బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన | Praja Garjana: Pm Modi Palamuru Tour Updates | Sakshi
Sakshi News home page

బీజేపీ సమరశంఖం.. మహబూబ్‌నగర్‌లో మోదీ లైవ్‌ అప్‌డేట్స్‌..

Published Sun, Oct 1 2023 10:22 AM | Last Updated on Sun, Oct 1 2023 4:38 PM

Praja Garjana: Pm Modi Palamuru Tour Updates - Sakshi

Updates..

పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. 
►నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. 
►తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. 
►రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. 
►చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. 
►దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. 
►మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. 
►ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. 
►మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం. 
►తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. 
►2014కు ముందు కేవలం 2500 కి.మీ నేషనల్‌ హైవేలున్నాయి. 
►మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం.
►తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. 
►తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 
►చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. 
►తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. 
►పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. 
►నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. 
►అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి.  
►రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. 
►పేదలకు గ్యాస్‌, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. 
►ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. 
►2014కు ముందు కాంగ్రెస్‌ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 
►రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో​ తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. 
►కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. 
►అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం.
►రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. 
►రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీని తెరిపించాం. 
►రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. 
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. 
►పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. 
►పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 
►పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. 
►తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. 

సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌..
పాలమూరు సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ శ్రేణుల తరఫున ప్రధానికి స్వాగతం. పాలమూరు ప్రజాగర్జున తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని గర్జన. గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో గర్వపడుతున్నాను. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం ఆనందంగా ఉంది. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు ప్రకటన చారిత్రాత్మకం. తెలంగాణలో చాలా మంది రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్‌కు తీరిక లేదు. కేంద్రంపై కేసీఆర్‌ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేసీఆర్‌ లాంటి మోసపూరిత సీఎంను ఎక్కడా చూడలేదు. 

►త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎలాంటి ప్రభుత్వం ఉందో మీకు తెలుసు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా.. మాకేం ఇచ్చారు.. మా ఫామ్‌హౌస్‌కు ఏమిచ్చారు? అన్నట్టుగా వారు తీరు ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్టే. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టే. కాబట్టి బీజేపీకి ఓటు వేయండి. 

►పాలమూరుకు చేరుకున్న ప్రధాని మోదీ. 
►కాసేపట్లో ప్రజాగర్జన బహిరంగ సభలో మోదీ ప్రసగించనున్నారు. 
►ఓపెన్‌ టాప్‌ జీపులో పార్టీ శ్రేణులకు ప్రధాని అభివాదం. 

► పాలమూరు బీజేపీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ. 

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. 
►తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 
►పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 
►పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. 
►పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. 
►సమక్క సారక్క పేరుతో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. 

►జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోదీ. 
►కాచిగూడ-రాయ్‌చూర్‌ మధ్య కొత్త ట్రైన్‌ను ప్రారంభించిన మోదీ. 
►హసన్‌-చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ ఎల్పీజీ పైప్‌లైన్‌ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. హెచ్‌సీయూలో భవానాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ.
►మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన జక్లేర్‌-కృష్ణా రైల్వే లైన్‌ జాతికి అంకితం. 
►వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుప్థాపన
►కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రాజెక్ట్‌ పైప్‌లైన్‌ ప్రారంభం.
►రూ.2457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం. 

తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోంది. తెలంగాణ కోసం కేంద్రం రూ.9లక్షల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ హయంలోనే అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. వైద్య, విద్య సెక్టార్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. తెలంగాణ రైల్వేల అభివృద్ధికి కూడా కేంద్రం సాయం అందించింది. రైల్వే అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి కృతజ్ఞతలు. 

►రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం కేసీఆర్‌కు కలిసేందుకు సమయం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. కేంద్రం చేపట్టే పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ రావడం లేదు. తెలంగాణలో అద్భుతమైన రహదారులు ఉన్నాయి. ట్రిపుల్‌ ఆర్‌ చుట్టూ రైల్వే లైన్‌ వేసేందుకు సర్వే జరుగుతోంది. 

►సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. 
►పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 

2:19 PM
► మహబూబ్‌నగర్‌ చేరుకున్న ప్రధాని మోదీ.

1:54 PM
►శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్‌ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ

1:35PM
►శంషాబాద్‌ విమానాశ్రాయానికి చేరుకున్న ప్రధాని మోదీ
►ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
►ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం
►శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ పాలమూరుకు ప్రధాని
►పాలమూరు ప్రజా గర్జన సభలో మాట్లాడనున్న మోదీ

►తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు నుంచే శంఖారావం పూరించేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం
►దాదాపు 13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పాలమూరు ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగసభకు ఇటు అధికార యంత్రాంగం, అటు పార్టీ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు
►ప్రధాని రాక నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు

2 లక్షల మంది జనసమీకరణ
సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ నుంచి దాదాపు రెండు లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి తదితరులు మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి జనసమీకరణపై పలువురి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనాలను తరలించేలా వాహనాలను సమకూర్చారు.

‘పాలమూరు’పైనే సర్వత్రా ఆసక్తి..
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభకు హాజరయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించేందుకు పాలమూరును ఎంచుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకోగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ అంశంపై ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించకుండా, కృష్ణానదిలో వాటా తేల్చకుండా మోసం చేశారని అధికార బీఆర్‌ఎస్‌ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారు.. వరాలు కురిపిస్తారా.. అనే చర్చ జోరుగా సాగుతోంది.

షెడ్యూల్‌ ఇలా..
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు చేరుకోనున్నారు. భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధి అమిస్తాపూర్‌లోని ఐటీఐ కళాశాల మైదానంలో సుమారు 26 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ వద్ద ముందుగా రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లకు సంబంధించి వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుజరాత్‌ నుంచి వచ్చిన ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రెండో వేదిక వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement