Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Aqua Sector Crisis: YS Jagan Questions To Chandrababu Kutami Govt1
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేవలం కేంద్రానికి లేఖ రాస్తే సరిపోదని.. అమెరికా టారిఫ్‌ల పేరుతో దోచుకుంటున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేశారాయన. అక్వా రంగం సంక్షోభంలో(Aqua Sector Crisis) ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?చంద్రబాబుగారూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడంలేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే.ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్‌ వన్‌. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్‌, ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్‌ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. కోవిడ్‌ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం. మూడుసార్లు ఫీడ్‌ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్‌ ఆయిల్‌, సోయాబీన్‌ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదు.గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్‌(Aqua Zone) పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్‌ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో జోన్‌ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్‌ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారు.చంద్రబాబుగారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు అని వైఎస్‌ జగన్‌ కూటమి సర్కార్‌కు హితవు పలికారు. 1.@ncbn గారూ.. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2025

IPL 2025: Royal Challengers Bangalore vs Mumbai Indians Live Updates and Highlights2
IPL 2025 RCB vs MI: ఆర్సీబీ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ లైవ్ అప్‌డేట్స్‌..

Rcb vs MI Live Updates: ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి.5 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 52/25 ఓవ‌ర్లు ముగిసే సరికి ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 52 ప‌రుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్‌(13), సూర్య‌కుమార్ యాద‌వ్‌(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్‌..ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్ త‌గిలింది. 17 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. య‌శ్‌ద‌యాల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్టానికి 25 ప‌రుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాట‌ర్లు ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(67), ర‌జిత్ పాటిదార్‌(64) హాఫ్ సెంచ‌రీలు సాధించ‌గా.. ప‌డిక్క‌ల్‌(37), జితేష్ శ‌ర్మ‌(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. విఘ్నేష్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్‌..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే లివింగ్ స్టోన్ పెవిలియ‌న్‌కు చేరాడు. 15 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. నిల‌క‌డ‌గా ఆడుతున్న విరాట్‌, పాటిదార్‌13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్‌(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌..దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌డిక్క‌ల్‌.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 95 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు ప‌డిక్క‌ల్‌(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్‌.. సాల్ట్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 4 ప‌రుగులు చేసిన ఫిల్ సాల్ట్‌.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ప‌డిక్క‌ల్‌(4) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, రోహిత్ శ‌ర్మ తిరిగి తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.తుది జ‌ట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా

Supreme Court Slams UP Police3
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

Warren Buffett Gains 12.7 Billion Amid Turbulence In US Stock Markets4
‘ట్రంప్‌’ అలజడికి తట్టుకు​న్న ఒకేఒక్క ఇన్వెస్టర్‌..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్‌ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్‌ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి.

Trump Doubles Down On Tariffs Says This on Inflation5
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన

ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్‌ దేశాల స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్‌ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్‌: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్‌ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్‌ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్‌ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన.

Telangana Govt Withdraws Cases On HCU Students6
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్: హెచ్‌సీయూవిద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నీర్ణయం తీసుకుంది. హెచ్ సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హెచ్ సీయూ విద్యార్థులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కంచ భూముల్ని అభివృద్ధి పేరుతో విక్రయిస్తే ఊరుకోబోమంటూ తెలంగాణ సర్కారును హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఈరోజు(సోమవారం) స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది.మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయంHCU కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లోసమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు. ఇందులో విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.ఇదిలా ఉంచితే, కంచ భూముల వ్యహహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

Sachin Tendulkar Left Mesmerised By Garo Staple Pumpkin Chicken Curry7
సచిన్‌ మెచ్చిన గుమ్మడికాయ చికెన్‌ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్‌ చెఫ్‌

మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్‌ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్‌ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్‌ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్‌ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్‌ చెఫ్‌ రన్నరప్‌ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్‌ టెండూల్కర్‌ పోస్టర్‌లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్‌ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్‌ హీరోకి వండిపెట్టే ఛాన్స్‌ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్‌ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్‌ గారో, గుమ్మడికాయ చికెన్‌(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్‌ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్‌. వాటిన్నింటిలో సచిన్‌ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్‌ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్‌ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్‌ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)

Telangana Likely To Receive Rain Again In Next Three Days8
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!

హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణంహైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈరోజు(సోమవారం) హైదరాబాద్ తో పాటు మహబూర్ నగర్, మేడ్చల్, మల్కాజగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది.

What Congress MP Rahul Gandhi Said on Stock Market Full Details Here9
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

పాట్నా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పర సుంకాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లపై(భారత్‌ సహా) ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయి. ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలో స్టాక్‌ మార్కెట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi On Stock Market) కీలక వ్యాఖ్యలు చేశారు.స్టాక్‌ మార్కెట్‌(StockMarket)లో డబ్బు అపరిమితంగా సృష్టించబడుతుందని, అయితే అది అందరికీ లాభం చేకూర్చదని అన్నారాయన. సోమవారం పాట్నా(బీహార్‌)లో సంవిధాన్‌ సురక్షా సమ్మేళన్‌ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన.అమెరికా అధ్యక్షుడి(US President) నిర్ణయం.. మన స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేస్తోంది. మన దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందే స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే.. ఇది అందరి కోసం కాదని అర్థం. స్టాక్‌ మార్కెట్‌లో డబ్బు సంపాదించడం అనేది ఓ భ్రమ. ప్రత్యేకించి.. యువత స్టాక్‌ మార్కెట్లకు దూరంగా ఉండండి అని రాహుల్‌ గాంధీ సందేశం ఇచ్చారు.#WATCH | Patna, Bihar | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The US president has led to a tumble in the stock market. Less than 1% of the people here have their money invested in the stock market, which means the stock market is not a field for you. Unlimited money… pic.twitter.com/UNhSIHV4mv— ANI (@ANI) April 7, 2025

Peddi First Shot Glimpse Hindi Out Now And Glimpse 24 hrs Record Views10
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్‌ గల్లంతు

మెగా హీరో రామ్‌ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్‌ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్‌ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్‌ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్‌ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్‌ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్‌ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్‌ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో పెద్ది గ్లింప్స్‌ టాప్‌-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్‌ (36 మిలియన్లు)తో టాప్‌-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్‌ విడుదల.. డబ్బింగ్‌ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హందీ వర్షన్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్‌ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్‌ టాప్‌ (గ్లింప్స్‌) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్‌ (17.12 మిలియన్లు)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement