praja garjana
-
బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన
Updates.. పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ►నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. ►తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. ►రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. ►చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. ►దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. ►మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ►ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. ►మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం. ►తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. ►2014కు ముందు కేవలం 2500 కి.మీ నేషనల్ హైవేలున్నాయి. ►మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. ►తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ►తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ►చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. ►తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. ►పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ►నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. ►అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. ►రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. ►పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ►ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. ►2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ►రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. ►కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. ►అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ►రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. ►రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించాం. ►రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ►బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ►పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ►పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. ►తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్.. ►పాలమూరు సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ శ్రేణుల తరఫున ప్రధానికి స్వాగతం. పాలమూరు ప్రజాగర్జున తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని గర్జన. గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో గర్వపడుతున్నాను. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం ఆనందంగా ఉంది. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు ప్రకటన చారిత్రాత్మకం. తెలంగాణలో చాలా మంది రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్‌కు తీరిక లేదు. కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేసీఆర్ లాంటి మోసపూరిత సీఎంను ఎక్కడా చూడలేదు. ►త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎలాంటి ప్రభుత్వం ఉందో మీకు తెలుసు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా.. మాకేం ఇచ్చారు.. మా ఫామ్‌హౌస్‌కు ఏమిచ్చారు? అన్నట్టుగా వారు తీరు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్టే. బీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టే. కాబట్టి బీజేపీకి ఓటు వేయండి. ►పాలమూరుకు చేరుకున్న ప్రధాని మోదీ. ►కాసేపట్లో ప్రజాగర్జన బహిరంగ సభలో మోదీ ప్రసగించనున్నారు. ►ఓపెన్ టాప్ జీపులో పార్టీ శ్రేణులకు ప్రధాని అభివాదం. ► పాలమూరు బీజేపీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ. ►ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. ►తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ►పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. ►పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ►సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ►జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోదీ. ►కాచిగూడ-రాయ్‌చూర్ మధ్య కొత్త ట్రైన్‌ను ప్రారంభించిన మోదీ. ►హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. హెచ్‌సీయూలో భవానాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ►మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్ట్‌లో భాగమైన జక్లేర్-కృష్ణా రైల్వే లైన్ జాతికి అంకితం. ►వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుప్థాపన ►కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రాజెక్ట్ పైప్‌లైన్ ప్రారంభం. ►రూ.2457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం. ►తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోంది. తెలంగాణ కోసం కేంద్రం రూ.9లక్షల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ హయంలోనే అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. వైద్య, విద్య సెక్టార్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. తెలంగాణ రైల్వేల అభివృద్ధికి కూడా కేంద్రం సాయం అందించింది. రైల్వే అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి కృతజ్ఞతలు. ►రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం కేసీఆర్‌కు కలిసేందుకు సమయం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. కేంద్రం చేపట్టే పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ రావడం లేదు. తెలంగాణలో అద్భుతమైన రహదారులు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేసేందుకు సర్వే జరుగుతోంది. ►సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2:19 PM ► మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ. 1:54 PM ►శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ 1:35PM ►శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ►ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం ►శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ పాలమూరుకు ప్రధాని ►పాలమూరు ప్రజా గర్జన సభలో మాట్లాడనున్న మోదీ ►తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు నుంచే శంఖారావం పూరించేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం ►దాదాపు 13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పాలమూరు ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగసభకు ఇటు అధికార యంత్రాంగం, అటు పార్టీ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు ►ప్రధాని రాక నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు 2 లక్షల మంది జనసమీకరణ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాదాపు రెండు లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి తదితరులు మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి జనసమీకరణపై పలువురి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనాలను తరలించేలా వాహనాలను సమకూర్చారు. ‘పాలమూరు’పైనే సర్వత్రా ఆసక్తి.. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభకు హాజరయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించేందుకు పాలమూరును ఎంచుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకోగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించకుండా, కృష్ణానదిలో వాటా తేల్చకుండా మోసం చేశారని అధికార బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారు.. వరాలు కురిపిస్తారా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. షెడ్యూల్ ఇలా.. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు చేరుకోనున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి అమిస్తాపూర్‌లోని ఐటీఐ కళాశాల మైదానంలో సుమారు 26 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ వద్ద ముందుగా రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లకు సంబంధించి వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుజరాత్ నుంచి వచ్చిన ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రెండో వేదిక వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కి ఎక్కడిది?
సాక్షి, చేవెళ్ల: కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే.. ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటిస్తోంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు. ప్రజాగర్జన సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అనంతరం డిక్లరేషన్‌కు సంబంధించిన పోస్టర్లను వేదిక మీద ఉన్న నేతలంతా ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కీలకాంశాలు ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు. ►పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షలు సాయం ►పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం ►ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ►ప్రతి కార్పొరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు ►మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు ► దళిత గిరిజన విద్యార్థులకు పది పాస్ అయితే రూ. 10 వేలు. ► డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 25 వేలు. ► పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందజేత. ► అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు అధికారంలోకి వస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వాటాల ద్వారా న్యాయం చేస్తాం’’ వెల్లడించారాయన. రేపు అమిత్ షా వస్తారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజా గర్జన వేదిక నుంచి ప్రసంగించిన ఖర్గే.. ► తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యారు. కానీ, తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది(కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి..). తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?. ఇది తెలంగాణ ప్రజల పోరాటం. కేసీఆర్‌కు బలం ఇచ్చింది మేం. కానీ, మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ► ప్రజల అభీష్టం.. సొనియా గాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడున్నవాళ్లంతా తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లే. కేసీఆర్‌ను గద్దెదించడానికే మీరంతా వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తాం. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర చేశారు. అదీ కాంగ్రెస్ పార్టీ శక్తి. సీడబ్ల్యూసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. గతంలో సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చాను. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. ► రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసిందెవరు? కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు?. ఉమ్మడి ఏపిలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్రశ్నించారు ఖర్గే. ► బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే నేరుగా బీఆర్ఎస్ను విమర్శించరు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తాం. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించుతాం. ► కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి.. అమలు చేస్తున్నాం. తెలంగాణలోనూ అదే చేస్తాం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుంది అని ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడగొట్టండి. దేశంలో మోదీని ఓడగొట్టండి అని ఖర్గే చేవెళ్ల వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
ఏ వర్గానికీ న్యాయం జరగలేదు
-
కలలు కంటున్నా.. నాకే ఓట్లేయండి
కడప ప్రజా గర్జనలో చంద్రబాబు కడప: ‘‘జూన్ 2తో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయి. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంటుంది. సీమాంధ్రలో లోటు బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ ఆదాయం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా పగులూ రాత్రీ తేడా లేకుండా కలలు కంటున్నా. రాష్ర్టం కోసం ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా. అందరూ నాకు ఓట్లేసి గెలిపించండి’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. కడప మునిసిపల్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ప్రజాగర్జనలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించింది. ఇంత అనుభం ఉన్న నన్ను సంప్రదించలేదు. అందుకే కాంగ్రెస్ భూస్థాపితమైంది. దేశానికి నాయకుడు లేడు. మన్మోహన్ సోనియాకు రోబోగా మారిపోయాడు. సోనియా అవినీతి అనకొండలా మారింది. అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం సహకారం అవసరం. అందుకే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం. అందరూ ‘బ్రింగ్ బ్యాక్ బాబు’ అంటున్నారు. సోనియా ఎంతోమందితో ఆడుకున్నారు. నన్నుకూడా ఇబ్బంది పెట్టాలని చూశారు. సుప్రీంకోర్టులో 35 కేసులు వేశారు. 25 విచారణ కమిటీలు వేశారు. అయినా ఏం చేయలేకపోయారు. నా జోలికి వస్తే ఖబడ్దార్.. ఇటలీకి పంపిస్తా’ అని చెప్పా’’ అని చంద్రబాబు అన్నారు. -
తమ్ముళ్లు తన్నుకున్నారు!
-
సీఆర్‌జెడ్ గర్జన
ఆర్కే బీచ్ నుంచి ప్రజాగర్జన వేదిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మారింది. ఇ.ఎ. ఎస్.శర్మ ఫిర్యాదుతో వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అదనపు జాయింట్ కలెక్టర్ సభా ఏర్పాట్లు తక్షణం నిలిపివేయాలని మంగళవారం ఆదేశించారు. పనులు జరగకుండా పోలీసులను నియమించారు. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సముద్రతీర ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారంటూ కలెక్టర్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శర్మ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పనుల నిలిపివేతకు ఆదే శించారు. వేదిక నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు, టీడీపీ నాయకుడు నల్లూరి భాస్కరరావు, ఎంవీవీఎస్ మూర్తి వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్‌లు ఎవరు అడ్డువచ్చిన గర్జన సభను ఇక్కడే నిర్వహిస్తామంటూ కొద్దిసేపు హంగా మా చేశారు. అనంతరం శాసనసభ్యుడు వెలగపూడి తన అనుచరులతో సభాస్థలికి వచ్చి కొద్దిసేపు హల్చల్ చేసి చివరకు వెనుతిరిగారు. ఒకదశలో రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహనరావు ఎట్టిపరిస్థితుల్లో గర్జన సభను బీచ్‌లోనే నిర్వహిస్తామని హడావుడి చేశారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా రోడ్డుపై చంద్రబాబు వాహనాన్ని నిలిపి అక్కడ నుంచే ఆయన ప్రసంగించేలా ఆలోచించారు. ఇక్కడ కూడా సభకు అడ్డంకులు ఎదురవుతాయన్న అనుమానాలను సీనియర్ నాయకులు వ్యక్తం చేయడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని వేదికను మున్సిపల్ స్టేడియానికి మార్చుకున్నారు. ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తిలు కలెక్టర్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. తొలుత ఏయూ మైదానంలోసభ నిర్వహణకు నిర్ణయించగా కోడ్ కారణంగా అనుమతులు రాకపోవడంతో బీచ్‌రోడ్‌కు మార్చుకున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూడోసారి వేదికను స్టేడియాన్ని మార్చుకోవడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ప్రజాగర్జన వేదికను తొలగిస్తాం
విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించతలపెట్టిన ప్రజాగర్జన సభ తుస్సుమనేలాగే ఉంది. ఇప్పటివరకు ఆ సభ నిర్వహణకు అసలు అనుమతే రాలేదు. ఈరోజు మధ్యాహ్నం లోగా సభకు అనుమతి రాని పక్షంలో ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన సభా వేదికను తాము తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ సభపై మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ రోడ్డులో సభ నిర్వహిస్తే పర్యావరణం దెబ్బతింటుందని వారు అంటూ, ఈ మేరకు పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సభను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. వాస్తవానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఇంతకుముందే నిరాకరించింది. బీచ్ రోడ్డులో సభ ఏర్పాటుచేస్తే వాస్తుపరంగా అనుకూలంగా ఉండదని, అందువల్ల సభ ఎక్కడ నిర్వహించాలోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. -
ఆత్మస్తుతి..పరనింద
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆత్మస్తుతి..పరనింద అన్నట్టుగానే చంద్రబాబు ప్రసంగం మొత్తం సాగింది. స్థానిక అయోధ్య మైదానంలో ప్రజాగర్జన పేరిట బుధవారం నిర్వహించిన సభలో బాబు తన గొప్పలు చెప్పుకొని, ఇతర పార్టీల నేతలపై నిందారోపణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా తన వల్లే రాష్ట్రం బాగుపడిందని సొంతబాకా ఊదుకున్నారు. తనకు అనుకూలంగా ప్రశ్నలు వేసుకొని సభికులను చప్పట్లు కొట్టాలని కోరారు. ముందుగా ప్రకటించిన స్థాయిలో ప్రజా గర్జన సాగలేదు. గత సభల కన్నా మెరుగ్గా ఈ సభ జరగడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మూడు జిల్లాల నుంచి జనాల్ని తరలించారు. 15 రోజులుగా ప్రజాగర్జన కోసం టీడీపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3 గంటలకే విజయనగరం జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నా ఆ సమయానికి అయోధ్య మైదానంలో ఐదు వేల మంది జనాలు కూడా లేరు. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత, వాతావరణం చల్లబడ్డాక వచ్చారు. దీంతో నాలుగు గంటలకు ప్రారం భం కావల్సిన సభ 6.30 గంటలు దాటితే గానీ మొదలు కాలేదు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఎప్పటిలాగానే వైఎస్ జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. సోనియాగాంధీ,బొత్స సత్యనారాయణ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్సనైతే గంజాయి మొక్కగా అభివర్ణించారు. లిక్కర్, ఇసుక, ల్యాండ్ మాఫియాలన్నింటికీ ఆయనే ఆద్యుడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాపై కూడా ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆవేదనతో విషం చిమ్మారు. పోలీసులను సైతం వదల్లేదు. ఖబడ్దార్ పోలీసులంటూ హెచ్చరించారు. ‘మీ అంతు చూస్తానంటూ’ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. అంతలోనే నోరు జారానని అనుకున్నారేమో ‘మా పోలీసుల తప్పులేదు’ పనికి మాలిన కాంగ్రెస్ నాయకులు పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయకపోవడమే కారణమని నాలిక తిప్పారు.ఆంధ్రప్రదేశ్‌ను తానే నిర్మించానన్నట్టుగా మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే తన ఘనతేనని, జిల్లాలోని తోటపల్లి, పెద్దగెడ్డ ప్రాజెక్టులు తానే చేపట్టానని కూడా నమ్మబలికారు. విడిపోయిన రెండు రాష్ట్రాలను పునర్నిర్మాణం చేసే సత్తా తమకే ఉందని, ఇంకొకరికి అంత సామర్థ్యం లేదని గొప్పలు చెప్పుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెప్పుకొచ్చారు. -
ఎడాపెడా హామీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించిన ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎడాపెడా హామీల వర్షం కురిపించారు. అడిగిన వాటికి, అడగని వాటికి సైతం హామీలు గుప్పించారు. దీంతో పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఆచరణ సాధ్యమా అని ఒకరినొకరు ప్రశ్నించుకు న్నారు. మరోవైపు చంద్రబాబు అడుగడుగునా ఓ సామాజిక వర్గం పేరును జపిస్తూ.. ఆ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పటం బీసీ వర్గాలను అసహనానికి గురి చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచుతామని.. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు వంటి పలు హామీలను అధినేత గుప్పించడం చర్చనీయూంశమైంది. అవినీతి, కుట్ర రాజకీయాలపై ప్రజాగర్జన పేరిట నిర్వహించిన సభలో ఏకంగా గంటా 40 నిమిషాలపాటు ప్రసం గించిన చంద్రబాబు హామీలతో ఊదరగొట్టేశారు. వీటిని వినలేక సభ మధ్యలోనే జనం వెళ్లిపోవడం కనిపించింది. అసహనానికి గురైన బీసీలు రైతుల రుణమాఫీ ఫైలుపై తొలి సం తకం, డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభ వం, నిరుద్యోగులకు భృతి, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు వంటి పాత హామీలతోపాటు కొత్తగా ఈ సభలో ఆయన చేసిన కొన్ని హామీలు పార్టీ శ్రేణులను సైతం నివ్వెరపరిచాయి. సభలో చాలాసేపు ఓ సామాజిక వర్గం పేరును జపిస్తూ.. వారికి పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్పడం బీసీలను అసహనానికి గురి చేసింది. బీసీలకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పినా.. ఇప్పటివరకూ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఆ వర్గానికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పారు. టీడీపీలో చేరిన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఈసారి ఎన్నికల్లో కొత్తపేట సీటును కేటారుుస్తామని చంద్రబాబు ప్రకటించడంపై కొందరు బీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశం తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన నిర్ణయంపై పాతపాటే తెలుగుజాతిని చీల్చాలంటూనే.. విభజనను సరిగా చేయాలనే పాత పాటనే ఈ సభలోనూ చంద్రబాబు పదేపదే వినిపించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే సీమాంధ్రులు ఒప్పుకోవాలని, కలిసి ఉండాలంటే తెలంగాణ వారిని ఒప్పించాలనే లాజిక్లను ప్రయోగించి ఈ విషయంపై సొంత పార్టీ నేతలనే అయోమయంలో పడేశారు. ఇదే అంశంలో సోనియాగాంధీపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేయడం విశేషం. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, జగన్మోహన్రెడ్డిపైన ఎప్పటిలా విమర్శలు చేశారు. మొత్తానికి హామీలు గుప్పించి.. విమర్శలు కురిపించిన చంద్రబాబు త్వరలో ఎన్నికలు వస్తున్నాయని.. అందరూ జస్టిస్ చౌదరిల్లా పోరాడాలంటూ అయోమయంలో ఉన్న క్యాడర్‌కు ఊపుతెచ్చే పంచ్ డైలాగులూ విసిరారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, పార్టీ ముఖ్య నేతలు మాగంటి మురళీమోహన్, వర్ల రామయ్య, బోళ్ల బులిరామయ్య, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, టీవీ రామారావు. కలవపూడి శివ, చింతమనేని ప్రభాకరరావు, నాయకులు డాక్టర్ సీహెచ్ బాబ్జి, అంబికా కృష్ణ, బడేటి బుజ్జి, పీతల సుజాత, ముళ్లపూడి వెంకటకృష్ణారావు, గుబ్బల తమ్మయ్య, గొడవర్తి శ్రీరాములు, ముళ్లపూడి బాపిరాజు, గాదిరాజు బాబు, దాసరి శేషు, ఎంఏ షరీఫ్, కారుపాటి వివేకానంద, చలమలశెట్టి రామాంజనేయులు, మాగంటి బాబు తనయుడు రాంజీ తదితరులు సభలో పాల్గొన్నారు. -
రావద్దు బాబూ
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :‘సంక్రాంతి పండగ అంటే ఆ హడావుడే వేరు. పండగకు మూడు రోజులు ముందు నుంచి ప్రారంభమయ్యే ఆ మజా నుంచి పండ గ తరువాత మూడు రోజులకు కూడా బయటకు రాలేం. కోడిపందాలు లాంటివి సాధార ణం కనుక చంద్రబాబు ప్రజాగర్జనను వాయిదావేయండి’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రజాగర్జనపై చర్చించేందుకు పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని స్థానిక జిల్లా రైస్ మిల్లర్స్ హాల్లో బుధవారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రజలకున్న విశ్వాసాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మాట్లాడుతూ పార్టీని జిల్లాలో నంబర్ వన్‌గా నిలపాలన్నారు. అధ్యక్షత వహించిన గూడెం నియోజకవర్గ ఇన్చార్జి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే ఆస్తులను కుదువపెట్టి జిల్లాలో 15 స్థానాలు టీడీపీ దక్కించుకునేలా కృషి చేస్తామన్నారు. గెలిచే సత్తా ఉన్నవారిని పక్కన పెడితే చూస్తూ ఊరుకోమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే హైకమాండ్‌పై పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కాపుల ఉన్నతికి పాటుపడింది టీడీపీ అని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సంక్రాంతి సరదాలు, కోడిపందాల నేపథ్యంలో బాబు ప్రజాగర్జన తేదీని మార్చాలని కోరారు. కష్టపడి పనిచేసిన వారిని విస్మరించి , కొత్తగా వచ్చే వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తే సహించబోమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీఫ్ హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆస్తులు తగలేసుకున్నవారికి విలువ ఇవ్వకపోతే పార్టీకి మంచిది కాదన్నారు. క్రీడాస్ఫూర్తి ద్వారా యువతను పార్టీ వైపు ఆకర్షించాలని అల్లూరి విక్రమాదిత్య అన్నారు. పార్టీలోని కార్యకర్తలకు ఆవేశంకాదు, ఆలోచన కావాలని గుంటూరు జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు సాంబశివరావు హితవు పలికారు. పార్టీ జిల్లా పరిశీలకులు గరిక పాటి రామ్మోహన్రావు మాట్లాడుతూ టికెట్ల విషయంలో నాయకులు, కార్యకర్తల్లో అనుమానాలు, అపోహాలను గమనించామన్నారు. ఈ తరహా భయం కలగటానికి దారి తీసిన పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామన్నారు. కొన్నిచోట్ల సామాజిక వర్గాలవారీగా సర్దుబాట్ల నేపథ్యంలో మార్పులు చేయాల్సి వస్తే, తప్పని సరిగా ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తల సమక్షంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ప్రజాగర్జన తేదీని ఖరారు చేయకుండానే సమావేశాన్ని ముగించారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, టీవీ రామారావు, మాజీ మంత్రులు మాగంటి బాబు, కారుపాటి వివేకానంద, జెడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మేకా జానకిరామయ్య, పాలి ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రజాగర్జన సభలో బాబు నోటివెంట రాని ''సమైక్యం''
-
అందరి దారి ఒకటైతే.. బాబుది మరోదారి!
=చంద్రబాబు విభజన పాట =వేదికపై ఎంపీ శివప్రసాద్ సమైక్య బీరాలు =అధినేత తీరుపై క్యాడర్లో అసహనం =రొటీన్‌గా సాగిన టీడీపీ అధినేత పర్యటన =ఎన్నికల వేడి పుట్టించలేక పోయిన ప్రసంగం సాక్షి, తిరుపతి: జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలందరిదీ ఒక దారైతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుది మాత్రం మరోదారనే విషయం మళ్లీ స్పష్టమయింది. ప్రజాగర్జన పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం తిరుపతి నుంచి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు తన ప్రసంగంతో పార్టీ క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయారు. జిల్లాలో అందరూ సమైక్యం కోరుకుంటున్నా ఆయన తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదలకుండా ప్రసంగించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తానని గానీ, తానూ సమైక్యవాదినని గానీ చెప్పలేదు. దీంతో తాము ప్రజల్లోకి ఎలా వెళ్లేదంటూ జిల్లాలోని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజాగర్జన అని సభ పెట్టి ఇక్కడ ప్రజల కోరుకుంటున్న సమైక్యాంధ్రను ప్రస్తావించకుండా ఉపన్యసించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుం దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్వయంగా సవాల్ విసిరినా, దీనిని స్వీకరించలేని స్థితిలో విభజనకు అంగీకరిస్తామని, ఇరుపక్షాల వారి వాదనలు వినాలని, అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు మాట్లాడడం టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మింగుడు పడడం లేదు. మరో వంద రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో వైఎస్ఆర్ సీపీ నేరుగా సమైక్యవాదంతో ప్రజల్లోకి వెళ్తుంటే తాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు లోలోపల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదే విషయాన్ని ఒకరిద్దరు నాయకులు బాహాటంగానే మీడియా ప్రతినిధుల వద్ద గర్జన ముగిసిన వెంటనే ప్రస్తావించడం గమనార్హం. అదే సమయంలో చంద్రబాబు మినహా, మిగిలినవారు సమైక్యం ఉన్న రాష్ట్రాన్ని సోనియాగాంధీ విభజించిందని, చిచ్చుపెట్టిందని విభజనను అడ్డుకుంటామని మాట్లాడడం గమనార్హం. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే ఏకంగా అపరిచితుడు వేషం వేసి సోనియాపై విభజన చిచ్చుపాట పాడుతూ, డైలాగ్‌లు విసురుతూ చిందులేశారు. వర్లరామయ్య, కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు కూడా రాష్ట్ర సమైక్యతకు విఘ్నం కలిగితే చూస్తూ ఊరుకోం అన్న తరహాలో తమ ఉపన్యాసాలు అదరగొట్టారు. అధినేత మాత్రం తాను విభజనకు అనుకూలమని చెప్పకనే చెప్పారు. దీంతో కార్యకర్తలకు ఎవరి మాటాలు నమ్మాలో అర్థంకాక వెనుతిరిగారు. ప్రైవేట్ హోటల్లో మంతనాలు జిల్లాలో కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? వారి పరిస్థితి ఏమిటి? అనే వివరాలను చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ సమక్షంలో చర్చించారు. వీరితో పాటు శాసనమండలి ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబును ఆదివారం ఉదయం కలిశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి చేరుకున్న చంద్రబాబు ఆర్టీసీ బస్టాండ్ సమీంలోని ఒక ప్రైవేట్ హోటల్లో జిల్లా పార్టీ ముఖ్యనాయకులతో మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశమయ్యారు. జిల్లాలో నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితితో పాటు, వలసలు ఎవరెవరు రానున్నారు, వారి ఆర్థికపరిస్థితి ఏమిటి, పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో అంతర్గతంగా అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉందా అన్న వివరాలు చంద్రబాబు ఆరా తీశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు సైకం జయచంద్రారెడ్డితో సహా, చంద్రగిరి నియోజకవర్గానికే చెందిన తిరుపతిలో చురుకుగా ఉన్న ఒక డాక్టర్ పార్టీలో చేరే వ్యవహారం, కాంగ్రెస్‌లో కీలక వ్యక్తులు ఎవరెవరు చేరే అవకాశం ఉందనేదానిపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం. -
బాబు హామీల గాలం
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం చేపట్టిన ప్రజాగర్జన సభలో ఓటర్లకు గాలం వేసేందుకు వరుస హామీలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రసంగం ప్రారంభంలోనే చిత్తూరు జిల్లా సమస్యలు, స్థానిక సమస్యలను ప్రస్తావించారు. తొలుత తనకు వేంకటేశ్వరస్వామి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు శక్తిని ఇస్తాడని, శ్రీవారు మన అందరి ఇలవేల్పు అంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగంలో మధ్యలో ‘ఏం తమ్ముళ్లు..చెప్పండి.. నేను చెప్పింది కరె క్టేనా’ అంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉంటూ తాను ఏ పనులు అయితే చేయలేకపోయారో వాటన్నింటిని ఈసారి సీఎం అయితే చేస్తానని, నమ్మండి అంటూ ముఖ్యంగా యువతను అభ్యర్థించారు. దీనిలో భాగంగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, స్వర్ణముఖి-సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు తాగునీరు లేకపోతే కల్యాణి డ్యాం పైపు లైన్ నిర్మించానని, బర్డ్, రుయా, స్విమ్స్ ఆస్పత్రులను ఒక్కటిగా చేశామని చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రాణదానం స్కీమ్ ప్రారంభించి తిరుమల వెళ్తూంటే తనపై 22 క్లేమోర్ మైన్స్‌తో దాడి జరిగిందని, మీకు మేలు చేసేందుకే తనను వేంకటేశ్వరస్వామి బతికించారని గుర్తుచేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అలాగే తిరుపతిని వాటికన్ సిటీగా మారుస్తామని, ఆ బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని రెండుసార్లు చెప్పారు. తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత, ఆరోగ్యభద్రత కల్పిస్తామన్నారు. వారికి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపడతామన్నా రు. ఉచిత కరెంట్, రుణమాఫీ ప్రకటించారు. జన్మభూమి రుణం తీర్చుకుంటా ‘‘నేను ఇక్కడే పుట్టాను, తిరుపతిలోనే పెరిగాను, నాకు రాజకీయాలు నేర్పింది తిరుపతి. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నది చిత్తూరు జిల్లా వాసులే. మీలో ఒకడిగా ఉంటూ వ్యవసాయ పనులు చేశాను. నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది ఇదే తిరుపతిలోనే. పక్కనున్న ఎస్వీ యూనివర్సిటీలోనే నేను చదువుకున్నది. జన్మభూమి రుణం తీర్చుకుంటాను. కచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడేవిధంగా పని చేస్తాను’’ అంటూ ముఖ్యంగా తిరుపతి ఓటర్లకు గాలం వేసేందుకు తంటాలు పడ్డారు. ఉపన్యాసం ముందు, చివరన ఎక్కువగా యువతను, మహిళలను, మధ్యతరగతి వారిని, కార్మికులను ఇలా రంగాల వారీగా వారి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. నిత్యావసరవస్తువుల ధరల ప్రస్తావన, పెట్రోల్డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలెండర్ల కోత, ఆధార్ సమస్యలు.. ఇలా ప్రతి అంశాన్ని పేర్కొంటూ ఎన్నికల ప్రసంగం చేశారు. పదే, పదే ‘‘నన్ను ఆశీర్వదించండి, ఓట్లు వేసి గెలిపించండి. నన్ను ఆశీర్వదించండి బుల్లెట్లా దూసుకెళ్తా’’ అంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పల్చబడిన జనం జిల్లా వ్యాప్తంగా ప్రజాగర్జనకు తెలుగుతమ్ముళ్లు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ జీపులు, కార్లు అద్దెకు తీసుకుని జనాన్ని తరలించినా ఒక దశలో జనం పల్చబడ్డారు. 2 గంటలకని చెప్పిన మీటింగ్ 4.30 గంటలకు ప్రారంభం కావటం, చంద్రబాబు ఉపన్యాసంలో కొత్తదనం లేకపోవటంతో పార్టీకార్యకర్తలు, నాయకులు లేచి వెళ్లిపోవడం కనపడింది. చంద్రబాబు విజన్ 2020 గురించి ప్రస్తావిస్తున్న సమయంలోనే వెనుక ఉన్న కుర్చీలు చాలా వరకు ఖాళీ అయ్యాయి. వేదికపై ఉన్న టీడీపీ రాష్ట్రనాయకులు, ఎమ్మెల్యేలే చంద్రబాబు ఉపన్యాసం సమయంలో నిద్రపోతూ కనిపిం చారు. చివరలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రజాగర్జనకు హాజరైన పార్టీనాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. -
ఆమోదయోగ్య విభజన : చంద్రబాబునాయుడు
ప్రజాగర్జనలో చంద్రబాబు డిమాండ్ సమైక్యం ఊసెత్తని వైనం సాక్షి, తిరుపతి: ‘రాష్ట్ర విభజన ఇరుప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగానే జరగాలి. సీమాంధ్ర వారిని కట్టుబట్టలతో నిలబెట్టాలని చూస్తే ఊరుకోను. సరైన పరిష్కారం చూపిన తర్వాతే విభజన అంశంలో ముందుకెళ్లాలి..’ అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాను రాష్ట్ర విభజనకు అనుకూలమనే విషయం మరోమారు స్పష్టం చేశారు. తిరుపతిలో పార్టీ ప్రజాగర్జన సందర్భంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో సమైక్యమనే మాట ఒక్కసారి కూడా ఆయన నోటి నుంచి రాలేదు. మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలంటూ వరుసబెట్టి ఎన్నికల హామీలిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి లో నిర్వహించిన ప్రజాగర్జనలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రామలక్ష్మణులు మాదిరి ఉన్న రెండు ప్రాంతాల ప్రజలను వాల్మీకి సుగ్రీవుల్లా కాంగ్రెస్ మార్చిందన్నారు. విభజన పేరిట ఇరు ప్రాంతాలు వారు కొట్టుకుంటుంటే ‘రెండు కోతులు- పిల్లి -రొట్టెముక్కల వివాదం’ తీరున అన్ని అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. విభజన సాకుతో కేంద్రం శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలోకి తెస్తున్నదని, అలాగే ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక అంశాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుని పిల్లకాలువ కట్టుకోవాలన్నా వారిని అడుక్కునేలా చేసేందుకు కుట్రపన్నిందని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసే సంప్రదాయానికి విరుద్ధంగా నేడు విభజన చేస్తున్నారని, ఇలా ఏ రాష్ట్ర విభజన సమయంలోనూ జరగలేదన్నారు. ఇరుప్రాంతాల వారికి న్యాయం చేసిన తరువాతే ముందుకెళ్ళాలని 2005లో తాను లేఖ ఇస్తే దానిని తప్పుపడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రభంజనం చూసే.. ఒకేరోజు తెలంగాణ అంశానికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపడం, అదే రోజు కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించటం జరిగిపోయూయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సోనియూ పెద్ద అనకొండ: లోక్‌పాల్ బిల్లుతో అవినీతి నిర్మూలనకు పాటుపడుతున్నామని కథలు చెబుతున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న అవినీతికి కర్త, కర్మ, క్రియ సోనియాగాంధీయేనని ఎద్దేవా చేశారు. అవినీతిలో సోనియాగాంధీనే ఒక పెద్ద అనకొండ పాము అని, ఆమె అల్లుడు రాబర్ట్ వధేరా ఇంకొక అనకొండ అని చెప్పారు. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వధేరాకు నేడు వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎలా సమకూరాయని, పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘బక్కచిక్కిన కాంగ్రెస్‌ను ఒక పాముగా భావించి బతకమని పాలు పోస్తే అది గుడ్లు పెట్టి అవినీతి అనే పాములను తయారు చేసింది. ఆ పాములు మళ్ళీ దేశమంతా గుడ్లు పెట్టి దేశాన్ని దోచేశాయి..’ అంటూ కథ చెప్పారు. అలా వచ్చిన అనకొండల్లో ఒక అనకొండ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని, ఆయన వదిలివెళ్ళిన పిల్ల అనకొండే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని ఆరోపించారు. సమైక్యవాదం ముసుగులో జగన్ సోనియావాదం వినిపించేందుకు వస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి వైఎస్ఆర్సీపీ వారు రాష్ట్ర విభజనకు, సోనియాగాంధీకి సహకరిస్తున్నారన్నారు. సోనియాగాంధీ ఆశీస్సులతో, ఆమెతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నందు వల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందనే విషయం అందరికీ తెలుసునన్నారు. పిల్ల కాంగ్రెస్‌కు ఓటెయ్యవద్దంటూ ఆ పార్టీ మీటింగ్‌లు విన్నా పాపాలు చుట్టుకుంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి రూ.30 వేల కోట్లు ప్రజల నెత్తిన మోపిందన్నారు. రాజీవ్ యువకిరణాలు ఎక్కడా కనపడటం లేదన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, మౌలిక సదుపాయూలు కొరవడ్డాయని విమర్శిం చారు. నిత్యావవసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉన్నాయంటూ సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఎన్టీఆర్‌ను యుగపురుషుడంటూ అభివర్ణించారు. గెలిపిస్తే మళ్లీ చక్రం తిప్పుతా! 2014 ఎన్నికల్లో గెలిపిస్తే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయల్లో మళ్ళీబచక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి నుంచి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, డీ.కే.టీ పట్టాలను రెగ్యులరైజ్ చేయటంతో పాటు, అమ్ముకునే హక్కు కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపించారు. వ్యసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. తిరుపతిని వాటికన్ నగరం మాదిరి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత మోడీ చెబుతున్నవి ఏనాడో తెలుగుదేశం చేసినవేనని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్డీయే అనుసరించిన విధానాలను పొగుడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు దిశగా సంకేతాలిచ్చారు. ఎన్నికలకు ఇక వంద రోజులే గడువుందంటూ.. మద్యం రేట్లు ప్రస్తావించి చివరకు మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు కూడా బాబు ప్రయత్నించారు. నేతల కునికిపాట్లు: ఒకవైపు చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసమిస్తుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు నిద్రతో కునికిపాట్లు పడుతూ కన్పిం చారు. టీడీపీ చిత్తూరు జిల్లా ఇన్చార్జి కోడెల శివప్రసాదరావు, ఎంపీ శివప్రసాద్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే పరసారత్నం, తిరుపతి నియోజవర్గ ఇన్చార్జి చదలవాడ క్రిష్ణమూర్తి వేదికపై నిద్రపోతూ కనిపించారు. బాబు విజన్ 2020 గురించి మాట్లాడటం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం లేచి వెళ్ళిపోవటం మొదలెట్టారు. సమైక్యం అన్నందుకే ఆహ్వానించట్లేదేమో: హరికృష్ణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతి రేకించాలని కోరుతున్నందునే తనను టీడీ పీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆహ్వానిం చడంలేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆ కారణంగానే తిరుపతిలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు తనకు ఆహ్వానం రానట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
చంద్రబాబు గర్జనలు దేనికి?: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తానంటున్న ప్రజాగర్జనలు దేనికోసమో స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గర్జించనున్నారా లేక సాధ్యమైనంత తొందరగా విభజించాలని గర్జిస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో దివంగత ఎన్టీఆర్ గర్జన పేరుతో సభలు జరిపారంటే దానికి ఒక అర్థం, అర్హత ఉంది. కానీ ఈరోజు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చంద్రబాబు గర్జన పేరుతో పిల్లికూతలు తప్ప చేయగలిగేదేం ఉండదు’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 75 శాతం మంది కలిసుండాలని కోరుకుంటున్నా, ఢిల్లీలో సోనియాగాంధీ తెలుగు ప్రజలపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు బాబు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి వద్దకు ఇరుప్రాంత నేతలను పంపుతారే తప్ప బాబు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. ఈ గిమ్మిక్కుల నేపథ్యంలో ప్రతి టీడీపీ కార్యకర్త్తా బాబుపై గర్జించాలని విజ్ఞప్తి చేశారు. ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుంది పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్న చంద్రబాబు తీరు చూసి ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుందని పద్మ వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి రోజునే ప్రెస్‌మీట్ పెట్టి స్వాగతించిన బాబు.. తదనంతరం ఎన్ని వేషాలేశారో లెక్కే లేదన్నారు. విభజన ఎలా జరగాలో చెబుతున్న బాబు.. ‘సమైక్యం’ అనే మూడు అక్షరాలు ఎందుకు పలకలేకపోతున్నారని నిలదీశారు. ‘‘అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఎక్కడ దాక్కున్నారు? అలాంటి మీరు ఈరోజు ఏముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారు? పిల్లల ఉద్యోగాలు, సాగునీరు తదితర అంశాలపై మహిళలు, రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు? మీ కమెండోలతో కొట్టిస్తారా? లేక అడిగిన ప్రతీ ఒక్కరినీ జగన్ మనుషులంటూ ముద్రవేస్తారా? లేదంటే ప్రజల న్యాయమైన కోరికను అప్పటికైనా ఆలోచిస్తారా’’ అని పద్మ ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ పుట్టిందే చంద్రబాబు వల్ల అని సాక్షాత్తు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివే దికలో పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. బాబు చేతకానితనం వల్లే ఈదుస్థితి తలెత్తిందని, అది కాస్తా ఇప్పుడు రాష్ట్రం విడిపోవడానికి కారణమవుతోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆ తప్పుల నుంచి బయటపడేందుకు విభజనకు వ్యతిరేకంగా, సమైక్యానికి అనుకూలంగా బాబు లేఖ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఈ నెల 21 నుంచి ప్రజా గర్జన: చంద్రబాబు
చిత్తూరు: ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రను ఆరంభిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతి నుంచి తన యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు మంగళవారం బాబు మీడియాకు తెలిపారు. ఈ యాత్రలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ వైఖరికి ఇదే నిదర్శమన్నారు. రాష్ట్ర విభజన అనేది పారదర్శకంగా జరగాలని బాబు తెలిపారు. ఈ మెయిల్స్ ద్వార విభజన చేస్తామంటే కుదరే పని కాదన్నారు. -
'ఎంపీలు దద్దమ్మలు కాబట్టే రాష్ట్ర విభజన జరిగింది'
ప.గో: 'మీ ఓట్లతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పండి. మీ ఓట్లతోనే మంచి నాయకుడిని ఎన్నుకోండి'. అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. గురువారం భీమవరంలో జరిగిన ప్రజా గర్జన సభలో అశోక్ బాబు ప్రసంగించారు. వర్షంలో సాగిన ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం రాష్ట్ర రాజకీయ నాయకులేనని ఆయన దుయ్యబట్టారు. ఎంపీలు దద్దమ్మలు కాబట్టే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు. 2014 ఎన్నికలు చాలా కీలకమని, ఈ అంశాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని నాయకుల్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై ఆయన మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు విభజనవాదో..? సమైక్యవాదో చెప్పకుండా ప్రజలను గందరగోళంలో నెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన వైఖరిని చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. -
సుష్మా ‘తెలంగాణ గర్జన’ నేడు
పాలమూరు సభకు భారీ ఏర్పాట్లు 50 వేల మంది సమీకరణకు సన్నాహాలు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన యువభేరీ సదస్సు జయప్రదమైన నేపథ్యంలో కమలనాథులు మరో భారీ సభకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని పునరుద్ఘాటించేందుకు, ఏ పార్టీతోనూ పొత్తులుండవని చెప్పేందుకు శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజా గర్జన సభ నిర్వహిస్తోంది. ఈ సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. సుమారు 50 వేల మందిని, అందులో ఎక్కువగా మహిళల్ని సభకు తరలించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మోడీ సభకు దీటుగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు జన సమీకరణలో పోటీపడుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కూడా ఈ సభతో సత్తా చాటాలనుకుంటున్నారు. తన నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణమైన బాలుర జూనియర్ కళాశాలను కాషాయ జెండాలు, నేతల కటౌట్లతో ముస్తాబు చేశారు. సుష్మా టూర్ ఇలా.. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే సుష్మా తదుపరి రోడ్డు మార్గాన మహబూబ్‌నగర్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభలో పాల్గొని రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మర్నాడు ఉదయం 8 గంటలకు పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం 9.45 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతారు.