
ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్‌ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులతో ఎస్‌ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్‌ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్‌ఈసీ నీలంసాహ్ని సూచించారు.
రాజకీయ పార్టీలతో కూడా శుక్రవారం ఉదయం ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్‌ఈసీ తీసుకున్నారు.
చదవండి:
ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..