Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Doing Dirty Work For US And West: Pak Minister Admits To Funding Terrorism1
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్‌

అమెరికా, బ్రిటన్‌ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.

How Hafiz Saeed Linked To Pahalgam Incident2
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్‌ సయ్యద్‌!

పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్‌ఎఫ్‌ గ్రూప్‌ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్‌ సాజిద్‌ గుల్‌ సుప్రీం కమాండర్‌గా, చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా బాసిత్‌ అహ్మద్‌ దార్‌ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయ్యద్‌(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్‌ ముహజిదిన్‌) వ్యవహరిస్తున్నారు. ఈ ఇ‍ద్దరూ పాక్‌ నుంచే ఎల్‌ఈటీ కార్యకలాపాలను నడిపిస్తు​న్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్‌ సైన్యం, ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ISI) టీఆర్‌ఎఫ్‌ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్‌లైన్‌లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్‌ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్‌ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్‌ ముహజిదిన్‌, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్‌ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్‌ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్‌, బూటా పాత్రి, గందర్బల్‌ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్‌ టన్నెల్‌ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్‌ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్‌ మూసా.. సోనామార్గ్‌ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్‌ ఘటన తర్వాత.. ఎల్‌ఈటీ ఏఫ్లస్‌ కేటగిరీ ఉగ్రవాది జునైద్‌ అహ్మద్‌ భట్‌ను డిసెంబర్‌లో దాచిగామ్‌ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో గ్రూప్‌ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్‌ఎఫ్‌ గ్రూప్‌ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్‌ నుంచి గ్రూప్‌ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్‌ఎఫ్‌ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్‌ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్‌ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్‌ చేశారు. అందులో హషిమ్‌ మూసా అలియాస్‌ సులేమాన్‌, అలీ బాయి అలియస్‌ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్‌ హుస్సేన్‌ తోకర్‌, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్‌ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎఫ్‌లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్‌ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు.. బైసరన్‌ లోయలోని పిక్నిక్‌ స్పాట్‌లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్‌ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్‌ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.

IPL 2025 Playoffs Qualification Scenarios Of All 10 Teams3
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెల‌వాలంటే?

ఐపీఎల్‌-2025 సీజ‌న్ కీల‌క ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే దాదాపుగా స‌గం మ్యాచ్‌లు ముగిసినందున‌, ఆయా జ‌ట్లు త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ల‌పై క‌న్నేశాయి. ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఆరు జ‌ట్లు పోటీప‌డుతుంటే.. ఐదు సార్లు ఛాంపియ‌న్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు వ‌రుస ఓట‌ముల‌తో వెన‌కంజ‌లో ఉన్నాయి. ఈ ఏడాదిలో సీజ‌న్‌లో ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. దీంతో సెకెండ్ హాఫ్‌లో ప్ర‌తీ మ్యాచ్ ఆయా జ‌ట్లకు కీల‌కంగా మార‌నుంది. కేవ‌లం విజ‌యాలు మాత్ర‌మే కాదు, నెట్ ర‌న్ రేట్ కూడా టాప్‌-4 జ‌ట్ల‌ను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్‌ఆర్‌హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్ర‌తీ జ‌ట్టుకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో మొత్తం 10 జ‌ట్ల‌కు ప్లే ఆఫ్ చేరే అవ‌కాశాలు ఎంత‌వ‌ర‌కు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ఈ ఏడాది సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ దుమ్ములేపుతోంది. గుజ‌రాత్ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడి ఆరు విజ‌యాలతో 12 పాయింట్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ అగ్రస్ధానంలో కొన‌సాగుతోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది.ఢిల్లీ సైతం 8 మ్యాచ్‌లు ఆడి 6 విజ‌యాల‌తో 12 పాయింట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. అయితే గుజ‌రాత్(+1.104) కంటే ర‌న్‌రేట్ ప‌రంగా కాస్త వెన‌కబ‌డి ఉండ‌డంతో ఢిల్లీ( +0.657) రెండో స్ధానంలో కొన‌సాగుతోంది. ఈ రెండు జ‌ట్ల‌కు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ, గుజ‌రాత్ జ‌ట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు.ఆర్సీబీ అండ్ ముంబై ఇండియ‌న్స్‌ఈ ఏడాది సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడి 6 విజ‌యాల‌తో 12 పాయింట్లు సాధించింది. అయితే గుజ‌రాత్‌, ఢిల్లీ కంటే ర‌న్‌రేట్‌ప‌రంగా వెన‌క‌బ‌డి ఉండ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్ధానంలో కొన‌సాగుతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాలి.మ‌రోవైపు ఆరంభంలో త‌డ‌బ‌డ్డ ముంబై ఇండియ‌న్స్ తిరిగి పుంజుకుంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఖాతాలో ప్ర‌స్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. . ఇందులో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది.ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అండ్ పంజాబ్ కింగ్స్‌ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మిశ్ర‌మ ఫ‌లితాల‌ను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది. అదేవిధంగా సీజ‌న్‌లో ఆరంభంలో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్‌.. ప్ర‌స్తుతం కాస్త త‌డ‌బ‌డుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్‌క‌తా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. కేకేఆర్ ర‌న్‌రేట్(+0.212) కాస్త మెరుగ్గా ఉండ‌డంతో వారి ప్లే ఆఫ్స్ ఆశ‌లు ఇంకా స‌జీవంగానే ఉన్నాయి.రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌..ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ క‌థ దాదాపుగా ముగిసిన‌ట్లే. ఇప్ప‌టివ‌ర‌కు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజ‌స్తాన్‌.. 2 విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొనసాగుతుంది. స‌న్‌రైజ‌ర్స్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడ‌నుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు గెలిచినా రాజ‌స్తాన్ ప్లే ఆఫ్ చేరే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్(-0.625) కూడా మెరుగ్గా లేదు.ఎస్ఆర్‌హెచ్ అండ్ సీఎస్‌కే..ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి రెండు స్దానాల్లో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాలి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్‌హెచ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితో ఇతర జట్ల ఫలితాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. రెండు ఓడితే మాత్రం అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ నిష్క్ర‌మిస్తోంది. మ‌రోవైపు సీఎస్‌కే ప‌రిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

YSRCP Leader Perni Nani Takes on Chandrababu Govt4
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’

తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.

pakistan to skip tashkent agreement5
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!

భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! - జమ్ముల శ్రీకాంత్.

Friday OTT Movies Telugu Release On April 25th 20256
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా తదితర సినిమాలొచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం దాదాపు 25కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో అరడజనుకు మూవీస్ కి పైగా ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే మ్యాడ్ స్క్వేర్, జ్యూయెల్ థీప్, మజాకా, వీరధీరశూర, ఎల్ 2 ఎంపురాన్, నిరమ్ మరుమ్ ఉళగిల్, లాఫింగ్ బుద్ధా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (ఏప్రిల్ 25)నెట్ ఫ్లిక్స్మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమాహవోక్ - ఇంగ్లీష్ మూవీఈజ్ లవ్ సస్టెయనబుల్ - జపనీస్ సిరీస్జ్యూయెల్ థీప్ - తెలుగు డబ్బింగ్ సినిమాద రెలుక్టెంట్ పీచర్ - జపనీస్ సిరీస్వీక్ హీరో క్లాస్ 2 - కొరియన్ సిరీస్అమెజాన్ ప్రైమ్మజాకా - తెలుగు మూవీవీరధీరశూర - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)కల్లు కాంపౌండ్ - తెలుగు మూవీఫ్లో - ఇంగ్లీష్ సినిమాఇరవనిల్ ఆటమ్ పర్ - తమిళ మూవీల్యాండ్ లైన్ - ఇంగ్లీష్ సినిమావివాహా ఆహ్వానం - మలయాళ చిత్రంనోవకైన్ - ఇంగ్లీష్ మూవీసమర - మలయాళ సినిమాసూపర్ బాయ్స్ మలెగావ్ - తెలుగు డబ్బింగ్ మూవీతకవి - తమిళ సినిమాహాట్ స్టార్ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ - ఇంగ్లీష్ మూవీకజిలియోనైరీ - ఇంగ్లీష్ సినిమావాండర్ పంప్ విల్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఎల్ 2 ఎంపురాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5అయ‍్యన మానే - కన్నడ సిరీస్ఎస్ఎఫ్ 8 - కొరియన్ సిరీస్సన్ నెక్స్ట్నిరమ్ మరుమ్ ఉళగిల్ - తమిళ సినిమాలాఫింగ్ బుద్ధా - కన్నడ మూవీఆపిల్ ప్లస్ టీవీవోండ్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఆహాగార్డియన్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Pahalgam Incident LIC Opens Special Claim Settlement Window for Victims Families Check The Details7
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది."పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్‌ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్‌లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు అర్హత ఉంటుంది.క్లెయిమ్ ప్రాసెస్➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

Couple Denies Viral Video Features Navy Officer Vinay Narwal Before Pahalgam incident8
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్‌ సార్‌ కాదు’

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 16న ఉత్తారఖండ్‌ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్‌. ఏప్రిల్‌ 21న కశ్మీర్‌లో హనీమూన్‌. ఏప్రిల్‌ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్‌ నేవి లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ నర్వాల్‌ జీవితం ఇలా ముగిసింది.ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్‌ నార్వాల్‌ ఒకరు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్‌ నార్వాల్‌, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. We're safe. A recent video was misused by some pages, falsely claiming it was the last video of late Vinay narwal and his wife. They have clarified that this video is not theirs. #Pahalgam #Kashmir #pahalgamattack pic.twitter.com/aAdlnTarNf— Shaheen khan (@shaheenkhan09) April 24, 2025 ఆ వీడియో మాదే కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్‌ నార్వాల్‌ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్‌, యాషికా శర్మ దంపతులు సోషల్‌ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్‌ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వైరల్‌ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము. మేం బ్రతికే ఉన్నాం.. కశ్మీర్‌ టూర్‌లో ఉండగా ఏప్రిల్‌ 14న రికార్డ్‌ చేసిన వీడియోని ఏప్రిల్‌ 22న సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్‌ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్‌ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వీడియోని షేర్‌ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్‌ చేయొద్దని కోరారు.తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయిపహల్గాంలో వినయ్‌ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్‌ నర్వాల్‌ సోదరి స్రిష్టి నర్వాల్‌ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్‌, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్‌ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

USA Woman Credits AI Chatbot For Saving Her Life9
చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..!

చాట్‌జీపీటీ వంటి సాంకేతికతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దుని నొక్కి చెబుతుంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లుగా ఉండదు, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధులను నిర్థారించలేదనే హెచ్చరిస్తుంటారు. అయితే ఆ మాటలన్నింటిని కొట్టిపారేసేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్‌జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటిపర్యంతమైంది ఆమె. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..అమెరికాలోని నార్త్‌కరోలినా ప్రాంతానికి చెందిన మహిళ ఎన్నేళ్లుగానో తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం కారణంగా ఆమె బాడీలో ఎన్నో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. దీంతో వైద్యులను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. వాళ్లంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ అని నిర్థారించారు.పైగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో తాను అంతకుమించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్‌ ఉండేది. దీంతో సరదాగా ఏఐ చాట్‌జీపీటీలో తాను ఫేస్‌ చేస్తున్న అనారోగ్య సమస్యలను వివరించింది. చివరగా వైద్యులు ఏమని నిర్థారించారో చాట్‌జీపీటో సంభాషిస్తుండగానే..ఆమె హషిమోటో వ్యాధితో బాధపడి ఉండొచ్చని చెప్పింది చాట్‌జీపీటీ. దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమె ప్రాణాంతక కేన్సర్‌ అయినా..హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్‌ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో రెండు చిన్న గడ్డలను గుర్తించారు. ఆ తర్వాత వాటిని కేన్సర్‌ కణితులుగా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె తగిన చికిత్సను పొంది ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనుక చాట్‌జీపీటీనీ సంప్రదించి ఉంకడపోతే..ఇంకా ఆర్థరైటిస్‌ మందులు వాడుతూ..కేన్సర్‌ సమస్యను ముదరబెట్టుకునేదాన్ని అని వాపోయింది. ఇలా మరో ప్రయత్నం చేయకుంటే తన ప్రాణాలే పోయేవి అంటూ తన అనుభవాన్ని వివరించారామె. ఏంటీ వ్యాధి అంటే..హషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజం (thyroid గ్రంధి తక్కువ పనితీరు)కు కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని విదేశీ కారకంగా భావించి, దానిపై దాడి చేస్తుంది. ఈ దాడి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీసి, దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చితకిత్స మాత్రం.. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Starch-Free Rice Cooker: డయాబెటిస్, ఊబకాయాన్ని దరిచేరనీయదు..)

Gujarat Man Gets Widowed Bahu Remarried Bids Tearful Goodbye10
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’

కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్‌ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్‌ సింగ్‌ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్‌తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్‌,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్‌.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement