం ఉండటంతో వాటిని మినహాయించి... మిగిలిన సీట్లలో జాబితా ప్రకటించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. -
ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ. అక్టోబర్ 22వ తేదీన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే.. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది. ఫస్ట్ లిస్ట్ ►బెల్లంపల్లి- శ్రీదేవి ►సిర్పూర్ - పాల్వాయి హరీశ్‌బాబు ►గోషామహల్- రాజాసింగ్ ►దుబ్బాక-రఘునందన్‌రావు ►కరీంనగర్-బండి సంజయ్ ►ఆదిలాబాద్- పాయల్ శంకర్ ►బోథ్(ఎస్టీ) సోయం బాపూరావు ►నిర్మల్- ఏ.మహేశ్వర్‌రెడ్డి ►ముథోల్-రామారావు పటేల్ ►ఆర్మూర్- పైడి రాకేష్‌రెడ్డి ►జుక్కల్- టీ.అరుణతార ►కామారెడ్డి- కె.వెంకటరమణారావు ►నిజామాబాద్ అర్బన్- ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ►ఖానాపూర్- రమేష్ రాథోడ్ ►కోరుట్ల- ధర్మపురి అరవింద్ ►సిరిసిల్ల- రాణీ రుద్రమరెడ్డి ►చొప్పదండి-బొడిగె శోభ ►మానకొండూరు అరెపల్లి మోహన్ ►కుత్భల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్ ►సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు ►కల్వకుర్తి-ఆచారి ►మహేశ్వరం- శ్రీరాములు యాదవ్ ►వరంగల్ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ►వరంగల్ వెస్ట్-రావు పద్మ ►నిమాజాబాద్ అర్బన్- యెండల లక్ష్మీనారాయణ ►ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్ ►ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి ►కార్వన్-అమర్ సింగ్ ►చార్మినార్- మెఘారాణి ►చంద్రాయణ గుట్ట-సత్యనారాయణ ముదిరాజ్ ►యాకత్పురా-వీరేంద్రయాదవ్ ►బహుదూర్ పురా- వై.నరేష్కుమార్ ►కొల్లాపూర్- ఏ సుధాకర్‌రావు ►నాగార్జున సాగర్-కే.నివేదిత రెడ్డి ►సూర్యాపేట- సంగినేని వెంకటేశ్వరరావు ►భువనగిరి-గూడూరు నారాయణరెడ్డి ►తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య ►జనగాం- డా.ఏ దశ్మంతరెడ్డి ►స్టేషన్ ఘన్పూర్-డా. గుండె విజయరామారావు ►బాల్కొండ-ఆలేటి అన్నపూర్ణమ్మ ►జగిత్యాల- డా.బోగా శ్రావణి ►రామగుండం-కందుల సంధారాణి ►చొప్పదండి-బోడిగ శోభ ►నర్సాపూర్- ఎర్రగొల్ల మురళీయాదవ్ ►పటాన్చెరు-టీ.నందీశ్వర్‌గౌడ్ ►వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్ ►భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి ►ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్ నాయక్ ►భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు ►పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి ►డోర్నకల్ (ఎస్టీ)- భుక్యా సంగీత ►మహబూబాబాద్ (ఎస్టీ)- జతోత్ హుస్సేన్ నాయక్ రెండో జాబితా మహబూబ్‌నగర్-ఏపీ మిథున్‌రెడ్డి -
మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చామని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేక జూరాల నుంచి నీళ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశానని చెప్పారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరని ప్రశ్నించారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు జడ్చర్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారన్నారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు వస్తున్నాయన్నాయని తెలిపారు. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని, టన్నెల్స్ పూర్తయ్యాయి. మోటర్లను బిగిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలను సాగునీళ్లు అందివ్వనున్నట్లు తెలిపారు. నీటి గోసపై ఉద్యమ సమయంలో పాట రాశా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ మూలకు పోయినా దుఖంతోనే పోయేదని అన్నారు. ఒకప్పుడు దుమ్ముకొట్టుకుపోయిన దుందుబి నది ఇప్పుడు జీవనదిగా మారిందని తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నా ఏం లాభం జరగలేదని, మహబూబ్‌నగర్ నీటి గోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానని గుర్తు చేశారు. కరువు అనే మాట ఉండదు జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధింధించానని చెప్పారు. జిల్లా తన గుండెల్లో ఉంటుందని, పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని తెలిపారు. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దుతానని, ఇకపై ఇక్కడ కరువు అనే మాట ఇక ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్ పార్టీకి గద్వాల జిల్లా అధ్యక్షుడి రాజీనామా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు ‘తెలంగాణను మనకు ఎవరో ఇవ్వలేదు. ఆమరణ దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు. రాష్ట్రాన్ని ఉత్తిగా ఇవ్వలేదు. ఎంతో మంది విద్యార్థులను బలితీసుకొని ఇచ్చారు ఎప్పుడైనా రైతుబంధు లాంటి స్కీం విన్నామా?. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు. ఎన్నికల ముందు కర్ణాటకలో కాంగ్రెస్ 20 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కర్ణాటక సీఎం 5 గంటల కరెంట్ ఇస్తాం సరిపెట్టుకోండని అన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు చాలన్నాడు.’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. -
కోర్టు తీర్పుపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వారి వల్లే అంటూ..
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
మోదీ మార్క్ శంఖారావం!
(మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అటు అధికారిక కార్యక్రమాలతో అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. ఇటు బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలతో రాజకీయ ప్రసంగం చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్లను తీరుస్తూ పసుపుబోర్డు, గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా.. తెలంగాణకు బీజేపీ మేలు చేస్తోంది అన్నట్టుగా సంకేతాలు పంపారు. తెలంగాణప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూనే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరుస్తామని చెప్పారు. మహిళా బిల్లును ఆమోదించడం, హైవేల నిర్మాణంతో ప్రయోజనాలు, కేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేస్తున్నట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. సభ సాంతం.. మోదీ నామస్మరణతో.. అధికారిక కార్యక్రమం, ఊరేగింపు, సభా వేదికపై ప్రసంగం సమయంలో సభా ప్రాంగణమంతా మో దీ.. మోదీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అరుపులు, కేకలతోపాటు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది చూసిన మోదీ.. ‘మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు నేను ధన్యుడిని అయ్యాను. ఇంత ప్రేమను చూసి ముగ్దుడిని అయ్యాను. మీరు, మేము కలసి తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళదాం. ఈ సభ విజయవంతం కావడం, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపడాన్ని వరుణదేవుడు కూడా హర్షాన్ని వెలిబుచ్చి వర్షాన్ని కురిపించాడు. (ప్రసంగం సాగుతున్నపుడు వర్షం పడుతుండటాన్ని ప్రస్తావిస్తూ..). తెలంగాణ ప్రజలను కలసిన నా జీవితం ధన్యమైంది..’’అని పేర్కొన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో అంతా లేచి మోదీకి గౌరవసూచకంగా చప్పట్లు కొట్టాలని కోరారు. దీనితో వేదికపై ఆసీనులైన నేతలు, సభికులు లేచి ‘మోదీ నాయకత్వం వరి్ధల్లాలి’అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మోదీ రెండు చేతులు జోడించి, వంగి సభికులకు సమస్కారం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి జోష్ చూసి మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చి న్నారికి తన ఆశీస్సులు అందిస్తున్నట్టు చెప్పారు. పది నిమిషాల్లో మనసు విప్పుతా..! తొలుత అధికారిక కార్యక్రమ వేదికపై సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన మోదీ అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. చివరిలో మాత్రం.. ‘‘ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. కొన్ని అంశాలపై నన్ను నేను నియంత్రించుకున్నాను. ఓ పది నిమిషాల్లో మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నా.. అక్కడ మనసు విప్పి మాట్లాడుతా.. నేను మీకు మాటిస్తున్నా.. నేను ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా మాట్లాడుతా..’’అని పేర్కొనడం గమనార్హం. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. -
కరప్షన్, కమీషన్ వారి సిద్దాంతాలు.. పాలమూరులో మోదీ ఫైర్
సాక్షి, పాలమూరు: తెలంగాణ బీజేపీ పాలమూరులో ప్రజా గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, పాలమూరు ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. పాలమూరు ప్రజలందరికీ నమస్కారములు, మరోసారి నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఈరోజు రాత్రి నిద్రపట్టదు. ఈ ప్రజాస్వామ వ్యవస్థను కుటుంబవ్యవస్థగా మార్చేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసమే కొందరు బయటి వ్యక్తులు ఉంటారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మోదీ హామీ ఇస్తే నెరవేరుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. కలిసికట్టుగా తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం కావాలి.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణకు ఎంతో చేశాం.. తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. 2014కు ముందు కేవలం 2,500 కి.మీ నేషనల్ హైవేలున్నాయి. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2,500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. కేసీఆర్ సర్కార్‌పై ఫైర్.. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించాం. రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. పసుపు ఎగుమతి గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యింది. తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం’ అని కామెంట్స్ చేశారు. -
పాలమూరుకు మోదీ కోట్ల రూపాయిలు
-
నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన
Updates.. పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ►నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. ►తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. ►రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. ►చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. ►దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. ►మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ►ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. ►మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం. ►తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. ►2014కు ముందు కేవలం 2500 కి.మీ నేషనల్ హైవేలున్నాయి. ►మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. ►తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ►తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ►చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. ►తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. ►పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ►నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. ►అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. ►రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. ►పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ►ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. ►2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ►రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. ►కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. ►అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ►రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. ►రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించాం. ►రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ►బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ►పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ►పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. ►తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్.. ►పాలమూరు సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ శ్రేణుల తరఫున ప్రధానికి స్వాగతం. పాలమూరు ప్రజాగర్జున తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని గర్జన. గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో గర్వపడుతున్నాను. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం ఆనందంగా ఉంది. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు ప్రకటన చారిత్రాత్మకం. తెలంగాణలో చాలా మంది రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్‌కు తీరిక లేదు. కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేసీఆర్ లాంటి మోసపూరిత సీఎంను ఎక్కడా చూడలేదు. ►త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎలాంటి ప్రభుత్వం ఉందో మీకు తెలుసు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా.. మాకేం ఇచ్చారు.. మా ఫామ్‌హౌస్‌కు ఏమిచ్చారు? అన్నట్టుగా వారు తీరు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్టే. బీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టే. కాబట్టి బీజేపీకి ఓటు వేయండి. ►పాలమూరుకు చేరుకున్న ప్రధాని మోదీ. ►కాసేపట్లో ప్రజాగర్జన బహిరంగ సభలో మోదీ ప్రసగించనున్నారు. ►ఓపెన్ టాప్ జీపులో పార్టీ శ్రేణులకు ప్రధాని అభివాదం. ► పాలమూరు బీజేపీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ. ►ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. ►తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ►పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. ►పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ►సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ►జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోదీ. ►కాచిగూడ-రాయ్‌చూర్ మధ్య కొత్త ట్రైన్‌ను ప్రారంభించిన మోదీ. ►హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. హెచ్‌సీయూలో భవానాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ►మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్ట్‌లో భాగమైన జక్లేర్-కృష్ణా రైల్వే లైన్ జాతికి అంకితం. ►వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుప్థాపన ►కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రాజెక్ట్ పైప్‌లైన్ ప్రారంభం. ►రూ.2457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం. ►తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోంది. తెలంగాణ కోసం కేంద్రం రూ.9లక్షల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ హయంలోనే అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. వైద్య, విద్య సెక్టార్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. తెలంగాణ రైల్వేల అభివృద్ధికి కూడా కేంద్రం సాయం అందించింది. రైల్వే అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి కృతజ్ఞతలు. ►రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం కేసీఆర్‌కు కలిసేందుకు సమయం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. కేంద్రం చేపట్టే పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ రావడం లేదు. తెలంగాణలో అద్భుతమైన రహదారులు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేసేందుకు సర్వే జరుగుతోంది. ►సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2:19 PM ► మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ. 1:54 PM ►శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ 1:35PM ►శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ►ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం ►శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ పాలమూరుకు ప్రధాని ►పాలమూరు ప్రజా గర్జన సభలో మాట్లాడనున్న మోదీ ►తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు నుంచే శంఖారావం పూరించేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం ►దాదాపు 13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పాలమూరు ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగసభకు ఇటు అధికార యంత్రాంగం, అటు పార్టీ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు ►ప్రధాని రాక నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు 2 లక్షల మంది జనసమీకరణ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాదాపు రెండు లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి తదితరులు మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి జనసమీకరణపై పలువురి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనాలను తరలించేలా వాహనాలను సమకూర్చారు. ‘పాలమూరు’పైనే సర్వత్రా ఆసక్తి.. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభకు హాజరయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించేందుకు పాలమూరును ఎంచుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకోగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించకుండా, కృష్ణానదిలో వాటా తేల్చకుండా మోసం చేశారని అధికార బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారు.. వరాలు కురిపిస్తారా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. షెడ్యూల్ ఇలా.. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు చేరుకోనున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి అమిస్తాపూర్‌లోని ఐటీఐ కళాశాల మైదానంలో సుమారు 26 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ వద్ద ముందుగా రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లకు సంబంధించి వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుజరాత్ నుంచి వచ్చిన ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రెండో వేదిక వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
‘కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు’
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. రేపు(ఆదివారం) మహబూబ్‌నగర్‌కు మోదీ విచ్చేయనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ క్రమంలో సభా ఏర్పాట్లు స్థానిక తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోంది. అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి.. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు. కేసీఆర్‌లా ఫామ్‌హౌజ్‌లో ఉండటానికి మోదీ తెలంగాణకు రావడం లేదు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదు. కేసీఆర్ సర్కార్ విఫలం.. మోదీ అనేక అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్‌కు రావడానికి సమయం ఉండదు. రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే కలవడానికి సమయం లేదా?. కేసీఆర్ హాటావ్, తెలంగాణ బచావ్ అని ప్రజలు నినాదిస్తున్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని పూర్తిగా వైఫల్యం చెందాయి. విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడింది. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టే. కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు. ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుంది కాంగ్రెస్. ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజలకు తెలుసు.అరవై యేండ్లు దేశాన్ని పాలించారు. అడుగడుగున అవినీతితో దోచుకున్న కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు. ప్రజలు ఆలోచించాలి. రేపు మోదీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారు. ఘనంగా స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటున్నాను. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. గంట సేపు మీమీ పరిసరాల్లో శ్రమ దానం చేయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీలోకి క్యూ కడుతున్న నేతలు.. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు. సొంత ఎజెండాతో కొన్ని మీడియా సంస్థలు రాతలు రాస్తున్నాయి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయి. బీఅర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోంది. తెలంగాణ ప్రజలు అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు: కేటీఆర్ వ్యాఖ్యలు -
ఎన్నోసార్లు గెలిచి అక్కడ ఎంపీగా గెలవడమే కిక్కిచ్చింది: సీఎం కేసీఆర్
-
అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్లో ‘సీట్ల’ పంచాయితీ
సాక్షి, మహబూబ్‌నగర్: అధికార బీఆర్ఎస్లో టిక్కెట్ల పంచాయితీ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సీట్ల గొడవ ఎంతకీ తెగడం లేదు. అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి గళాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలంపూర్, కల్వకుర్తి అభ్యర్థులను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు. అలంపూర్‌లో విభేదాలు తారా స్థాయికి చేరగా, ఎమ్మెల్యే అబ్రహం అనుకూల, వ్యతిరేక వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి సీటు విషయంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం
సాక్షి, హైదరాబాద్/అడ్డాకుల: దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులోని ఓ గుట్ట చిటారు గుండుపై రాయితో చెక్కిన ఎద్దు బొమ్మ ఇది. 4 వేల ఏళ్ల క్రితంనాటి చిత్రమిది. మహబూబ్‌నగర్‌కు చేరువలో ఉన్న మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపైనున్న ఈ బొమ్మను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానిక రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసే పనిలో భాగంగా ఆదివారం ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 400 అడుగుల ఎత్తున్న గుట్ట పైభాగానికి చేరుకోగా, అక్కడున్న గుండుపై ఈ చిత్రం కనిపించింది. 10 సెం.మీ. పొడవు, 8 సెం.మీ.ఎత్తుతో ఉన్న ఈ బొమ్మ దిగువన మరికొన్ని జంతువులు, మనుషుల చిత్రాలు కూడా ఉన్నాయి. వాతావరణ ప్రభావానికి గురై అవి కొంతమేర మసకబారిపోయాయని ఆయన తెలిపారు. గుట్టపై నాటి మానవుల్లో ఓ సమూహం నివాసంగా ఉండి ఉంటుందని, ఆ క్రమంలోనే నిత్యం కలిసి ఉండే పశువులను చూసి ఈ చిత్రాలు చిత్రించి ఉంటారని పేర్కొన్నారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు
సాక్షి, మహబూబ్‌నగర్/హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో 14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. చదవండి: కారిడార్ వార్!... ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం ఇదీ కేసు.. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్‌పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు. కేసు నమోదైంది వీరిపైనే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ సెక్రటేరియల్ రాజీవ్‌కుమార్, సంజయ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కలెక్టర్ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్ అధికారి వెంకటే‹Ùగౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదైనట్టు సమాచారం. -
వనపర్తి: కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు, కానీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు ప్రస్తుతం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు. రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్! కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్‌గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫి, డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు.. మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్‌రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
మక్తల్: ప్రతీసారి భిన్న ప్రజాతీర్పు.. ఈసారి మాత్రం ఉత్కంఠే!
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్‌రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్‌రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు. ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్‌రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది. కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్‌లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్‌రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది. -
పాలమూరుపై బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫోకస్
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆరోపణలు.. బీఆర్ఎస్కు అదే మైనస్! బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది. అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం. రంగంలోకి బీకే అరుణ.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదు అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా? రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు. అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!
నియోజకవర్గం: జడ్చర్ల మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట) మొత్తం పంచాయితీలు: 187 మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు పురుషులు: 102076; మహిళలు: 100326 ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు. పార్టీల్లో కుమ్ములాటలు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. మూడు ముక్కలాట కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది. మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రెరెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. అయోమయంలో కార్యకర్తలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్ గౌడ్ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రసవత్తరంగా మారనున్న గద్వాల ఎన్నికలు.. గెలుపు ఎవరిది?
నియోజకవర్గం: గద్వాల మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి ) మొత్తం పంచాయితీలు: 130 పెద్ద మండలం: గద్వాల మొత్తం ఓటర్లు: 91875 పురుషులు: 45321; మహిళలు: 46544 ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది. కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్ఎస్ వచ్చేనా? సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ సీటు సిట్టింగ్‌లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట. అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం, పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం -
దేవరకద్ర ఎమ్మెల్యేకు సొంత పార్టే సమస్య కానుందా?
మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పున: వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇందులో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. వర్గపోరు కలిసివచ్చినా.. ప్రభుత్వ వ్యతిరేకతే సమస్య మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ప్రతిసారి ఆయనకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు కలిసి వస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఇదే తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యే ఉన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చాలా వరకు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేపై కంటే మండల నేతల వ్యవహారంపైనే ఓటర్లు గుర్రుగా ఉన్నారు. పెద్దవాగు, ఊకచెట్టువాగు పై దాదాపు 18 చెక్ డ్యాంల నిర్మాణం చేయించారు. ఎన్నో ఏళ్లుగా వర్నె-ముత్యాలంపల్లి మధ్య వాగులో వంతెన లేక జనాలు వర్షాకాలం అనేక కష్టాలు పడేవారు. ఆ వంతెన మంజూరు చేయించి పనులు చేపట్టడంతో నాలుగైదు గ్రామాల ప్రజల సమస్య తీరుతుంది. కానీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారనుంది. శంకర సముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి అయినా పునరావాసం కొలిక్కిరాకపోవడంతో ఆయకట్టుకు నీరందించటం లేదు. దీంతో పెద్దమందడి, అడ్డాకుల మండలాల ప్రజలు సాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. మండలస్దాయిలో పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివేన రిజర్వాయర్ నీటిరాక ఆలస్యం కావటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దేవరకద్రకు వందపడకల ఆస్పత్రి మంజూరు కాకపోవటం ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018లో డోకూర్ పవన్ కుమార్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. అవే అప్పట్లో పవన్ కుమార్ ఓటమికి కారణమైంది. ఆ సెగ్మెంట్లో న్యాయవాది మధుసూదన్ రెడ్డి( జీఎంఆర్), ప్రదీప్ గౌడ్ వర్గాలు ఉన్నాయి. సీటుకోసం ఎవరంతకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీటు రాని పక్షంలో ఒకరికొకరు ఏ మేరకు సహకరిస్తారో చెప్పలేని విచిత్ర పరిస్దితి ఉంది. దీన్ని అధికార టీఆర్ఎస్ అభ్యర్ది అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. అవకాశం వస్తే సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరి దేవరకద్ర సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోకూరు పవన్ కుమార్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే జరిగితే అభ్యర్ది విషయంలో ఇక్కడ నలుగురు నేతల మధ్య పోటీ తీవ్రం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. పార్టీ గెలిస్తే సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి నేతల మధ్య సమన్వయం చేసేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపుపై కాంగ్రెస్ మాత్రం ధీమాగా ఉంది. సొంత పార్టీలోనే ముగ్గురు నేతల పోటీ ఇక బీజేపీలో చేరిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కుమార్‌రెడ్డికి ఈసారి సానుభూతి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇదే సమయంలో స్వంత పార్టీలో పోటీకోసం మరో ముగ్గురు నేతలు ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు సీటు ఆశిస్తుండటం కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇంకోవైపు గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటున్న డీఎస్పీ కిషన్ ఈసారి దేవరకద్ర నుంచి తప్పకుండా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకోసం వివిధ పార్టీలతో ఆయన టచ్‌లో ఉంటూ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు. భూత్పూర్ నుంచి కొత్తకోట మండలం వరకు NH 44 జాతీయ రహదారి, దేవరకద్ర మీదుగా167 జాతీయ రహదారి కలదు.కొత్తకోటలో చేనేత కార్మికులు,బీడీ కార్మికులు ఉన్నారు పరిశ్రమలు: కొత్తకోట మండలం అప్పరాల దగ్గర కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ కలదు.మూసాపేట మండలంలో ఓ గ్లాస్ పరిశ్రమ ఉంది అడవులు- దేవరకద్ర మండలంలో అడవి అజిలాపురం, బసవయ్య పల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి. ఆలయాలు- చిన్నచింతకుంట మండలంలో పేదల తిరుపతిగా పిలిచే శ్రీ కురుమూర్తి స్వామిఆలయం,అడ్డాకుల మండలం కందూరులో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాశీ తర్వాత కల్పవృక్షాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. పర్యాటకం: 1), కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.2), సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే మొదటిదిగా మరియు ప్రపంచంలో రెండవది ఇక్కడ ప్రత్యేకత మానవ ప్రమేయం లేకుండా వాటర్ వచ్చినప్పుడు గాలి పీడనం (సైఫన్ సిస్టమ్) ద్వారా నీరు బయటికి వస్తుంది. సుదీర్ఘమైన పొడవులో ఊకచెట్టు వాగు ఉంది. -
అలంపూర్: అధికార పార్టీలోనే గ్రూపు రాజకీయాలు.. గెలుపు సాధ్యమేనా?
5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరటంతో అక్కడి రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ఇక్కడ బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకోవటంతో బహుముఖపోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం: అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్) మండలాల సంఖ్య: 7 (అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఐజ, ఇటిక్యాల ) పెద్ద మండలం: ఐజ మున్సిపాలిటీలు: అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మొత్తం పంచాయతీలు: 125 అత్యంత ప్రభావితం చూపే పంచాయితీ: ఐజ మొత్తం ఓటర్ల సంఖ్య: 222463 పురుషులు: 111024 ; మహిళలు: 111439 సతమతమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వర్గపోరుతో సతమతమవుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే అడ్డుకున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో అబ్రహాం కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవటంతో టీడీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్రహం రెండవ స్దానంలో నిలవగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంద జగన్నాథం తనయుడు మందా శ్రీనాథ్ మూడవ స్దానానికే పరిమితమయ్యారు. తర్వాత అబ్రహం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే 2018లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మాజీఎంపీ,ఢిల్లీలో ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్ మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాలో రెండు వర్గాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు విడిపోయారు. గెలిచిన కొన్నాళ్లు ఎమ్మెల్యే అబ్రహాం బాగానే ఉన్నా తర్వాత పార్టీ నేతలు,కార్తకర్తలతో పొసగలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తమను పట్టించుకోవటం లేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తే అడ్డుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే బలమైన ఆరోపణ అయనపై ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని స్వంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వందపడకల ఆస్పత్రి అలంపూర్‌లో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేయటంతో అక్కడి నేతలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే అబ్రహాం ఈసారి తన తనయుడు అజయ్ కుమార్‌కు సీటు ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తండ్రికంటే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇది కూడ పార్టీలోని ఇతర నేతలకు రుచించటం లేదు. ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నీటిమూటలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. స్దానికులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోని వల్లూరు,మల్లంకుంట రిజర్వాయర్ పనులు చేపట్టలేదు. నియోజకవర్గంలో ఒక్కరికి కూడ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఈసారి జనాలు గుర్రుగా ఉన్నారు. ఆయన అనుచరుడు యువజన నాయకుడు ఆర్.కిశోర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంద జగన్నాథం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.. ఇవి తనకు చివరి ఎన్నికలనే ఉద్దేశ్యంతో ఉన్నారట అందుకే ఆయన తన ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు ప్రచారం సాగుతుంది. అధికార పార్టీ కొంపముంచేట్టుగా గ్రూపు రాజకీయాలు ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతతో పాటు గ్రూపు రాజకీయాలు కొంపముంచే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇటీవలే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈయనకు ఎమ్మెల్యే అబ్రహంకు మద్య చాలా గ్యాప్ ఉంది. చల్లా పార్టీలో చేరిన తర్వాత అలంపూర్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లా ఆశీస్సులు ఉన్నవారికే సీటు వస్తుందని...వారే గెలుస్తారనే నమ్మకం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోని తన అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు చల్లా చుట్టు తిరుగుతున్నారు. మరి ఆయన ఎవరికి మద్దతు తెలుపుతాడోననే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే అబ్రహంకు మాత్రం సీటురాకుండా అడ్డుకుంటారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అలా 2014లో అలంపూర్ నుంచి కాంగ్రేస్ అభ్యర్ది సంపత్ మార్ గెలిచారు. 2018లో ఓడిపోయారు.ఆ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా సీటుకోసం ప్రయత్నం చేసే నాయకుడు లేకపోవటంతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న నేపధ్యంలో ఆయనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు. ఇప్పటికే సంపత్‌కుమార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే వైఖరిపై విమర్శలు చేస్తూ జనాలను ఆకర్శించే ప్రయత్నంచేస్తున్నారు. కాని చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రేస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరటం సంపత్‌కుమార్‌కు పెద్దదెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో చల్లా అనుచరులు కూడ ఆయన వెంటే వెళ్లటం సంపత్‌కుమార్‌కు సంకటంగా మారనుంది. టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు,ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని సంపత్వర్గీయులు భావిస్తున్నారు. అయితే సంపత్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వచ్చిపోతారనే విమర్శకూడ ఉంది. నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీని జనాలు నమ్మె పరిస్దితి లేదనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. బీజేపి ఇలా.. అలంపూర్ సెగ్మెంట్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు బీజేపీకి మంచి పట్టుండేది.ఇక్కడి నుంచి మూడు సార్లు బీజేపీ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఎస్సీ రిజర్వేషన్ మారిన తర్వాత బలమైన నాయకత్వం లేకపోవటంలో పార్టీ చతికిల పడింది.ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్దులు సీటుకోసం ప్రయత్నిస్తున్నారు.నాగర్‌కర్నూల్‌లో 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీని పోటీ చేసి ఓడిపోయిన బంగారు శృతి,ఎస్పీ మోర్చ రాష్ట్రనాయకుడు బంగి లక్ష్మణ్ కూడ పార్టీ సీటు కోసం యోచిస్తున్నారు.బంగి లక్ష్మణ్ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు.వీరంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేస్తున్న దాఖలాలు లేవు.మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: అలంపూర్ నియోజకవర్గ కృష్ణా, తుంగభద్రా రెండు నదుల మధ్యలో ఉండి నడిగడ్డ ప్రాంతంగా పిలవబడుతుంది. ఇటు ఏపీ,అటు కర్ణాటక సరిహద్దులు కలిగిన నియోజకవరం కావటంతో అక్కడి రాజకీయ పరిస్దితుల ప్రభావం ఇక్కడ కూడ ఉండే అవకాశం ఉంటుంది.44 జాతీయ రహదారికి ఇరువైపుల విస్తరించి ఉంది.నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్నారు.పత్తి,మిర్చి,పప్పుశెనగను వాణిజ్య పంటగా రైతులు సాగుచేస్తారు.ఆర్డీఎస్ ద్వారా ఇక్కడ పంటపొలాలకు సాగునీరు అందాలి. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ 3 పార్టీలూ ఒక్కటే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు కుటుంబ పార్టీలే. వాటి డీఎన్ఏ కూడా ఒకటే. అందుకే ఆ మూడు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)ను వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళలకు హక్కులు వద్దంటున్నాయి..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఈ మూడు పార్టీలు ఒకే గూటి పక్షులు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కు వేసినట్లే..’అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్‌టవర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఏ పార్టీతో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని చెప్పారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కా రని ధ్వజమెత్తారు. కుటుంబాల చేతుల్లో అధికారం ఉంటే దేశం బాగుపడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పటికీ వైఎస్ హయాంలోని రేషన్ కార్డులే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్‌కార్డులే తప్ప.. తెలంగాణలో కొత్తవి రాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులివ్వాలనే సోయి కేసీఆర్ సర్కారుకు లేదని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, దళితబంధు స్కీంను అమ్ముకుంటున్నారని, బీసీ బంధు పేరిట ఆ వర్గాలను మభ్యపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆట కట్టించాలి.. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు కోట్లకు పైగా ఇళ్లు కట్టించామని, తెలంగాణలోనూ ఇళ్లు కట్టించాలని కోరినా ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పేదలకు ఇళ్లు లేవు కానీ.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి రాజభవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ ఆట కట్టించాల్సిన అవసరముందని అన్నారు. నియంత పాలనను అంతమొందిస్తాం: డీకే అరుణ తెలంగాణలో నియంతపాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ వదలబోమని, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై హస్తం నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ అభివృద్ధి శూన్యం. కేసీఆర్ చేతిలో పాలమూరు జిల్లా మోసపోయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే. మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 సీట్లు కాంగ్రెస్‌ను గెలిపించండి. ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ‘కవిత లిక్కర్ స్కాంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు’ -
‘గట్టు ఎత్తిపోతల’లో భారీ గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు (నల సోమనాద్రి) ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ పరిహారం పంపిణీలో భారీ గోల్మాల్ చోటుచేసుకుంది. ఇటు రికార్డులు లేకున్నా అటు పొజిషన్లో లేకున్నా.. పలువురికి పరిహారం చెల్లించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతంలో రూ.3.74కోట్లు దుర్వినియోగం కావడం కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. కరువు పీడిత ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాల్లోని 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. ఈ మేరకు కుచ్చినెర్ల గ్రామ శివారులో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్, కట్ట నిర్మాణంలో మొత్తం 955.45 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అంచనా వేశారు. ఇందులో 574 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేల్చారు. ముంపు ప్రాంతానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.80లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భూములు కోల్పోతున్న వారి పేర్లు, వారికి ఎంతెంత భూమి ఉంది.. ప్రభుత్వ భూమిలో పొజిషన్లో ఉన్న వారు ఎంతమంది.. వంటి వివరాలు సేకరించి ఈ ఏడాది ఏప్రిల్‌లో 155మందితో కూడిన జాబితాను కుచ్చినెర్ల గ్రామపంచాయతీలో అధికారులు ప్రదర్శించారు. నోటీసులు అందజేసి.. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ తర్వాత మారిన సీన్.. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమా లకు తెరలేచింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న ప్రభుత్వ భూము లకు సంబంధించి పట్టాలు లేకున్నా, పొజిషన్లో ఉంటే సరిపోతుందని అధికారులు చెప్పడాన్ని అక్రమా ర్కులు అదునుగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో పట్టా లేనప్పటికీ, పొజిషన్లో లేకున్నప్పటికీ మరో 17మందిని పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తూ.. వారి పేర్లను పరిహారం జాబితాలో చొప్పించారు. ఇందకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, సర్వేయర్లు అండదండలు అందించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇలా 17 మందికి సంబంధించి రూ.3.76కోట్లు దండుకున్నట్లు సమాచారం. బ్యాంకులో పరిహారం డబ్బులు పడిన తర్వాత ఆ 17మంది నుంచి సదరు నేతలు రికవరీ కూడా చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇలా 17మందిని అడ్డుపెట్టు కుని అధికారపార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్న విషయం ఓ ముఖ్య నేత దృష్టికి రాగా ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా విషయం రచ్చ కాకుండా సెటిల్ చేసుకోవాలని సదరు ముఖ్యనేత క్లాస్ పీకినట్టు సమాచారం. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 17 మందికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. వివరాలు సేకరించి క్షేత్ర స్థాయిలో మరోసారి విచారణ చేపడతాం. అక్రమాలు నిజమని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్, జోగుళాంబ గద్వాల. ఇది కూడా చదవండి: బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు? -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన! -
కాంగ్రెస్‌లో జూపల్లి చేరికపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై పార్టీ నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక, మరో కీలక నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికపై సస్పెన్స్ నెలకొంది. అయితే, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ కొల్లాపూర్ సభ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సభ వాయిదాపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక, ఈనెల 20వ తేదీన జూపల్లి చేరిక సందర్భంగా సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కాంగ్రెస్‌లోకి బీజేపీ సీనియర్ నేత.. ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్ననేత చేరికపైనా చర్చ నడుస్తోంది. ఇక, జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి.. మరోవైపు.. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న సరిత.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి సహా పలు మండలాల బీఆర్ఎస్ కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేరిక కూడా ఇప్పటికే ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచర వర్గం అటు కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై భట్టి సంచలన కామెంట్స్ -
జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
సాక్షి, మహబూబ్‌నగర్: ఆస్పత్రికి వెళుతున్న జడ్జి భర్తతో పాటు ఓ సివిల్ కానిస్టేబుల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం గండేడ్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో కోస్గి సివిల్ జడ్జి ఫరీనాబేగం భర్త, న్యాయవాది శశికిరణ్ తన అత్తమామలు వెంకటేశ్, లక్ష్మిలను తీసుకొని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి బయల్దేరారు. రాస్తారోకో వల్ల ఆలస్యమవుతుందని భావించిన శశికిరణ్.. బీఆర్ఎస్ కార్యకర్తల వద్దకెళ్లి పక్షవాతం వచ్చిన వాళ్లున్నారు, ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. ఆందోళన ముగిసే వరకు ఆగాలని కొందరు నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, అడ్వొకేట్ శశికిరణ్ మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కొందరు శశికిరణ్‌పై దాడికి దిగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజాపూర్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి.. గొడవను గమనించి శశికిరణ్కు కొట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను వారించబోయారు. దీంతో అతడిపైనా కార్యకర్తలు దాడికి దిగారు. తర్వాత కొందరు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను దహనం చేసి ఆందోళన విరమించారు. కాగా, ఈ సంఘటనలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ సురేష్ తెలిపారు. దాడికి పాల్పడిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యానాయక్‌తో పాటు జోగు కృష్ణయ్య, వెంకట్రాములు, మల్లేశ్‌లపై కేసు నమోదు చేశారు. తమపై దాడి చేశారంటూ పెంట్యానాయక్, జోగు కృష్ణ చేసిన ఫిర్యాదుపై జడ్జి భర్త శశికిరణ్, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే మహిళలకు ఎక్కువ సేఫ్... -
అరుదైన పాము ‘కామన్కుక్రి’ పట్టివేత
సాక్షి, జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం కామన్కుక్రి అనే అరుదైన పామును పట్టుకున్నారు. పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ వ్యాపారి ఇంట్లోకి పాము చొరబడగా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సర్ప రక్షకుడు డాక్టర్ సదాశివయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యుడు, బీజెడ్సీ విద్యార్థి రాహుల్‌ను పంపించగా.. ఆయన పామును పట్టుకుని కళాశాలకు తీసుకెళ్లారు. కామన్కుక్రి పాము ప్రమాదకరం కాదని, అయితే అవి ఈ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో సంచరిస్తాయని సదాశివయ్య చెప్పారు. కుక్రి పామును అంతరించిపోతున్న పాముల్లో ఒకటిగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్– అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ) గుర్తించింది. ఈ పాము ఎక్కువగా చెత్తాచెదారంలో ఉండి సాయంత్రం సమయంలో బయటకు వస్తుందని, విషరహిత సర్పమని పేర్కొన్నారు. గ్రామంలోకి అడవిబర్రె ఏటూరునాగారం (ములుగు జిల్లా) : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శివాపురం దట్టమైన అటవీప్రాంతం నుంచి అడవిబర్రె శనివారం గ్రామంలోకి వచ్చి హల్చల్ చేసింది. దానిని చూసి ఆందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా...అధికారులు వచ్చి దానిని మళ్లీ అడవిలోకి పంపించారు. దారితప్పి గ్రామంలోకి వచ్చిందని, ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని అటవీ అధికారులు సూచించారు. -
పంటల లెక్కపై కేంద్రం కొత్త యాప్.. జీపీఎస్, ఫొటోలతో..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో వ్యవసా య శాఖ చేపట్టిన పంటల నమోదు ప్రక్రియ తర హాలో దేశవ్యాప్తంగా డిజటల్ సర్వేకు కేంద్ర ప్రభు త్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అన్ని రాష్ట్రాల్లో పంటల నమోదును ఒకేరీతిన పక్కాగా చేపట్టేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏ సర్వే నంబర్లో, ఏ రైతు, ఎంత విస్తీ ర్ణంలో ఏ పంట సాగు చేశారన్న కచి్చతమైన వివరాలను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయనున్నారు. 12 రాష్ట్రాల్లో ఒక్కో గ్రామం చొప్పున ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 12 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పంటల డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ) కింద నమూనా సర్వే కోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. మనరాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామం ఎంపికైంది. ఈ మేరకు ఇటీవల నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆ గ్రామంలో పర్యటించి నమూనా సర్వే నిర్వహించింది. టెక్నికల్ బృందం సీనియర్ మేనేజర్ సరిత, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి డీడీ గోవింద్, శైలజ, జేడీఏ విజయగౌరితో పాటు డీఏఓ వెంకటేష్ తదితరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం స్థానిక వ్యవసాయాధికారులతో కలసి వెంకటాపూర్‌లోని పంట పొలాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్ ప్రకారం.. భూరికార్డులకు అనుగుణంగా రైతులు వేసిన పంటలను ఫొటోలు తీశారు. ఏ సర్వే నంబర్లో ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది, ఆ రైతులు ఏ పంటలు వేశారనే సమాచారాన్ని ఫొటోలతో సహా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం చేశారు. ఇలా ఈ ఖరీఫ్‌లోపు 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 20శాతం గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రైతులకు ప్రయోజనకరంగా.. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పంటలను నమోదు చేసిన యాప్, నిక్షిప్తం చేసిన వివరాలు, వాటి క్రోడీకరణను పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. లోటుపాట్లేమైనా ఉంటే సరిదిద్ది అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు. తర్వాత ఈ యాప్‌ను అన్ని రాష్ట్రాలు నేరుగా వినియోగించుకోవచ్చని.. ఇదివరకే పంటల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో యాప్‌లో మార్పులు, చేర్పులు చేసుకుని వాడుకునే అవకాశం ఉందని కేంద్రం బృందం వెల్లడించింది. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు పంటల సర్వే పక్కాగా జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని.. దీని ద్వారా రైతులకు నేరుగా, పారదర్శకంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టపరిహారం, బీమా, రాయితీపై ఎరువుల సరఫరా వంటివాటికి ఈ యాప్ తోడ్పడుతుందని వివరించింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. -
పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్
పాలమూరు: మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని నేను.. నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయ్. నేనే పరమాత్ముడ్ని.. అవతారపురుషుడ్ని.. రండి.. నా చెంతకు రండి.. నేనే దేవుడ్ని.. అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేయగా.. ఆ పిలుపు అందుకుని భక్తులు కుప్పులు కుప్పలుగా క్యూ కట్టేశారు మరి. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి.. తాను దేవుడ్ని అంటూ.. రోగమేదైనా ఇట్టే నయం చేస్తానంటూ పాలమూరులో సెటిల్ అయ్యాడు. కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి.. శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్ములు(భార్యలు)ను చూపి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నాడు. భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు.. పోలీసులు ఆ దొంగ బాబా గుట్టు రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు. ఇదీ చదవండి: ఆశ్రమంలో కీచక పర్వం.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
బీజేపీలో హాట్ టాపిక్.. డీకే అరుణ మౌనంపై సస్పెన్స్!
తెలంగాణ ఫైర్ బ్రాండ్.. గద్వాల జేజమ్మ సైలంటయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉంటున్నారు. పాలమూరుకే పరిమితమవుతున్నారు. జేజమ్మ సైలెంట్ వెనుక కారణమేంటి?. కమలం పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా? లేక ఏదైనా కొత్త పదవి కోసం ఎదురుచూస్తున్నారా? డీకే అరుణ మౌనం వ్యూహత్మకమా? ఇంకేదైనా రీజన్ ఉందా?.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీకే అరుణ.. కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో డీకే అరుణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో చక్రం తిప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ.. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలతో పాటు.. కర్ణాటక రాష్ట్ర కో-ఇంఛార్జ్ బాధ్యతలు డీకే అరుణకు అప్పగించారు. పార్టీ లైన్ క్రాస్ కాకుండా.. తనపని తాను చేసుకుంటూపోతున్నారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డిని బరిలో దించి.. గెలిపించడంలో అరుణ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ముందుండే డీకే అరుణ ఒక్కసారిగా సైలెంట్ కావడం ఇప్పుడు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకే ఆమె పరిమితమవుతున్నారు. హైదరాబాద్ రాకుండా.. కేవలం సొంత జిల్లాలోనే పార్టీ పనులు చేసుకోవడం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే డీకే అరుణ సైలెంట్‌గా ఉంటున్నారా?. వ్యూహత్మకంగానే ఆమె మౌనపాత్ర పోషిస్తున్నారా? అనే విషయం అంతుచిక్కడం లేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు, ఇతర బాధ్యతల విషయంలో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీలో కూడా కొద్దిపాటి మార్పులు జరుగుతాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ డీకే అరుణ సైలెంట్‌పై తెరవెనుక ఏమైనా పావులు కదుపుతున్నారా? రాష్ట్ర పార్టీ వ్యవహారాలు తనకెందుకులే అని పాలమూరు జిల్లాకే పరిమితం అయ్యారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఏదేమైనా గద్వాల జేజెమ్మ సైలెన్స్ వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీలో తెగ చర్చించుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మల్లు రవితో జూపల్లి భేటీ.. కాంగ్రెస్ సీనియర్ ఏమన్నారంటే? -
మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేష్(24) అమెరికాలో మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో మృతి చెందాడు. వివారాలు.. బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేసి.. 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్ఎస్ చేస్తున్నాడు.మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. కొడుకు మృతి వార్తతో విలపిస్తున్న తండ్రి రాములు, మహేష్ తండ్రి బోయ వెంకట్ రాములు మహారాష్ట్రలో కాంట్రాక్టర్ వద్ద సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గ్రామంలో విషాదచ్చాయలు అలముకున్నాయి. మహేశ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు.. -
బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మూడు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు బాలికలు, ఓ మహిళ మృతి చెందారు. వనపర్తి జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నమ్మాయి ప్రమాదవశాత్తు నీటిలో పడడంతో ఆమెను కాపాడేందుకు అక్కలు కూడా నీటిలో దిగడంతో ఈత రాక ముగ్గురూ మృత్యువాత పడ్డారు. శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములకు చెందిన గంధం కురుమయ్య, భాగ్యమ్మ దంపతుల కుమార్తెలు తిరుపతమ్మ(16), సంధ్య (12), దీపిక (10) బట్టలు ఉతకడానికి గ్రామంలోని వీరసముద్రం చెరువు దగ్గరకు వెళ్లారు. బట్టలు ఉతుకుతున్న సమయంలో చిన్న అమ్మాయి దీపిక కాలు జారి చెరువులో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ఇద్దరు అక్కలు చెరువులోకి దిగడంతో అక్కడే గొయ్యి ఉండడంతో ఈత రాక నీట మునిగిపోయారు. ఈతకు వెళ్లి మరో ముగ్గురు: నారాయణపేట జిల్లాలో పెళ్లింటికి వచ్చిన ముగ్గురు బాలికలు కోయిల్‌సాగర్ వాగు (ఊకచెట్టువాగు)లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. మరి కల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన భాగ్యమ్మ, అశోక్ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. హైదరాబాద్‌కు చెందిన ఓ అబ్బాయితో ఆదివారం పెద్దకూతురు పెళ్లి జరిపించి సోమవారం రాకొండకు చేరుకున్నారు. పెళ్లికూతురు సోదరి రాధిక (16)తో పాటు నర్వమండలం పాతర్చేడ్కు చెందిన బంధువులు సువర్ణ, గణేష్ దంపతుల కుమార్తెలు శ్రావణి (15), మహేశ్వరి (14), మరో ఇద్దరు శశికళ, చంద్రకళ కోయిల్‌సాగర్ ఊకచెట్టు వాగులో కి ఈతకు వెళ్లారు. కాగా.. ఇసుక కోసం తీసిన గుంత లోతుగా ఉండడంతో రాధిక, శ్రావణి, మహే శ్వరి నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడే యత్నంలో శశికళ కూడా నీటిలోకి జారుతుండగా.. వెంటనే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఈత నేర్పించేందుకు బావిలోకి దిగి... నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లికి చెందిన తెలుగు లింగమ్మ(30) భర్త లింగస్వామితో కలిసి పిల్లలకు ఈత నేర్పించేందుకు వ్యవసాయబావిలోకి దిగింది. అయితే ఈత సరిగ్గా రాక బావి నీటిలో మునిగిపోయింది. భర్తతో పాటు చుట్టుపక్కల వాళ్లు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. చదవండి: బిడ్డా పదేండ్ల తర్వాత వస్తిని.. మినరల్ వాటర్ కోసం పోయి.. -
TS: 48 ఎకరాల భూములపై కన్నేసి.. 24 ఎకరాలు మింగేసి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, జాప్యానికి తావు లేకుండా.. పారదర్శకంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అధికారుల అండతో దీనికీ తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు.. వివాదాల్లో ఉన్న వక్ఫ్ భూముల్ని మింగేస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న భూ బాగోతం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. కోర్టులో కేసులుండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డుకు చెందిన ఇనాం (కిద్మత్) భూములపై ఎప్పటినుంచో నజర్ వేసిన కొందరు ‘పెద్దలు’చాకచక్యంగా వాటిని కొట్టేశారు. టెనెంట్‌దారులు (సాగుదారులు), ఇనాందారుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజి్రస్టేషన్ చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో కిద్మత్ ఇనాం కింద ఇచి్చన భూముల క్రయవిక్రయాలకు హక్కులు ఉండవు. ఎవరైతే ఇనాం పొందుతారో వారితో పాటు తర్వాతి తరాలు సాగు చేసుకునేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ.. కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లిన ఓ జిల్లా స్థాయి అధికారి, ఓ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కుమ్మక్కై చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం రూ.5 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని, తహసీల్దార్‌కు సమాచారం లేకుండానే రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. వారసులతో ఒప్పందం కుదుర్చుకుని.. ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 19, 20, 50, 51 సర్వే నంబర్లలో 48 ఎకరాల భూమి ఉంది. దీన్ని మూడు తరాలుగా చెన్నారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు సాగు చేసుకుంటూ టెనెంట్దారులుగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇది కిద్మత్ కింద ఇనాం భూమిగా.. హుస్సేని ఆలం ఇనాందారుగా ఉన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఆలం ఆ భూముల పట్టాదారుగా ఆన్లై¯న్లో నమోదైంది. విషయం తెలిసిన టెనెంట్ దారులు తాము అనేక ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ పేరు మీద పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సదరు ఇనాందారుకు చెందిన వారసులు (మూడో తరం) కూడా తమకే హక్కు కలి్పంచాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా ఈ భూములపై కన్నేసిన పెద్దలు.. ఇనాందారుడి వారసులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. మీ పేరిట పట్టాదారు పాసుబుక్కులు తెచ్చే బాధ్యత తమదని..ఆ తర్వాత ఆ భూమిని తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇనాందారుడి వారసులను కుటుంబసభ్యులుగా చేర్చి ఫ్యామిలీ సరి్టఫికెట్‌తో సంబంధిత 48 ఎకరాల కిద్మత్ ఇనాం భూమిని అధికారుల అండదండలతోవారి పేరిట మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఇలా వెలుగులోకి.. ఇనాందారుల పేరిట మొత్తం 48 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన విషయం తెలుసుకున్న టెనెంట్ దారులు మూకుమ్మడిగా కోస్గిలోని తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచి్చంది. అయితే తన ప్రమేయం లేకుండానే పాసు బుక్కులు వచ్చాయని.. తనకు కనీస సమాచారం లేదని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ ఇచ్చారు. అసలు విషయం బట్టబయలు కావడంతో పాసు బుక్కులు రద్దు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. కానీ అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. భూముల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఓ అధికారి కీలకపాత్ర! నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ అధికారి ఈ భూ బాగోతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సమాచారం చేరవేసి తతంగం నడిపించినట్లు సమాచారం. కోర్టు కేసులకు సంబంధించి ఇరువర్గాల అడ్వకేట్లు సహా ఇటు టెనెంట్‌దారులు, అటు వారసుల మధ్య రాజీ కుదిర్చాడు. ఇరువర్గాలు 48 ఎకరాల భూములను సమానంగా పంచుకుని.. హైదారాబాద్ చెందిన ఓ రియల్టర్ల గ్రూప్‌నకు అమ్మేలా ఒప్పందం చేయించాడు. ఉన్నతాధికారి సహకారంతో ఇరువర్గాలకు (టెనెంట్, ఇనాందారులకు) సమానంగా 24 ఎకరాల చొప్పున రిజి్రస్టేషన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన రిజి్రస్టేష¯న్ వెనుక రూ.5 కోట్ల డీల్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రియల్టర్లు ప్రజాప్రతినిధి బినామీలేనట.. ఒప్పందం ప్రకారం ఇనాందారులకు సంబంధించిన 24 ఎకరాల భూములను హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వీరందరూ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీలేనని తెలిసింది. కాగా సదరు ప్రజాప్రతినిధి ముందస్తు ఒప్పందం ప్రకారం వారసులకు తూతూ మంత్రంగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే 11 ఎకరాలను కోస్గి పట్టణానికి చెందిన ఇద్దరు బడావ్యాపార వేత్తలకు ఏకంగా రూ.6.5 కోట్లకు విక్రయించి తిరిగి వారి పేరిట రిజి్రస్టేషన్ చేయించారు. ఈ భూభాగోతంపై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్‌ను సంప్రదించగా.. ‘నేను ఇటీవలే బదిలీపై వచ్చా. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదిక అందజేస్తా’అని సమాధానమిచ్చారు. ఇది కూడా చదవండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ? -
TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి కారణంగా రేపు.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఇక, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో, దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో, రాగల మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అవుతాయి. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశముంది. ఇక నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50కిమీ) వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
బీజేపీలోకి జూపల్లి!.. డీకే అరుణ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, మహబూబ్ నగర్: తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావాడంతో వారు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, డీకే అరుణ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసంతృప్తులు మాతో టచ్‌లో ఉన్నారు. జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి ఆహ్వానించాను. ఈ క్రమంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా మధ్య వ్యక్తిగత వైరం లేదు.. పార్టీ పరంగా విభేదాలు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. ఇదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై కూడా డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేస్తోంది. పేపర్ లీకేజీతో 30 లక్షల మందికి నిరుత్సాహమే మిగిలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయి. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పాత్ర ఉందని అనుమానం. పరీక్ష రాసిన ప్రతీ అభ్యర్థికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలి. ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకోవాల్సిన మంత్రులు ఇష్యూను డైవర్ట్ చేస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా డీకే అరుణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన వరంగల్‌లో మొదటి నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే, రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాడి ముగ్గురు మృతిచెందడం బాధకరమని అన్నారు. -
‘కల్తీ’ కల్లు కల్లోలం! మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న బాధితులు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ కల్లు (మందు కల్లు) తాగి అస్వస్థతకు గురై మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 32 మంది రాగా.. 23 మంది వరకు అప్పటికప్పుడే చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు సమాచారం. అయితే దీనిని ఆస్పత్రి అధికారులు గానీ, ఎక్సైజ్ శాఖ గానీ ధ్రువీకరించడం లేదు. అయితే సోమవారం ఒక వ్యక్తి మరణించడం, ఇందుకు కల్తీ కల్లే కారణమనే అనుమానాలు వ్యక్తం కావడం కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగిన మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి మహబూబ్‌నగర్ మండలం కోడూరు గ్రామానికి చెందిన హరిజన ఆశన్న (58) ఈ నెల పదో తేదీ తెల్లవారుజామున మరణించాడు. అతను ఈనెల 9న మధ్యాహ్నం దొడ్డలోనిపల్లిలోని దుకాణంలో కల్లు తాగాడని.. ఇంటికెళ్లిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని సమాచారం. మాటలు తడబడడం, చేతులు, మూతి వంకర్లు తిరగడంతో రాత్రి 108 అంబులెన్స్‌లో బంధువులు అతడిని జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆశన్న తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. వైద్యులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అతడి తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చేసరికి సమయం పట్టడంతో మంగళవారం దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు, ఎక్సైజ్‌శాఖ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఇద్దరు ఐసీయూలో.. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఐసీయూలో మరో ఇద్దరు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుబాబు భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లో పోస్టల్ శాఖలో ఏబీపీఎంగా చేస్తున్నాడు. ఆయనతో పాటు దొడ్డలోనిపల్లి గ్రామానికి చెందిన రేణుక ఐసీయూలో చికిత్స పొందుతోంది. విష్ణుబాబుకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. దొడ్డలోనిపల్లికి చెందిన రేఖతో పాటు మరో ఆరుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఆ్రల్ఫాజోలం మోతాదులో తేడా వల్లేనా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. కల్లులో ప్రధానంగా నిషేధిత మత్తు పదార్థం ఆ్రల్ఫాజోలంను కలుపుతున్నారు. అయితే మోతాదులో తేడా రావడం వల్లే బాధితులు పిచి్చపిచి్చగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అందరిలో మెడ తిమ్మిర్లు, చేతులు వణకడం, తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఎవరూ కల్లు తాగి అడ్మిట్ కాలేదు.. కల్తీ కల్లు తాగి ఆస్పత్రిలో ఎవరూ ఆడ్మిట్ కావడం లేదు. కేవలం వింత వింత ప్రవర్తనతో పాటు ఫిట్స్ ఇతర సమస్యలతో వస్తున్నారు. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు దాదాపు 25 మంది వరకు ఇలాంటి లక్షణాలతో ఆడ్మిట్ అయ్యారు. వీరిలో కొందరికి ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారించాం. అందరికీ కావాల్సిన చికిత్స అందించి డిశ్చార్జి చేయడం జరుగుతుంది. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఐదురోజులుగా ఆస్పత్రిలోనే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని మోతీనగర్ ప్రాంతానికి చెందిన ఇంద్రజ ఈ నెల 7న కల్లు తాగి అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది. సపర్యలు చేస్తున్న ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం..ఇంద్రజకు కల్లు తాగే అలవాటు ఉంది.. పిచి్చపిచి్చగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం..’ అని తెలిపింది. చదవండి: అదిరిపోయే ఎండలు.. -
కల్లు కల్లోలం..! బిత్తిరి చూపులు..వింత ప్రవర్తన..
-
గద్వాలలో సరెండర్ లొల్లి!.. హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్‌ను పంచా యతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్‌మీట్ నుంచే మంత్రికి ఫోన్.. తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్‌మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు. కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఏ-2 రాజశేఖర్ బావ ప్రశాంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన కమిషన్ నెట్వర్క్ ఆడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు(బావ) ప్రశాంత్‌ను సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ప్రశాంత్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ ఉపాది పథకంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నవాబ్ పేట వెళ్లిన సిట్ అధికారులు ఎంపీడీవో కార్యాలయం చేరుకుని.. అక్కడే ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించిన అనంతరం అతన్ని హైదరాబాద్ తరలించారు. అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రశాంత్‌కు..100కుపైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రశాంత్.. మరో ముగ్గురితో కలిసి 15 లక్షలు వెచ్చించి గ్రూప్-1 పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 13కుచేరింది. నిందితుల్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ కేసులో సిట్ అధికారులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ పిటిషన్‌పై నేడు(శనివారం)నాంపల్లి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఏ-1 ప్రవీణ్, ఏ-2 రాజశేఖర్ రెడ్డి, ఏ-4 డాక్య, ఏ-5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ-11, సురేష్, ఏ-12 రమేష్‌లను సిట్ ఆరు రోజుల కస్టడీ కోరింది. చదవండి: ‘టీఎస్పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి -
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
వ్యాయామం చేసి వచ్చాక.. గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్ మజిద్ హుస్సేన్ అలియాస్ జునేద్ (26) గురువారం రాత్రి జిమ్‌లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్‌కోవిడ్ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్ కార్డియాక్ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఎలా? సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. దెబ్బకొడుతున్న జీవన శైలి గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్‌ఫుడ్ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి విజయం
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వీరిలో ఏవీఎన్‌రెడ్డి 7505 ఓట్లు (మొదటి ప్రాధాన్యత) సాధించగా, గుర్రం చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లు పొందారు. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి 4569 ఓట్లు పొందారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి అతి తక్కువగా 1,236 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక హర్షవర్థన్‌రెడ్డికి 1907 ఓట్లు రాగా, భుజంగరావు 1103 ఓట్లు వచ్చాయి. కాసం ప్రభాకర్‌కు 764 ఓట్లు సాధించగా, ఎ.వినయ్‌బాబు 568 ఓట్లు సాధించారు. ఎస్ విజయ్‌కుమార్ 313 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 212 ఓట్లు , ఎ.సంతోష్‌కుమార్ 160 ఓట్లు, అన్వర్‌ఖాన్ 142 ఓట్లు, డి.మల్లారెడ్డి 69, ప్రొఫెసర్ నథానియ ల్ 98, మేడిశెట్టి తిరుపతి 57, జి. వెంకటేశ్వర్లు 47, చంద్రశేఖర్‌రావు 41, పార్వతి 20, కె. సత్తెన్న 6, ఎల్ వెంకటేశ్వర్లు 14 ఓట్లు పొందగా, త్రిపురారి అనంతనారాయణ్ ఒకే ఓటుతో సరి పెట్టుకున్నారు. -
గవర్నర్ వ్యవస్థతో అణచివేతకు పాల్పడుతున్న కేంద్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు. -
‘డర్టీపిక్చర్’లో కొత్త మలుపులు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘న్యూడ్‌కాల్స్’ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అసలు నిందితులను తప్పించారని.. ఈ మేరకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. డర్టీపిక్చర్ను తలపించిన ఈ రోత పనిలో ఓ పోలీస్ అధికారి స్వీయ భాగస్వామ్యం ఉందని.. అయితే కిందిస్థాయి అధికారిపై బదిలీ వేటుతో సరిపుచ్చారని గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్‌శాఖలో అసలు ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎటుపోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయం ఖాకీల్లో నెలకొంది. తాజాగా రహస్య విచారణ.. న్యూడ్‌కాల్స్ వ్యవహారం వెలుగులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా జిల్లాపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు జిల్లాపై డేగ కన్ను వేశారు. ఇటీవల జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోగా.. అందరూ దాదాపుగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వారికి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు.. ఇక్కడ ఎవరి మద్దతు ఉంది.. పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు అనే కోణంలో రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ బృందం రహస్యంగా విచారణ చేపట్టి ఆరా తీసింది. ఈ క్రమంలో న్యూడ్ కాల్స్ వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అసలు నిందితులను తప్పించే క్రమంలో సుమారు రూ.50 లక్షలు చేతులు మారాయని గ్రహించిన వారు.. ఎవరెవరికి ఎంత ముట్టాయనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఏం జరిగింది.. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబరుచుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్, స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ రోత పనులకు పురిగొల్పారు. పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ అంశం బట్టబయలైన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి రాగా.. ఇందులో ప్రధాన పారీ్టకి చెందిన యువకులు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది. అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితులెవరూ ముందుకు రాకపోవడంతో ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత నిఖిల్, వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడు అయిన ఓ ప్రజాసంఘం నాయకుడి కుమారుడు, ఇద్దరు కౌన్సిలర్లతోపాటు ఓ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అరెస్టు చేసిన ఆ ముగ్గురు మాత్రమే నిందితులని.. మిగతా వారి ప్రమేయం లేదని అప్పటి జిల్లా పోలీస్ బాస్ కొట్టి పారేశాడు. దీనిపై అప్పట్లోనే దుమారం చెలరేగింది. కలవరం.. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి పట్టుబడిన ముగ్గురు యువకులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాన పార్టీకి చెందిన యువకులే. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురితోపాటు తప్పించిన అసలు నిందితుడు ఓ పురపాలిక ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ పంచాయితీ జిల్లాకు చెందిన ముఖ్య నేత వద్దకు చేరింది. తన వైరి వర్గమైనప్పటికీ జిల్లా పరువు పోతుందనే కారణంతో ఆయన సైలెంట్‌గా ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్వీయ భాగస్వామ్యం ఉన్న పోలీస్ అధికారిని వదిలేసి నిందితులతో ఖరీదు దోస్తాన్ చేసిన ఓ ఎస్ఐపై బదిలీ వేటు వేసి కేసు మొత్తం క్లోజ్ చేశారని ఇంటెలిజెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు క్లోజ్ అయిన మూడు నెలల తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ రహస్యంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం జిల్లా పోలీస్‌శాఖ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది. ‘సిట్’తో విచారణ జరిపించాలి.. గద్వాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులపై ప్రభుత్వం స్పందించాలి. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా సరే గుర్తించి శిక్ష పడేలా ప్రత్యేకంగా సిట్ బృందం ఏర్పాటు చేయాలి. ఈ కేసులో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, పోలీసుల పేర్లు వినపడుతున్నాయి. స్థానిక పోలీసులపై అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. వారిని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పారదర్శకంగా జరగాలంటే సిట్‌తో విచారణ జరిపించాలి. – జ్యోతి, స్త్రీ చైతన్య సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎవరినీ ఉపేక్షించం.. జిల్లాలో న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి నేను బాధ్యతలు తీసుకోక ముందే విచారణ చేశారు. దానిపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. పరిశీలించి మళ్లీ విచారణ చేపడతాం. తేలిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. – సృజన, జోగుళాంబ గద్వాల ఎస్పీ -
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు!
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం. అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. అరోపణలు ఇలా ► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి. ►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గానికి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 తేదీ వరకు (సెలవు దినాలు మినహా) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు.. ►ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల నిర్వహణకు అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. వివరాలిలా ఉన్నాయి. ►జి.వెంకటేశ్వర్లు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకర ణ): బ్యాలెట్‌పత్రాలు, బ్యాలెట్‌బాక్సుల తయారీ. ►పి.సరోజ(అడిషనల్ కమిషనర్, పరిపాలన): ఎన్నికల సామాగ్రి సేకరణ. ►సంధ్య(జేసీ, శానిటేషన్): ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది. ►పద్మజ( సీఎంఓహెచ్):హెల్త్‌కేర్ కార్యక్రమాలు,కోవిడ్ నిబంధనలు. ► కె.నర్సింగ్‌రావు:( డీఈఈ, ఐటీ): వెబ్‌క్యాస్టింగ్,ఐటీ సంబంధిత అంశాలు. ►శ్రుతిఓజా (అడిషనల్ కమిషనర్), సౌజన్య( పీడీ), యూసీడీ: శిక్షణ కార్యక్రమాలు ►ఎన్.ప్రకాశ్‌రెడ్డి (డైరెక్టర్, ఈవీడీఎం): ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతలు,వాహనాలు ►మహ్మద్ జియా ఉద్దీన్(ఈఎన్సీ): పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ►ముర్తుజాఅలీ(సీపీఆర్ఓ): ఓటరు అవగాహన కార్యక్రమాలు, మీడియాసెల్, పెయిడ్‌న్యూస్ ►బాషా(ఎస్టేట్ ఆఫీసర్): 24 గంటల ఫిర్యాదుల విభాగం, కాల్‌సెంటర్ ఫిర్యాదుల పరిష్కారం ►మహేశ్ కులకర్ణి( చీఫ్వాల్యుయేషన్ఆఫీసర్): రిపోర్టులు ► విజయభాస్కర్‌రెడ్డి(పర్సనల్ ఆఫీసర్): పోస్టల్‌బ్యాలెట్ 25న స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో 118 మంది ఓటర్లున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్యసభల సభ్యులు ఓటర్లు. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించి తుదిజాబితా 25న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోటాలోని ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్జాఫ్రి పదవీకాలం మే 1వ తేదీతో ముగియనున్నందున ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. -
త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు..
కృష్ణా: మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వేలో భాగంగా దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల దక్షిణ మధ్య రైల్వేలైన్ పనులు పూర్తి కావడంతో ఇటు తెలంగాణ ప్రజలతో పాటు కర్నాటక, గోవా రాష్ట్రాల మధ్య రాకపోకలకు, వర్తక, వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మొట్టమొదట 2017లో దేవరకద్ర నుంచి జక్లేర్ గ్రామం వరకు 28.3 కిలోమీటర్లు రూ.943 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. తర్వాత జక్లేర్ నుంచి మక్తల్ వరకు 11.5 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులను 2020లో, ఆ తర్వాత మక్తల్ నుంచి మాగనూర్ వరకు ఉన్న 13.3 కిలోమీటర్లను 2022 మార్చిలో, మాగనూర్ నుంచి కృష్ణా వరకు ఉన్న 12.7 కిలోమీటర్లను 2023లో పూర్తి చేశారు. ఈనెల 6న సికింద్రాబాద్, గుంతకల్ డీఆర్ఎంలతో పాటు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ప్రణవ్ సక్సేనా ఆధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తి కావడంతో ఇక మీదట అన్నిరకాల రైళ్లు నడిపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ధారించారు. గతంలో 6గంటలపాటు ప్రయాణించి హైదరాబాద్ చేరేవారు, ప్రస్తుతం 3గంటల్లోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది. త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు.. కాచిగూడ నుంచి కృష్ణా వరకు రైలును త్వరలోనే ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కర్నాటకలోని రాయచూర్, బళ్లారి, గుంతకల్, హుబ్లి, గోవాకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా, ప్రజా రవాణాలకు ఈ దారి ఎంతో ఉపయోగంగా మారనుంది. నిత్యం వందల సంఖ్యలో రాయచూర్ నుంచి హైదరాబాద్ వరకు వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణా వాహనాలు రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు రైల్వేలైన్ అందుబాటులోకి రావడం ఎంతో తోడ్పడనుంది. ఇక్కడి రైతులు పండించే ధాన్యం, కూరగాయలు, పండ్లు అటు హైదరాబాద్, ఇటు కర్నాటకలోని రాయచూర్‌కు తరలించేందుకు వీలు కలుగనుంది. అభివృద్ధికి తోడ్పాడు.. మునీరాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడంతో మక్తల్ నియోజకవర్గం అన్ని రకాలుగా వేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా తక్కువ సమయంలో గమ్యం చేరుకునేందుకు వీలు కలుగుతోంది. మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నా హయాంలో పూర్తికావడం ఆనందంగా ఉంది. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ధ ఘాట్ రోడ్డులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తృటిలో ఈ ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రాజెక్ట్ లోయ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డివైడర్ రైయిలింగ్‌కు ఆనుకుని ఆగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కేసీఆర్ మార్క్ పాలిటిక్స్‌ను తిప్పికొట్టాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రాష్ట్ర పార్టీ సన్నద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్‌బన్సల్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్దీ కేసీఆర్ తనదైన పద్ధతుల్లో బీజేపీని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఇరుకున పెట్టేందుకు చేసే ప్రయత్నాలను నీరుగార్చాలని సూచించారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న 9 వేల వీధి సమావేశాల (స్ట్రీట్‌కార్నర్ మీటింగ్స్)ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సునీల్ బన్సల్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలన్నింటినీ తు.చ. తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అంతకుముందు మాట్లాడిన నేతలంతా కేసీఆర్ రాజకీయాలు చేస్తారని ప్రస్తావించగా, బీజేపీ కూడా రాజకీయ పార్టీయేనని కేసీఆర్‌కు తగ్గట్టుగా మన వ్యూహాలు ఉండాలని చెప్పారు. అవిశ్రాంత పోరాటం.. బీజేపీ తీర్మానం కేసీఆర్ సర్కార్ అవినీతి, అరాచకపాలనపై బీజేపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం స్పష్టంచేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర, ప్రజాగోస–బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో బీఆర్ఎస్పై జరిపే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్ఎస్ సర్కార్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా బీజేపీని గెలిపించాలని కోరింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తెలంగాణవాదాన్ని విడిచిపెట్టి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని పేర్కొంది. ప్రజాక్షేత్రంలో తమ వైఫల్యాలు చర్చకు రాకుండా చేసేందుకు కేసీఆర్ రాజకీయ కుట్రకు తెరలేపారని బీజేపీ మండిపడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినట్టుగా చెప్పుకునే పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించి ప్రజలను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తింది. జీహెచ్ఎంసీ, పౌరసరఫరాలు, విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ప్రభుత్వరంగ కార్పొరేషన్లు అప్పులతోనే నడుస్తున్నాయని ఆరోపించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ప్రతిపాదించిన రాజకీయతీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రతిపాదించగా, పార్టీ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. కాళేశ్వరంలో అవినీతి.. కేసీఆర్ నేతృత్వంలోని అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనతో ఎనిమిదిన్నరేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు తమ విధులు నిర్వహించకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై తప్పుడు కేసులు బనాయించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. మహిళలపై హత్యాచారాలు పెరగడంతోపాటు ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ముమ్మాటికి నిజమని, ఇది బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంగా మారిందనే ఆరోపణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం తీరు తెన్నులపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.గంగిడి మనోహర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఈటల రాజేందర్, డీకే అరుణ, సంకినేని వేంకటేశ్వర రావు బలపరిచారు. స్వతంత్ర భారతంలో తొలిసారిగా జీ–20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం తెచ్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించారు. బడుగు వర్గాలను మోసం చేశారు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఈ భేటీలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, డా.జి.విజయరామారావు, రవీంద్రనాయక్‌లు ఆయా వర్గాల వారీగా ప్రస్తావించారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆర్భాటంగా ప్రకటించిన దళితబంధును సరిగా అమలుచేయకుండా దళిత సమాజాన్ని వంచించారని ధ్వజమెత్తారు. -
రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది: బండి సంజయ్
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో రాజాకర్ల పాలన కొనసాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలన అరాచకం, అవినీతి పరంగా సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ అగౌరవ పరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ ప్రత్నామ్నాయం అనే విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశం గురించి ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవతున్నారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీటన్నింటిపై చర్చిస్తామని తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్రలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలిసిందన్నారు. మన ప్రజా సంగ్రామయాత్రను ప్రధాని మోదీ కొనియాడటం అభినందనీయన్నారు. అంబేద్కర్ పుట్టినరోజు కాకుండా కేసీఆర్ పోడుభూముల విషయం ఎందుకు పరిష్కరించటం లేదు. రుణమాఫీ ఏమయ్యింది. 317 జీఓపై బీజేపీ పోరాటం వల్లే ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి దివాలా తీసింది. జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మద్యంపై వచ్చే 40 వేల కోట్ల ఆదాయంపై ఆదారపడి పాలన సాగిస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చుతాడో కేసీఆర్ చెప్పే స్థితిలో లేడు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు హామీలు ఇచ్చి మరోసారి సారి ప్రజలను మోసగించే ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఎమ్మార్పీఎస్ వర్సెస్ బీజేపీ.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. మరోవైపు పోలీస్ వాహనం సైతం ధ్వంసం కావడంతో.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్ వద్దకు చేరుకుని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై బాహాబాహీకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, ఓ పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. -
పాత ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం.. అనుమానంతో వేధిస్తున్నాడని
సాక్షి, నాగర్‌కర్నూల్: తాగి వేధిస్తున్న ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు వలస వెళ్లింది. అక్కడే ఉంటున్న రవికుమార్ (38)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వారు ఐదేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చి వట్టెంలో సహజీవనం చేస్తున్నారు. కాగా, కృష్ణమ్మకు గతంలో జడ్చర్లకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో రవి రోజూ తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆ వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక మాజీ ప్రియుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న రవికుమార్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ హన్మంత, ఎస్ఐ కృష్ణా ఓబుల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వెంటనే విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. -
కల్తీ కేరాఫ్.. ఆ నలుగురు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓ ఇద్దరు కల్లు డిపోల నిర్వాహకులు..ఓ మద్యం వ్యాపారి..ఓ నకిలీ లిక్కర్ తయారీదారు.. ఉమ్మడి పాలమూరులో కల్తీ కల్లు, నకిలీ మద్యం దందాకు కేరాఫ్ వీళ్లేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఓ అధికారి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి కనుసన్నల్లో సిబ్బంది నిర్బంధ వసూళ్లకు పాల్పడుతుండగా, కల్లు డిపోల నిర్వాహకులు, మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం.. లిక్కర్లో ఘాటు పెంచే స్పిరిట్ సరఫరా జోరుగా సాగుతోంది. మరోవైపు పేరున్న మద్యం బ్రాండ్లలో మూతలు తీసి నీరుపోసేందుకు ఓ ముఠా ఇటీవల సరిహద్దులు దాటి వచ్చి ఐదు జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించింది. అయినా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిద్ర‘మత్తు’వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార’పార్టీ నేతల బినామీలే కల్తీ కల్లు, నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ చేతులెత్తేసిందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం, కల్లు కల్తీ రాకెట్ సూత్రధారులు, పాత్రధారులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఇద్దరి కీలక పాత్ర ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా లకు ఆ్రల్ఫాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేయడంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఈ నిషేధిత పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరికి వారు జిల్లాలు, మండలాలు, ప్రాంతాల వారీగా పంచుకుని ఏజెంట్లను పెట్టుకుని కోడ్ భాష ఆధారంగా సరుకును ఆయా డిపోలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నువ్వా? నేనా? మహబూబ్‌నగర్ పట్టణ శివారులో ఆ ఇద్దరికి సంబంధించిన కల్లు కాంపౌండ్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. అటు నిషేధిత మత్తు పదార్థాల రవాణాతో పాటు సదరు కాంపౌండ్లలో కల్లు విక్రయాల్లో కూడా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి పట్టణ ప్రధాన కూడలిలో టైర్ల షాపు ఉంది. ఇతను తన పోటీదారుడిని, అతడి కాంపౌండ్‌లోకి కల్లు తాగేందుకు వెళ్లేవారిని బౌన్సర్లతో నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండదండలు తనకే ఉన్నాయని సదరు వ్యక్తి దబాయిస్తుండగా, ప్రస్తుతం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పంచాయితీ సదరు ముఖ్యనేత వద్దకు చేరడంతో, తాను సమస్య పరిష్కరిస్తానని, గొడవలు పడొద్దని మందలించినట్లు సమాచారం. బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నీళ్లు! ఇక ఉమ్మడి జిల్లాలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగుతుండడంతో వాటిలో స్పిరిట్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. అంతేకాదు వైన్స్లతోపాటు బార్లలో బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ బాటిళ్లలో 40 శాతం మేర మద్యం తీసి నీరు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ మద్యం వ్యాపారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి ఆధ్వర్యంలోనే వికారాబాద్ నుంచి వచి్చన ఎవరూ కనిపెట్టని విధంగా లిక్కర్ మూతలు తీసి, పెట్టే గ్యాంగ్ పాలమూరులో కార్యకలాపాలను విస్తరించినట్లు సమాచారం. మునుగోడులో కల్తీ లిక్కర్ వెనుక గద్వాల కింగ్! నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కల్తీ లిక్కర్ ఏరులై పారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దీన్ని గుర్తించిన అధికారులు కూపీ లాగారు. అనుమతి లేకుండా డిస్టిలరీ ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఉమ్మడి నల్లగొండతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించినట్లు సమాచారం. ఇందులో బాలరాజుగౌడ్ కీలకంగా వ్యవహరించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గద్వాల జిల్లా పాతపాలెంకి చెందిన లిక్కర్ కింగ్ వెంకన్నగౌడ్ హస్తం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఇతను కర్ణాటక లిక్కర్‌ను తెలంగాణ, ఏపీకి అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కగా ఇరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తన స్వగ్రామమైన పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తూ కూడా పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్‌లో రూ.10 లక్షల విలువ చేసే 750 కిలోల సీహెచ్‌ను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కర్నూలుకు తరలిస్తున్న క్రమంలో భూత్పూర్ సమీపంలో పట్టుకున్నారు. ఇటీవల ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ బైండోవర్‌తో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
నేనేం పాపం చేశాను నాన్నా?
మహబూబ్‌నగర్ క్రైం: భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న ఆక్రోశంతో తన ఆరేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పాలకొండ తండాకు చెందిన నేనావత్ శివ, శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. కొంతకాలానికి శివ మద్యానికి అలవాటుపడి తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట భార్యను కొట్టడంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో శివ భార్య పుట్టింటికి వెళ్లి పెద్ద కూతురు కీర్తన (6) ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 4న కీర్తనను శివ కొట్టాడు. దీంతో బాలిక అమ్మ కావాలని మారాం చేసింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఏమాత్రం కనికరం లేకుండా కూతురు ముక్కు మూసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పాప పలకడం లేదని ఆటోలో జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే కీర్తన మృతి చెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై పోలీసులు హత్య కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం
మహబూబ్‌నగర్ రూరల్/హన్వాడ: రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా ఎదుగుతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోడూరు, హన్వాడలో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడంలేదని శ్రీకాంతాచారి వంటి అనేక మంది త్యాగాలు చేశారని, ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని, దక్షిణ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అన్నారు. నెత్తిమీద రూపాయి పెడితే కూడా ఎవరూ కొనుక్కోలేని వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయ్యారని, కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు కేవలం ఆరు నెలల్లో కాలం చెల్లనుందన్నారు. ప్రజలు సామాజిక తెలంగాణను కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, జిల్లా ఇన్చార్జి భరత్‌గౌడ్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. -
కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా: ఇటిక్యాల మండలంలోని కొండేరులో యువతి అదృశ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోకారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండేరు చెందిన డక్కలి కోటమ్మ, హనుమంతు దంపతుల చిన్న కుమార్తె రాణికి కుటుంబసభ్యులు కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ఇష్టం లేకపోవడంతో బుధవారం ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూలీ పనులకు వెళ్లగా ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తమ కూతురు లేకపోవడంతో ఆరా తీయగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం తల్లి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి) -
180 కిలో మీటర్లు.. 5 ఆస్పత్రులు.. సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గుండెపోటుతో మృతి చెందింది... స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది. – మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా? -
బ్యాటరీ పరిశ్రమ వద్దేవద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఐటీ, సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీల స్థాపనను స్వాగతిస్తాం గానీ.. బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు’ అని మహబూబ్‌నగర్ ప్రజలు తేల్చి చెప్పారు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్ మైదానంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, పీసీబీ ఈఈ సంగీత హాజరుకాగా.. బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి గ్రామస్తులతోపాటు పర్యావరణ, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. సందిగ్ధత.. అయినా అంగీకరించం దివిటిపల్లి పారిశ్రామికవాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఈ నెల 2న అమర్‌రాజా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే, బ్యాటరీల పరిశ్రమతో జల, వాయు కాలుష్యం వెలువడి.. సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఆ కంపెనీ పేరు ప్రస్తావించ లేదు. మెకానికల్ బ్యాటరీలు అని గానీ. ఎలక్ట్రానిక్ బ్యాటరీలు అని గానీ స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ అంశాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. బ్యాటరీ తయారీ కంపెనీతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిందని, బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు నినదించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ వద్దు శ్రీసాయి మానస నేచర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రతిపాదిత ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్‌ను కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే నంబర్ 556, 607లో సేకరించిన 377.65 ఎకరాల్లో రూ.568.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, డ్రోన్లు, ఐటీ పార్క్, మొబైల్ఫోన్ల ఉపకరణాలు, చార్జర్లు, డిస్ప్లే, కెమెరాలు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా వందకు వంద శాతం మంది ఈ క్లస్టర్ ఏర్పాటుపై వ్యతిరేకగళం వినిపించారు. సంతకాల సేకరణ కో సం రిజిస్టర్లో ముందు పేజీలో స్థలం వదిలి సంతకాలు సేకరిస్తుండటంపై పలువురు ప్రశ్నించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఊరు విడిచి వెళ్లాల్సిందే... గతంలో డైయింగ్ ప్లాంట్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ ప్లాంట్‌ను తొలగించాలని ధర్నాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్పందించి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వ్యయం కావడంతో కంపెనీ వాళ్లే మూసేసుకున్నారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు మృత్యువాత పడ్డాయి. గర్భిణులు, పిల్లలు దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాటరీ పరిశ్రమ పెడితే మళ్లీ అలాంటి దుస్థితే వస్తుంది. అప్పుడు మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే. –హన్మంతు, రైతు, ఎదిర, మహబూబ్‌నగర్ -
‘నన్ను ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు..పెళ్లి చెడగొడతా’
చిన్నచింతకుంట: ‘నన్ను ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నన్ను కాదంటే పెళ్లి చెడగొడతా’ అంటూ ఓ యువకుడు వేధించడంతో ఆందోళనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామ తండాకు చెందిన ముడావత్ అంజమ్మ, హనుమంతు దంపతులకు పుష్పలత (19) ఒక్కగానొక్క కుమార్తె. తండ్రి చనిపోవడంతో పుష్పలత టైలరింగ్ చేస్తూ తల్లిని పోషించుకుంటోంది. అదే తండాకు చెందిన సాయి సందీప్ నాయక్‌తో కొంతకాలంగా పుష్పలత ప్రేమలో ఉంది. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వచ్చే నెలలో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో తనను ప్రేమించి.. మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని ప్రియుడు సాయిసందీప్ కొన్ని రోజులుగా ఆమెతో గొడవకు దిగుతున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే ఇద్దరం కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టి పెళ్లి చెడగొడతానని బెదిరింపులకు దిగాడు. దీనికి తోడు అతని స్నేహితుడు బాషా నాయక్ సైతం సందీప్‌ను పెళ్లి చేసుకోమని వేధించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లి అంజమ్మకు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ పుష్పలత కనిపించింది. దీంతో చుట్టపక్కల వారిని పిలువగా వారు వచ్చి పుష్పలతను కిందికి దించగా.. అప్పటికే మృతి చెందింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మారెడ్డి తెలిపారు. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!
సాక్షి, మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రాంలాల్ వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు(39) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్, భార్య సుజాత వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డితో నాలుగేళ్ల క్రితం సుజాతతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు భార్యను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. అయినా గుట్టు చప్పుడుగా వీరు తమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో, పద్ధతి మార్చుకోవాలని భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త గొడవ పడుతున్న విషయాన్ని సుజాత ప్రియుడికి తెలిపింది. ఇరువురు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం వేశారు. ఈ నెల 6న గ్రామంలో జాతర ఉందని ఇంటిని శుద్ధి చేసి భర్తను నమ్మించి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మద్యం సేవించారు. శ్రీనివాసులు మద్యం మత్తులోకి జారుకోగా, రాత్రి 12 గంటల సమయంలో భార్య తన భర్త ముఖంపై ఊపిరి ఆడకుండా గట్టిగా దిండు పెట్టగా, ప్రియుడు కరుణాకర్‌రెడ్డి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. భార్యపై అనుమానంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిజాలు తేలాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరిని గ్రామంలోనే అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ -
జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
జోగుళాంబ శక్తిపీఠం(మహబూబ్‌నగర్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ గగన్‌గౌరవ్ జ్యోతిర్లింగ ఫౌండేషన్లు వరల్డ్ హెల్త్ డయాబెటిక్, క్యాన్సర్, ఎయిడ్స్ ఫౌండేషన్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని గాంధీభవన్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో జోగుళాంబ ఆలయానికి ‘హిందుస్తాన్ గగన్‌గౌరవ్ అంతర్జాతీయ పురస్కారం–2022’ప్రకటించారు. కోవిడ్ సమయంలో వచ్చిన తుంగభద్ర నదీ పుష్కరాలకు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, వేదపండితులు శ్యాంకుమార్ శర్మలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి వారికి అవార్డును ప్రదానం చేశారు. -
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. గద్వాలలో కారు డ్రైవర్ ఎవరు?
వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు నిత్యం సవాల్‌గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది. మా దారి మాదే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్‌రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు. కులాల కురుక్షేత్రం గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. నన్నే పక్కనబెడతారా? ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్‌పర్సన్‌తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది. ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్ ముఖ్యమా..
బాలానగర్: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాలవర్ధన్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులుఉన్నారు. -
మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో కొన్ని విశేషాలు గమనించవచ్చు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు కురిపించినా, పెద్ద గా హద్దులు దాటినట్లు అనిపించదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని స్థాయి లో ఉన్నవారు అనవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉదాహరణ కాకుండా పశ్చిమబెంగాల్ ను ఉదహరించారు. బెంగాల్ లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని గతంలో మోడీ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. మోడీ ఆ మాట అన్న విషయం నిజమే. అప్పట్లో దీనిపై కలకలం రేగింది. వివిధ రాజకీయ పక్షాలు మోడీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాయి. తాజాగా కెసిఆర్ ఆ సంగతి ఎందుకు తీసుకు వచ్చారో తెలియదు. అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినవారని పట్టుకుని జైలులో వేశామని ఆయన తెలిపారు. నిజమే! ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పే. మధ్య ప్రదేశ్, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో బిజెపి వారు గేమ్ ప్లాన్ ఆడి తమ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. కెసిఆర్ ఆ ముచ్చట చెప్పి బిజెపిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అలా ప్రయత్నం చేసినవారిని జైలులో పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే ఆయనే గత ఎనిమిదేళ్లలో ముప్పైఏడు మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరి దానిని ఏమంటారన్నదానిపై మాట్లాడడం లేదు. కాకపోతే వారంతా తెలంగాణ అభివృద్ది కోసం స్వచ్చందంగా చేరారని చెప్పవచ్చు. ఎర కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు కావడం, అసలు పట్టుబడ్డ నిందితులతో ఈ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధాలు ఏమిటో ఇంతవరకు బహిరంగ పరచకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? ఈ నేపధ్యంలో ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలను కొనడం ఏమిటో, సిట్ ఏమి తేల్చిందో, నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనే యత్నం చేసిందో ఇంతవరకు తేలలేదు. కాని ఈ విషయంలో బిజెపిని ఇరుకున పెట్టడంలో, తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయడంలో కెసిఆర్ కొంతవరకు సఫలం అయ్యారు. ఇదే తరుణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైన, మంత్రి మల్లారెడ్డి వంటివారిపైన వచ్చిన ఆరోపణలు టిఆర్ఎస్ కు అప్రతిష్టగానే మారాయి. ఎంత కేంద్రంపైన, కేంద్ర దర్యాప్తు సంస్థలపైన విమర్శలు కురిపించినా, చివరికి అవి నిర్వహించే విచారణలకు హాజరుకాకుండా ఉండలేని పరిస్థితి. టిఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని కెసిఆర్ వాపోయినా, సంబంధిత నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుంది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ప్రముఖంగా వచ్చిన వైనంపై మహబూబ్ నగర్ సభలో మాట్లాడలేదు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్ల లో జరిగిన సోదాలు, పట్టుబడిన డబ్బు గురించి ప్రస్తావించలేదు. దీనిని ఏమని అనుకోవాలి. ఈ పాయింట్ నే బిజెపి కాని, ఇతర పార్టీల నేతలు కాని ఫోకస్ చేస్తున్నాయి. మల్లారెడ్డి తన పై ఐటి దాడి జరిగినప్పుడు గంభీరంగా మాట్లాడారు కాని, ఆయన సంతృప్తికరమైన వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. అలాగే కవిత కూడా కావాలంటే జైలులో పెట్టుకోవాలని సవాల్ చేశారు కాని, ఆ స్కామ్ గొడవకు సంబంధించి స్పష్టత ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ క్రమంలో ఆమె విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ, తదితర డాక్యుమెంట్లు అందచేయాలని , ఆ తర్వాత విచారణ చేయాలని ఆమె కోరారు. ఇందుకు సీబీఐ స్పందన ఎలా ఉంటుందన్నది తెలియవలసి ఉంది. అయితే, ఆమెను కేవలం వాంగ్మూలం ఇవ్వడానికే నోటీసు ఇవ్వడం కొంతలో కొంత ఊరట అవుతుందేమో! ఆమె సాక్ష్యం తర్వాత అధికారులు ఎలా స్పందిస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటి గురించి మాట్లాడడం ఒకరకంగా కెసిఆర్ కు కూడా ఎంబరాస్మెంటే అని చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదని, మల్లారెడ్డి కాలేజీలలో అవకతవకలు లేవని చెప్పే సాహసం కెసిఆర్ చేయలేకపోవచ్చు. కాకపోతే టిఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభావితం చేస్తోందన్న అభియోగం మోపవచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి పట్టుబడ్డ 15 కోట్ల నగదుపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రాజకీయంగా కూడా కొంత నష్టం వాటిల్లవచ్చు. ఏది ఏమైనా వచ్చే ఆరు నెలలు టిఆర్ఎస్ కు అత్యంత కీలకం. బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల గడువు దగ్గరపడే కొద్ది ఈ కాక ఇంకా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణ సర్కారును.. కూల్చేస్తారా?
తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్ర బడ్జెట్ రూ.65 వేల కోట్లు. అదిప్పుడు రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లు. ప్రధాని మోదీ సహకరిస్తే రూ.14.50 లక్షల కోట్లకు చేరేది. అసమర్థ కేంద్రం తీరుతో తెలంగాణ జీఎస్డీపీకి రూ.3 లక్షల కోట్లు నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సరిగా కలిసి పనిచేస్తేనే ఇలాంటి వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఈ విధానాలు ఎటువైపు దారి తీస్తున్నాయి? దేశంలో ఎక్కడో ఓ చోట తిరుగుబాటు రావాలనే.. మా ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేసిన వారిని జైల్లో వేశాం..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఎన్నో కలలతో సాధించుకున్న తెలంగాణపై కుట్రలు చేస్తే ప్రజలు ఎలా ఊరుకుంటారని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఒక్కరమే బాగుపడితే చాలదని, దేశం కూడా బాగుపడాలని.. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్లో పూజల అనంతరం కలెక్టర్ వెంకట్రావ్‌ను చాంబర్‌లోని సీట్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రసంగం వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. ‘‘అనేక దౌర్జన్యాలు, ఉద్వేగాలు, అబద్ధాలు, కుట్రలు, బాధలతో దేశం కష్టాల్లో ఉంది. మహనీయులు పోరాటాలతో సాధించిన స్వాతంత్య్రం ఇందుకేనా? భారత జీవనాడి కలుషితమవుతోంది. దీనిపై చర్చ జరగాలి. మేధావులు, విద్యార్థులు, యువత ఆలోచించాలి. 75ఏళ్ల స్వాతంత్య్రంలో ఇన్ని ఇబ్బందులా? దిక్కుమాలిన రాజకీయాల కోసం దేశ ప్రగతిని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం. ప్రజాసంక్షేమానికి సంబంధించి వారు చేయరు, మమ్మల్ని చేయనివ్వరు. ఇదేం పద్ధతి? మేధావులు, విద్యార్థులు, యువత ఆలోచించాలి. మాకెందుకులే అనుకోవద్దు. పాలమూరు– రంగారెడ్డికి కేంద్రం అడ్డంకులు పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించాను. ఆ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పాలమూరు జిల్లాకే దక్కుతాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి పరిస్థితి చూసి నడిగడ్డలో ఏడ్చిన. ఇక్కడి బాధలు, కష్టాలు, బొంబాయి బస్సుల వద్ద రోదనలను చూసి గుండె తరుక్కుపోయి.. తెలంగాణ సాధనకు నాపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇక్కడి పంట పొలాలకు సాగునీరు అందించి పచ్చని మాగాణిగా మార్చాలనే సంకల్పం నన్ను తెలంగాణ సాధనవైపు నడిపింది. పాలమూరు జిల్లాను ఎప్పటికీ మరువలేను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని పనులు ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. నీటి వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోలేదా? గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ సభ పెట్టి పాలమూరుకో హమ్ బనాయేంగే అన్నారు. అంతా పైన పటారం, లోన లొటారం. పాలమూరుకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ, కరువు జిల్లా పాలమూరు, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నేను దండం పెట్టి చెప్పిన. 150 దరఖాస్తులు ఇచ్చి పరిష్కరించాలని కోరిన. ప్రధానంగా ఈ జిల్లాల్లో తాగు, సాగునీరు కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చాం. కానీ కేంద్రానికి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చేందుకు ఈ ఎనిమిదేళ్లు సరిపోలేదు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు పచ్చగా పంటల జిల్లాగా మారింది. ఒక్క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అయినా మక్తల్, నారాయణపేట తదితర నియోజకవర్గాల్లో త్వరలో కాల్వలను పూర్తి చేస్తాం. 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించే రోజులు వస్తాయి. రైతులు అప్పుల్లేకుండా ఉండాలన్నదే లక్ష్యం దేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఐదేళ్లలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. తెలంగాణలో రైతులు అప్పులు లేకుండా ఉండాలన్నదే లక్ష్యం. నేడు దేశం మెచ్చిన రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పక్కరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లోని రైతులు తమను తెలంగాణలో కలపాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడి అభివృద్ధి పక్కరాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదు? మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికీ నీటికోసం అల్లడుతున్నారు..’’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కె.దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు వెళ్తుండగా జడ్చర్లలో కొందరు బీజేవైఎం నాయకులు ప్లకార్డులు పట్టుకుని కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇది గమనించి వారిని వెంటనే అడ్డుకుని, జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాలమూరుకు వరాలు సభ సందర్భంగా పాలమూరుకు సీఎం వరాల జల్లు కురిపించారు. సభ జరిగిన ఎంవీఎస్ కాలేజీకి స్టేడియం, ఆడిటోరియం కోసం సోమవారమే జీవో విడుదల చేస్తామన్నారు. సొంత జాగా ఉంటే డబుల్ బెడ్రూం ఇంటికోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకంలో ఈ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పాలమూరు ఎంపీగా, అక్కడి కష్టాలు తెలిసిన వాడిగా ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల కింద రూ.220 కోట్లు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆ ఊరి నుంచి ‘కంటి వెలుగు’ పుట్టింది ‘‘గజ్వేల్ నియోజకవర్గంలో చిన్న గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేద్దామనుకున్నాం. ఊరివాళ్లకు విశ్వాసం కల్పించాలనే ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. అంత చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్టు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు సరిగా చదవడం లేదని బడిలో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కొడుతున్నారు. వారికి కళ్లు సరిగా కనబడక చదవడం లేదని తెలిసి బాధపడ్డాం. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. కంటి వైద్యం విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అందరికీ హైదరాబాద్‌లోని సరోజిని దవాఖానా ఒక్కటే. అంతకు మించి ఏమీ లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా ఆలోచించి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. అంతేతప్ప చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం కాదు. త్వరలో కంటి వెలుగు రెండో దశ చేపట్టబోతున్నాం..’’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జై భారత్.. జై తెలంగాణ.. ‘‘మనం ఒక్కరమే బాగుపడితే కాదు.. దేశం కూడా బాగుపడాలే.. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో సైతం చురుకైన పాత్ర వహించాల్సిన అవసరముంది. మీరు ఇక్కడ గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూసుకుంటా.. బీఆర్ఎస్ ఒకేనా. బీఆర్ఎస్తో అందరం కలిసిపోదాం. భగవంతుడిపై నమ్మకంతో సర్వశక్తులు ఒడ్డి తెలంగాణతో పాటు దేశాన్ని బాగు చేసుకుందాం..’’ అని సభలో సీఎం కేసీఆర్ పేర్కొనగా ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు జనాలు ‘జై భారత్.. జై తెలంగాణ..’ నినాదాలు చేశారు. కేసీఆర్ నోట.. పాలమూరు పాట పాలమూరు కష్టాలు, బాధలు చూసి మిత్రులు గోరటి వెంకన్న, సాయిచంద్‌కు పాటలు రాయాలని సూచించానని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులోనా’ అనే పాటను తానే రాయమన్నానని.. ఇప్పుడా పల్లేర్లు మాయం అయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కష్టాలు, ఇప్పుడవి తొలగిపోవడంపై సీఎం కేసీఆర్ స్వయంగా కాస్త పాట పాడి వినిపించారు. ‘‘వలసలతో వలవల విలపించు పాలమూరు.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నద’ని రాయమన్నానని వివరించారు. -
కేంద్రంలో చేత కానీ ప్రభుత్వం ఉంది : సీఎం కేసీఆర్
-
తగ్గేదేలే.. మోదీ టార్గెట్‌గా మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం, అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. కాగా, బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాము. గతంలో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ వచ్చాక పాలమూరు వలసలు తగ్గాయి. వలసపోయిన బిడ్డలంతా తిరిగి వస్తున్నారు. పాలమూరు ఇప్పుడు పచ్చిన పంటల జిల్లాగా అయింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాము. సంక్షేమంలో తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాము. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదు. తెలంగాణలో కలపాలని కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కోరుతున్నారు. నా తెలంగాణ రైతు కాలర్ ఎగరవేసే స్థాయికి చేరాలి. అసమర్థ కేంద్ర ప్రభుత్వం కారణంగా రూ. 3 లక్షల కోట్లు నష్టపోయాం. కేంద్రం కూడా బాగా పనిచేస్తేనే దేశం బాగుపడుతుంది. మన నీటి వాటా తేల్చడం లేదు. రాష్ట్రానికి వచ్చి మోదీ డంబాచారాలు చెబుతున్నారు. నీటి వాటాలు తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోవా?. దేశంలో ఏం జరుగుతుందో మేధావులు, యువకులు ఆలోచించాలి. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా మంచి నీటి సమస్యలు, కరెంట్ కోతలున్నాయి. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. మేము చేయం.. వాళ్లను చేయనివ్వం అనే విధంగా కేంద్రం తీరు ఉంది. కాళ్లలో కట్టెలు పెడుతా అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనివ్వరా?. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ పెట్టంది. ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉంది. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుపడతారా?. ప్రశ్నిస్తే మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. చిల్లరగాళ్ల ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏ కారణంతో ప్రభుత్వాలను కూలగొడతారు. దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులు చేయడం సరికాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ దిశగా ముందుకెళ్తున్నాము’
సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషం. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. గురుకులాలను ఇంకా పెంచుతాము. చాలా కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. కంటివెలుగు ఓట్ల కోసం తెచ్చింది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాము. సంస్కరణ అనేది అంతం కాదు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మహబూబ్ నగర్ లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
-
జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో ఉద్రిక్తత
-
వరుసకు బాబాయ్.. మద్యం మత్తులో బాలికపై అత్యాచారం, హత్య!
సాక్షి, మహబూబ్‌నగర్/రాజాపూర్: వావి వరుసలు మరిచాడు.. వరుసకు అన్న కూతురు అనీ చూడలేదు.. బాలిక అనే కనికరమూ చూపించలేదు.. మద్యం మత్తులో స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని అంతా కలిసి కిరాతకంగా గొంతు నులిమి బాలికను చంపేశారు. పైగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టుగా వేలాడదీశారు. తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తులు, బాధిత కుటుంబం చెప్పిన వివరాల మేరకు ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడినా.. ఘటన జరిగిన తీరుపై భిన్నమైన వివరాలు ప్రచారంలో ఉన్నాయి. తల్లిదండ్రులు ఊరెళ్లడంతో.. సదరు తండాకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె ఇంటర్, చిన్న కుమార్తె (15) పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం బంధువుల ఇంట్లో పోశమ్మ పండుగ ఉండటంతో తల్లిదండ్రులు కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. పెద్ద కుమార్తె హాస్టల్లో ఉండగా చిన్నకుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే ఆమెపై కన్నేసిన నేనావత్ శ్రీనుకు ఈ విషయం తెలిసింది. బాలికకు వరుసకు బాబాయి అయిన శ్రీను.. తన స్నేహితుడు అడ్వొకేట్ అయిన శ్రీనివాస్, పక్క గ్రామానికి చెందిన టీవీ మెకానిక్, కేబుల్ ఆపరేటర్ శివతో కలిసి అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బెల్టుషాపు కావడం.. పరిచయం ఉండటంతో.. బాలిక తల్లిదండ్రులు స్థానికంగా కిరాణా దుకాణంతోపాటు బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. పక్కనే శ్రీను (నిందితుడు) నివాసం ఉంటున్నాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో.. మద్యం తాగుదామని తన స్నేహితులు అడ్వొకేట్ శ్రీనివాస్, శివను రప్పించుకున్నాడు. అంతా కలిసి అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లారు. శ్రీను వరుసకు బాబాయి కావడం, కేబుల్ ఆపరేటర్‌గా శివ పరిచయం ఉండటంతో బాలిక అభ్యంతరం చెప్పలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్తున్నారు. నిందితులు మద్యం తాగాక మత్తులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. విషయం బయటపడుతుందని గొంతు నులిమి చంపి, ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అంటున్నారు. అయితే నిందితుల్లో ఒకరైన శివ ముందే ఆ బాలిక ఇంట్లో ఉన్నాడని.. శ్రీను, శ్రీనివాస్ వెళ్లి అతడిని కొట్టి పంపించేసి, బాలికపై దాషీ్టకానికి పాల్పడ్డారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆడియో ప్రచారమవుతోంది. మరోవైపు మృతురాలు రాసినట్టుగా పేర్కొంటూ ఓ సూసైట్ నోట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు బాలికపై దారుణానికి సంబంధించి నేనావత్ శ్రీను, అడ్వొకేట్ శ్రీనివాస్, టీవీ మెకానిక్ శివలపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ ఘటన నిందితులు ముగ్గురూ పరారీలోనే ఉన్నారు. నిందితుల ఆస్తులు ధ్వంసం బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన విషయం తెలియడంతో తండా వాసులు ఆందోళనకు దిగారు. నిందితుడు శ్రీను ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. మరో నిందితుడు శ్రీనివాస్‌కు చెందిన ఇంటి పైకప్పు రేకులను ధ్వంసం చేశారు. పక్క గ్రామానికి ట్రాక్టర్లలో వెళ్లి నిందితుడు «శివకు చెందిన కారును తగలబెట్టారు. అతడి టీవీ మెకానిక్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, తండావాసులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కాగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దారుణానికి పాల్పడినవారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలోనూ చెడు ప్రవర్తన! నిందితుడు నేనావత్ శ్రీను గతంలోనూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇక మరో నిందితుడు శివపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నట్టు సమాచారం. వారిని చూశా.. ఇంత పని చేస్తారనుకోలేదు ‘‘అర్ధరాత్రి 12 అవుతోందనుకుంటా.. వీధి దీపాలు కూడా లేవు. బయట చప్పుడైతే వెళ్లి చూశాను. బెల్టుషాపు వద్ద శ్రీను, శివ ఉన్నారు. ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారని అడిగా. మద్యం కోసం వచ్చామన్నారు. శ్రీనుకు కూడా బెల్టుషాపు ఉంది కదా అని అడిగాను. మద్యం అయిపోయిందని, అందుకే ఇక్కడికి వచ్చామని అన్నాడు. తెలిసినవాళ్లే కదా అని వెళ్లిపోయా. ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదు. – రాందాస్, సమీపంలోని ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి చదవండి: (హోమ్ ట్యూషన్ చెప్పేందుకు వెళ్లి.. అఖిల్ వచ్చాడని సారిక వాట్సాప్ మెసేజ్ చేసి..) -
రిజర్వేషన్లపై ఎందుకు నిలదీయడం లేదు
జడ్చర్ల టౌన్: బీసీ రిజ ర్వేషన్లలో కోత విధించార ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర శ్నించినట్లే.. బీసీ కుల గణన చేయాలని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బీజేపీ నాయకులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిన పెంచాలని, బీసీ కుల గణన చేపట్టాలని ఇదివరకే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తాము పిలుపునిచ్చామని చెప్పారు. ఆ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 15 మందితో స్టీరింగ్ కమిటీని నియమించామని వివరించారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ.. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా డా.సాంబశివగౌడ్, కో కన్వీనర్‌గా దాసరి హనుమయ్య, సలహాదా రులుగా చంద్రశేఖర్ ముదిరాజ్, మహతి, రమేష్, రీసెర్చ్ ఇన్‌చార్జ్‌లుగా ఊరుమల్ల విశ్వం, జక్కని విజయ్‌కుమార్, గుర్రప్ప, కల్చరల్ ఇన్చార్జ్గా అశోక్, దయాకరణ్, మౌర్య, కోనేటి సుజాత, మీడి యా ఇన్చార్జ్గా డా.వెంకటేశ్ చౌహాన్, సభ్యులుగా నామాలక్ష్మి, కత్తుల పద్మయాదవ్, మౌలానాషఫి, శాంసన్‌లను నియమించారు. భవిష్యత్ కార్యాచ రణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. కాగా, అన్ని పార్టీల్లోని బీసీ నేతలు ఆయా పార్టీల నేతలకు ఊడిగం చేయకుండా బీసీల న్యాయమైన వాటా కోసం పోరాడాలని ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. -
నల్లమలలో కొత్త మొక్క
జడ్చర్ల టౌన్: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్‌లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ అభినందించారు. మరింత అధ్యయనం చేస్తాం.. నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. -
తల్లి కిరాతకం: అక్కపై కోపంతో.. అయిదు నెలల కొడుకుని హత్య చేసి..
సాక్షి, మహబూబ్‌నగర్: దివ్యాంగురాలైన చెల్లిని చేరదీసి.. తన భర్తకు రెండో వివాహం చేసి జీవితమిచ్చిన అక్కపై కోపంతో కన్నబిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి. పైగా నిద్రలో ఉండగా తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారంటూ అర్ధరాత్రి హంగామా సృష్టించి తప్పించుకునేందుకు చేసిన హైడ్రామా కథ బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కోస్గిలోని ఎస్సీకాలనీకి చెందిన మద్దూరు గోవింద్‌కు కర్ణాటక రాష్ట్రంలోని కానగడ్డకు చెందిన మొగులమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే మొగులమ్మ చెల్లెలు కాశమ్మ పుట్టుకతో మూగ, చెవుడు కావడంతో తన చెల్లెలి జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తన భర్త గోవిందును ఒప్పించి రెండేళ్ల క్రితం రెండో వివాహం జరిపించింది. కుటుంబ విషయమై అక్క చెల్లిని మందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. దీంతో అక్కపై కోపం పెంచుకున్న కాశమ్మ శనివారం ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రించిన తర్వాత అర్ధరాత్రి బాబును తీసుకెళ్లి హత్య చేసి పట్టణ శివారులోని శంభుని గుడి సమీపంలో ఉన్న నీళ్లబావిలో పడేసింది. ఇంటికి వచ్చిన కాశమ్మ తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యు లకు రోదిస్తూ సైగలు చేసింది. అయితే కొన్ని రోజులుగా దొంగలు తిరుగుతున్నారనే పుకార్లు ఉండటంతో కాలనీ మొత్తం మేల్కొంది. యువకులు కాలనీలో గాలించి ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో.. పోలీసులు ఆదివారం ఉదయం కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరగడంతో బాబును కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట మొగులమ్మపై అనుమానం వచ్చినప్పటికీ పోలీసులు బాధిత కుటుంబ సభ్యులందరినీ స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన కాశమ్మ అక్కపై కోపంతో క్షణికావేశంలో బిడ్డను తానే చంపి బావిలో వేసినట్లు ఒప్పుకుంది. బాబును వేసిన బావిని చూపడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్ చేసిన విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ దీనిపై బుధవారం ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడనివారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిని శిక్షించాలని కోరారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కీలక వ్యక్తులను తప్పిస్తున్నారనే ఆరోపణలు మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డితోపాటు నిఖిల్, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్య నేత అనుచరుడు ఉన్నారని.. వారిని తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ.. బుధవారం ప్రజా, విద్యార్థి సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీపీ, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్కుమార్లకు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్‌తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలో సిట్ అధికారులు రహస్య విచారణ చేపట్టారంటూ రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం. ముఖ్య నేతకు ఫోన్.. సీరియస్ వార్నింగ్? మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్యనేతతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించొద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్టు తెలిసింది. చదవండి: హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు -
హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు
సాక్షి, గద్వాల: హనీట్రాప్ వ్యవహారం జోగుళాంబ గద్వాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఓ ఖాకీ పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో పోలీసు అధికారికి స్నేహం ఉండటంతో.. సదరు నేతకు ఖరీదైన నజరానాలు ఇవ్వడం వంటి విషయాలు వెలుగు చూస్తుండటం కేసును మరో స్థాయికి తీసుకెళ్తుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన నియోజకవర్గ స్థాయి పోలీసు అధికారి, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి నెరపిన ‘లీలలు’ సైతం ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇందులో బాధితులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు కేసులో పలుకుబడి గల నాయకుల నుంచి ఒత్తిళ్లు, పలు రకాల ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అటు తిరిగి.. ఇటు తిరిగి తమ కొంపనే ముంచుతుందనే ఉద్దేశంతో పోలీసులు అత్యవసరంగా కేసు మూసేందుకు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారులతో దోస్తానా.. హనీట్రాప్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సూత్రధారులతో జిల్లాలో పనిచేస్తున్న ఓ ఖాకీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య పలు రకాల లావాదేవీలు కొనసాగినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ప్రధాన సూత్రధారికి సంబంధించి వ్యక్తిగత వేడుకలో సదరు ఖాకీ అధికారి ఖరీదైన నజరానాను ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రధాన సూత్రధారి అనుకోని విధంగా పంజరంలో చిక్కడం.. యువతులు, మహిళలతో సాగించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సదరు ఖాకీ ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో సదరు అధికారి లోలోపల మదనపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, వెనక నిందితుడు తిరుమలేష్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఈ హనీట్రాప్ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడం.. పలుకుబడి గల నేతల నుంచి ఒత్తిళ్లు రావడం.. మరోవైపు కొందరు ఖాకీల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తలనొప్పిని వదిలించుకునేందుకు పోలీసులు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరిపై కేసు నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించడం, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు. అలాగే ఇందులో ఏ రాజకీయ పారీ్టకి సంబంధించిన నేతలు లేరని చెప్పారు. కాగా.. అసలు సూత్రధారులను వదిలి అమాయకుడైన తమ కుమారుడిని (తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి)ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపండంపై తల్లిదండ్రులు పద్మ, నారాయణలు పట్టణ పోలీసుస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పాత అధికారులు వెలుగులోకి ఇదిలా ఉంటే గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన ఓ ఖాకీ అధికారి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరపిన రాసలీలల వ్యవహారం కూడా గుప్పుమంది. సాధారణ ప్రజలు చేస్తే దండన విధించే పోలీసులు.. వారి శాఖలోనే పనిచేసే కొందరు ఖాకీలపై ఆరోపణలు వస్తే మాత్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ జరిపి ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన శిక్ష వేస్తేనే ఇలాంటి లతో సహా ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు.. మీరు చెబుతున్నట్లు ఈ వ్యవహారంలో పోలీసు పాత్ర ఉందనడం అవాస్తవం. మహిళల పట్ల జరిగే ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదు. ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. అదేవిధంగా ఆధారాలు లేని ప్రచారాలను కూడా మీరు నమ్మకుండా ఇలాంటి సున్నితమైన అంశంలో సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మీరు చెప్పినట్లు ఏదైనా ఆధారాలు లభిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల