సాక్షి ప్రతినిధి, ఏలూరు : తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించిన ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎడాపెడా హామీల వర్షం కురిపించారు. అడిగిన వాటికి, అడగని వాటికి సైతం హామీలు గుప్పించారు. దీంతో పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఆచరణ సాధ్యమా అని ఒకరినొకరు ప్రశ్నించుకు న్నారు. మరోవైపు చంద్రబాబు అడుగడుగునా ఓ సామాజిక వర్గం పేరును జపిస్తూ.. ఆ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పటం బీసీ వర్గాలను అసహనానికి గురి చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని పెంచుతామని.. ఏపీపీఎస్‌సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు వంటి పలు హామీలను అధినేత గుప్పించడం చర్చనీయూంశమైంది. అవినీతి, కుట్ర రాజకీయాలపై ప్రజాగర్జన పేరిట నిర్వహించిన సభలో ఏకంగా గంటా 40 నిమిషాలపాటు ప్రసం గించిన చంద్రబాబు హామీలతో ఊదరగొట్టేశారు. వీటిని వినలేక సభ మధ్యలోనే జనం వెళ్లిపోవడం కనిపించింది.
అసహనానికి గురైన బీసీలు
రైతుల రుణమాఫీ ఫైలుపై తొలి సం తకం, డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభ వం, నిరుద్యోగులకు భృతి, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు వంటి పాత హామీలతోపాటు కొత్తగా ఈ సభలో ఆయన చేసిన కొన్ని హామీలు పార్టీ శ్రేణులను సైతం నివ్వెరపరిచాయి. సభలో చాలాసేపు ఓ సామాజిక వర్గం పేరును జపిస్తూ.. వారికి పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్పడం బీసీలను అసహనానికి గురి చేసింది. బీసీలకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పినా.. ఇప్పటివరకూ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఆ వర్గానికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పారు. టీడీపీలో చేరిన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఈసారి ఎన్నికల్లో కొత్తపేట సీటును కేటారుుస్తామని చంద్రబాబు ప్రకటించడంపై కొందరు బీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశం తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
విభజన నిర్ణయంపై పాతపాటే
తెలుగుజాతిని చీల్చాలంటూనే.. విభజనను సరిగా చేయాలనే పాత పాటనే ఈ సభలోనూ చంద్రబాబు పదేపదే వినిపించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే సీమాంధ్రులు ఒప్పుకోవాలని, కలిసి ఉండాలంటే తెలంగాణ వారిని ఒప్పించాలనే లాజిక్‌లను ప్రయోగించి ఈ విషయంపై సొంత పార్టీ నేతలనే అయోమయంలో పడేశారు. ఇదే అంశంలో సోనియాగాంధీపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేయడం విశేషం. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, జగన్‌మోహన్‌రెడ్డిపైన ఎప్పటిలా విమర్శలు చేశారు.
మొత్తానికి హామీలు గుప్పించి.. విమర్శలు కురిపించిన చంద్రబాబు త్వరలో ఎన్నికలు వస్తున్నాయని.. అందరూ జస్టిస్ చౌదరిల్లా పోరాడాలంటూ అయోమయంలో ఉన్న క్యాడర్‌కు ఊపుతెచ్చే పంచ్ డైలాగులూ విసిరారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, పార్టీ ముఖ్య నేతలు మాగంటి మురళీమోహన్, వర్ల రామయ్య, బోళ్ల బులిరామయ్య, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, టీవీ రామారావు. కలవపూడి శివ, చింతమనేని ప్రభాకరరావు, నాయకులు డాక్టర్ సీహెచ్ బాబ్జి, అంబికా కృష్ణ, బడేటి బుజ్జి, పీతల సుజాత, ముళ్లపూడి వెంకటకృష్ణారావు, గుబ్బల తమ్మయ్య, గొడవర్తి శ్రీరాములు, ముళ్లపూడి బాపిరాజు, గాదిరాజు బాబు, దాసరి శేషు, ఎంఏ షరీఫ్, కారుపాటి వివేకానంద, చలమలశెట్టి రామాంజనేయులు, మాగంటి బాబు తనయుడు రాంజీ తదితరులు సభలో పాల్గొన్నారు.
ఎడాపెడా హామీలు
Published Sun, Feb 16 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement