షరీఫ్‌తో మోదీ షేక్‌హ్యాండ్
పారిస్: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేశారు. సదస్సుకు వచ్చిన షరీఫ్‌తో మోదీ భేటీ అయి కాసేపు ముచ్చటించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివార్లలోని లె బౌర్జెట్‌లో ఐరాస నేతృత్వంలో వాతావరణ మార్పులు-సీవోపీ21 సదస్సు జరుగుతోంది. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించే విషయమై ఈ సదస్సులో ప్రపంచదేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ మొదట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్‌ను కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఆ తర్వాత వివిధ దేశాధినేతలను పలుకరించారు.
ఈ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ మాట్లాడుతూ వాతావరణ మార్పులపై ప్రస్తుత సదస్సు అత్యంత కీలకమైనదని, ఈ సదస్సులో వెలువడే నిర్ణయం ప్రస్తుతమున్న ప్రజల తలరాతనే కాదు.. రాబోయే తరాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని, ఈ సదస్సులో సానుకూల నిర్ణయం వెలువడానికి ప్రపంచం ఆశిస్తున్నదని చెప్పారు.