Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Free medical treatment banned Network hospitals on strike in Andhra Pradesh1
‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబు­తున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య ప్రదాత..ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బకాయిలు చెల్లించి భరోసా 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్‌లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది.

Donald Trump Vows To Stand Firm On Tariffs2
టారిఫ్‌లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్‌ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్‌ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. సోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్‌ మార్కెట్లు భారీ క్రాష్‌ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్‌ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్‌ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్‌ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు.

IPL 2025: SRH Captain Cummins Comments After Losing To Gujarat Titans3
SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడ్డాయి. తమ హోం గ్రౌండ్‌లో (ఉప్పల్‌ స్టేడియం) జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో వారికిది వరుసగా నాలుగో ఓటమి. గుజరాత్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఓడి, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం అనంతరం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానాని​కి ఎగబాకింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్‌ చిట్టచివరి స్థానానికి పడిపోయింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు లోకల్‌ బాయ్‌ సిరాజ్‌ చుక్కలు చూపించాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (8), అభిషేక్‌ శర్మను (18) పవర్‌ ప్లేలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మరో డేంజర్‌ బ్యాటర్‌ అనికేత్‌ వర్మను (18) కూడా ఔట్‌ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్‌ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్‌రైజర్స్‌ అతి కష్టం మీద 152 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. ఆఖర్లో కమిన్స్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ 17, నితీశ్‌ రెడ్డి 31, క్లాసెన్‌ 27, కమిందు 1, సిమర్‌జీత్‌ డకౌటయ్యారు. షమీ 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు తమ సహజ శైలికి భిన్నంగా జిడ్డుగా ఆడారు.స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క గిల్‌ బాధ్యతాయుతంగా ఆడుతుంటే వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. సుందర్‌ ఔటయ్యాక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా గుజరాత్‌ మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌(5), జోస్‌ బట్లర్‌ (0) విఫలమయ్యారు. గుజరాత్‌ పవర్‌ ప్లేలోనే వీరిద్దరి వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో షమీ 2, కమిన్స్‌ ఓ వికెట్‌ తీశారు.మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వికెట్‌ (పిచ్‌) చాలా కఠినంగా ఉండింది. మ్యాచ్‌ ఆరంభంలో వికెట్లు తీస్తే ఆటలోకి వచ్చినట్లే. బంతి ఎక్కువగా స్పిన్‌ కాలేదు. మంచు ప్రభావం కూడా ఉండింది. అయినా వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారి పేసర్లును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండింది.

Rasi Phalalu: Daily Horoscope On 07-04-2025 In Telugu4
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.11.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి ఉ.10.01 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.11.03 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 6.10. మేషం.... వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.వృషభం... చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిథునం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం... బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యాయత్నాలు సానుకూలం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.సింహం.... ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. .కన్య.. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.తుల... వ్యవహారాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.వృశ్చికం... బంధువుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు....... పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. అనారోగ్యం. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.మకరం... శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.కుంభం... నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మీనం... బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

CID chief target is to close cases against Babu5
రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో కీలక విభాగాల అధిపతి పోస్టు దక్కించుకునేందుకు సాధారణంగా ఉన్నతాధికారులు పోటీ పడతారు. అలాంటిది టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖలో కీలక పోస్టులంటేనే సీనియర్‌ ఐపీఎస్‌లు హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సీఐడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్‌ పోస్టుల పేరు చెబితేనే కంపించిపోతున్నారు. అవి మాకొద్దు..! అప్రాధాన్య పోస్టులైనా ఫర్వాలేదు..! వీలైతే కేంద్ర సర్వీసులకు పంపండి..! అని మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యనేతల కుట్రలను అమలు చేసేందుకు నిరాకరించి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సీఐడీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ బాటలో సాగేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో భారీ కుదుపులు ఉండొచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తలొగ్గిన వారికి పెద్దపీట.. పోలీసు శాఖలో సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు అత్యంత కీలకమైనవి. కీలక కేసుల్లో సమర్థ దర్యాప్తు, అవినీతి నిర్మూలన ప్రాతిపదికన ఆ మూడు విభాగాల అధిపతులుగా సీనియర్‌ ఐపీఎస్‌లను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. టీడీపీ సర్కారు దీనికి మంగళం పాడింది. తాము సూచించిన వారికి వ్యతిరేకంగా అక్రమ కేసులు నమోదు చేయడం, అక్రమంగా నిర్బంధించడం, బెదిరించడం, హింసించడం, వేధించడమే అర్హతగా నిర్ణయించింది. అందుకు తలొగ్గిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులనే సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు అధిపతులుగా నియమించింది. విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా ఉంటూ రెడ్‌బుక్‌ కుట్రల అమలుకు అనుగుణంగా నివేదికలు రూపొందించినందువల్లే హరీశ్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యం.ఐరాసకు అయ్యన్నార్‌...!చంద్రబాబుపై గతంలో సీఐడీ పూర్తి ఆధారాలతో నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, మద్యం, ఇసుక కుంభకోణాల కేసులను అర్ధంతరంగా క్లోజ్‌ చేయాలన్న షరతు మీదే సీఐడీ అధిపతిగా రవి శంకర్‌ అయ్యన్నార్‌ను నియ­మించారు. మొదట్లో అందుకు తలూ­పినా అది అంత సులభం కాదనే వాస్తవం అయ్యన్నార్‌కు అర్థమైంది. వేధించినా.. బలవంతంగా 164 సీఆర్‌సీపీ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించినా అవన్నీ తరువాత తన మెడకే చుట్టుకుంటాయని ఆయన గ్రహించడంతో కొద్ది నెలలుగా ఆయన కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు నుంచి రవి శంకర్‌ అయ్యన్నార్‌ను తప్పించి విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రవిశంకర్‌ అయ్యన్నార్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) ఆఫ్రికా దేశాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు ఆపరేషన్ల విభాగానికి వెళ్లేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు సమాచారం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.ఇక ఏసీబీ చీఫ్‌గా ఉన్న అతుల్‌ సింగ్‌ కూడా తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్‌పై పంపాలని లేదంటే రాష్ట్రంలోనే ఏదైన అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. ఇక ఆ ఇద్దరే..!ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుకొంటుండటంతో సీఐడీ, ఏసీబీ అధిపతులుగా ఎవరిని నియమిస్తారన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. బరితెగించి కుట్రలను అమలు చేసే సీనియర్‌ ఐపీఎస్‌ల కోసం ప్రభుత్వ పెద్దలు జల్లెడ పడుతున్నారు. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబే ప్రభుత్వం దృష్టిలో అర్హులుగా ఉన్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీ హరీశ్‌ కుమార్‌గుప్తా నిర్వహిస్తున్న విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ పోస్టులో సీనియర్‌ ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యంను నియమించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఆయన ఐటీ–ఆర్‌టీజీఎస్‌ శాఖల ముఖ్యకార్యదర్శి పోస్టు కోసం పట్టుబడుతున్నారు. శాంతి–భద్రతల విభాగం అదనపు డీజీగా ఉన్న మధుసూదన్‌రెడ్డి తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నారు.

YSRCP Ahmed Basha Arrest By AP People6
వైఎస్సార్‌సీపీ అహ్మద్‌ భాషా అరెస్ట్‌.. పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు!

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా సోదరుడు వైఎస్సార్‌సీపీ నేత అహ్మద్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆయనను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్‌ భాషాను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కడప చిన్న చౌక్‌ పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కడప తాలూకా పోలీసు స్టేషన్‌లో స్థల వివాదం విషయంలో అహ్మద్‌ భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

India looks towards new markets internationally7
యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకు!

భారత్‌ నుంచి గత ఏడాది 87.4 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్‌కు అయిన దిగుమతులు 41.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్‌లో పాగా వేసిన భారత్‌.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.అయితే ట్రంప్‌ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్‌ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్‌ ప్లస్‌ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్‌కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌చూపు భారత్‌ వైపు.. రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్‌ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్‌కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్‌ ఎండీ ప్రశాంత్‌ బోరా తెలిపారు. అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్‌ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ అంచనా వేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా.. భారత్‌ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్‌ సుంకాలు భారత్‌కు అపార అవకాశాలను తేవొచ్చు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్‌ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్‌ వ్యూహాత్మక స్థానంగా.. ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్‌పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్‌ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్‌ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్‌ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్‌అండ్‌డీ కేంద్రంగా అవతరించడానికి భారత్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ప్రత్నామ్నాయం లేదు.. జనరిక్‌ డ్రగ్స్‌ విషయంలో భారత్‌కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్‌ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్‌లో యూఎస్‌కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్‌ ప్లస్‌ విధానం సరైన పరిష్కారం. – రవి ఉదయ్‌ భాస్కర్‌మాజీ డైరెక్టర్‌ జనరల్, ఫార్మెక్సిల్‌ కొత్త మార్కెట్లకు విస్తరించాలి.. ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్‌ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్‌ ప్లస్‌ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్‌ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్‌ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట. ఎగుమతుల పరంగా యూఎస్‌పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్‌వైపు దృష్టిసారిస్తాయి. ఈ పరిస్థితిని భారత్‌ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్‌ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్‌ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్‌లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం సూచించింది.2024లో భారత్‌ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్‌ డాలర్లుభారత్‌ నుంచి యూఎస్‌కు ఎగుమతులు: 87.4 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 4.5 శాతం యూఎస్‌ నుంచి భారత్‌కు దిగుమతులు: 41.8 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 3.4 శాతం వాణిజ్య లోటు: 45.7 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 5.4 శాతం 2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక

Bengaluru Woman Incident Full Details Video Viral8
బెంగళూరులో దారుణం.. వాకింగ్‌ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.వివరాల ప్రకారం... బెంగళూరులోని బీటీఎం లేఅవుట్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. వారిలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనంతరం, సదరు ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తామే స్వయంగా చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025ఇదిలా ఉండగా.. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల సాధారణంగా మారాయి. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో ఓ యువతి వేధింపులకు గురైంది. ఆమె బుక్ చేసుకున్న క్యాబ్‌లోకి బలవంతంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారని ఆరోపించారు. కమ్మనహళ్లి నివాసి అయిన ఆ మహిళ ఏదో విధంగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 27న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ మహిళ తన స్నేహితుడిని తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ భయంతో క్యాబ్ నుంచి దిగాలని నిర్ణయించుకున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఆమెను వెంబడించాడు. మరొకరు ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.

Court State Vs A Nobody Movie OTT Streaming Date Officially Announced9
ఓటీటీలో కోర్ట్‌ సినిమా.. అఫీషియల్‌ ప్రకటన

హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా నటించారు. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్‌ చేయడం విశేషం. సెన్సిటివ్‌ పోలీస్‌ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.'కోర్టు' సినిమా 'ఏప్రిల్‌ 11'న విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్‌'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్‌సూన్‌ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్‌ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్‌ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది.ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.

Flood prevention work in Amaravati as per orders of World Bank: Andhra pradesh10
వరద రాజధానిలో ప్రజాధనం వృథా

సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాద­న్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధాని­లో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్‌డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళి­కను రూపొందించింది.వరద ముంపు ఉన్న చోటే రాజ­ధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావా­సం కోసమే వేల కోట్ల రూపా­యలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయను­న్నట్లు సీఆర్‌డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.వరద తగ్గింపు పనులతో సీఆర్‌డీఏ పరిధిలోని 21 గ్రామా­ల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలా­శయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్‌ బఫర్‌తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్‌ స్టేషన్‌ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రా­లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పను­ల­న్నీ పూర్త­యితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులుప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పను­లకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరా­వాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్‌ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావి­తం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామా­ల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలో­మీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్‌డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement