evade subrahmanyam
-
నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వార్‌పై నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో హీరో అభిమానుల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టీజర్, ట్రైలర్ మొదలు సినిమా రిలీజ్ వరకు ప్రతీది పోల్చుతూ హీరో ఫ్యాన్స్ ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కలిసి మెలిసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయింది.నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా దీనిపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) స్పందించారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని(nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ ఈ నెల 21న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పదేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా చేయగలరా?’ అని ఓ విలేకరి అడగ్గా నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్ వార్ గురించి తెలియదు కానీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో విజయ్‌కు నాని సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు’ అన్నారు. అలాగే నాని, విజయ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో సినిమా చేయలేం. నా నాలుగో సినిమాని మళ్లీ ఇలాంటి నేపథ్యంతో తీస్తే.. అది ఇంత బాగా రాకపోవచ్చు. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. ఇంత నేచురల్‌గా తీయడం సాధ్యంకాకపోవచ్చు’ అన్నారు. ఎవడే సుబ్రమణ్యంలోని నాని పాత్రను ఇప్పుడున్న యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి చేయగలడని, విజయ్ పాత్రను పోషించాలంటే కొత్త హీరో కావాల్సిందేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నాని - విజయ్ కి మొదట్లో చాలా సపోర్టివ్ ఉండేవాడు..వివాదాలపై స్పందించిన నాగ్ అశ్విన్ : #NagAshwin@NameisNani @TheDeverakonda #Nani #VijayDevaraKonda pic.twitter.com/CqCUlBPh0x— The Cult Cinema (@cultcinemafeed) March 18, 2025 -
ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ విడుదలైన పదేళ్లు పూర్తి కావడంతో మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.ఇలాంటి అరుదైన సినిమాలు తరచుగా రావని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మీలో ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే తప్పుకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని అభిమానులను కోరారు. నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం ఒకటని ఆయన తెలిపారు. ఈ జనరేషన్‌కు మూవీ కథ సరిగ్గా సెట్ అవుతుందన్నారు. గత పదేళ్లలో చాలా చిత్రాలు వచ్చాయి.. కానీ ఆ టైమ్‌లో చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూడాలని కోరారు. ఈ సినిమా చూసి కనీసం ఒకశాతం మార్పు వచ్చినా చాలని నాగ్ అశ్విన్ వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ఎవరైనా మిస్సయితే ఎంచక్కా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు
హైదరాబాద్: ఎవడే సుబ్రమణ్యం డైరెక్టర్ నాగ్ అశ్విన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడట.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియా దత్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తో ప్రియాంక చిరకాలంగా ప్రేమలో పడినట్లు, ఇప్పుడు పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విషయంలో క్రెడిట్ తనకే దక్కుతుందని నాగ్ అన్నారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నాడు. దీంతో తాను సంతోషంగా అంగీకరించానని నాగ్ తెలిపారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో తమ అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించినట్టు చెప్పారు. ఇంకా పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేయలేదని తెలిపాడు. స్వతహాగా సినిమా కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అమెరికాలో డైరెక్షన్‌కు సంబంధించి శిక్షణ కూడా పొందారు. తిరిగి వచ్చాక అనేక వైవిధమైన చిన్న సినిమాలు తమ బ్యానర్ లో అందించడంలో కీలక పాత్ర వహించారు. అటు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉంటే, ఇటు ప్రియాంక కొత్త కథలను పరిశీలించే పనిలో మునిగి తేలుతోందట. అందుకే పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయలేదట. ఇద్దరూ మంచి టేస్ట్ ఉన్నవ్యక్తులే. అందుకే ఇద్దరికీ జత కలిసిందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారట.