నల్గొండ జిల్లా భువనగిరిలోని తారకరామనగర్‌లో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి బంగారు చోరీ చేశారు.
యువకుడిని కొట్టి బంగారం చోరీ
Published Tue, Jan 19 2016 11:53 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరిలోని తారకరామనగర్‌లో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి బంగారు చోరీ చేశారు. స్థానికంగా ఉండే రేణుక తెల్లవారుజామున లేచి పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఆమె కుమారుడు నవీన్ నిద్రపోతుండగా జొరబడిన దొంగలు నవీన్‌ను కొట్టి, తాడుతో కట్టేసి బీరువాలో ఉన్న 5 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు.
రేణుక పనులు ముగించుకుని ఇంటికొచ్చి చూడగా తలుపునకు గొళ్లెం పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కొడుకును కట్టేసి ఉండటంతో విషయం బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement