Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP coalition govt Fake Case On Sakshi Editor Dhanunjay Reddy1
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు

సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్‌ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులకు ఒడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు ఎన్‌.వీరస్వామి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌­బాబు, ఇతర టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించడం.. వెనువెంటనే రాత్రికి రాత్రే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అంతా పక్కా పన్నాగంతో చకచకా సాగిపోయింది. దీంతో సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయ్‌రెడ్డితోపాటు ఇదే పత్రికకు చెందిన ఆరుగురు పాత్రికేయులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 196(1), 352, 353,(2), 61(1) రెడ్‌విత్‌ 3(5) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పింఛన్‌ కోసం వస్తే కడతేర్చారన్నది వాస్తవంపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ గుండాలకు భయపడి కుటుంబంతో సహా పొరుగున తెలంగాణలోని నల్కొండ జిల్లా కనగల్‌లో పది నెలలుగా తల దాచుకుంటున్నారు. ప్రతి నెల పింఛన్‌ తీసుకునేందుకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ వర్గీయులు పక్కా పన్నాగంతో ఆయన్ను హత్య చేశారు. ఏప్రిల్‌ నెల ఫించన్‌ తీసుకునేందుకు ఈ నెల 3న రాష్ట్ర సరిహద్దుల్లోని నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీ వద్దకు వచ్చి.. తమ గ్రామం పశువేములకు చెందిన ఒకరికి ఫోన్‌ చేశారు. సామాజిక పింఛన్లు ఇస్తున్నారా.. లేదా.. అని అడిగారు. అతను ఆ విషయాన్ని టీడీపీ వర్గీయులకు చేరవేశాడు. వెంటనే టీడీపీ గూండాలు వచ్చి హిల్‌ కాలనీలో ఉన్న హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై దాడి చేసి, హత్య చేసి.. మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలోనే పడేశారు. హరిశ్చంద్ర భార్య నిర్మల తన భర్తను కిడ్నాప్‌ చేశారని తెలంగాణలోని విజయపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పశువేములలో దారుణ హత్యకు గురైన హరిశ్చంద్ర మృతదేహాన్ని ఈనెల 4న గుర్తించారు. కర్రలతో కొట్టి.. గొంతుకోసి.. ముఖంపై యాసిడ్‌ పోసి మరీ దారుణంగా హత మార్చినట్టు నాగార్జున సాగర్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హిల్‌ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి పుటేజీ సేకరించారు. హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి.పూర్తి అవగాహనతోనే వార్త ప్రచురితంహరిశ్చంద్ర హత్య సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమపై టీడీపీ గూండాలు కక్ష కట్టిన తీరును హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి వివరించారు. ఇది టీడీపీ గూండాల పనేనని కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు క్షణ్ణంగా తెలుసుకుని పూర్తి వివరాలతో సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. తెలంగాణలోని విజయపురి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలతోపాటు మృతుని కుటుంబ సభ్యుల ఆవేదన, పశువేములలోని నెలకొన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా వివరించింది. కాగా, తెలంగాణలో పాత్రికేయులు కేవలం అక్కడి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వార్తగా ఇచ్చారు. హరిశ్చంద్రను సమీప బంధువులే హత్య చేశారని సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లోనూ, తెలంగాణ ఎడిషన్‌లోనూ ప్రచురించింది. కాగా, ఆ సమీప బంధువులు టీడీపీ గూండాలేనన్నది ఏపీలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం, అవగాహన ఉంది కాబట్టి మరింత సమగ్రంగా వార్తను ప్రచురించారు. అంతేతప్ప సాక్షి పత్రిక ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన వార్తలోని అంశాల మధ్య వ్యత్యాసం లేదు. ఈ హత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏ ఎండకాగొడుకు పచ్చ ముఠా నిర్వాకమే ప్రజల్ని మోసగించేందుకు పరస్పర విరుద్ధ వాదనలు, కథనాలు, పత్రికా ప్రకటనలు ఇవ్వడం పచ్చ ముఠా పన్నాగం. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో పరస్పర విరుద్ధంగా ఈనాడుతోపాటు ఎల్లో మీడియా లెక్కకు మించి కథనాలు ప్రచురించిన విషయాన్ని పాత్రికేయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. టీడీపీ.. ప్రజల్ని మోసగించేందుకు ఏపీలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా పత్రికా ప్రకటనలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడుతోపాటు ఇతరత్రా ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనం. ‘కలల రాజధాని అమరావతి’అని విజయవాడ ఎడిషన్‌లో ప్రకటనలు ఇచ్చిన టీడీపీ.. అదే రోజు విశాఖపట్నం ఎడిషన్‌లో మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌ వికాసానికి గ్యారంటీ’ అని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. టీడీపీ, ఎల్లో మీడియా కుయుక్తులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.

helicopter crashed into the Hudson River in New York City2
న్యూయార్క్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి

న్యూయార్క్‌: న్యూయార్క్‌ నగరంలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.వివరాల ప్రకారం.. న్యూయార్క్‌ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:17 నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. బెల్‌-206 అనే హెలికాప్టర్‌ నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న పైలట్‌ కుటుంబం చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతిచెందిన వారిని స్పెయిన్‌లోని సిమెన్స్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా అధికారులు గుర్తించారు. ఇక, విమానం న్యూయార్క్ డౌన్‌టౌన్ మాన్‌హట్టన్ హెలిపోర్ట్ నుండి బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. Tracking: looks like a Bell 206L Long Ranger Helicopter. Appears main rotor & tail are detached when the main fuselage impacts the Hudson River in NYC. The main nut/pin that holds the main rotor onto the helicopter’s fuselage is called the ‘Jesus Nut.´pic.twitter.com/o4N23RY5kZ— Mikey Kay 🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 (@MikeyKayFilms) April 10, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. వెస్ట్ సైడ్ హైవే మరియు స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ క్రాష్ కారణంగా, చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. BREAKING: Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post. The New York… pic.twitter.com/Jnw8EIiioH— Bruce Snyder (@realBruceSnyder) April 11, 2025హెలికాప్టర్ నుంచి రోటర్ బ్లేడ్ విడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దృశ్యాల్లో విమానం భాగాలు విరిగిపోవడం, అది నీటిలో కూలిడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘బెల్ 206 హెలికాప్టర్ న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో కూలి మునిగిపోయింది’ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌, ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొంది.🇪🇦🇺🇸 Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post.The New York Helicopter… pic.twitter.com/Inp6NckoAu— Dan-i-El (@Danielibertari0) April 11, 2025 న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతానికి ఆరుగుర్ని నదిలో నుంచి వెలికితీశామని, దురదృష్టవశాత్తూ వాళ్లంతా చనిపోయారు’ అని తెలిపారు. ఇది హృదయ విదారక, విషాదకరమైన ప్రమాదమని అభివర్ణించారు. ఘటనా స్థలికి పడవల్లో చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. కాగా, నౌకలు ఎక్కువగా ప్రయాణించే హడ్సన్ నదిలో అమెరికా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 2009లో నాటకీయంగా ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందులోని 155 మంది ప్రాణాలతో బయటపడటంతో ఇది ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ గా గుర్తింపు పొందింది.

Donlad Trump Govt Full Focus On Inidan Students In USA3
భారత విద్యార్థులపై ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్‌–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన వర్సిటీలపై దృష్టిఅమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్‌ వర్సిటీ, నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్‌ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్‌ మాత్రమే) ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్‌ సర్కార్‌ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్‌ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్‌ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్‌ టైం జాబ్‌ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్‌ పూనాటి, అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసిన విద్యార్థి. హెచ్‌–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్‌ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్‌–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్‌–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్‌సీ ఉద్యోగిని. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య న్యూయార్క్‌ వర్సిటీ న్యూయార్క్‌ 27,247 నార్త్‌ ఈస్ట్రన్‌ వర్సిటీ బోస్టన్‌ 21,023 కొలంబియా వర్సిటీ న్యూయార్క్‌ 20,321 అరిజోనా స్టేట్‌ వర్సిటీ టెంపే 18,430 యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌ 17,469.

Rasi Phalalu: Daily Horoscope On 11-04-2025 In Telugu4
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చతుర్దశి రా.2.34 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ఉత్తర ప.2.54 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.12.04 నుండి 1.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: ఉ.7.05 నుండి 8.51 వరకు.సూర్యోదయం : 5.50సూర్యాస్తమయం : 6.10రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.వృషభం... పనులలో తొందరపాటు వద్దు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.మిథునం.. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు.విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కర్కాటకం... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.సింహం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య..... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల... ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలలో అదనపు బాధ్యతలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.ఆరోగ్యసమస్యలు.వృశ్చికం.... చేపట్టిన పనులలో విజయం. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.ధనుస్సు... విద్యార్థులకు కొత్త ఆశలు. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మకరం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.కుంభం... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.మీనం... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.

West Bengal teachers protest in Kolkata after Supreme Court verdict5
‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2016 నిర్వహించిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమీషన్‌ (ssc)లో అవకతవకలు జరిగాయంటూ సుమారు 26 వేల మంది టీచర్ల నియామకాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 26వేలమంది టీచర్లలో సుమారు 500 మంది రోడ్డెక్కారు.తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్‌ సీల్దా, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ.. ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | West Bengal: A large number of teachers in Purulia district locked the gates of Purulia District Education Department and protested in the wake of 26,000 teachers in Bengal schools losing their jobs following a Supreme Court order. pic.twitter.com/F0x3x9bnXw— TIMES NOW (@TimesNow) April 10, 2025అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ చేసిన ఈ ధర్నాలో బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పలువురిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడి,లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. Kolkata Police officer using “mild force” to “violent mob” who happens to be teachers terminated from jobs due to ruling party’s monumental scam. #SSCScam pic.twitter.com/N2yd4u0acP— Aparna (@chhuti_is) April 9, 2025అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్‌. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.టీచర్ల నియామకం రద్దు.. తీర్పు వెలువరించిన సుప్రీం అంతకుముందు పశ్చిమబెంగాల్‌ టీచర్‌ స్కాంపై సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టింది. అనంతరం తుదితీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. విద్యాశాఖ మంత్రితో సహా పలువురి అరెస్ట్‌2016లో పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు రంగంలోకి దిగాయి. దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ , రాష్ట్రస్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ పదవులు నిర్వహించిన మరికొందరు అధికారులను అరెస్ట్‌ చేశాయి.

Microsoft New Round of Layoffs Focuses on Boosting Engineer Headcount6
మైక్రోసాఫ్ట్‌లో మరోమారు లేఆఫ్స్!.. ఎఫెక్ట్ వారిపైనే..

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. ఎయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు.అమెజాన్, గూగుల్ కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆప్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.మైక్రోసాఫ్ట్ గతంలో కూడా.. తక్కువ పనితీరు కనపరచిన 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగుల మీదనే పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.ఏఐలో శిక్షణభవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ సీఈఓ సత్యనాదెళ్ళ గతంలోనే వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: వ్యభిచార గృహాలతో సంబంధాలు:.. అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌

Who Are the Real Kings and Who Are the Truly Poor7
పేదలు ఎవరు.. రాజులు ఎవరు

పేదరికం అంటే ఏమిటి.. డబ్బు లేకపోవడమా.. ఆస్తులు అంతస్తులు లేకపోవడమా.. మనసులో మానవత్వం కొరవడడమా.. ఎదుటివారి కష్టం చూడగానే కళ్ళు చెమర్చకపోవడమా అంటే ఎవరి అర్థాలు వారు చెబుతారు.. కొందరి దృష్టిలో సంపద అంటే డబ్బు.. మరికొందరు ఐతే మానవత్వాన్ని మైన మించిన సంపద లేదంటారు.ఒక మహా నగరంలో ఒక ధనవంతులు ఉండే ప్రాంతం.. పెద్దపెద్ద కార్లు .. ఐదారు బెడ్ రూములు ఉండే ప్లాట్స్ .. అంతా కొట్లమీద జీవించేవాళ్ళు .. వారికి కింది స్థాయి మనుషులు కనిపించరు.. అలాంటి కాలనీలో వీధుల్లో బెలూన్లు అమ్ముకునే ఓ తల్లి చంటిబిడ్డను ఎత్తుకుని బెలూన్లు అమ్ముతూ తిరుగుతోంది. పైన ఎండ దహించేస్తోందో. రోళ్ళు పగిలిపోయే ఎండ.. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన అన్నం మూటను పట్టుకుని ఓ అపార్ట్‌మెంట్‌ ముందున్న పెద్ద క్రోటన్ మొక్క వద్ద కూర్చుంది తల్లి.అన్నం మూట విప్పి బిడ్డకు ముద్ద లోపలకు వెళ్ళబోతున్న ఓ పదవకారునుంచి ఓ మహారాణి కళ్ళజోడు సారించుకుంటూ ఓ సారి బయటకు చూసింది. ఆమెకు పేదలన్నా.. పేదరికం అన్నా అసయ్యం.. అలాంటిది ఓ పేదరాలు తమ ఇంటిముందు భోజనం చేయడమా. ఠాట్ అసలే కుదరదు. అందుకే వెంటనే కారు అద్దం దించి ఏయ్ .. ఏంటి ఇక్కడ కూర్చున్నావ్.. వెళ్ళు ఇంకెక్కడైనా తిను.. అంటూ ఏయ్ రంగయ్యా ఈమెను పంపించేయి అని కేకేసి సర్రున కారులో లోపలి వెళ్ళింది.. ఆ దెబ్బకు భీతిల్లిన ఆ తల్లి ఓ చేత్తో అన్నం మూటను.. ఇంకో చేత్తో బిడ్డను ఎత్తుకుని అక్కణ్ణుంచి కదిలింది.. లోపల్నుంచి వచ్చిన రంగయ్య ఈ ఎండలో ఎక్కడకు వెళ్తావు.. సెల్లార్లో మా రూమ్ ముందు కూర్చుని తినేసి వెళ్ళమ్మా అని పిలిచి బాటిల్లో చల్లని నీళ్లిచ్చాడు.. డబ్బున్న ఆవిడకన్నా తనలాంటి పేదవాడిదే పెద్దమనసు అనుకున్న ఆ బెలూన్లు అమ్మే అమ్మి సెల్లార్లో తినేసి.. ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి వెళ్ళింది.. ఇప్పుడు చెప్పండి ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప.. ఇంకో సందర్భంలో ఒక ధనిక మహిళ చీరల షాప్‌కి వెళ్లింది. “బాబూ, కొన్ని చవక రకం చీరలు యివ్వండి .. మా అమ్మాయి పెళ్లి ఉంది.. మా చుట్టాలు బంధువులకు మంచి చీరలు కోనేసాం కానీ మా పనివాళ్లకు అవి ఇవ్వలేం కదా అందుకే నాసిరకం చీరలు ఇవ్వం డి అని అడిగింది.. కొన్ని చీరలు తీసుకెళ్లింది. ఆ తరువాత కొద్ది సేపటికే మరో పేద మహిళ చీరాల షోరూం కు వచ్చి “అన్నా, కాస్త ధర ఎక్కువ ఉండే చీరలు చూపించు. మా సేఠ్ బిడ్డ పెళ్లికి నేను ఒక చీరను గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను. దీనికోసం నెలనెలా కొంత పొదుపు చేశాను.. మా చిన్నమ్మగారికి మంచి చీర ఇవ్వాలి కదా అని ఓ ఖరీదైన చీరను తీసుకెళ్లింది. ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు పేదవారు.. డబ్బు విలువైనదే.. కాదనలేం.. కానీ మానవత్వానికి.. మానవ విలువలకు సైతం అపారమైన విలువ ఉంటుంది.. అది ఆయా సందర్భాల్లో వెలుగులోకి వస్తుంది.. అవతలివారికి అర్థం అవుతుంది.. దేనివిలువ దానికే ఉంటుంది. మానవత్వం మనసులో చెమ్మ లేనపుడు ఎంత సంపాదించినా దానికి పెద్దగా విలువ ఉండదు అని అందుకే పెద్దలు అంటుంటారు- సిమ్మాదిరప్పన్న

Delhi beat Royal Challengers Bangalore by 6 wickets8
రాహుల్‌ గెలిపించాడు

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అజేయ ప్రదర్శన కొనసాగుతోంది. ఓటమి లేకుండా సాగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీకి పరాజయం ఎదురుకాగా... తన సొంత నగరంలో మ్యాచ్‌ను గెలిపించిన అనంతరం ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా రాహుల్‌ విజయనాదం చేయడం విశేషం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 55 బంతుల్లో అభేద్యంగా 111 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో 30 పరుగులు... ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతులు ఆర్‌సీబీ విధ్వంసంతో 61 పరుగులు... చివరి 12 బంతుల్లో అదే తరహా దూకుడుతో 36 పరుగులు... మధ్యలో మిగిలిన 86 బంతుల్లో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం... పేలవ బ్యాటింగ్‌తో బెంగళూరు చేసిన పరుగులు 66 మాత్రమే... జట్టు ఇన్నింగ్స్‌ ఇలా భిన్న పార్శ్వాలలో సాగింది. తొలి ఓవర్లో స్టార్క్‌ 7 పరుగులే ఇవ్వగా, అక్షర్‌ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు వచ్చాయి. అయితే అసలు విధ్వంసం మూడో ఓవర్లో సాగింది. స్టార్క్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ ఊచకోత కోశాడు. అతను 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సాల్ట్‌ వరుసగా 6, 4, 4, 4 (నోబాల్‌), 6తో చెలరేగిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక సాల్ట్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం గగనంగా మారింది. అయితే అక్షర్‌ వేసిన 19వ ఓవర్లో డేవిడ్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో 17 పరుగులు రాగా, ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లోనూ అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. డుప్లెసిస్‌ (2), ఫ్రేజర్‌ (7), పొరేల్‌ (7) విఫలం కాగా, అక్షర్‌ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో చక్కటి బౌలింగ్‌తో ఆర్‌సీబీ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రాహుల్, స్టబ్స్‌ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. పిచ్‌ ఇబ్బందికరంగా ఉండటంతో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.చివర్లో 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా...రాహుల్, స్టబ్స్‌ కలిసి 7 ఫోర్లు 4 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు. హాజల్‌వుడ్‌ ఓవర్లో రాహుల్‌ 3 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (రనౌట్‌) 37; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) నిగమ్‌ 22; పడిక్కల్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 1; పాటీదార్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 25; లివింగ్‌స్టోన్‌ (సి) అశుతోష్‌ (బి) మోహిత్‌ 4; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 3; కృనాల్‌ (సి) అశుతోష్‌ (బి) నిగమ్‌ 18; డేవిడ్‌ (నాటౌట్‌) 37; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–61, 2–64, 3–74, 4–91, 5–102, 6–117, 7–125. బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–35–0, అక్షర్‌ 4–0–52–0, నిగమ్‌ 4–0– 18–2, ముకేశ్‌ 3–1–26–1, కుల్దీప్‌ 4–0–17–2, మోహిత్‌ 2–0–10–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) పాటీదార్‌ (బి) దయాళ్‌ 2; ఫ్రేజర్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; పొరేల్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; రాహుల్‌ (నాటౌట్‌) 93; అక్షర్‌ (సి) డేవిడ్‌ (బి) సుయాశ్‌ 15; స్టబ్స్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–58. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–2, దయాళ్‌ 3.5–0– 45–1, హాజల్‌వుడ్‌ 3–0–40–0, సుయాశ్‌ 4–0–25 –1, కృనాల్‌ 2–0–19–0, లివింగ్‌స్టోన్‌ 1–0–14–0. ఐపీఎల్‌లో నేడుచెన్నై X కోల్‌కతావేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Court And Chhaava Movie Now OTT Streaming9
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్‌ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్‌

కోర్టు- నెట్‌ఫ్లిక్స్‌హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈరోజు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా నటించారు. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. బక్సాఫీస్‌ వద్ద రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిన కోర్టు చిత్రం నేడు ఏప్రిల్‌ 11న 'నెట్‌ఫ్లిక్స్‌'(Netflix)లోకి వచ్చేసింది.ఛావా- నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ)బాలీవుడ్‌ హిట్‌ సినిమా 'ఛావా' ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌశల్‌,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత నేడు ఏప్రిల్‌ 11న నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, కేవలం హిందీ వర్షన్‌ మాత్రమే రిలీజ్‌ చేసి చివర్లో మేకర్స్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. మరో వారంలోపు తెలుగులో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.షణ్ముఖ- ఆహాటాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్‌ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్‌ హీరోయిన్‌గా కనిపించింది. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్‌ అయిందని చెప్పవచ్చు. నేడు ఏప్రిల్‌ 11న ఆహా(Aha) తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.మనమే- ఆహాశర్వానంద్‌, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie) మరో ఓటీటీలోకి వచ్చేసింది. రాజ్‌ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్‌ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్‌ రన్‌ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు ఏప్రిల్‌11న 'ఆహా'(Aha)లో కూడా విడుదలైంది.

Pressure on Nellore SP Krishnakanth for illegal arrest of Kakani10
కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూట­మి ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్‌­సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికా­రులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్‌­సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విష­యం తెలిసిందే. అయితే, ఆయ­నపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహా­రాన్ని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో పాటు రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమో­దైన పలు కేసుల్లో కాకాణి పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ నిలదీస్తు­న్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ... బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్‌ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రంగా మందలించిన పోలీస్‌ బాస్‌కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్‌ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!రెడ్‌బుక్‌ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితు­డిగా గుర్తింపు పొందిన ఐపీఎస్‌ అధికారి సుబ్బారా­యు­డును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారా­యు­డును ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. అనంతరం ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్‌ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement