ఇంట్లో ఎవరులేని సమయం చూసి దొంగలు పడి దోచుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.
నల్లగొండ: ఇంట్లో ఎవరులేని సమయం చూసి దొంగలు పడి దోచుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లో లేని సమయంలో భార్యా పిల్లలు ఆరుబయట నిద్రపోతుండగా అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 30 తులాల వెండి, తులం బంగారంతో పాటు రూ. 8 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.