Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates1
హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు.

Major Earthquake In Japan2
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్‌ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

IPL 2025: RCB VS Gujarat Titans Live Updates And Highlights3
IPL 2025, RCB VS GT Updates: లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌12.3వ ఓవర్‌: 107 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సాయి సుదర్శన్‌ 49 పరుగులు చేసి హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్‌ ఆతర్వాత గేర్‌ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47), జోస్‌ బట్లర్‌ (39) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. గేర్‌ మార్చిన బట్లర్‌అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్‌ రసిక్‌ సలామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో గేర్‌ మార్చాడు. ఆ ఓవర్‌లో బట్లర్‌ 2 సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 75/1గా ఉంది. బట్లర్‌ 26, సాయి సుదర్శన్‌ 32 పరుగులతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌4.4వ ఓవర్‌: 170 పరుగుల ఛేదనలో గుజరాత్‌ 32 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్‌ (15), జోస్‌ బట్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్‌ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్‌170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ​్‌మన్‌ గిల్‌ 7, సాయి సుదర్శన్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీ.. గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే..?టాస్‌ ఓడి గుజరాత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్‌ 14, విరాట్‌ కోహ్లి 7, పడిక్కల్‌ 4, పాటిదార్‌ 12, కృనాల్‌ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్‌ 2, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు. చివరి ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాది చివరి బంతికి ఔటైన టిమ్‌ డేవిడ్‌ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీసిరాజ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో లివింగ్‌స్టోన్‌ (54) ఔటయ్యాడు.లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీరషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్‌ డౌన్‌14.2వ ఓవర్‌: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి కృనాల్‌ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌ (24), టిమ్‌ డేవిడ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ12.4వ ఓవర్‌: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చి జితేశ్‌ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌కు (19) జతగా కృనాల్‌ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 73/410 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 73/4గా ఉంది. లివింగ్‌స్టోన్‌ (8), జితేశ్‌ శర్మ (23) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్‌: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్‌4.4వ ఓవర్‌: టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన అనంతరం ఫిల్‌ సాల్ట్‌ (14) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రజత్‌ పాటిదార్‌కు (6) జతగా లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో విరాట్‌ను ఆర్షద్‌‌ ఖాన్‌​ ఔట్‌ చేయగా.. మూడో ఓవర్‌లో సిరాజ్‌ అద్భుతమైన బంతితో పడిక్కల్‌ను (4) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆర్సీబీ​కి షాక్‌.. రెండో ఓవర్‌లోనే విరాట్‌ ఔట్‌ఆర్సీబీకి రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (7) అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓ‍వర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 12/1గా ఉంది. పడిక్కల్‌ (4), సాల్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ బతికిపోయాడు..!సాల్ట్‌కు తొలి ఓవర్‌లోనే లైఫ్‌ లభించింది. సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్‌ ఔట్‌ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం గుజరాత్‌ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్‌ తరఫున రబాడ స్థానంలో అర్షద్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట​్‌కీపర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. గుజరాత్‌ రెండింట ఓ మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్‌, సీఎస్‌కేపై విజయాలు సాధించగా.. గుజరాత్‌.. పంజాబ్‌ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.

Poonam Gupta appointment as RBI Deputy Governor4
ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. ఎవరీ పూనమ్‌ గుప్తా?

ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తాను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పూనమ్ గుప్తా ఎవరు?కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.ఇక ఆమె చదువు విషయానికి వస్తే ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)ఎం.ఎ ఎకానమిక్స్‌ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)బీఏ ఎకానమిక్స్‌ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్‌ను గెలిచారు

Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident5
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Team India Upcoming Home Season Schedule Released, India To Play West Indies, South Africa At Home6
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌, సౌతాఫ్రికా.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు హోం సీజన్‌ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 2) ప్రకటిం​చింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌.. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్‌ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్‌ క్రికెట్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్‌ కోల్‌కతా వేదికగా అక్టోబర్‌ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్‌ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్‌ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్‌ జరుగనుంది. నవ​ంబర్‌ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, డిసెంబర్‌ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, వైజాగ్‌ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, చండీఘడ్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్‌, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్‌ చేశారు.కాగా, భారత క్రికెట్‌ జట్టు ఐపీఎల్‌ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్‌ జట్టు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్‌ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీఅక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

Sensational Details Come To Light In The Ameenpur Case7
అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

సాక్షి, సంగారెడ్డి: అ​మీన్‌పూర్‌ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్‌ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్‌మేట్స్‌ ఈ మధ్య గెట్‌ టు గెదర్‌ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్‌ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్‌, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం ‍కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు.

Kantara Chapter 1 Team Clarity On delay rumours October release8
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్

కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్‌ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్‌ కూడా రివీల్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్‌ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.కాగా.. ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Kantara (@kantarafilm)

Latest News on Bird Flu In Telangana9
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో బర్డ్‌ప్లూ (bird flu) వైరస్‌ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. తాజాగా, ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి.బర్డ్‌ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందా?పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా టైప్‌ –ఏ వైరస్‌లు వ్యాధి కారకాలు. కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్‌లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్‌’’, ‘‘ఎన్‌’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.మనుషులకూ సోకుతుందా?మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్‌5, హెచ్‌7, హెచ్‌9 రకాల వైరస్‌లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్‌ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్‌లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు.ఎలాంటి పక్షులకు సోకుతుంది?కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్‌95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Karnataka Government Revised Office Timing Over Heatwave10
Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్‌ టైమింగ్స్‌

బెంగళూరు,సాక్షి: మార్చి తొలి వారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీస్‌ టైమింగ్స్‌ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కలబురగి డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో, బెళగావి డివిజన్‌లోని విజయపుర, బాగల్‌కోట్ జిల్లాల్లో వేడిగాలుల కారణంగా 2025 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ కార్యాలయ సమయాలను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. The Karnataka government has issued an order to change the government office timings from 8 am to 1.30 pm in April and May 2025 in 7 districts of Kalaburagi division and Vijayapura and Bagalkot districts of Belagavi division due to heatwave. Earlier proposal was kept by the… pic.twitter.com/5E6CkvfvPV— ANI (@ANI) April 2, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement