Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP YV Subba Reddy Opposes Waqf Bill in Rajya Sabha1
వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్‌సీపీ

ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Live Updates2
ఎస్ఆర్‌హెచ్ వ‌ర్సెస్ కేకేఆర్ లైవ్ అప్‌డేట్స్‌..

KKR vs SRH Live Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌ర‌ఘువ‌న్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 ప‌రుగులు చేసిన ర‌ఘువ‌న్షి.. క‌మిందు మెండిస్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 4 వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులు చేసింది. క్రీజులో వెంక‌టేష్ అయ్య‌ర్‌(5), రింకూ సింగ్‌(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్‌.. ర‌హానే ఔట్‌అజింక్య ర‌హానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన ర‌హానే.. జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ మూడు వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌ఘువ‌న్షి(49), వెంక‌టేష్ అయ్య‌ర్‌(1) ఉన్నారు.నిల‌క‌డ‌గా ఆడుతున్న ర‌హానే, ర‌ఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య ర‌హానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్‌..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్ వేసిన ప్యాట్ క‌మ్మిన్స్ బౌలింగ్‌లో క్వింట‌న్ డికాక్‌(1) ఔట్ కాగా.. రెండో ఓవ‌ర్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్‌(7) ఔట‌య్యాడు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌హానే(1), ర‌ఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. తుది జ‌ట్టులోకి క‌మిందు మెండిస్‌, సిమర్‌జీత్ సింగ్ వ‌చ్చారు.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్ర‌వ‌ర్తి

BJDs message to MPs on Waqf Bill vote in U turn3
లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..

ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

HCU Land Row Hearings In Supreme Court April 3rd Updates4
HCU: ఇది చాలా సీరియస్‌ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం

న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్‌ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్‌ క్యూరీని రిట్‌ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది.

Google,Amazon,Microsoft,apple caution H1B visa staff5
H1B visa: దిగ్గజ టెక్‌ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్‌ కంపెనీలు హెచ్‌1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్‌1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్‌ కంపెనీలు అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ ఐటీ కంపెనీలు తమ హెచ్‌1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్‌ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ హైలెట్‌ చేసింది.అయితే, హెచ్‌1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్‌1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్‌ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్‌1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి.

HCU students celebrate the Supreme Court verdict over Kancha Gachibowli lands6
‘స్ట్రేచర్‌ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (​Hyderabad Central University) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీయూ భూముల్లో చేపడుతున్న పనులన్నింటిని నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈమేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్‌ గవాయ్‌), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్‌సీయూలో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.కంచ గచ్చిబౌలి భూముల్లో (kancha gachibowli land issue) 400 ఎకరాల వేలంపై వారం రోజులగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమేని భీష్మించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీం కోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇది విద్యార్థుల విజయంమరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది’ అని అన్నారు.స్ట్రేచర్‌ ఉందని విర్రవీగితే..సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది అని మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. స్ట్రేచర్‌ ఉందని విర్రవీగితే.. చట్టం చూస్తూ ఊరుకోదు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినపుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామం. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజిక వేత్తల విజయం.హెచ్‌సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి అభినందనలు’ అని తెలిపారు. పర్యావరణ విధ్వంసంపై సుప్రీం ఆవేదన హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌ నుంచి నివేదిక తెప్పించుకుని విచారించింది. విచారణ సందర్భంగా.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో యదేశ్చగా చెట్లను నరకడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బ తీయడం, జేసీబీలతో చెట్లను కొట్టేయడం,మూగజీవాల్ని హింసిస్తున్నారనే తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్‌ గవాయ్‌), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.ఎవరిచ్చారు మీకు ఆ హక్కు‘ఇది చాలా సీరియస్‌ విషయం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఏ అధికారంతో చెట్లను ఎలా తొలగిస్తారాని పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. సీఎస్‌,జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్‌ఎంసీ కమీషనర్‌తో పాటు పలువురి అధికారులను తొలగించింది. ఈనెల 16 కల్లా సీఈసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Visakha Incident: Daughter inquires about mother through gestures7
నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి

విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉ‍న్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానిక​ఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచ­క్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘ­ట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్‌ పరిచయమ­య్యా­డు. నవీన్‌ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్‌ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించా­డు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.

EPFO simplifies claim settlement process with Two Key Reforms8
EPFO కీలక మార్పులు..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఈపీఎఫ్ సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.డాక్యుమెంట్ అప్‌లోడ్ అవసరం లేదుఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్‌లను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్‌లైన్ క్లెయిమ్‌ చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్‌బుక్ వివరాల స్కాన్ చిత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి. ఈ ఆవశ్యకతను తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (యూఏఎన్) అనుసంధానించే ప్రక్రియలో యజమాన్యం (కంపెనీ) అనుమతి అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. యూఏఎన్‌కు బ్యాంకుల ఖాతాల లింక్‌ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్‌లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగుతాయి.Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey! Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025

No Fee To Be Charged for Updation of Nominees for PPF Accounts Say Nirmala Sitaraman9
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్

నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్!నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts. Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025

Tollywood Hero Manchu Manoj Special wishes To His Daughter Birthday10
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్‌ దంపతుల ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్‌ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్‌ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement