
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. అయితే ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. సెక్రటేరియట్ డీ బ్లాక్‌లో రేపు రాత్రి ఏడు గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5,38,867 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 2,62,479 మంది బాలికలు, 2,76,388 మంది బాలురు ఉన్నారు.
టెన్త్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి