ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో మూడంస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడటంతో రాజం శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మృతిచెందాడు.
ఆదిలాబాద్ (మంచిర్యాల): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో మూడంస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడటంతో రాజం శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మృతిచెందాడు. సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవనంపై నుంచి పడినపుడు కొన ఊపిరి ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. శ్రీనివాస్ ప్రస్తుతం నస్‌పూర్ ఫ్లడ్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.