Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Free medical treatment banned Network hospitals on strike in Andhra Pradesh1
‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబు­తున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య ప్రదాత..ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బకాయిలు చెల్లించి భరోసా 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్‌లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది.

Rasi Phalalu: Daily Horoscope On 07-04-2025 In Telugu2
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.11.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి ఉ.10.01 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.11.03 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 6.10. మేషం.... వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.వృషభం... చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిథునం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం... బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యాయత్నాలు సానుకూలం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.సింహం.... ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. .కన్య.. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.తుల... వ్యవహారాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.వృశ్చికం... బంధువుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు....... పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. అనారోగ్యం. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.మకరం... శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.కుంభం... నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మీనం... బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

CID chief target is to close cases against Babu3
రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో కీలక విభాగాల అధిపతి పోస్టు దక్కించుకునేందుకు సాధారణంగా ఉన్నతాధికారులు పోటీ పడతారు. అలాంటిది టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖలో కీలక పోస్టులంటేనే సీనియర్‌ ఐపీఎస్‌లు హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సీఐడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్‌ పోస్టుల పేరు చెబితేనే కంపించిపోతున్నారు. అవి మాకొద్దు..! అప్రాధాన్య పోస్టులైనా ఫర్వాలేదు..! వీలైతే కేంద్ర సర్వీసులకు పంపండి..! అని మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యనేతల కుట్రలను అమలు చేసేందుకు నిరాకరించి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సీఐడీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ బాటలో సాగేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో భారీ కుదుపులు ఉండొచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తలొగ్గిన వారికి పెద్దపీట.. పోలీసు శాఖలో సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు అత్యంత కీలకమైనవి. కీలక కేసుల్లో సమర్థ దర్యాప్తు, అవినీతి నిర్మూలన ప్రాతిపదికన ఆ మూడు విభాగాల అధిపతులుగా సీనియర్‌ ఐపీఎస్‌లను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. టీడీపీ సర్కారు దీనికి మంగళం పాడింది. తాము సూచించిన వారికి వ్యతిరేకంగా అక్రమ కేసులు నమోదు చేయడం, అక్రమంగా నిర్బంధించడం, బెదిరించడం, హింసించడం, వేధించడమే అర్హతగా నిర్ణయించింది. అందుకు తలొగ్గిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులనే సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు అధిపతులుగా నియమించింది. విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా ఉంటూ రెడ్‌బుక్‌ కుట్రల అమలుకు అనుగుణంగా నివేదికలు రూపొందించినందువల్లే హరీశ్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యం.ఐరాసకు అయ్యన్నార్‌...!చంద్రబాబుపై గతంలో సీఐడీ పూర్తి ఆధారాలతో నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, మద్యం, ఇసుక కుంభకోణాల కేసులను అర్ధంతరంగా క్లోజ్‌ చేయాలన్న షరతు మీదే సీఐడీ అధిపతిగా రవి శంకర్‌ అయ్యన్నార్‌ను నియ­మించారు. మొదట్లో అందుకు తలూ­పినా అది అంత సులభం కాదనే వాస్తవం అయ్యన్నార్‌కు అర్థమైంది. వేధించినా.. బలవంతంగా 164 సీఆర్‌సీపీ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించినా అవన్నీ తరువాత తన మెడకే చుట్టుకుంటాయని ఆయన గ్రహించడంతో కొద్ది నెలలుగా ఆయన కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు నుంచి రవి శంకర్‌ అయ్యన్నార్‌ను తప్పించి విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రవిశంకర్‌ అయ్యన్నార్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) ఆఫ్రికా దేశాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు ఆపరేషన్ల విభాగానికి వెళ్లేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు సమాచారం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.ఇక ఏసీబీ చీఫ్‌గా ఉన్న అతుల్‌ సింగ్‌ కూడా తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్‌పై పంపాలని లేదంటే రాష్ట్రంలోనే ఏదైన అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. ఇక ఆ ఇద్దరే..!ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుకొంటుండటంతో సీఐడీ, ఏసీబీ అధిపతులుగా ఎవరిని నియమిస్తారన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. బరితెగించి కుట్రలను అమలు చేసే సీనియర్‌ ఐపీఎస్‌ల కోసం ప్రభుత్వ పెద్దలు జల్లెడ పడుతున్నారు. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబే ప్రభుత్వం దృష్టిలో అర్హులుగా ఉన్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీ హరీశ్‌ కుమార్‌గుప్తా నిర్వహిస్తున్న విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ పోస్టులో సీనియర్‌ ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యంను నియమించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఆయన ఐటీ–ఆర్‌టీజీఎస్‌ శాఖల ముఖ్యకార్యదర్శి పోస్టు కోసం పట్టుబడుతున్నారు. శాంతి–భద్రతల విభాగం అదనపు డీజీగా ఉన్న మధుసూదన్‌రెడ్డి తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నారు.

YSRCP Ahmed Basha Arrest By AP People4
వైఎస్సార్‌సీపీ అహ్మద్‌ భాషా అరెస్ట్‌.. పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు!

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా సోదరుడు వైఎస్సార్‌సీపీ నేత అహ్మద్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆయనను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్‌ భాషాను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కడప చిన్న చౌక్‌ పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కడప తాలూకా పోలీసు స్టేషన్‌లో స్థల వివాదం విషయంలో అహ్మద్‌ భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

India looks towards new markets internationally5
యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకు!

భారత్‌ నుంచి గత ఏడాది 87.4 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్‌కు అయిన దిగుమతులు 41.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్‌లో పాగా వేసిన భారత్‌.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.అయితే ట్రంప్‌ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్‌ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్‌ ప్లస్‌ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్‌కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌చూపు భారత్‌ వైపు.. రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్‌ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్‌కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్‌ ఎండీ ప్రశాంత్‌ బోరా తెలిపారు. అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్‌ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ అంచనా వేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా.. భారత్‌ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్‌ సుంకాలు భారత్‌కు అపార అవకాశాలను తేవొచ్చు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్‌ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్‌ వ్యూహాత్మక స్థానంగా.. ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్‌పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్‌ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్‌ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్‌ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్‌అండ్‌డీ కేంద్రంగా అవతరించడానికి భారత్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ప్రత్నామ్నాయం లేదు.. జనరిక్‌ డ్రగ్స్‌ విషయంలో భారత్‌కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్‌ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్‌లో యూఎస్‌కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్‌ ప్లస్‌ విధానం సరైన పరిష్కారం. – రవి ఉదయ్‌ భాస్కర్‌మాజీ డైరెక్టర్‌ జనరల్, ఫార్మెక్సిల్‌ కొత్త మార్కెట్లకు విస్తరించాలి.. ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్‌ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్‌ ప్లస్‌ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్‌ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్‌ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట. ఎగుమతుల పరంగా యూఎస్‌పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్‌వైపు దృష్టిసారిస్తాయి. ఈ పరిస్థితిని భారత్‌ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్‌ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్‌ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్‌లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం సూచించింది.2024లో భారత్‌ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్‌ డాలర్లుభారత్‌ నుంచి యూఎస్‌కు ఎగుమతులు: 87.4 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 4.5 శాతం యూఎస్‌ నుంచి భారత్‌కు దిగుమతులు: 41.8 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 3.4 శాతం వాణిజ్య లోటు: 45.7 బిలియన్‌ డాలర్లు. వృద్ధి 5.4 శాతం 2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక

Flood prevention work in Amaravati as per orders of World Bank: Andhra pradesh6
వరద రాజధానిలో ప్రజాధనం వృథా

సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాద­న్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధాని­లో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్‌డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళి­కను రూపొందించింది.వరద ముంపు ఉన్న చోటే రాజ­ధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావా­సం కోసమే వేల కోట్ల రూపా­యలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయను­న్నట్లు సీఆర్‌డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.వరద తగ్గింపు పనులతో సీఆర్‌డీఏ పరిధిలోని 21 గ్రామా­ల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలా­శయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్‌ బఫర్‌తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్‌ స్టేషన్‌ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రా­లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పను­ల­న్నీ పూర్త­యితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులుప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పను­లకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరా­వాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్‌ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావి­తం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామా­ల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలో­మీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్‌డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది.

Court State Vs A Nobody Movie OTT Streaming Date Officially Announced7
ఓటీటీలో కోర్ట్‌ సినిమా.. అఫీషియల్‌ ప్రకటన

హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా నటించారు. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్‌ చేయడం విశేషం. సెన్సిటివ్‌ పోలీస్‌ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.'కోర్టు' సినిమా 'ఏప్రిల్‌ 11'న విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్‌'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్‌సూన్‌ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్‌ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్‌ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది.ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.

Sunrisers Hyderabad suffer fourth consecutive defeat8
‘నాలుగు’తో నగుబాటు

ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్‌ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్‌ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్‌ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్‌ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్‌ 18వ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్‌ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ ఆడుతూ పాడుతూ అలవోక­గా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్‌ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్‌ జట్టు గెలుపు ఖాయమైంది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్‌ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ సిరాజ్‌ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్‌ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్‌ తరఫున ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు విఫలం... టి20 క్రికెట్‌లో తొలిసారి ట్రవిస్‌ హెడ్‌ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్‌ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్‌ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్‌ క్లాసెన్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్‌ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్‌ నుంచి 10వ ఓవర్‌ వరకు హైదరాబాద్‌ బ్యాటర్లు ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్‌ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్‌ నమోదు కాలేదు. రషీద్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ ఈ సిక్స్‌ బాదాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్‌ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్‌ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్‌ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్‌ కమిన్స్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్‌ ఇషాంత్‌ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో టైటాన్స్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్‌ (5)ను వెనక్కి పంపగా, బట్లర్‌ (0)ను కమిన్స్‌ అవుట్‌ చేశాడు. అయితే సన్‌రైజర్స్‌ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్‌ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్‌ ఓవర్లో సుందర్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్‌ స్కోరు 48 పరుగులకు చేరింది. మరోవైపు గిల్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్‌ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్‌ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్‌ చెలరేగిపోయాడు. అభిషేక్‌ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్‌ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 19 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్‌ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. 4/17 ఐపీఎల్‌ చరిత్రలో సిరాజ్‌ తన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) తెవాటియా (బి) సిరాజ్‌ 18; హెడ్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 8; ఇషాన్‌ కిషన్‌ (సి) ఇషాంత్‌ (బి) ప్రసిధ్‌ 17; నితీశ్‌ రెడ్డి (సి) రషీద్‌ (బి) సాయికిషోర్‌ 31; క్లాసెన్‌ (బి) సాయికిషోర్‌ 27; అనికేత్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 18; కమిందు (సి) సుదర్శన్‌ (బి) ప్రసిధ్‌ 1; కమిన్స్‌ (నాటౌట్‌) 22; సిమర్జిత్‌ (బి) సిరాజ్‌ 0; షమీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–17–4, ఇషాంత్‌ శర్మ 4–0–53–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–25–2, రషీద్‌ ఖాన్‌ 4–0–31–0, సాయికిషోర్‌ 4–0–24–2. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయిసుదర్శన్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 5; గిల్‌ (నాటౌట్‌) 61; బట్లర్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 0; సుందర్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్‌: షమీ 4–0–28–2, కమిన్స్‌ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్‌ 1–0–20–0, ఉనాద్కట్‌ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్‌ 1–0–12–0, అభిషేక్‌ శర్మ 1–0–18–0. ఐపీఎల్‌లో నేడుముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Explanation of Harassment by Recovery Agents9
రుణ వేధింపులకు చెక్‌ పెడదాం..!

ఢిల్లీకి చెందిన అనుజ్‌ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్‌ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్‌కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్‌ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు. ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది. గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి. లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు (ఏఆర్‌సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్‌సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని. స్పష్టమైన నిబంధనలు రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్‌లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు. రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్‌ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం. గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..నేడు సైబర్‌ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్‌ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్‌ మోసగాళ్ల కాల్స్‌ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్‌ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్‌ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్‌ మీరు రుణం తీసుకున్న బ్యాంక్‌ లే దా ఎన్‌బీఎఫ్‌సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ సిబ్బందితోనే డీల్‌ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.నిబంధనలు పాటించాల్సిందే.. ఆర్‌బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు, కోపరేటివ్‌ బ్యాంక్‌లు అన్నీ కూడా ఆర్‌బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్‌లే బాధ్యత వహించాలని ఆర్‌బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్‌లు తమ వెబ్‌సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్‌ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్‌ ముందస్తు సమాచారం ఇవ్వాలి. బ్యాంక్‌ అదీకృత లేఖ, బ్యాంక్‌ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్‌ చేసి వేధించినట్టయితే కాల్‌ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్‌ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్‌బీఐని ఆశ్రయించొచ్చు.ఇలా చేస్తే నయం.. → ఆర్‌బీఐ రిజిస్టర్డ్‌ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం. → రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్‌ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు. → రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేధింపులపై చర్యలు → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్‌ లోన్‌ ఆఫీసర్‌ లేదా నోడల్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. → స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. → బ్యాంక్‌ సేవలపై కన్జ్యూమర్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు. → వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్‌ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు పొందొచ్చు. → తమ ఆందోళనలను బ్యాంక్‌ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్‌మన్‌ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్‌ వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు. → వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్‌ నంబర్లు లేదా వాట్సాప్‌ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. → రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్‌ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు. → అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు. → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.ఆర్‌బీఐ కఠిన చర్య హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్‌ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. కఠిన చట్టాలు...సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్‌బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్‌ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్‌లైన్‌ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Today is World Health Day10
హెల్దీ పునాదితో భవిష్యత్తు బంగారం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: దేశ పురోగమనానికి సూచనగా మన దేశవాసుల ఆరోగ్య పరిస్థితులూ క్రమంగా మెరుగుపడుతున్నాయి. 2024 లెక్కల ప్రకారం ఒక వ్యక్తి సగటు ఆయుఃప్రమాణం 70.62 ఏళ్లు. 2023తో పోలిస్తే ఇది 0.29 శాతం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి మహిళల ఆయుఃప్రమాణం 75.7 ఏళ్లకూ, పురుషులు 72 ఏళ్లకూ.. అదే 2050 నాటికి మహిళల ఆయుఃప్రమాణం 79.8 ఏళ్లకూ, పురుషులు 76.2 ఏళ్లకు చేరుతుందని అంచనా. అయినా ప్రపంచ సగటు 73.7 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుత భారత్‌లోని వ్యక్తుల ఆయుఃప్రమాణం తక్కువే. ఈ ఏడాది వరల్డ్‌ హెల్త్‌ డే థీమ్‌ ‘హెల్దీ బిగినింగ్స్‌.. హోప్‌ఫుల్‌ ఫ్యూచర్స్‌’.. అంటే ఓ చిన్నారి తాలూకు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు సైతం ఆశాజనకంగా ఉంటుందనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వ్యాఖ్యానం. రేపటి మన పౌరుల భవిష్యత్తు మంచి ఆశారేఖలతో వెలగా­లంటే.. చిన్నప్పట్నుంచి అంటే ‘బిగినింగ్స్‌’ ఆరోగ్యంగా ఉండటమెలాగో చూద్దాం. ఆరోగ్యం కోసం బ్యాలెన్స్‌డ్‌ ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామాలూ అంతే అవసరం. వీటిల్లో ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్స్, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు, కోర్‌ ఎక్సర్‌సైజెస్‌.. ఇవన్నీ చేస్తుండటం వల్ల బరువు పెరగకుండా ఉండటంతో పాటు ఫిట్‌గా, చురుగ్గా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు.ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు.. వీటినే స్ట్రెచింగ్‌ వ్యాయామాలు అని చెప్పవచ్చు. కాళ్లు, చేతులు వేగంగా కదలడంతో కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అసలు వ్యాయామానికి ముందుగా ఈ స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయడం అవసరం. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌.. ఎక్సర్‌సైజ్‌ రెజీమ్‌లో ఆసక్తి ఉండి, బరువులు ఎత్తుతూ చేసేవి. వీటిల్లో బరువులతో చేసే వాటితో పాటు పుషప్స్, పులప్స్, అబ్డామినల్‌ క్రంచెస్, లెగ్‌ స్క్వాట్స్‌ వంటివి ఉంటాయి. వ్యాయామం ప్రధానం ఏరోబిక్స్‌.. వీటినే కార్డియో వ్యాయామాలనీ, ఎండ్యూరెన్స్‌ ఎక్సర్‌సైజ్‌లనీ అంటారు. వీటి వల్ల ఊపిరితిత్తుల నిండా ఆక్సిజన్, గుండె వేగం పెరుగుతాయి. దాంతో ప్రతి కణానికీ, కండరానికీ అందే ఆక్సిజన్, పోషకాలతో సామర్థ్యం పెంపొందుతుంది. చాలాసేపు పనిచేసినా అలసట రాదు. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, వాటర్‌ ఏరోబిక్స్‌ ఇవన్నీ ఏరోబిక్స్‌ ప్రక్రియలే. పై వ్యాయామాలతో పాటు మానసిక ఆరోగ్యం కోసం యోగా చేస్తూ, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ధ్యానం (మెడిటేషన్‌) చేయాలి. ఎముకలకు అత్యంత అవసరమైన విటమిన్‌ డీ అందేలా సూర్యకాంతిలో నడవాలి. పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. 0 నుంచి ఐదు నెలల వరకు.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ తమ తల్లి గర్భం నుంచే మెుదలైతే.. వాళ్ల ఆరోగ్య పునాదులూ పటిష్టంగా ఉంటాయి. కాబోయే తల్లి తన ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న మూడు నెలల ముందు నుంచే తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ ఉండాలి. ఐరన్‌ టాబ్లెట్లు, ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకుంటే పుట్టబోయే చిన్నారి ఆరోగ్యంగా బాగుండటమే కాకుండా స్పైనా బైఫిడా వంటివి నివారితమవుతాయి. పిల్లలు పుట్టాక కనీసం ఆర్నెల్ల పాటు వారికి తల్లిపాలే తాగించాలి. ‘యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌’ కార్యక్రమంలో అన్నిరకాల టీకాలు, వ్యాక్సిన్లు ఇప్పించడం ద్వారా వాళ్లు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. ఆర్నెల్ల తర్వాత ఘనాహారం పిల్లలను ఘనాహారం వైపు మళ్లించడాన్ని వీనింగ్‌ అంటారు. ఘనాహారం వైపునకు మళ్లించేందుకు మార్కెట్లోని ఖరీదైన ఆహారాలు కాకుండా ఇంట్లోనే లభ్యమయ్యే పదార్థాలతో పుష్టికరమైన ఆహారాన్ని అందించవచ్చు. ఆర్నెల్లప్పుడు బియ్యంతో మెత్తగా వండిన పదార్థాలు పెట్టొచ్చు. 6 నుంచి 8 నెలల వయసులో గుజ్జులా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలతో పాటు తాజా పండ్లు ఇవ్వాలి. 8 నుంచి 10 నెలల వయసులో మాంసాహారం తినేవారైతే గుజ్జుగా ఉడికించిన మాంసం, చికెన్, చేపలు, గుడ్డు పెట్టొచ్చు. శాకాహారులైతే తృణధాన్యాలు ఉడికించి ఇవ్వొచ్చు. 11–12 నెలల వయసులో కూరగాయల ముక్కలను ఉడికించి పెట్టొచ్చు. ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారం వైపునకు మళ్లించాలి.ఇవి మాత్రం వద్దు చక్కెర ఎక్కువగా ఉండేకాఫీ, టీ, శీతల పానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోకపోవడమే మంచిది. బేకరీ ఫుడ్స్, పిట్జా, బర్గర్‌ల వంటి ప్రాసెస్‌డ్‌ ఆహారాల్లో పోషకాలు తక్కువ. నూనెలు, వేపుళ్లు, చిప్స్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్‌లో ట్రాన్స్‌–ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. వీటికి దూరంగా ఉండాలి. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు.. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు పిల్లలు ఎదుగుతుంటారు కాబట్టి ఈ సమయంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లూ, మినరల్స్, మైక్రో న్యూట్రియెంట్స్‌... పుష్కలంగా ఉండే పదార్థాలు తినిపించాలి. ఇవన్నీ ఒకే భోజనంలో దొరకవు కాబట్టి.. రకరకాల ఆహార పదార్థాలు తినేలా చూడాలి. అంటే... వాళ్ల ఆహారంలో పొట్టుతో ఉండేæ గోధుమ, జొన్న, మెుక్కజొన్న, రాగులతో చేసిన పదార్థాలు ఇవ్వాలి. ఎముకల ఆరోగ్యం కోసం క్యాల్షియం అందేలా చూడాలి. గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లలకు ఇష్టం లేని ఆహారాలను వాళ్లు ఇష్టంగా తినేలా ఇవ్వాలి. ఉదాహరణకు పండ్లు తినకపోతే వాటిని ఫ్రూట్‌ సలాడ్స్‌గా, కస్టర్డ్‌తో కలిపి ఇవ్వవచ్చు. పాలు తాగకపోతే మిల్క్‌õÙక్‌గా ఇవ్వడం లేదా పాలతో తయారైన స్వీట్లు పెట్టడం చేయాలి. తల్లులు తమ పిల్లలకు వెన్న, నెయ్యి ఎక్కువగా పెడుతుంటారు. ఈ శాచ్యురేటెడ్‌ కొవ్వులు అంత మంచివి కాదు. అందుకే వాటిని రుచి కోసం చాలా పరిమితంగా తీసుకోవాలి. కౌమార యువత నుంచి మధ్య వయసు వచ్చే వరకు... 16 ఏళ్లు దాటాక.. యవ్వనంలో, ఆపైన కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే తీసుకుంటూ ఉండాలి. మన ప్రధాన ఆహారమైన బియ్యం విషయానికి వస్తే దంపుడు బియ్యం, కూరల్లో ముదురాకుపచ్చ రంగులో ఉండే గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్‌ మంచివి. మాంసాహారంలో చేపలు మంచి ఆహారం. రెడ్‌ మీట్‌ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ వంటివి తీసుకోవాలి. అరటి, నారింజ వంటి పండ్లలో విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయతోపాటు డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి. వృద్ధాప్యం తొలి దశలో పరీక్షలు కీలకం ఇక వృద్ధాప్యపు తొలి దశ అయిన 60–68 ఏళ్ల మధ్య చాలా మందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు పరీక్షలతో వీటిని ముందస్తుగానే గుర్తించి సత్వర వైద్యం పొందాలి. 50–60 ఏళ్ల మధ్య మహిళల్లో హార్మోన్‌ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ఒక వయసు దాటాక రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్‌ వంటివి కనిపిస్తుంటాయి. ఈ దశలో తమ సమస్యలకు తగిన మందులతో పాటు 68 ఏళ్ల నుంచి 70 ఏళ్లు దాటాక ఏ టైమ్‌లో తీసుకోవాల్సిన వ్యాక్సిన్లను ఆ టైమ్‌లో (ఉదా: నిమోకోకల్‌ వ్యాక్సిన్‌) తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాటు డాక్టర్ల సూచనలు పాటిస్తుంటే అందరూ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. –డాక్టర్‌ ఉషారాణి, సీనియర్‌ ఫిజీషియన్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement